ఇతనాల కడవ కు ఈబూది బొట్లు…!
రాసిన వారు : చంద్రలత
***********************
“..ఇత్తబోదము రండి ముత్తైదులారా !” అంటూ పాడుతూ విత్తు నాటే సేద్యపు సంప్రదాయం మనది.
విత్తనం మన స్వంతం. విత్తనం మన సంస్కృతి.
ఒక పంట నుంచి మరొక పంటకు – ఒక రైతు నుంచి మరొక రైతుకు -ఒక తరం నుంచి మరొక తరానికి – నిరంతరంగా అందుతూ వచ్చిన ఆ జీవభాండాగారం “విత్తనాల కడవ” .
ఇప్పుడు –
బహుళ జాతి వ్యాపార సంస్థల గుత్తాధిపత్యపు గుప్పిటలో చిక్కి , ముక్కలు కాబోతున్నది.
సస్యవిప్లవం పంటపొలాలలోకి విస్తరించి- ఉత్పత్తి ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది.ఆ వ్యవసాయ ఉత్పత్తి ఆధారిత వ్యాపారం అంతకంతకూ ఎదుగుతూ వచ్చింది.
రైతు క్షేమం దృష్ట్యా ,వ్యవసాయ ప్రయోజనాల దృష్ట్యా, మన దేశంలో అనేక విత్తన చట్టాలను, నిబంధనలను ,నియంత్రణలను తీసుకు వచ్చి ,వాటిని పర్యవేక్షించడానికి విభిన్న శాఖలను ఏర్పరచుకొన్నాం. ఆ పరిమితులకూ పరిధులకు లోబడే , ప్రభుత్వం మరియు ప్రవేటు రంగాలలో విత్తనవ్యాపారం , ఒక విధి విధానం గా విస్తరిస్తూ వస్తోంది.
వ్యవసాయ రంగంలో పరాయీకరణను నిరోధించడానికి ,విదేశీ పెట్టుబడులకు అవకాశం లేని కట్టుదిట్టమైన చట్టబద్దతను నిర్మించుకొన్నాం. అయితే, సరళీకరణ క్రమంలో- బహుళజాతి వ్యాపారసంస్థలు దేశీయ విత్తనవ్యాపారాల్లో నేరుగా పెట్టుబడులను పెట్టే అవకాశం కల్పించింది.చూస్తుండగానే ,విత్తనవ్యాపారం గా ప్రారంభమై విత్తనంపై పెత్తనం గా మారి – ఆ కొన్ని విదేశీ సంస్థల చేతిలోకి విత్తనం చేరిపోయింది.
వ్యవసాయం మన జీవనాధారం.విత్తనం మన వ్యవసాయానికి మూలం.
మన విత్తన భద్రతలోనే మన ఆహార భద్రత ,దేశ ఆర్ధిక భద్రత ఉన్నది.
ఆ దిశగా , రెండు ప్రధానమైన అంశాలతో – ఈ రచనను మీ ముందు ఉంచుతున్నాము. పాఠకులకు ఈ వ్యాసాలు కొన్ని ముఖ్యమైన అంశాలను పరిచయం చేయగలవనే అనుకొంటున్నాము. ఇది మొదలు కాదు.తుది కాదు. దేశవ్యాప్తంగా జరుగుతోన్న అనేక ఆలోచనలకు, ప్రతిఘటనలకు కొనసాగింపు మాత్రమే.
విత్తు మన సొత్తు !
మన విత్తనాల కడవను మనం పదిల పరుచుకొనే చిన్న ప్రయత్నం మాత్రమే.
పుస్తకం వివరాలు:
ఇందులో –
1.మా స్వంతం కాని ఏ ఆహార పంట పండించ రాదు ! బహుళజాతి విత్తన సంస్థలు ,ఇంకొక మారు !
2. నిత్యావసర సరుకుల చట్టం – హైబ్రీడ్ పట్టి విత్తనాలు
అన్న వ్యాసాలు ఉన్నాయి.
రచన : యస్.వెంకటరెడ్డి (విశ్రాంత సీనియర్ జాయింట్ డైరెక్టర్ ,అగ్రికల్చర్) , చంద్రలత (రచయిత్రి)
వెల : అమూల్యము
ప్రతులకు: 040-27633722 (ఆసక్తి కలవారు ఆ ఫోను ను సంప్ర దించ వచ్చును. ఉచితంగా కాపీలు పొంద వచ్చును.)
prabhava.books@gmail.com
perugu
vinoothna rachana parichayam…
Good…!