ఓ పుస్తకాల కొట్టులో
పుస్తకం.నెట్ కు “ఇట్లు మీ శ్రేయోభిలాషు” లలో ఒకరైన ఎ.స్వాతి ఓ పుస్తక విక్రేతతో తన సంభాషణ వివరాలు అందరితో పంచుకుంటున్నారు. ఓ పుస్తకాల కొట్టుకి వెళ్ళినపుడు షాపు యజమానితో జరిపిన చిన్న సంభాషణ సారాంశం ఇది. అంటే, ప్రశ్నా జవాబులు ఇలాగే ఉన్నాయని కాదు. Gist of the chat. అంతే.
ప్ర: పుస్తకాలు చదవడానికి, కొనడానికి ఎవరన్నా వస్తూంటారా?
జ: ఈ తరం కొంత నయం. పుస్తకాలు కొనడానికి చాలా మంది వస్తూ పోతూ ఉన్నారు కానీ, ప్రధానంగా అందరూ వ్యక్తిత్వ వికాసం పుస్తకాల వైపే మొగ్గు చూపుతున్నారు. వాళ్ళ ఉద్దేశ్యం చూస్తే కొన్ని పుస్తకాలు మాత్రమే చదవదగ్గవి, అన్నీ కావు అన్నట్లు ఉంది.
ప్ర: జనాల్లో ఆసక్తి ఎలా ఉంది?
జ: పంతొమ్మిదేళ్ళుగా చూస్తున్నాను. పుస్తకాలు చదివే ఆసక్తి ముందంతా అంత కనబడ్డంలేదు కానీ ఇప్పటి తరం వారిలో కాస్త కనిపిస్తోంది. అయితే, ఇందాకే అన్నట్లు వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు తప్ప వేరేవి పుస్తకాలు కావు అన్నట్లు ఉంది వారి వాలకం.
ప్ర: మీరేమంటారు? వేరే పుస్తకాలు పనికిరావా ఐతే?
జ: యే ఒక్క పుస్తకమూ మనం చదవకూడనిది కాదు. ఇది మనకు సంబంధించినది కాదు, మనం చదివేది కాదు అంటూ ఏ పుస్తకమూ ఉండదు. ఏదన్నా చదవొచ్చు, ఎవరన్నా చదవొచ్చు. పుస్తకాలు చదివితే మనం ఆలోచించలేని కోణంలో కూడా ఆలోచించే శక్తి మనకి వస్తుంది. ఎందుకంటే ఒక్కో రచయితా ఒక్కో కోణంలో ఆలోచించి రాస్తాడు. ఆ విధంగా మనం కూడా విభిన్న కోణాల్లో ఆలోచిస్తాము. ఒక్కోసారి ఇలా చేయడం మనకు చాలారోజులుగా ఏదో జవాబు తెలీకుండా ఉన్న సమస్యకి పరిష్కారం చూపవచ్చు.
– చాలా చిన్న ఇంటర్వ్యూనే లెండి. కానీ, ఆ మాటలు పుస్తక ప్రియులు అందరితో పంచుకోదగ్గవిగా అనిపించి మీ ముందుంచుతున్నాము. ఇలా మీరు కూడా ఎవరితోనన్నా పుస్తకాల గురించో, రచయితల గురించో చర్చించి ఉంటే ఆ చర్చ సారాంశాన్ని మాకు పంపితే పుస్తకం.నెట్ లో ఉంచడానికి ప్రయత్నిస్తాము. వాళ్ళ ఊరిలో పుస్తకాల షాపతనితో సంభాషణ జరిపి ఆ వివరాలు మనతో పంచుకున్నందుకు స్వాతి గారికి పుస్తకం.నెట్ తరఫున ధన్యవాదాలు.
Gali RamanaReddy
sir i want the book name vyaktitva vikasam .but so many books are there in market.but i want that book which is one paper in nepal university send that name sir
chuckareddy komatireddy
Friends,
Long back I purchased three books of Late Sri K.N.Y.Pathanjali.They are all same.Collection of all his novels.I gifted all of them to my friends.I used to read the book regularly like Gurajada’s Kanya Shulkam.I tried for that book in every shop at Karimnagar and Hyderabad.Will any one tell me where I could get it.Please reply to my Email chuckareddy@hotmail.com
నెటిజన్
పుస్తకాల కొట్లో అరుణ గారు. చదవండి
నెటిజన్
@Sowmya:ఆ “బుక్‌బర్డ్” కి ఒక కొమ్మ ఇవ్వండి, లేదా చెట్టో, గుట్టో చూపించండి. మీరు మరీను. పాపం! ఎన్ని రోజులు అలా గాలిలోనే ఎగురుతూఉంటుంది? అలసి,సొలసి..:(
The Thorn Birds చదివారా? ఎవరినన్నా పరిచయం చెయ్యమనండి! అది నచ్చిన వారికి మంచి పుస్తకం.
నెటిజన్
@Sowmya: నెనరులు అండి. 🙂 కధ: ఇతివృత్తము, కత, కద, చరితము, కథ కాదా?! అని అందరూ అంటుంటారే!
Sowmya
@Netijen: కథ – katha. not, kadha or కధ
– Since u cant bear typos, for your information.
నెటిజన్
@Sowmya: “అయ్యా!” ?! అమ్మా,…
@Sowmya: 🙂
@Sowmya: మీరేనా S? ఒకవేళ అయ్యుంటే, ఆ కధలు రెండూ చదివారా? అని మాత్రమే ప్రశ్న! ఏ కధలు అనో, మీ అభిప్రాయం అనీ అడగడం లేదు!
Sowmya
Bookbird – This is the name of the shop.
Sowmya
@Netijen:
అయ్యా!, అక్కడ ఒకరు ఒక పుస్తకం షాపతనితో కాసేపు మాట్లాడారు. దాన్ని ఈ సైటులో వేసుకుంటారా అని పంపారు. పుస్తకాల కొట్టు యజమానులతో ఇలాంటివి మాట్లాడాలన్న ఆలోచన మాకూ ఉండటంతో దాన్ని ప్రచురించాము. త్వరలో ఇలాంటివి మరిన్ని కూడా రావొచ్చు. అవన్నీ ఆ షాపులో సేల్స్ బట్టి వారు ఏర్పరుచుకున్న అభిప్రాయాలు. అంతే కానీ, మొత్తం ప్రపంచంలో పుస్తకాల సేల్స్ ని ఇక్కడ జనరలైజ్ చేస్తున్నామని మేము ఎక్కడా చెప్పలేదు. అతను చూసినంతలోనే అతను చెప్పగలడు కానీ, ఎక్కువ చెప్పలేడు కదా.
ఇంతకీ, షాపు వివరాలు ఇక్కడ ఇవ్వకపోవడం మా పొరపాటే. వరంగల్ లో ఒక పాత బుక్ షాపని మాత్రం ప్రస్తుతానికి చెప్పగలను. మిగితా వివరాలు పంపినవారిని అడిగి కనుక్కుని చెబుతాము.
నెటిజెన్
కోఠిలోని విశాలాంధ్ర బుక్ హౌజ్ లో “కుక్కలున్నాయి జాగ్రత్త” గురించి అడిగితే వచ్చే జవాబుకి, విజయవాడలోని అరుణా బుక్ హౌజ్ లో “వస్తుగుణ దీపిక” గురించి అడిగితే వచ్చే జవాబుకి, కోటగుమ్మం ఎదురుగుండా ఉన్న గొల్లపూడి వీరవెంకయ్య అండ్ సన్స్ వారిని “కాంతమ్మ కధలు” గురించి అడిగితే వచ్చే జవాబుకి, చాలా తేడా ఉంటుంది అని చెప్పడమే ఇక్కడి ఉద్దేశం.
అలాగే “ఝంఝ” ని నిషేధించడానికి కారణాలు, “మరీచిక” నిషేధానికి కారణాలు వేరు అని తెలిసినవారు ఏ పుస్తకాల గురించి ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ వెతకాలో తెలిసిఉన్నవారవుతారు. అంత అవగాహన ఉన్నప్పుడు, పుస్తకాల కొట్టువాడుకి “పుస్తకం” మీదున్న పట్టు తెలిసినట్టు.
అది తెలియని వాడి అభిప్రాయం – ఇతరులు తెలుసుకోదగ్గది కాదు అని చెప్పడమే ఇక్కడి వ్యాఖ్య ఉద్దేశం. ఇండాలజి బుక్ సెంటర్ వాడికి “కాంతమణి వంటకాలు” గురించి తెలియదని విస్తుబోవడం అడిగినవారి అజ్ఞానం తప్ప మరొహటి కాబోదు.
ఒకరిని నిందించాలనో, కించపరచాలనో ఇక్కడ వ్యాఖ్యానించటంలేదు.
పుస్తకం – అధినేతలకి/ నిర్వాహకులకు క్షమాపణలతో
Swathy
@Pustakam:ముందుగా పుస్తకం కి నా ధన్యవాదాలు.
@Netijan:ప్రత్యేకంగా ఇంటర్వ్యూ అంటూ ఏమి చేయలేదండి. ఈ సారి ఇంటర్వ్యూ చేస్తే మీ అమూల్యమైన సలహాలను దృష్టిలో ఉంచుకుంటాను. మీరు అనట్టు అక్కడ అన్ని రకాల పుస్తకాలు దొరుకుతాయి .. టెక్స్ట్ పుస్తకాలు ,రెఫెరెన్సు పుస్తకాలు , తెలుగు పుస్తకాలు మరియు ఇతర భాషా పుస్తకాలు కూడా .. గమనించాల్సిన విషయం ఏంటంటే .. ఆ కొట్టు కి యజమాని ,అసిస్టెంట్ అన్నీ ఒకే మనిషి …
యువత ఎలాంటి పుస్తకాలు ఎక్కువగా చదవడానికి ఇష్టపడుతున్నారు అని తెలుసుకునే ప్రయత్నం లో జరిగిన సంభాషణ ఇది …. ప్రత్యేకంగా వ్యక్తిత్వ పుస్తకాల గురించి మాత్రం కాదు .
మార్తాండ
I am not just writing about my personal preferences. I wonder why do publishers popularise Yandamuri so much while there are other writers who are much efficient than him.
కె.మహేష్ కుమార్
@మార్తాండ: ఇక్కడ చర్చ ఒక ట్రెండ్ గురించి మీ వ్యక్తిగత preference గురించి కాదు. ఏది ఏమైనా ఎవరు బాగారాసినా మొతానికి వ్యక్తిత్వ వికాస పుస్తకాల మార్కెట్ కి మీరూ దొహదపడుతున్నారు. బహుశా టపా రాసినవారు ఉద్దేశం కూడా అది చెప్పడమే. కాబట్టి చర్చ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఎవరు గొప్పగా రాస్తారు అని కాదు, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు తప్ప మిగతావి యువత ఎందుకు చదవడం లేదు అని. So,మన చర్చ కాస్త దానిమీద ఉంటే బాగుంటుందేమో!
పబ్లిషింగ్ పరిశ్రమ విజయవాడలో కేంద్రీకృతమయ్యిందనేది నిన్నటి మాట.విజయవాడలో ప్రారంభమయినా, ప్రస్తుతం అన్ని పబ్లిషింగ్ గౌస్ లూ హైదరాబాద్ నుండే వ్యవహారాలు నడుపుతున్నారు. ప్రింటింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది. కాబట్టి ఆ ఆరోపణ సత్యదూరం.
బహుశా అసలు సమస్య మన promotion and distribution లో ఉందేమో అనిపిస్తుంది. దాని గురించి ఎవరైనా కొంత సమాచారం తెలిపితే బాగుండును.
మార్తాండ
తెలుగు పబ్లిషింగ్ పరిశ్రమ ఎక్కువగా విజయవాడలో కేంద్రీకృతం కావడం వల్లే అది పెద్దగా వృద్ధి చెందలేదు. యండమూరి ప్రొఫెషనల్ గా చార్టర్డ్ అకౌంటెంట్. ప్రొఫెషనల్ గా సైకాలజిస్ట్ + హిప్నాటిస్ట్ లైన పట్టాభిరాం, నాగేష్ లాంటి వాళ్ళే వ్యక్తిత్వ వికాసం గురించి బాగా వ్రాయగలరు. అందుకే నేను చిన్నప్పుడు పట్టాభిరాం, నాగేష్ లాంటి వాళ్ళ రచనలే ఎక్కువగా చదివేవాడిని. పబ్లిషర్లు యండమూరిని పాపులర్ చేసినంత మాత్రాన యండమూరినే ఫాలో అవ్వాలని రూలేమీ లేదు.
కె.మహేష్ కుమార్
@మార్తాండ: మీధోరణి మీదేగానీ, ఎదుటోడు చెప్పిండి అస్సలు చదవరే! యండమూరి తులసీదళం రాసినంత మాత్రానా తను రాసే వ్యక్తిత్వ వికాస పుస్తకాలు అర్థరహితం అనడం పేలవమైన వాదన. తను రాసిన విజయానికి ఐదు మెట్లు, విజయానికి ఆరోమెట్టు,తప్పుచేద్ధాం రండి వంటి పుస్తకాలు అమ్ముడయినంతగా ఇతర ఏరచయిత పుస్తకాలూ అమ్ముడవలేదు. తెలుగు పబ్లిషింగ్ చరిత్రను తిరగరాసిన పుస్తకాలు ఇవి. వాటిల్లో ఏముంది ఎంతరవకూ పనికొస్తుంది అనేది, కొంటున్న పాఠకుడికి తెలుసు.
అయినా తులసీదళం మూఢనమ్మకాల్ని ప్రోత్సహించే నవల అని నేను అనుకోను. Its a horror fiction. ఇదొక విధమైన రసస్పందన.
————————————————————————–
తెలుగు పబ్లిషింగ్ మరియూ వితరణ పరిశ్రమ కొందరి చేతుల్లో ఉండటం. వారి లాభాలు ప్రభుత్వ (లైబ్రరీ)కాంట్రాక్టుల మీదేతప్ప పాఠకులు పుస్తకాలు కొనడం నుండీ రాకపోవడంతో, అంటు రచయితకూ ఇటు పాఠకుడికీ పనికి రాకుండా పరిశ్రమ తయారయ్యింది. ఇది ఎప్పుడు మారుతుందో!
మార్తాండ
ఒక పుస్తకాల షాపులోని మార్కెట్ ఆధారంగా దేశ వ్యాప్తంగా మార్కెట్ ఇలాగే ఉందని చెప్పలేం. వ్యక్తిత్వ వికాసానికి ఏమాత్రం పనికిరాని పుస్తకాలు, మూఢ నమ్మకాల్ని ప్రోత్సహించి ఉన్న వికాసాన్ని చెడగొట్టే పుస్తకాలు కూడా మార్కెట్ లో ఉన్నాయి. వ్యక్తిత్వ వికాసం పేరుతో బోలెడన్ని పుస్తకాలు అమ్మే యండమూరి గారే గతంలో మూఢ నమ్మకాల్ని పెంచి పోషించే నవల వ్రాసి వివాదాస్పదమైయ్యారు. ఆ నవలని టి.వి. సీరియల్ గా తీసి మళ్ళీ వివాదంలోకి దిగారు. రాష్ట్రంలో పల్లె ప్రాంతాలలో చేతబడి పేరుతో హత్యలు జరుగుతుండగా ఇలాంటి సీరియల్స్ తీసి పల్లె ప్రజలని ఇంకా చెడగొట్టడం ఎందుకు? వ్యక్తిత్వ వికాసం గురించి ఇంత వ్రాసే వ్యక్తికి మూఢ నమ్మకాలు వ్యక్తిగతంగా ప్రగతి నిరోధకమైనవి అని తెలియదా? చిన్నప్పుడు నేను పత్రికల్లో బి.వి.పట్టాభిరాం, నాగేష్ గార్ల వ్యాసాలు చదివి వ్యక్తిత్వ వికాసం పెంచుకున్నాను. నాగేష్ గారి వ్యాసాలు పత్రికలలో చదివాను కానీ షాప్ లో మాత్రం అతని పుస్తకాలు కనిపించలేదు నాకు. నేను ఎక్కువగా సమాజం, రాజకీయాలు, చరిత్రకి సంబంధించిన పుస్తకాలు కొంటుంటాను.
మాలతి
మంచి ఆలోచనే. పుస్తకం.నెట్ విస్తరించుకుంటోందనడానికి సాక్ష్యం :). ఈ సైటుకి వచ్చేవారందరూ పుస్తకాలు కొనేవారే కనక వారి వారి అనుభవాలు పుస్తకాలకొట్టులోనివి, కొట్టు యజమానులతో మాట్లాడి రాస్తేనూ, ప్రచురణకి సంబంధించిన విషయాలు తెలుస్తాయి.
మరోసారి జయహో!
మార్తాండ
యండమూరి గతంలో తులసిదళం అనే హారర్ సీరియల్ వ్రాసి వివాదాస్పదమయ్యాడు. వ్యక్తిత్వ వికాసం గురించి ఇంత వ్రాసే వ్యక్తికి మూఢ నమ్మకాలు వ్యక్తిగతంగా ప్రగతి నిరోధకమైనవి అని తెలియదా?
కె.మహేష్ కుమార్
@మార్తాండ: శివ్ ఖేడా పేరెప్పుడైనా విన్నారా? హిందీ,మరాఠీ భాషా ప్రాంతాలలో అత్యంత ప్రసిద్ది చెందిన వ్యక్తిత్వ వికాస పుస్తకాల రచయిత. కోకొల్లలుగా కొన్ని లక్షల్లో ఈయన పుస్తకాలు అమ్ముడవుతుంటాయి. యండమూరి వీరేంద్రనాధ్ తెలుగులో ఎంత ప్రాచుర్యం సంపాదించాడో అంతే ప్రాచుర్యం కర్ణాటకలోనూ కలిగివున్నాడు. బెంగాలీ,పంజాబీలలో కూడా ఈ పుస్తకాలు విరివిగా లభిస్తాయి. ఇవి భారతీయభాషలకు సంబంధించినవైతే, ఇంగ్లీషు పుస్తకాలైన I am OK,You are OK మొదలు 7 Habits of successful people (ఆతరువాతొచ్చిన కొన్నింటి) వరకూ పిచ్చపిచ్చగా కొని చదవబడుతున్న పుస్తకాలున్నాయి. కాబట్టి, మీరు చూసిన భారతదేశం మనదోకాదో ఒకసారి పరీక్షించుకోండి.
మార్తాండ
వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలకి పెద్ద క్రేజ్ లేదు. ఉంటే ఆంధ్ర ప్రదేశ్ లో ఉండొచ్చు కానీ వేరే రాష్ట్రాలలో మాత్రం కాదు.
భమిడిపాటి ఫణిబాబు
నిన్న సాయంత్రం మా తమ్ముడికి ఏదో రిఫరెన్స్ పుస్తకం ( వాళ్ళ అమ్మాయికోసం) కావాలంటే, ఇక్కడ రాజమండ్రి లో ఒక సెకండ్ హాండ్ పుస్తకాల షాప్ కి వెళ్ళాము. పై అంతస్థు మీద ఉంది. ఓ పాతిక మెట్లు ఎక్కి వెళ్ళ వలసి వచ్చింది. మా వాడు తనకి కావల్సిన పుస్తకాలు వెతుక్కుంటూ ఉంటే, నేను ఆ కొట్టతన్ని అడిగాను ” ఏమండీ మీ కొట్టు ఇలా పై అంతస్థు లో పెడితే నాలాంటి వాళ్ళకు కష్టం కదా”. అంటే అతను అన్నాడూ ” సార్ ఇక్కడ చాలా భాగం సెకండ్ హాండ్ టెక్నికల్ పుస్తకాలే దొరుకుతాయీ, కావాలన్న వాళ్ళు ఎంత శ్రమ అయినా వస్తారు, మీలాంటి వారికి కావల్సిన పుస్తకాలు గొల్లపూడి వారి కొట్టు లో దొరుకుతాయి ” అని. అతని ఆత్మ విశ్వాసానికి నాకు చాలా సంతోషం అనిపించింది.
నెటిజెన్
@సౌమ్య: చాలా దాఋణమైన పొరబాటు జరిగిపోయింది. కావాలనో, ఉద్దేశపూర్వకంగానో చేసింది కాదు. మిమ్మల్ని నొప్పించినట్టున్నాను. స్వాతి గారి పేరుని మీరు బొద్దు అక్షరాలు వాడి ప్రత్యేకంగా చూపినా పొరబాటు జరిగింది. తప్పు చేసాను. మరో విధంగా భావించవద్దు. నా క్షమాపణలు అంగీకరించగలరు. నాకు మాటలు దొరకడం లేదు. I tender you my unconditional apologies.
సౌమ్య
@Netijen:
మీరు అన్నిసార్లు నా పేరు ఎందుకు పెట్టారో నాకు తెలీదు. ఈ ఇంటర్వ్యూ చేసిన మనిషి పేరు స్వాతి. ఆ మెయిల్ వివరాలను తెలుగీకరించింది మాత్రం నేను. మీ ప్రశ్నలకి జవాబులు నాకు తెలీదు. నేను ఎవర్నన్నా ఇంటర్వ్యూ చేస్తే మీ అమూల్యమైన సలహాలను దృష్టిలో ఉంచుకుంటాను.
రవి
నా అనుభవాల ప్రకారం, చాలావరకు – ఈ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చేసే ఉపయోగం కంటే, అంతర్లీనంగా పెంచుతున్న భయం, ఆత్మన్యూనత పాలే ఎక్కువ. ఇవి పనికి రానివి అని చెప్పలేము. అయితే, ఈ పుస్తకాల మీద ఆధారపడే మనస్తత్వాన్ని అధిగమించటమే నిజమైన వ్యక్తిత్వ వికాసం అని నా భావన.
నెటిజెన్
పై సంభాషణలో , ఇంటర్యూ జరిగిన “కొట్టు” ఏ పుస్తకాల (టెక్స్‌ట్ పుస్తకాలా, రెఫరెన్సు పుస్తకాలా, కాలేజి పుస్తకాలా, తెలుగు పుస్తకాల, పుస్తకాలు – స్టేషనరి అమ్మే) “అంగడి” అన్నది తెలిసినప్పుడు సౌమ్య గారి “ముఖాముఖి”కి ఒక సంపూర్ణత ఏర్పడుతుంది. ఉదాహరణకు సౌమ్య గారు – “యజమాని” తో జరిపిన సంభాషణ అని అన్నారు. అదే మరి, షాప్ అసిస్టెంట్ అయితే ఎలాగుండేదో?
ఇంతకి “సౌమ్య” గారు పుస్తకం కొనడానికి వెళ్ళారా?
ఏదేని పుస్తకం కొన్నారా?
వారు కావాలనుకున్న పుస్తకం మాత్రమే కొనుకున్నారా?
పుస్తకాల కొట్టు యజమాని మరేమన్నా పుస్తకాలను సూచించారా?
ఇక ఇలా ఎన్ని ప్రశ్నలన్నా సంధించవచ్చు..!!! 🙂
మార్తాండ
జనం ఇతర సబ్జెక్ట్స్ కి సంబంధించినవి కూడా కొంటారు. నమ్మకపోతే భుబనేశ్వర్ రైల్వే స్టేషన్ ఏరియాలో ఉన్న బుక్ షాపులకి వెళ్ళి చూడండి. బిజినెస్ పెట్టక ముందు తరుచూ ఒరిస్సాలోని మా బంధువుల దగ్గరకి వెళ్ళి వస్తుండేవాడిని. అలాగే భుబనేశ్వర్ కూడా వెళ్ళేవాడిని. భుబనేశ్వర్ లో ఇతర సబ్జెక్ట్స్ కి సంబంధించిన బుక్స్ ఎక్కువ దొరుకుతాయి కాబట్టి కొంటారు, ఇక్కడ ఎక్కువ దొరకవు, అంతే తేడా.
కె.మహేష్ కుమార్
వ్యక్తిత్వ వికాసం పుస్తకాలను నిత్యజీవితంలో “పనికొచ్చే”పుస్తకాలుగా మార్కెట్ చెయ్యబడుతున్నాయి. కాబట్టి సహజంగా యువత ఆసక్తి వాటి మీదే. ఈ పోటీప్రపంచంలో ఎవర్ని ఎలా అధిగమించాలో,మనం ఎలా ఎదగాలో ఒక mathematics ఫార్ములా లాగా చెప్పే popcorn పుస్తకాలపైనే మోజెక్కువ.
ఇది మన మార్కెట్ సంస్కృతికి ఒక mirror image మాత్రమే. దీన్ని అమానుషం అనలేముగానీ, ఇదే నిజం. భౌతిక అవసరాలకు మించిన మానసిక అవసరాల్ని (టెక్స్ట్ పుస్తకాలు కాని)పుస్తకాలు అందిస్తాయనే స్పృహ అటు తల్లిదండ్రులకే లేనప్పుడు, పిల్లలకి ఎవరు చెబుతారు?