Candy is dandy
“Eccentric, erudite, yet, easily accessible, Nash’s verse is unique and hugely funny”
’Candy is Dandy’ – The best of Ogden Nash : ఈ పుస్తకం నాష్ రాసిన 1931 నుండి 1972 మధ్యలో రాసిన వాటిలో ఉత్తమమైన నాలుగొందల కవితలని (పధ్నాలుగు సంకలనాల నుండి) ఎంచుకుని వేసిన కలెక్షన్. అతని కూతుళ్ళు ఎంపిక చేసారీ కవితలని. నాష్ గురించి చెప్పాలంటే ఆయన ఒక ప్రముఖ అమెరికన్ కవి. నాష్ కవిత్వం అంటే, చాలా ఎంజాయబుల్ అన్న పేరు. కవిత్వం లో హాస్యం ఆయన ప్రత్యేకత అని చెప్పవచ్చునేమో. నాకీయన గురించి, ఈయన కవిత్వం గురించీ పరిచయం ఈ పుస్తకం ద్వారానే. కనుక, నాష్ గురించిన మరింత సమాచారం కోసం ఆయన పేరుగల వికీ పేజీ చూడండి (లంకె ఇక్కడ). వీటిని చిన్నపిల్లల కోసం రాసినవని కొట్టిపారేసే అవకాశమూ లేకపోలేదు. కానీ, నా మటుకు నేనైతే పూర్తిగా ఆస్వాదించాను ఈ పుస్తకంలోని భాగాలని. బహుశా, ప్రతి మనిషిలోనో ఉండే బాల్యపు ఛాయల్ని ఇలాంటి పుస్తకాలే బైటకి తీస్తాయనుకుంటాను. జీవితానందానికి చిట్కాల్లో ఇలాంటి పుస్తకాలు చదవడం ఒకటి అని నాకనిపిస్తుంది.
నిజానికి, ఈ పుస్తకం గురించి రాయడం కష్టం – ఎంత డైవర్సిటీ ఉందంటే – ఏది చెప్పినా ఎంత చెప్పినా ఇంకేదో ఉందన్న సందేహం కలుగుతూ ఉంటుంది నాకు.
నాష్ కి రైమింగ్ అంటే ఇష్టమట. రైమింగ్ కోసం కొత్త పదాలు సృష్టించడం లో కూడా ఆయన చాలా ఫేమస్. ఉదాహరణకి – ఇక్కడ చూడండి:
‘I sit in a office at 244, madison avenue
And say to myself, you have a responsible job, havenue?’
(Haven’t u…ని ఇలా స్పెల్ చేయొచ్చు అని ఇది చదివే దాకా నాకు తట్టనేలేదు.. హీహీ…)
Kansas City – అన్న పేరుతో రెండు నగరాలున్నాయి. ఒకటి – Kansas రాష్ట్రంలో. మరొకటి Missouri రాష్ట్రంలో. ఒకచోట నాష్ –
’Kansas city, Kansas proves that even Kansas City needn’t always be Missouriable” అంటాడు. ఎందుకోగానీ, చదవగానే నవ్వొచ్చింది.
అలాగే, ’చీ, ఫాడులోకమ్!’ అని మనం అనుకోడాన్ని –
‘purity
is obscurity’
-అని తేల్చేస్తాడు సింపుల్గా, స్వీట్గా.
’The Turtle lives twixt plated decks
Which practically conceal its sex.
I think its clever of the turtle
In such a fix to be so fertile’
– ఇలాంటి తరహా హాస్యాలకీ కొదువ లేదు.
ది టెరిబుల్ పీపుల్ వంటి కవితలు కొన్ని చదువుతూ ఉంటే – నాష్ కొంత బీదరికం అనుభవించి ఉంటాడనిపిస్తుంది. డబ్బు గురించీ, ధనవంతులవ్వడం గురించి – వీటికి సంబంధించిన ఇతర విషయాల గురించి ఈ పుస్తకంలో బానే ఉన్నాయి కవితలు. అలాగే, పిల్లలంటే ఎందుకోగానీ గిట్టదు ఈ రచయితకి. ‘Down with the kiddies‘, ‘To a small boy standing on my shoes when Iam wearing them‘, ఇంకా ఇలాంటివి మరికొన్ని చదువుతూ ఉంటే అనిపించింది. అయితే, ఆ అయిష్టాన్ని చెప్పడంలో చాలా కామెడీగా చెప్పారు. నేను చాలా ఇష్టంగా చదివాను ఈ కవితల్ని…పిల్లలంటే నాకిష్టమే అయినా కూడా.
’Children aren’t happy with nothing to ignore
And that’s what parents are created for.’ – 🙂
’Very like a whale‘ కవితలో, ఉపమానాలూ గట్రా వాడ్డం గురించి ఇలా రాసాడు –
“And they always say things like that the snow is a white blanket after a winter storm.
Oh it is, is it, all right then, you sleep under a six-inch blanket of snow
and I’ll sleep under a half-inch blanket of unpoetical blanket material and we’ll see which one keeps warm,
And after that maybe you’ll begin to comprehend dimly
What I mean by too much metaphor and simile. ”
కొన్ని చోట్ల నాకు వాలకం అర్థంకాని సందర్భాలున్నాయి లెండి. ఉదాహరణకి – ’The camel’ లో
“the camel has a single lump
the dormedary, two;
Or else, the other way around.
I’m never sure, are you?”
– ఉండేది ఈ నాల్గు లైన్లే. ఇలాంటివెందుకున్నాయో అర్థంకాదు … ’ది బెస్ట్ ఆఫ్…’ కలెక్షన్ లో.
“The germ” లో germ గురించి రాస్తూ –
“His childish pride, he often pleases
By giving people strange diseases” అన్నారు. చదవగానే నవ్వొచ్చింది.
ఇలా – నవ్వుకోడం, నవ్వించడం, విసుక్కోవడం, విసుర్లు విసరడం, ఆలోచనలో పడేయడం, సీరియస్ గా మొదలెట్టి కామెడీ అన్నట్లే అని, జీవిత రహస్యాలు చెప్పడం – మీరంతా తప్పక ఆగ్డెన్ నాష్ క్లాసులు అటెండ్ కావాల్సిందే అని నా అభిప్రాయం.
ఒకే ఒక్క పదంలో ఆగ్డెన్ నాష్ కవిత్వం గురించి చెప్పాలంటే – ఆసం.
నేనైతే వీరాభిమానిని అయిపోయాను. కవిత్వం అంటే ఇది – అన్న డెఫినిషన్ వంటబట్టించుకున్న పక్షంలో, ఈ పుస్తకం చదవకండి. అలాంటి డెఫినిషన్లలో ఆగ్డెన్ నాష్ ని ఇమడ్చలేరు 🙂
ramanarsimha
Tayyabji..
Kya bath hai..
Aapne kamal karke dikhaya..
Mohammad Thayyab
Dear friend,
Your review is very good and as enjoyable as the book itself.
With reference to your following remarks..
“కొన్ని చోట్ల నాకు వాలకం అర్థంకాని సందర్భాలున్నాయి లెండి. ఉదాహరణకి – ’The camel’ లో
“the camel has a single lump
the dormedary, two;
Or else, the other way around.
I’m never sure, are you?”
– ఉండేది ఈ నాల్గు లైన్లే. ఇలాంటివెందుకున్నాయో అర్థంకాదు … ’ది బెస్ట్ ఆఫ్…’ కలెక్షన్ లో.”
I would like to clarify as follows:
There are two types of camels in the world. One is with a single lump ( Moopuram in Telugu ) and the Bactrian ( also referred as dormedary ) with two. So people are always confused as to which is what.. when they see a camel. The best way to remember is the letter “B” has two loops( Bactrian .. hence two lumps)..
Hope now you enjoy these four lines also. .. Mohd. Thayyab
సౌమ్య
@Mohammad Thayyab: Thanks. I was wondering about the meaning of those 4 lines. Your explanation here clarified that doubt.
ramanarasimha
Sir,
Candy is Dandy..
The title is very very attractive..
Poems are excellent..
Review is very nice..
E-mail:RPUTLURI@YAHOO.COM
ramanarasimha
Sir,
AVENUE.. HAVENUE..
The usage of these words
should be appreciated..
E-mail:rputluri@yahoo.com
Madhavi
very nice review. Thanks