మన టప్ టపా టప్

వ్యాసం రాసిపంపినవారు: చంద్రలత

టప్ టపా టప్!
ఏమిటీ శబ్దం ?
ఎలుగుబంటికి భయం వేసింది.జింక గడగడలాడింది.బ్రతుకు జీవుడా అని పరిగెత్తింది.చిరుతపులి కూడా ఆలస్యం చేయలేదు.సిం హం గారు సరేసరి!
“రండర్రా నేస్తాల్లారా !అసలీ టప్ టపా టప్! “ఏమిటో చూద్దాం.ఇంత మందిమి ఉన్నాం కదా,భయమెందుకు ?” అంది చీమ.
*
ఆ తరువాత ఏం జరిగింది? చిట్టిచీమతో అందరూ కలిసి వెళ్ళారా? వెళితే ఏమి చూశారు?ఛూసి ఏమి చేసారు?
ఊహు ,నేనెందుకు చెబుతాను? మీరే చదవండి.ఈ బుజ్జి పుస్తకం ప్రథం వారు పిల్లలకు ప్రచురించిన చిన్ని కథలలో ఒకటి.
ఈ కథ ను మీరు చదవడం వలన ,ఈ పుస్తకాన్ని కొనడం వలన “స్వాతి “లాంటి అమ్మాయిలు మరిన్ని పుస్తకాలు చదవాడానికి మీరు చేయూత నిచ్చిన
వారవుతారు.ఇదేంటబ్బా అనుకుంటున్నారా? అయితే ,అన్ని వివరాలను మరెన్నో పిల్లల పుస్తకాలను ఇక్కడ చూడండి.

www.prathambooks.org
Read India Books వారి ప్రచురణ.

*
మన టప్ టపా టప్ ! రచన(హింది, టప్ టప టపక్ !) అమర్ గోస్వామి ,చిత్రాలు
పార్తోసేన్ గుప్తా తెలుగు సేత పి.శాంతాదేవి
ISBN 81 -8263-466-0 వెల: 15 రూ.

***

You Might Also Like

4 Comments

  1. Telugu4kids

    Thanks. That helps.
    The books I mentioned are not avaialble in animation (in Telugu).
    I wish BookBox will get the chance to make soundtrack for them and others as well.
    When I get my next chance to contribute my voice, I hope to do a better job with narration.

  2. KumarN

    లలిత గారూ,
    బుక్ బాక్స్ లో కథలకి మీరిచ్చిన తెలుగు పదాలు బాగున్నాయండి. నిజంగానే.
    కొంచెం వాయిస్ అలా ఒకే రకంగా ఫ్లాట్ గా ఉండకుండా, కొంచెం సందర్భానుసారంగా వాయిస్ మాడ్యులేషన్ మీద వర్క్స్ చేస్తే, ఇంకొంచెం ఇంట్రస్ట్ లెవెల్స్ పెంచెచ్చోమో అని అనిపించింది.

  3. telugu4kids

    ప్రథమ్ వారి పుస్తకాలను పలకరించేవారు కాస్త BookBox వారి పుస్తకాలకు (Whispering Palms, Symbiosis, Four Friends) తెలుగు అనువాదాలు చూసి ఎలా ఉన్నాయో feedback ఇస్తారా? ఆ అనువాదాలు నేనే చేశాను మరి! ఎలా అనిపించాయో చెపితే నాకు ఉపయోగపడుతుంది. ఆంగ్లంలో ఆ కథలు చదవడానికీ, వినడానికీ చాలా బావుంటాయి. బొమ్మలు కూడా బావున్నాయి.

    విడిగా మార్కెట్లో ఆ పుస్తకాలు రావట్లేదనుకుంటా. BookBox వారికి తెలుగు మార్కెట్టు ప్రథమ్ వారి మూలంగానే అనుకుంటాను. అలాగే ఇటూ ఓ సారి చూడండి.
    http://www.bookbox.com/index.php?pid=129

    ప్రథమ్ వారు ప్రాంతీయ చెక్కులనే అడుగుతున్నారు. ప్రత్యామ్నాయం ఉంటే బాగుండును.

  4. చంద్ర మోహన్

    ముగింపు నాకు తెలుసుగా!! ఈ కథ, అచ్చంగా ఇలాగే కాదు గానీ,మా వాడు చదివిన NCERT వారి ఒకటవ తరగతి పుస్తకంలో ఉండేది (ఇప్పుడు పుస్తకం మార్చేశారు – కొత్త పుస్తకంలో ఈ కథ లేదు). ఇలాంటి కథలు ఎన్ని ఉన్నాయా పుస్తకంలో?

Leave a Reply