Meet the author అంటే?

“Meet the Author” అన్న టైటిల్ చదవగానే మీకు ఏమేమి ప్రశ్నలు మనస్సులో వచ్చాయి? మొట్టమొదటగా ఏదన్న ఈవెంట్ కానీ ఆర్టికల్ పేరు వినగానే లేక చదవగానే మొట్ట మొదటి ప్రశ్న – “ఏమిటి ఇది?”. అందునా మనం రోజువారిగా వినే పేరు అయితే మనకి వెంటనే దాని జవాబు తెలిసిపోతుంది. ఇప్పుడు ఉగాది జరిగింది కాబట్టి ఉగాది కి సంబంధించిన ఒక పదం ఉదాహరణకు వాడతాను. “పంచాంగ శ్రవణం” అని విన్నాము అనుకోండి, మనకి చిన్నప్పటినించి విన్న పదమే కాబట్టి, అసంకల్పితంగా దాని అర్ధం మనకు గోచరిస్తుంది. అదే “Meet the Author” లాంటి పదాలు వింటే ఒక్క క్షణం అది ఏమిటా అని ఆలోచిస్తాము లేదా అడుగుతాము. EveningHour లో ప్రతి నెల జరిగే “Meet the Author ” ఈవెంట్ గురించి అనౌన్స్ చేసినప్పుడు మమ్మలిని చాలా మంది అడిగిన ప్రశ్న – అంటే ఏమిటి ? ఏమి జరుగుతుంది ఆ మీటింగ్ లో? దాని వల్ల లాభం ఏమిటి? పుస్తకం.నెట్ గురించి తెలిసినప్పటి నుంచి ఏదన్న మంచి ఆర్టికల్ వ్రాయాలి అని  అనుకుంటున్నాము. “Meet the Author” గురించి అనేకమయిన ప్రశ్నలు విన్న తరువాత దీని గురించే వ్రాయాలి అని మొదలుపెట్టాము.

ఈ ఆర్టికల్ లో “Meet the Author ” అంటే ఏమిటి, దాని వల్ల ప్రయోజనాలు ఏమిటి ? ఎలాంటి వాళ్ళు ఇలాంటి మీటింగ్స్ కి రావచ్చు తదితర అంశాల గురించి చెప్తాను.

ఒక వెబ్సైట్ “Meet the Author” కి స్లోగన్ “Bringing Books to Life” అని పేర్కొన్నారు. అంతకంటే బాగా వర్ణించలేము ఏమో. ఒక పుస్తకం గురించి దాని రచయిత కంటే ఎవరు బాగా మాట్లాడగలరు.

సాధారణంగా ఒక “Meet the Author ” మీటింగ్ లో రచయిత తన బయో-డేటా కొంచెం చెప్పి, తను పుస్తకం వ్రాయటం ఎందుకు మొదలుపెట్టారు, అది వ్రాస్తున్నప్పుడు రచయిత ఎదురుకున్న చాల్లెంజస్, వాటిని అధిగమించిన తీరు ఇలాటి విషయాల గురించి విశదీకరిస్తారు. తన పుస్తకం గురించి చెప్పి, చాలా మంది ఆ పుస్తకం లో తనకి నచిన చాప్టర్స్ లేదా కొన్ని పారాగ్రాఫ్స్ చదువుతారు. తరువాత వచ్చిన ప్రేక్షకులు ప్రశ్నలు అడుగుతారు. మొన్న EveningHour లో జరిగిన “Meet the Author ” ఈవెంట్ లో, ‘ది మెన్ వితిన్” రచయిత హరి మోహన్ గారిని తన పుస్తకం గురించే కాకుండా డిస్ట్రిబ్యూటర్స్ గురించి, పుస్తకం ప్రచురించాలంటే ఏమేమి చెయ్యాలి అని ఇలా ఎన్నో ప్రశ్నలు అడిగారు.

చివరగా సైన్ ది బుక్ (Sign-the -book) అని వచ్చిన వారు తమ బుక్ మీద రచయితో తో సైన్ చేయించుకుని తమ మీటింగ్ కి మేమోరియల్ గా ఉంచుకుంటారు.

ఇలాంటి మీట్స్ వల్ల లాభాలు ఏమిటి అనే ప్రశ్న కలగకపోదు. మనకి బాగా నచ్చిన పుస్తకం రచయతని కలవాలి అంటే చాలా ఉత్సుకతగా ఉంటుంది అందరికి. ఇది కాకండా వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఏమి చెయ్యటం ద్వారా వారు ఈ ఉన్నతమైన స్థితి కి వచ్చారు అనే విషయాలు మనం తెలుసుకుంటే మనకి ఇన్స్పిరేషన్ (inspiration ) మరియు ప్రోత్సాహంగా ఉంటుంది. ఒక వేళ మనం ఎదుర్కున్న పరిస్థితులు వారు చెప్పిన experiences తో కలిసినట్టు ఉంటే, వారితో మాట్లాడడం ద్వారా సరి అయిన పరిష్కారం చూపకపోయినా కానీసం కొన్ని ideas అన్నా దొరుకుతాయి మనకి. అదే మనం రచయిత అవుదాము అనే ఉద్దేశం లో ఉంటే ఇంకా అసలు ఇంకో రచయిత ని కలవడం వాళ్ళ వచ్చే లాభాల గురించి చెప్పనే అక్కరలేదు.

సరి. మా స్నేహితురాలితో “Meet the Author” గురించి మాట్లాడుతూ, అలవాటు కొద్ది advantages మరియు disadvantages గురించి వ్రాస్తాను అని అన్నాను. కాని ఎంత తరిచి చూసినా నాకు ఇటువంటి వాటి వల్ల దుష్ప్రయోజనాలు ఏమి కనపడడం లేదు. మీరేమి అంటారు?

You Might Also Like

5 Comments

  1. Priyanka

    As Srivika mentioned, there are two sides to a coin. I agree to what Srivika and others have said that if during the meeting, we get to know about their negative traits, we loose our impression on the author or for that matter, any famous personalities that we meet.

    But more often than not, when we meet someone new, every person tries to cover up their negative traits and focus on their positives. For example, before Ms.Priti Aisola came to EveningHour last week, I only thought of her as someone who wrote a book. It is no mean achievement (for example,I was not able to do it) but then there are quite many new authors. But after meeting her, my respect for her has grown so much. She is at least 50 years young and took up writing at this age when most of us would not indulge into something new. You can read more on my opinion about her here at
    http://blog.eveninghour.com/2010/03/meeting-ms-priti-aisola.html.

    So, as Srivika said, there are two sides to a coin!

  2. Purnima

    @Independent: Wow.. now, that’s a feast. Didn’t dig into the details of site yet, but I’m sure it will be informative. Thanks for sharing!

    It would be amazing and inspiring to know about the book culture in US.. about the bookshops, about readers, about reading communities, their book reading gadgets and all.

    I wish someone could introduce them here. I wish you could be the one. 🙂

  3. శ్రీనిక

    బాబా గారు అన్నది నిజమే
    రచయిత బలహీనతలు తెల్సిన తర్వాత ఆ రచయితపై పెంచుకున్న Utopian views పటాపంచలయ్యే
    అవకాశం లేకపోలేదు. ఒకసారి ఏమయిందంటే…మా కలీగ్ వాళ్ళ బంధువు ఫ్లాట్ లో ఒక రచయిత్రి ఉంటుందని తెలిసి నేనూ, మా కలీగ్ కలవడానికి వెళ్ళాం. ఆమె రచయిత్రేకాదు..ఒక బాలల మాస పత్రికకు
    ఉప సంపాదకులు,ప్రచురణ కర్త కూడా. ఎన్నో నీతికధలని పిల్లలకు తమ పత్రిక ద్వారా అందించారు.మంచిగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. మేము కూడా ఎంతో ఆనందించాం. ఆ తర్వాత తెలిసింది…ఆమె తన కోడల్ని రాచి రంపాన పెడుతుందని, భర్తని చాలా చులకనగా చూస్తుందని. ఇది తెలిసాకా ఎలా ఉంటుంది చెప్పండి..అలాగని అందరూ ఇలానే ఉంటారని కాదు.అందరికి ఇలాటి అనుభవాలే ఎదురవుతాయని అనలేం. కాని కొన్ని విషయాలలో నాణానికి రెండో వైపు తెలియక పోవడమే మంచిదనిపిస్తుంది.

  4. Independent

    Meet the author గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇది రాస్తున్నాను.

    కొన్ని సార్లు ఇక్కడో, మిగతా బ్లాగుల్లోనో నేను C-SPAN Book TV వారి గురించి ప్రస్తావించి ఉన్నాను. నాకు అమెరికాకి వచ్చినందుకు జరిగిన మంచి విషయాల్లో పరిచయం అని నేను చాలా బలంగా భావిస్తాను. ప్రతి వారాంతం లో రెండు పూర్తి రోజులు, కేబుల్ నెట్ వర్క్స్ వాళ్ళు పబ్లిక్ సర్వీస్(free, but you need cable connection which everyone has) కోసం 1979 లో ప్రారంభించిన చానెల్ C-SPAN. అది ఇన్ని సంవత్సారాల్లో అలా పెరిగి C-SPAN1,2,3, C-SPAN Radio and ఇప్పుడు C-SPAN video website కూడా వచ్చిందంట నాకూ ఈవాళే తెలిసింది.

    నిజం చెప్పాలంటే ఇది మీతో షేర్ చెసుకుంటున్నందుకు I am excited. ఎందుకంటే ఇండియాలో C-SPAN వస్తుందో రాదో నాకు తెలీదు. కాబట్టి ఈ వెబ్ సైట్ లో కెళ్ళి బుక్ టి వి లింక్ లో, మంచి రచయితలతో ఇన్ డెప్త్ కారక్రమాలు కానీ, వాళ్ళతో ప్రశ్నలు-సమాధానాల ద్వారా వాళ్ళ బుక్స్ గురించి తెలుసుకునే అవకాశం కాని ఇప్పుడు world-wide గా అందించడానికి వాళ్ళు చేస్తున్న ఈ effort నాకెంతో నచ్చింది. You see, I love C-SPAN.

    నేను ఈ వెబ్ సైట్ ను ఇప్పుడే చూసాను, ఒక 30 నిమిషాల క్రితం, కాబట్టి ఇందులో కాంటెంట్ వాళ్ళు ఎంతవరకూ ప్రొవైద్ చేసారో తెలీదు. I hope they keep every video that comes on Book TV. I need to check them out, but I gotta go out now. Before I head out, I thought I would write about it here.

    నాకిష్టమయిన రైటర్ టోని మారిసన్ గురించి సెర్చ్ కొడితే, ఆవిడ C-SPAN లో వచ్చిన కార్యక్ర్మాలు 17 దాకా వచ్చాయి. ఆవిడ గురించి ఇన్ డెప్ట్ 3 గంటల కార్యక్రమం కింద “http://www.c-spanvideo.org/program/162375-1”

    పోయిన్నెల ఆమర్త్యా సేన్ గారు “Idea of Justice” Book గురించి చేసిన పరిచయ కార్య క్రమం ఆయన మాటల్లో, సమాధానాల్లో

    http://www.c-spanvideo.org/program/292560-1

    ఇష్టమున్న వాళ్ళు ట్రై చేయండి, నిజంగా ఎంత కాంటెంట్ ఉందో నాకూ తెలీదింకా. But I believe it will grow in time.

  5. bollojubaba

    దుష్ప్రయోజనాలు ఏమి కనపడడం లేదు
    అలా అనిపిస్తుంది కానీ

    రచయిత గురించి గొప్ప ఊహలు చాలా సందర్భాలలో నేల కూలుతాయి. చప్పగా అనిపిస్తాయి తరువాత. నిరుత్సాహపడే సందర్భాలే ఎక్కువ. ఆ కవి ఆతని కవిత్వమూ ఇక చవకైపోతుంది.

    నేను ఎంతగానో గౌరవించే ఒక పెద్ద కవిగారితో కలిసి గడిపే సందర్భం వచ్చినప్పుడు, వారి తాగుడు, ఇతర అలవాట్లు, కొన్ని సంభాషణలు, వంటివి ఎంత నిరుత్సాహపరచాయి అంటే, ఇక వారి కవిత్వం చదువుతున్నప్పుడల్లా అవే గుర్తుకు వచ్చేవి. ఇబ్బంది కలిగించేవి.

    యోగ్యతా పత్రంలో చలం, మధ్యవర్తులను నమ్మకు కవిని నేరుగా కలు అని సలహా ఇస్తాడు కానీ అలా చెయ్యటం అనవసరమేమో, ఎందుకంటే అలా కలిసిన వారే, శ్రీశ్రీ తాగుబోతు, ఓసారి తాగేసి ఫాంటులో … పోసుకొన్నాడు, అప్పులడుతాడు, దరిద్రుడు అంటూ రకరకాల అనవసర వాగుళ్లు వాగారు తరువాత్తరువాత.

    రచనల్ని ఆస్వాదించినంత ఆనందం, రచయితను కలుసుకొన్న తరువాత ఉండదేమోనని నా అనుమానం.

    రచయిత పట్ల మనకున్న అభిమానాన్ని ఉత్తరమో, ఫోను ద్వారానో లేక ఓ వ్యాసం రాసో ప్రకటించుకోవచ్చనేది నా వ్యక్తిగతాభిప్రాయం ప్రస్తుతానికి.

    ఇక మీరు చెపుతున్న మీట్ ద రైటర్ బహుసా కార్పొరేట్ కల్చర్ లో భాగంలా అనిపిస్తుంది. ఉండేది కొద్ది గంటల ఇంటరాక్శనే కనుక పైన చెప్పినన్ని ప్రమాదాలు ఉండకపోవచ్చనిపిస్తుంది.

    బొల్లోజు బాబా

Leave a Reply