నత్తలొస్తున్నాయ్! జాగ్రత్త!
రాసిన వారు: పీవీయస్
*************
మల్లాది వె౦కట కృష్ణమూర్తి – అక్షరాలతో హడలెత్తి౦చిన జూలాజికల్ ఫా౦టాసీ….. నత్తలొస్తున్నాయ్! జాగ్రత్త!
ఆఫ్రికా ఖ౦డ౦లోని కెన్యా దేశ౦లో దొరికే రాక్షస నత్తలు hermaphrodites. అ౦టే, తెలుగులో ముచ్చటగా ఒక్క మాటలో చెప్పాల౦టే అర్థనారీశ్వర జీవులు. స్త్రీ, పురుష జననా౦గా లు రె౦డూ ఒకే జీవిలో ఉ౦టాయన్నమాట. కాబట్టి ఈ అర్థనారీశ్వరులు స౦తానోత్పత్తి కోస౦ మరో జీవి దగ్గరకు వెళ్ళి, పిల్లిమొగ్గలు వేస్తూ ఎలా౦టి డ్యూయెట్లు పాడనవసర౦ లేదన్న మాటే కదా!
కెన్యాదేశ౦లో భారత రాయబారిగా పనిచేసిన ఉత్తమ్ సి౦గ్ కి అక్కడ అ౦దరూ బాగా ఇష్ట౦గా తినే రాక్షసనత్తమా౦స౦ తినట౦ అలవాటవుతు౦ది. పదవీ కాల౦ ముగిశాక, ఆ దేశ౦ ను౦చి మనదేశానికి వస్తూ, కస్టమ్స్ అధికారుల కన్నుగప్పి ఒకే ఒక్క రాక్షసనత్తని తనతో తెచ్చుకు౦టాడు అతగాడు. ఆ నత్త భారతదేశానికి అతనితోపాటు చేరుకున్నాక అనుకున్నట్లే 3౦౦ గుడ్లు పెడుతుంది. అందులో తన ఆహారానికి అవసరమైనన్ని గుడ్లు మాత్రమే ఉంచుకుని మిగిలిన అన్నిటినీ నిర్దాక్షిణ్యంగా నాశనం చేసేస్తాడు ఉత్తమ్. ఎ౦దుక౦టే, రాక్షసనత్త గుడ్డు ఒక్క రోజులోనే పిల్ల కాగలదు. ఇలా పిల్ల ఐన ఒక్కొక్క నత్తా తిరిగి వార౦ రోజులలోనే దేనికది స్వత౦త్ర౦గా స౦తాన ఉత్పాదక శక్తిని పొ౦ది స్వ౦త ఫ్యాక్టరీని ప్ర్రార౦భి౦చేస్తాయి. కనుక ఉత్తమ్ రాక్షసనత్త జనాభా అధిక౦ కాకు౦డా తన జాగ్రత్త తను పడుతూ ఉ౦టాడు. కానీ, కథావశాత్తూ, ఒకసారి ఉత్తమ్ ఢిల్లీ నుంచి మదరాసుకి రైల్లో ప్రయాణం చేస్తుండగా ఖాజిపేట దగ్గర ప్రమాదం జరిగి సింగ్ తోపాటు అతని సూటుకేసులో ప్రయాణిస్తున్న రాక్షసనత్తలు బంధవిముక్తులై వివిధ మార్గాల ద్వారా నెమ్మదిగా హైదరాబాదుకి చేరుకుంటాయి. అసలు వినాశనం ఇక మొదలవుతుంది.
పుట్టిన ప్రతి నత్తా వారం రోజులలో సంతాన సాఫల్యతా శక్తి సంపాదించుకుని తడవకి 300 గుడ్లు పెడుతుంది. మళ్ళీ ఈ 300 గుడ్లు ఒక్క రోజులో నత్తలై వారం తిరిగేసరికల్లా (300X300) 90000 నత్తలకి ప్రాణమివ్వగలవు. అలావాటి జనాభా అనతి కాలంలోనే చైనా జనాభాని సైతం అధిగమించి పోతుంది. మన నాయకులకి మల్లేనే ఈ నత్తలకీ ఆకలి అధికం. అది తీరనిది. వజ్రాలని కొరకలేవు తప్ప, పచ్చగడ్డి నుంచి పసిడి నగలదాకా అవి వేటినైనా స్వాహా చేసేయగలవు. పసిపిల్లలని సైతం వదిలి పెట్టకుండా కొబ్బరి ముక్కల్లా కొరికి చప్పరించేస్తాయి. ఈ జరుగుతున్న మారణహోమానికి దేశం దేశమే కంపించిపోతుంది. పరాయి దేశాలలోనూ ప్రకంపనలు మొదలవుతాయి. ఆ దేశాలు మన దేశంతో సంబంధాలు తెగతెంపులు చేసేసుకుంటాయి. లేకపోతే మనవాడు కోరితెచ్చుకున్ననత్తలు అక్కడ కూడా కొరివి పెడతాయిగా మరి! ఎయిర్ ఇండియా సంస్థ మూల పడుతుంది. ఈ నత్తలు విధ్వంసక సామ్రాట్టులవటంతో భీమా సంస్థలన్నీ దివాళా తీస్తాయి.
ఈ విలయతా౦డవానికి అ౦త౦ లేదా? పరిష్కరి౦చట౦ ఎలా? అని తలలు బద్దలు కొట్టుకోటానికి పెద్దలు అ౦దరూ ఓచోట చేరినపుడు, పరిశోధక పత్రికా రచయిత (investigative journalist) రఘుపతికి బల్బు వెలుగుతు౦ది. రాక్షసనత్తలకి జన్మస్థలమైన కెన్యా దేశ౦లో వీటివల్ల కి౦చిత్తైనా బెడద లేదు. ఒకేఒక్క నత్త వల్ల దాని విధ్వ౦సకర స౦తతి కేవల౦ నెల, నెలా పదిహేను రోజులలో ఒక బిలియన్ లేదా వంద కోట్ల స్థాయికి చేరుకుంటే, ఆ దేశం ప్రపంచ పటం నుండి ఎప్పుడో మాయమైపోయి ఉండేది. సృష్టిలో ఉన్న విచిత్రమైన విశిష్టత ఏమిటంటే ప్రతి అనర్థానికి ఒక సహజమైన విరుగుడు ఉంది. పాములు విపరీతంగా పెరగకుండా గద్దలు, ముంగీసలు ఉన్నాయి. అలాగే రాక్షసనత్తలకి విరుగుడు ఉండే ఉంటుంది. అది ఆ దేశానికి వెళితే కానీ తెలియదు. ఇలాంటి సహేతుకమైన ఆలోచనలతో కెన్యాదేశానికి బయలుదేరతారు రఘుపతి, జూవాలాజికల్ ప్రొఫెసర్ పాంచజన్య. పశ్చాత్తాప ధగ్ధ హృదయుడై, పాప ప్రక్షాళన కోసం వీరిని వె౦బడిస్తాడు ఉత్తమ్ సి౦గ్. అక్కడ అనేక శ్రమదమాదులు ఎదుర్కొన్నాక, వారికి రాక్షస నత్తలకి శత్రువైన గినాక్సిస్ నత్తలు లభిస్తాయి. వాటిని పదిల౦గా భారతదేశానికి తీసుకువచ్చి రాక్షసనత్తలని స౦హరి౦చి జరుగుతున్న ఘోరాన్ని అదుపులోకి తేగలుగుతారు.
తన ప్రదేశ౦లో లేని, దొరకని జ౦తువునో, జీవినో మనిషి తన సరదా కొసమో లేక అవసరార్థమో మరో ప్రదేశ౦ ను౦చి తెచ్చుకు౦టే కలిగే అనర్థాలని, జరగబోయే ప్రమాదాలని ఆసక్తికర౦గా తెలిపే zoological fantasy ఈ నవల. 1953లో అమెరికాలో రాక్షస నత్తలతోనూ, ఆస్త్రేలియాలో పిచ్చుకలతోనూ, కుందేళ్ళతోనూ నిజంగా ఇలాంటి పరిస్థితులే ఏర్పడటమూ; మానవ ప్రయత్నాలతో సమస్యలు పరిష్కారమై సాధారణ పరిస్థితులు నెలకొనటమూ జరిగిందని కూడా ఈ నవల చెపుతుంది.
ఈ నవల మొదట విజయ మాసపత్రికలో సీరియల్ గానూ, తర్వాత 1982/83 లలో పుస్తక రూపకంగానూ వచ్చింది. నేను 1983 జూలై 20న మొదటిసారి చదివాను. ఈ (Synopsis) సారాంశాన్ని కూడా అప్పుడే రాసుకున్నాను. చదివినవి నచ్చినప్పుడు వాటి గురి౦చి క్లుప్త౦గానో లేక విపుల౦గానో ఒక synopsis రాసి పడేసుకు౦టే ఆ తర్వాత ఆ ఒరిజినల్ గురి౦చి ఇక భయపడాల్సిన దేమీ ఉ౦డదని నా భావన. ఐతే, నచ్చిన అన్ని పుస్తకాలకీ లఘు టీకా టిప్పణీలు రాసుకోవట౦ కూడా సాధ్య౦ కాదు. ముఖ్య౦గా ఈ రాసుకునే అలవాటు ఎక్కువ పుస్తకాలని చదువనీయదు. ఇ౦కా పుచ్చెడు సమస్యలు ఉన్నాయి లాభాలతో పాటు. వాటన్నిటి గురి౦చి విశద౦గా వీలు౦టే మరోసారి….
(మరో మల్లాది నవల ’అందమైన జీవితం’ గత ఏడాది పుస్తకం.నెట్లో రమణి గారు రాసిన వ్యాసం ఇక్కడ చూడండి – పుస్తకం.నెట్]
Srinivas Vuruputuri
“ఈ అర్థనారీశ్వరులు స౦తానోత్పత్తి కోస౦ మరో జీవి దగ్గరకు వెళ్ళి, పిల్లిమొగ్గలు వేస్తూ ఎలా౦టి డ్యూయెట్లు పాడనవసర౦ లేదన్న మాటే కదా!”
కాదేమో! See this: http://en.wikipedia.org/wiki/Achatina_fulica#Reproduction
రవి
యండమూరికన్నా నాకు మల్లాది అంటేనే అభిమానం. ఈయన నవలలు మామూలుగా ఉంటూనే అసాధారణంగా ఉంటాయి.
ఈ నవల దాదాపు ఇరవై యేళ్ళ ముందు చదివాను. అయినా బాగా గుర్తుంది. ఈ నవల్లో రఘుపతి, మరో నవల్లోనూ వస్తాడు. అది “శనివారం నాది” నవల అనుకుంటాను.
peeveeyes
వేణూ శ్రీకాంత్ గారూ! ఇటీవలి కాలంలో మల్లాది వారు తన రచనలన్నిటిని తనే ప్రచురించుకుంటున్నారు. ” లిపి పబ్లికేషన్స్, గాంధీ నగర్, హైదరాబాద్—500 080 వద్ద మీరు సంప్రదిస్తే ఫలితం ఉండగలదు.
Lavanyapeeyesel
PEDANAANNA,
I LOVE A LOT YOUR REVIEW ABOUT THIS PARTICULAR NOVEL.I FELT THAT THE WRITER WAS SOME POET AND NOT AT ALL MY FAVOURITE PEDANAANNA THAT MUCH I INVOLVED .YOU DID A GREAT JOB .
Lavanyapeeyesel
pedanaanna,
naaku idi chadivaka oka rachayitha thana rachananu parichayam chesada anna feeling kalikindi chala happyga undi pedanaanna inka ilage nuvvu lakshaku paiga navalala gurinchi parichayam cheyyalani korukuntunnanu inka chala mandiki vari smruthulanu gyaptiki testhanu aasisthooo neee priyamaina koothuru lavanya.
LOVE YOU SO MUCH PEDANANNA FEELING VERY PROUD ABOUT YOU.
chinnari
అసలు మల్లాదివారు అద్భుతమయిన నవల్సు వ్రాసారు.తెలుగులోన్యూట్రెండ్ ఆయన తెచ్చినదే.యద్దనపూడి నవెల్స్ చిరి మువ్వలసవ్వడిలా ఉన్టే, మల్లాది ది శివమణీ కాంగో బీట్,తరువాత తరువాత సె క్స్ ,హర్రర్ పాళ్లు ఎక్కు వయిపోయాయి.యన్డమూరి వి బేలన్సుడు గా ఉంటాయి.ఇది నా సొంత అభిప్రాయమనుకోండి.his novels are informative,interesting,novelsubject.way of writingstyle is amazing.reading his book is like enjoying puzzle.characterijation is superb.
Srinivas Vuruputuri
Read this book, several years ago.
The giant snails seem to have invaded Kerala, now. Here are two links:
http://www.thehindu.com/news/states/kerala/article533332.ece
http://ibnlive.in.com/news/giant-african-snails-romp-kerala/17744-11.html
అరుణ పప్పు
మర్చిపోయా, కథల రచయిత్రిగా ఎవరికైనా నున్న రాజేశ్వరి పరిచయం ఉంటే దయచేసి నాకో కబురు చేరవెయ్యండి.
అరుణ పప్పు
1992, ఏడో క్లాసులో ‘స్కూల్ డే’ కోసం ఒక నృత్య నాటకం వేస్తున్నారు నా తోటివిద్యార్థులు. అందులో నా ఫ్రెండు నున్న ఉమామహేశ్వరి మేకప్ కోసం వాళ్లింటికి రమ్మంటే వెళ్లా. వాళ్లక్కయ్య ఎన్.రాజేశ్వరి డిగ్రీలో ఉండేది, అప్పటికే కథలు రాస్తుండేది. అలా వాళ్ల డ్రెస్సింగ్ టేబుల్ మీద ఈ పుస్తకం కనిపిస్తే మా ఉమ తయారయ్యేలోపు చదువుతూ కూచున్నా. ‘నా మేకప్ అయిపోయింది, ఇక బయల్దేరదాం…’ అని ఉమ ఎన్నిసార్లు పిలిచినా ఈలోకంలో ఉంటే కదా, వినిపించుకోడానికి. చివరికి వాళ్లక్కయ్య నా చేతిలోంచి బలవంతానా పుస్తకాన్ని లాక్కుని బయల్దేరదీసింది. ఇక నా బాధ ఏం చెప్పాలి? సగం చదివిన కథే బుర్రలో తిరుగుతుంటే అసలేం తోచేది కాదు. ఆరోజు దానికి అట్టలేదు, అందువల్ల పుస్తకం పేరేంటో తెలీదు. మళ్లీ ఓసారి వెళ్లి సగం కథ చెప్పి పుస్తకం వివరాలు అడిగితే ‘మాకు తెలీదు’ అన్నారు. ఏమంటే ఆ వివరం చెప్పగల వాళ్లక్కయ్య పెళ్లయి వెళ్లిపోయింది. అక్కడకు పదేళ్ల తర్వాత ఓ నోటు పుస్తకాలు అమ్మే షాపాయన నవలలు అద్దెకిస్తుంటాను, చదువుతారా అని అడిగి ఈ పుస్తకం చేతిలో పెడితే ఇక ఆ రోజు ఆనందం… హైదరాబాద్ లెక్క ప్రకారం తీన్ మార్!!! నేను చదివిన తొలి నవలగా, నన్నో పదేళ్ల పాటు వెతికేలా చేసిన పుస్తకంగా ఎప్పటికీ గుర్తుంటుంది. జ్ఞాపకాల తుట్టెను కదిలించిన పీవీఎస్ గారూ, అభినందనలు.
బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్
మీ synopsis బాగుంది.మల్లాది గారు ఇటువంటి నవలలు కూడా వ్రాశారన్నమాట.
gajula
novel chalaa bhaagundi.
కొత్తపాళీ
ఇప్పుడు స్పష్టంగా గుర్తు లేదు గానీ విజయలో సీరియల్ గా వచ్చిన రోజుల్లో బాగా అలరించినట్టు గుర్తు
వేణూశ్రీకాంత్
నా జీవితంలో నేను చదివిన మొట్ట మొదటి నవల ఇది. చాలా మంచి పుస్తకం గురించి పరిచయం చేశారండీ… ఆసక్తి కరమైన ప్లాట్ ఎన్నుకోవడమే కాకుండా దాన్ని చాలా చక్కగా ప్రజంట్ చేశారు మల్లాది గారు, ఎక్కడా బోర్ కొట్టడమనే మాటే ఉండదు అద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతుంది భీమనత్తలను కనిపెట్టేవరకు.
“అక్షరాలతో హడలెత్తి౦చిన జూలాజికల్ ఫా౦టాసీ….. ” అన్న ఒక్క లైన్ తో నవల గురించి భలే చెప్పేశారు 🙂 నవల కథా గమనం ఒక ఎత్తైతే మధ్య మధ్య లో ఇచ్చే ట్రివియా, ఎకొ ఈక్విలిబ్రియం గురించి వివరించే పిట్టకథలు ఇంకా చాలా అలరిస్తాయి. నేను కూడా ఈ నవల చదివి ఇరవై ఏళ్ళవుతుంది మళ్ళీ ఒకసారి చదవాలని ప్రయత్నిస్తున్నా కానీ ఇంతవరకూ ఎక్కడా నాకళ్ళ పడలేదు. AVKF లో కూడా లేదనుకుంటా రెండు మూడేళ్ళక్రితం వెతికాను.
నాగన్న
మీ సారాంశం ఆసక్తి కలిగించే విధంగా ఉంది. నెనరులు.
Anusha
Godzilla kante mundannamaata.. ee raakshasa nathala charitra.. chadavaali eppudanna
సౌమ్య
:)) Interesting and Amusing plot!!