కర్మ – జన్మ
రాసినవారు: నాగేంద్రప్రసాద్ గొంట్ల
******************
పుస్తకము పేరు : కర్మ – జన్మ
రచయిత : మల్లాది వెంకట కృష్ణ మూర్తి
వెల : నూట ముప్పది రూపాయలు
హిందూ సనాతన ధర్మం కొబ్బరి చెట్టు లాటిది. అలాంటి కిందు మతానికి మూల స్తంభాలు అయిన కర్మ, జన్మ గురించి వివరించే పుస్తకము ఇది. కర్మ అంటే ఏమిటి కర్మ ఫలం ఎప్పుడు ఎలా లభిస్తుంది. ఏది కర్మ బంధాన్ని కలిగిస్తుంది . కర్మ ఫలం అనుభవించకుండా దాన్ని ముందుగానే నాశనము చేసుకోవడము ఎలా. అలాంటి ఎన్నో విశేషాలని ఇందులో చదవ వచ్చును. తెలుగులో కర్మ సిద్దాంతాన్ని సమగ్రముగా వివరించే పుస్తకము కర్మ – జన్మ.
చేయబడేది ఏది అయిన కర్మయే. కర్మ అంటే మానసికముగా గాని, శారీరకముగాగాని చేసినది. ఈ ప్రపంచములో ప్రతి జీవి జన్మించడానికి కారణము, ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే. చెడు కర్మకి ఫలితము పాపం, పాపానికి దుఃఖము, మంచి కర్మకి ఫలితము పుణ్యము. పుణ్యానికి సుఖము అనుభవించాలి, వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది. ఇది హిందూ సనాతన ధర్మము చెప్పే కర్మ సిద్దాంతము. ఈ సిద్దంతమే హిందూ మతానికి పునాది. పురాణాలు, హిందూ మత గ్రంధాల సారము ఇదే.
కర్మ సిద్దాంతము ప్రకారము :
( ౧ ) పుట్టడానికి మునుపు ఆ జీవి కొంత కర్మ చేసాడు.
( ౨ ) కర్మ చేసాడంటే, ఆ జీవికి గత జన్మ ఉన్నది.
( ౩ ) వాటిని అతను ఆ జన్మలో అనుభవించలేదు.
( ౪ ) వాటిని అనుభవించడానికి ఇప్పుడు ఈ జన్మని తీసుకున్నాడు.
( ౫ ) ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాని అనుభవించడానికి ఈ జన్మ లాగే మరో జన్మని తీసుకోవచ్చు.
( ౬ ) గత జన్మ లాగే ఈ జన్మలో కూడా మరి కాస్త కర్మని చేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు. కర్మ సిద్దాంతాన్ని నాస్తికులు, భౌతిక వాదులు ఇతర మతస్తులు నమ్మరు.
ఎవరు చేసిన పాపం లేదా పుణ్యం వారు ఒంటరిగా, స్వంతముగా అనుభవించాలి. ఎందుకంటే వారి పాప పుణ్యాలు వారికి మాత్రమే పరిమితము. తల్లి తండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుందనడంలో నిజం లేదు.
ఒకే రకము పాపాన్ని కానీ, పుణ్యాన్ని కానీ మనము ఏ జన్మలో అధికముగా చేస్తే, దాని ఫలితము ఆ జన్మలోనే సిద్దిస్తుంది. అది వచ్చే జన్మ దాక వేచి ఉండదు.
కర్మ దోషము తప్పదు. కాని తగ్గించుకోవచ్చును. ఎలా అన్నది వివరముగా ఏ పుస్తకములో చెప్పారు. గత జన్మ లో ఏ పాపం చేస్తే ఈ జన్మలో ఏ జబ్బులు వస్తాయి అన్నది చెప్పారు. అన్ని ఉదాహరణలతో , అందరికి అర్ధము అయ్యే లాగ చెప్పారు. కర్మ సిద్దాంతము మీద నమ్మకము ఉన్న లేకున్నా అందరు చదువవలసిన పుస్తకము ఇది.
radhika
Sir “Excelent Book ” I Read This Book After Compared Past & Present Days In My Life.
Madhu
Where can i get this book?
subbarao
i like truth and future , to live perfect