రోడ్ రన్నర్ పుస్తక పఠనం

వ్యాసం పంపినవారు: సి.బి. రావు

road1

రోడ్ రన్నర్ పుస్తక పఠన – శ్రోతలకు స్వాగతం


జనవరి23, 2010 సాయంత్రం హైదరాబాదు బంజారా కొండలలోని అక్షరా పుస్తకాల దుకాణంలో  దిలీప్ డిసౌజా వ్రాసిన తాజా ఆంగ్ల పుస్తకం రోడ్ రన్నర్ పుస్తక పఠనం  విధ్యాధికులు, పుస్తకప్రియుల సమక్షంలో జరిగింది. అక్షర యజమానురాలైన శ్రీమతి లక్ష్మి  రచయితకు, The Little Theatre సంఘ సభ్యులకు, సభకు విచ్చేసిన ఆహుతులకు స్వాగతం పలికారు. అన్వర్ ఆలిఖాన్ గారు రచయిత డిసౌజా ను పరిచయం చేశారు. కంప్యూటర్ శాస్త్రం లో నిపుణుడైన దిలీప్ డిసౌజా 20 సంవత్సారాలు ఆ రంగంలో పనిచేసాక  , వ్రాయటమే  తన అభిరుచికి తగినదని తెలుసుకున్నారు.  ఇంతవరకూ రెండు పుస్తకాలు ప్రచురించారు. అవి  Branded by Law: Looking at India’s Denotified Tribes, The Narmada Dammed: An Inquiry Into the Politics of Development. రోడ్ రన్నర్ మూడవ పుస్తకం.   రచయిత డిసౌజా  ప్రసంగిస్తూ అమెరికా లో తాను 8 సంవత్సరాలు ఇంజనీర్ గా పనిచేశానని, ఆ సమయంలో అమెరికాను లోతుగా పరిశీలించే అవకాశం కలిగిందన్నారు.  అమెరికా దర్శించిన ఎందరో విదేశీయులు ఆ దేశం పై ఎన్నో పుస్తకాలు వ్రాశారు. తాను ఒక ఫ్రెంచ్ దేశస్థుడు  రాసిన   అమెరికా పరిశీలన చదివానని కాని అది తనకు తృప్తిని ఇవ్వలేదనీ, అందుకే  తాను అమెరికాను భారతీయకోణంలో చూసి రాయాలని సంకల్పించి ఈ రోడ్ రన్నర్ వ్రాశానని చెప్పారు.  తదుపరి The Little Theatre సంఘ సభ్యులు ఈ పుస్తకంలోని పలు అధ్యాయాలను రంజకంగా చదివి వినిపించారు.ఈ సంఘ సభ్యులలో , పెద్ద ఉద్యోగాలు చేసే వారు, రచయితలు, కవులు, అధ్యాపకులు, ఫిల్మ్ ఎడిటర్,  నటులు, ఇంకా బ్లాగరులు  ఉన్నారు.

road2

పుస్తక ప్రియులకు స్వాగతం చెప్తున అక్షర  లక్ష్మి, వెనక రచయిత డిసౌజా, దూరంగా అన్వర్ ఆలిఖాన్

road3

Roadrunner పుస్తక రచయిత దిలీప్ డిసౌజా ,  అన్వర్ ఆలిఖాన్



ఇంతకీ రోడ్ రన్నర్  లో ఏముంది?   కధా కమామిషు ఏమిటి?

ఒక ప్రజాసామ్యం మరో ప్రజాసామ్యాన్ని చూసినప్పుడు మనకు ఏమి అవగతమవుతుంది? 1800 ల సంవత్సరంలో తన గ్రంధం Democracy in America లో Alexis de Tocqueville  ఈ ప్రశ్నకు బదులిచ్చాడు. కాని ఈ రోజు భారత దేశం ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామిక దేశాలలో  ముఖ్యమైనవాటిల్లో ఉండటంవలన  కొత్త సమాధానం దొరకవచ్చు. చిన్న, పెద్ద కధలతో భారతీయుడి కళ్లతో అమెరికాను చూపే ప్రయత్నం చేస్తుందీ పుస్తకం. టెక్సాస్  లోని రెండవ ప్రపంచయుద్ధ  ఖైదీల కుడ్య చిత్రాలు చూడటం,  స్టర్గిస్ లో జరిగే సాంవత్సరిక  మోటార్ సైకిళ్ల పండగలో   క్రైస్ట్ కొరకు మొటార్ సైకిల్ నడిపే వారిని అర్థం చేసుకోవటం , ఐస్ లాండ్ కు  వలస వచ్చిన వారి   చరిత్ర  రాయటం , పర్వత ప్రాంతంలోని చిన్న పట్టణంలో అగ్నిమాపకదళ యంత్రం   నడపటం   లాంటి పనులు చేస్తూ, డిసౌజా అమెరికా దారులలలో పయనిస్తూ, ప్రపంచంలో గౌరవించబడే, ద్వేషించబడే,ఆ దేశపు  పాత సంప్రదాయలను, కొత్తగా పట్టించుకోవలసిన విషయాలను ఆన్వేషిస్తారు.

road4

పుస్తక పఠనలో  The Little Theatre సంఘ సభ్యులు విజయ్ మారు , చందనా చక్రవర్తి  (రచయిత్రి, మానవతా వాది, నటి -శేఖర్ కమ్ముల ఆనంద్ సినిమా ఫేం)

road5
పుస్తక పఠనలో  The Little Theatre సంఘ సభ్యుడు  బి.ఎస్ .ప్రకాష్ (SBI,Manager)
road6
పుస్తక పఠనలో  The Little Theatre  సంఘ సభ్యులు విఠల్ రాజన్, కుమారి శ్రీదల స్వామి (కవయిత్రి, రచయిత, ఫిల్మ్ ఎడిటర్ ,  బ్లాగర్ http://spaniardintheworks.blogspot.com)

road7
పుస్తక పఠనలో  The Little Theatre  సంఘ సభ్యులు శంకర్ మెల్కోటె (CEO & Actor), సరళ మహీధర

road8
సభకు విచ్చేసిన పుస్తక ప్రియులు, రచయితలు


Photos & Text  by cbrao

You Might Also Like

Leave a Reply