పిల్లలు,హక్కులు ,కార్యాచరణ ప్రణాళిక : ఒక పుస్తకం
రాసిన వారు: చంద్రలత
************
ఇదొక సున్నితమైన అంశం.
ఎప్పుడు ఎక్కడ మొదలు పెట్టలా అన్నది ఎవరికైనా సందేహమే.
అయినప్పటికీ , అనేక సందర్భాలలో తెలియకుండానే ఈ విషయం గురించి బోలెడంత మాట్లాడేస్తుంటాం.
తెలిసీనా తెలియక పోయినా పీకలోతుల్లోకి వెళ్ళి మునిగి తేలి వస్తుంటాం.
ఎన్నడైన తెలుసుకుందాం అనిపించినా ,అబ్బా ఇలాంటి ధీరగంభీర విషయాలను తవ్వి తలకెత్తుకొనే వయసింకా రాలేదు. ఇది సమయమూ కాదు, సంధర్భమూ కాదు అని వాయిదా వేస్తుంటాం. తీరిక దొరికినప్పుడు తరువాతెప్పుడైన చూసుకోవచ్చు లెమ్మని ..కాస్త బద్దకించి వదిలేస్తుంటాం.
ఇదేదో కార్యశూరులకు సంబంధించిన విషయం మనకెందుకు లెమ్మని ముక్తాయించి నిమ్మకు నీరెత్తుతాం.
ఇక, అంతంత తెలివిడి తో ఎలాంటి జంకుగొంకు లేకుండా ఎంతెంతో మాట్లాడేసేవారి సంగతి అటుంచుదాం.
అది సరే –
మరి ఇది అలాంటి ఇలాంటి విషయం కాదు.
మానవ హక్కులు.
వీటి విషయం లో మనకే ఇన్ని సంశయాలుంటే సందేహాలుంటే ,మరి మన పిల్లల సంగతి ఏమిటి?
వీటిని పిల్లలకు ఎప్పుడు పరిచయం చేయాలి? ఎలా పరిచయం చేయాలి? అసలెందుకు పరియం చేయాలి?
బావుందండి.
పిల్లలేమిటి? మనవహక్కులేమిటి..అన్న సందేహం ఏ మాత్రం వచ్చినా…ఒక్క క్షణం ఆగండి.
పిల్లల హక్కులు పరిరక్షించడానికి ఎన్నెనో ప్రయత్నాలు జరుగుతుండగా , ఎందరో మహానుభావులు నడుం బిగించి అలుపెరుగకుండా పనిచేస్తుండగా , పిల్లలతో మాట్లాడితే పిల్లల హక్కుల గురించి మాట్లాడాలి గానీ, ఏకం గా మనకే మింగుడు పడని ఈ మానవ హక్కులు మొదలైన గంభీరమైన అంశాల గురించి అప్పుడే మాట్లాడాలా ..అన్న సంశయం కలగడం సహజం.
మన సంశయాలకు సందేహాలకు సమాధానమేమో అన్నట్లుగా, పిల్లల కోసం My book of Human Rights అనే ఒక పుస్తకం మన ముందుకు వచ్చింది –
తెలుగుతో సహా అన్ని ప్రధాన భారతీయ భాషలలో.
డా.జయశ్రీ గుప్తా గారి రచనలో.
భారత సమాచార మరియు ప్రసార శాఖ వారి ప్రచురణలో.
మానవహక్కులంటే మరేవో కావు. మానవులుగా సహజంగా మనకున్న మౌలిక హక్కులు. అవి విశ్వవ్యాప్తమైనవి.సమానమైనవి.నిరాకరించలేనివి. అన్ని చోట్లా ప్రభుత్వ పరంగా,ప్రభుత్వేతరంగా ,ఎన్నెన్నో రకాలుగా మానవహక్కుల అమలుకు ,పరిరక్షణకు పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ,మనవహక్కుల ఉల్లంఘన యధేచ్చగా సాగిపోతున్నదన్నది సర్వవిదితం.
ఈ నేపథ్యంలో, ఈ పుస్తకం పిల్లలకు మానవహక్కులను పరిచయం చేస్తూ, వాటి అమలులో వారి పాత్రను వివరిస్తున్నది. ఈ పుస్తకం రెండు భాగాలుగా విభజించబడింది.
మొదటి భాగం లో ,మానవహక్కులను ప్రత్యక్ష అనుభవం కల్పించడం ద్వారా వివరించే ప్రయత్నం జరిగింది.ఒక Child Catalyst గా తమను తాము మలుచుకోవాల్సిన అవసరాన్ని తెలియపరుస్తుంది.
ఒక చైల్డ్ క్యాటలిస్ట్ కావడానికి మొదటి అడుగు తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిశీలించడం. ప్రశ్నించడం. తన ఇరుగుపొరుగులలో ఉన్న “under privileged” పిల్లలను గుర్తించడం. వారి నిత్య జీవితాన్ని గమనిచడం. తన జీవనంతో పోల్చి చూడడం..ఇదీ ఒక పద్దతి ప్రకారం చేయడానికి వీలుగా, కొన్ని కొన్నిసూచనలు, ఎక్సర్ సైజ్ లు, బొమ్మలు ఇచ్చారు. పరతి రోజు, వారానికి ఒకసారి, నెలకు ,ఆపై సంవత్సర కాలంలో ..ఈ అధ్యయనం ఎలా చేయాలో ..క్రమపద్దతిలో సూచించారు.
ఆపై, చాప్టర్..”ఇప్పుడు ఏం చేయాలి? ” నందు..ఆ అధ్యయనం నేర్పిన పాఠాల నేపధ్యంలో ,ఆపై చైల్డ్ క్యాటలిస్ట్ చేయవలసిన కార్యాచరణ ప్రణాళికను అందిస్తారు. ఇక, రెండో భాగంలో మానవ హక్కులను ,చట్టాలను, అమలును స్పష్టంగా వివరించారు.భారత రాజ్యాంగం ద్వారా అమలు అయ్యే మానవ హక్కులను వివరంగా తెలియపరిచారు. చిన్న చిన్న మాటలతో ,స్వీయాధ్యయాన్ని ,కార్యాచరణను ప్రొత్సహిస్తూ..పిల్లలకోసం రచించిన ఈ పుస్తకం, నిజానికి వారి చుట్టూ ఉన్న పెద్దలందరూ చదవవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. పిల్లలహక్కులు మానవహక్కులు అని అర్ధం చెసుకోవడానికి.బాలికా హక్కులు మానవహక్కులు అని అవగాహన చేసుకోవడానికి.
ఇక, పిల్లల విషయానికి వస్తే, సరిగ్గా తమ వయస్సులో నే ఉండి ,కనీసావసరాలకు నోచుకోని పిల్లల గురించి అవగాన పెంచుకొని ,సద్భావనతో మెలగ వలసిన అవసరాన్ని గుర్తింపజేస్తుంది. ఈ పుస్తకం పిల్లలు పెద్దలు, ఇంటిలో బడిలో తప్పక చదవ వలసిన పుస్తకం. ఇందులోని,అభ్యాసాలను సామాజికులు ప్రతి ఒక్కరు పూర్తి చేయడం అత్యవసరం.
***
రచన :డా.జయశ్రీ గుప్తా ,
7 నుంచి 14 సంవత్సరాల పిల్లల కోసం .
ప్రచురణ: ప్రచురణల విభాగం,భారత సమాచార మరియు ప్రసార శాఖ,
వెల :75/-
ramnarsimha putluri
Chandra Latha garu,
MATHRU BHASHA..lo vidyabodhana..py Dr.Jayasree Guptha gari opinion
emity?
Does she support or not?
చంద్ర లత
@ramnarsimha putluri
ఆ పుస్తకంలోని అంశాలలో “క్రమ పద్దతిలో ఏమేమి ” తెలుసుకోవచ్చునో .. పై పరిచయం చెపుతుందనే అనుకుంటున్నా. పైగా, మానవ హక్కులు ,పిల్లలహక్కులు .. ఒక్క గూగుల్ నొక్కు దూరంలో బోలెడంత విశదంగా లభ్యమవుతున్నాయి. పోతే, ఈ పుస్తకం పిల్లలకు ఆయా విషయాలను ..చెప్పడమే కాక చేసి స్వయంగా నేర్చుకొనే అవకాశాన్ని ఇస్తుంది. ఈ వివరాలు కూడా వ్యాసం లో చెప్పినట్లే. పునరుక్తికి మన్నించండి.
అన్నట్లు, తెలుగు అనువాదం లభ్యం కాలేదు.అందులో వారు “చైల్డ్ క్యాటలిస్ట్ ” వంటి పదాలకు సమానార్ధకాలు ఏమి వాడారో తెలియదు.భాష కన్న భావప్రాధాన్యత ముఖ్యమైనపుడు , నలుగురికీ తెలిసే పదాలను వాడడం తప్పదు కదా? అందునా ఇచ్చోట!
నా తెలుగు పరిజ్ఞానం అంతంత మాత్రం .కొత్త అనువాదాలు చేయతగదు కదా?
భాషేదైనా పుస్తకం ఒకటే.దాని ఆంతర్యమూ ఒకటే. మానవహక్కుల పట్ల అవగాహన.
ధన్యవాదాలు.
madhu
hello,
i have read about this pusthakam.net and about the people behind this website today in our local telugu newspaper… really a nice blog in telugu…
ramnarsimha putluri
Madam,
Just u praised that book.
U dint inform a single sentence from that book.
English words hv bn used 3 times.
Pl try to write in Telugu totally.
చంద్ర లత
క్షమించండి.
“ఒక చైల్డ్ క్యాపిటలిస్ట్”కాదండి.” చైల్డ్ క్యాటలిస్ట్.”
అచ్చు తప్పు ను సవరించవలసిందిగా సంపాదకులకు మనవి.
ధన్యవాదాలు.