ఈ నెల ఫోకస్: బాల సాహిత్యం
Telugu4kids లలితగారి సూచన మేరకు ఈ నెల ఫోకస్‍గా అన్ని భాషలకు చెందిన “బాల సాహిత్యాన్ని” ఎన్నుకోబడింది.
చంద్రలతగారి సలహాను ఆమోదిస్తూ, “బాల సాహిత్యం” అన్న అంశంలో ఈ కింది వర్గాలను పెట్టాలనుకుంటున్నాం.
౧. పిల్లల కోసం రాసినవి.
౨. పిల్లలు రాసినవి
౩. పిల్లల గురించి రాసినవి
పిల్లల పుస్తక / పత్రిక సమీక్షలు – పరిచయాలే కాక, మీ బుడతల్లో ఉన్న పఠనాభిలాష గురించీ, దాన్ని పెంపు చెయ్యడానికి మీరు చేసే ప్రయత్నాలూ, పిల్లల కోసం పుస్తకాలు ఎన్నుకోవడంలో మీరు తీసుకునే జాగ్రత్తలు – ఇలాంటి ఏ అంశం మీదైనా రాయచ్చు.
“అర్రెర్రె.. మాకు పిల్లలు లేకపోయారే, ఈ ఫోకస్‍లో పాల్గొనడానికి?” అని ఎవరూ నిరూత్సాహపడక్కరలేదు. సున్నాలు, సున్నాలు గీసుకుంటూనో / గీసుకోకుండానో మీ బాల్యంలోకి ఒక లాంగ్ జంప్ కొట్టి, అప్పటి మీ పఠనానుభవాలనూ (మీరు చదివిన పుస్తకాలు, మీరెళ్ళిన లైబ్రరీలు, మీ స్నేహితులతో కల్సి చదివినవి లాంటివెన్నో) పంచుకోవచ్చు. దీని వల్ల అప్పటి సాహిత్యం తెలీడంతో పాటు, నేటి కాలం పిల్లలు ఏం “మిస్స్” అవుతున్నారో అర్థంచేసుకోడానికి ప్రయత్నించచ్చు.
ఇవే కాక, పిల్లల కోసమో, పిల్లల గురించో అద్భుత రచనలు సృష్టించిన మహనీయుల గురించి రాయగలిగేవారుంటే.. అంతకన్నానా! అలా కాక వారిని గురించి కాస్త ఉప్పు (పేరూ, ఊరూ గట్రాలు) పుస్తకం.నెట్ వెనుకున్న ఉడతలకి ఉప్పందిస్తే, ఈ నెలలో కాకపోయిన ఏదో నెలలో వారిని పరిచయం చేసే ప్రయత్నాలు చేస్తాం.
మొదలెట్టండి తొరగా.. వెయిటింగ్ ఇక్కడ!!
(Photo Courtesy: Ravi)
పుస్తకం » Blog Archive » గడచిన సంవత్సరం, చదివిన పుస్తకాలు, పెరిగిన పరిచయాలు
[…] మాట అందుకుని ఓ నెల బాల సాహిత్యం ‘ఫోకస్‘ ప్రకటించేశారు. ప్రకటించి […]
సుజాత
నేన్రాస్తా, నేన్రాస్తా!
విజయవర్ధన్
మంచి ఆలోచన. నా చిన్నప్పుడు కె.సభా గారి కథలు, నవలలు చదివాను. వారి పిల్లల నవలలు (వారి “చంద్రం” నవల నా చిన్నప్పుడు చాలా చదివాను) ఎక్కడైన దొరికే అవకాశం వుంటే తెలుపగలరు. విశాలాంధ్ర వారు కొన్ని కథలు పునః ప్రచురించారు కాని నవలలు ఇంకా ప్రచురించలేదు.