చేతన్ భగత్ – మూడు తప్పులు
రాసి పంపిన వారు: స్వాతి కుమారి
**************************
శీర్షిక చూడగానే ఈ రచయిత రాసిన మూడు పుస్తకాల్లోనూ తప్పులు వెదికే కార్యక్రమం అనుకుంటారేమో! అదేం కాదు ‘తప్పు’ మన చూపు ని తొందరగా ఆకర్షిస్తుందని ఎవరో అంటేనూ ఇలా టెస్ట్ చేస్తున్నా అన్నమాట. మాకలాంటి తప్పుడు బుద్ధి లేదు అని కోప్పడ్డారా? అలా ఐతే మూడు చేపల కథనోసారి గుర్తు తెచ్చుకుని ముందుకి పదండి.
ఎప్పుడైనా గంటల కొద్దీ ఒంటరి రైలు ప్రయాణం చెయ్యాల్సొచ్చినా, సెలవులకందరూ ఊరెళ్ళిపోయి ఇంట్లోనో హాస్టల్లోనో గడియారం తో పందెం వేసుకు గడపాల్సి వచ్చినా.. నా మాట నమ్మండి చేతన్ పుస్తకాలు తెచ్చుకున్నారంటే టైము ని చంపేస్తాయి. ఏం లేదు ఆ మధ్యనో మరీ పెద్దల పుస్తకాలు తెగ చదివి జ్ఞానోదయమూ, చైతన్యమూ, తార్కిక ధోరణీ ఎక్కువైపోయి మరీ బుర్ర కి పెద్దరికం అంటుకుంటుందేమో అని భయపడుతుంటే ఎవరో ఇచ్చారు “five point someone” అనే పుస్తకం. నిజం చెప్పొద్దూ ఏదో వ్యక్తిత్వమనీ, వికాసమనీ ఉద్యోగం మాత్రం వచ్చి వేరే పనుల్లేని రోజుల్లో చదివిన Seven habits, Rich Dad, Six thinking hats లాంటి పుస్తకాలూ, హాస్టల్ రోజుల్లో పొరపాట్న చదివిన Shidney sheldon తరహా కాల్పనికమూ, ఇక మన తాతగారు R.K. Narayan గారి భారతీయత నిండిన ఇంగ్లీష్ పుస్తకాలూ తప్ప ఇంగ్లిష్ ఫిక్షన్ చదవటం నాకాట్టే అలవాటు లేదు. కథనం నిండా మనకర్ధం కానీ వ్యవహారాలు, కొత్త రకం పద్ధతులూ గట్రా కొద్దిగా ‘డ్రాగ’దీసినట్టుండే వర్ణనలూ మనవల్లకాదనుకునే వాళ్ళకి పూర్తి స్థాయి సమకాలీన ఇండియన్ తరహా నవల్లు భగత్ వి.
ఇక మొదటి పుస్తకం ‘five point..’ ఐ ఐ టీ కాంపస్ లో తిరిగి మననీ అక్కడే తిప్పుతుంది. పైన అనుకున్నట్టుగా మూడు చేపల్లాంటి ముగ్గురు స్నేహితులు దారుణమైన రాగింగ్ నేపధ్యం లో దగ్గరై మెల్లగా చదువుని నిర్లక్ష్యం చేస్తూ జీవితాన్ని అస్వాదించటం మీద ప్రయోగాలు మొదలెడతారు. మార్కులు(ఐ ఐ టీ భాష లో పాయింట్లు) ఇచ్చే రోజు మాత్రం వెనకబడ్డందుకు చిన్నబుచ్చుకుని ఒకళ్లనొకళ్ళు నిందించుకుంటారు. మధ్యల్లో టెర్రస్ మీద బీర్ పార్టీలు, చిన్నపాటి ప్రేమలు గట్రా మాములుగానే ఉంటాయి. చివర్లో ఘోరమైన తప్పొకటి చేసి పట్టుపడి పరిక్షలు రాయటానికి అవకాశం లేని పరిస్థితి తెచ్చుకున్నాక అప్పటికప్పుడు తక్కువ సమయం లో తమని తాము ప్రూవ్ చేసుకునే షరతు మీద బయటపడి నిజం గా బుద్ధి తెచ్చేసుకుని చాలా కష్టపడి ప్రొఫెసర్లకి తమ సత్తా నిరూపించుకుంటారు.
రెండో పుస్తకం “one night at the call centre” బహుశా ఈ పుస్తకం దాదాపు అందరూ చదివేసే ఉంటారు. ఈ కథ తో సినిమా కూడా వచ్చిందేమో తెలీదు (నా సినిమా పరిజ్ఞానం దారిద్ర్త్య రేఖ కు దిగువన ఉంది, క్షమించగలరు). చెప్పొచ్చేదేమిటంటే గొప్ప చదువులు పూర్తి చేయకున్నా చిన్న వయసులోనే పెద్ద జీతాలు సంపాదించే కాల్ సెంటర్ ఉద్యోగుల గురించి ఈ కథ. ఈ కాలపు యువత దృష్టి లో డబ్బు, మానవ సంబంధాలు, మారుతున్న నైతిక విలువలు వాళ్ళ ప్రాధామ్యాలు చాలా నిర్మొహమాటం గా ఒక్క రాత్రి కాల్ సెంటర్ లో జరిగిన ఉత్కంఠ భరితమైన సంఘటన ల నేపధ్యం లో చూపిస్తుందీ పుస్తకం. సందర్బం ఏదైనా తను చదివిన పుస్తకాల్లోనీ మేనేజ్మెంట్ పాఠాల్ని కింది వాళ్ళపై కుమ్మరించే బాస్ పాత్ర నేను గతం లో పని చేసిన కంపెనీ లో ఒక మేనేజర్ ను గుర్తు చేసింది. మీక్కూడా అలాంటి పాత్ర ఎక్కడో తగిలే ఉంటుంది.
ఇక మూడు తప్పుల కథ “The Three Mistakes of My Life” కూడా జీవితాన్ని మొదట్లో తేలిగ్గా తీసుకుని మెల్లగా వ్యాపారాన్ని, క్రికెట్ కోచింగ్ ని మొదలెట్టే స్నేహితుల కథ. భుజ్ లోని భూకంపం, అయోధ్య రామాలయం గొడవల వల్ల వీళ్ళ జీవితాలు ఊహించని మలుపులు తిరుగుతాయి. చివర్లోకొచ్చేసారికి ఏదో యండమూరి నవల్లోని శైలి లా అనిపించింది. నా ఉద్దేశం ఈ ఉత్తరాది రచయిత మన పుస్తకాలు చదివి ఉంటాడని కాదు కానీ ఎందుకో ఏదో కామన్నెస్. కొద్దిగా ఆస్ట్రేలియన్ల ఇంగ్లిష్ పలుకుబడి మీద చిన్న చిన్న పాఠాలు దొరుకుతాయి దీన్లో.
సాహిత్యాభిలాషతోనో, సందేశాల కోసమో, వ్యక్తిత్వాన్ని వోవర్ నైట్ మార్చుకోవటం కోసమో ఐతే ఈ రివ్యూ విషయం ఇక్కడితో మర్చిపొండి. ముందే చెప్పినట్టు సరదాగా, ధ్రిల్లింగ్ గా తల తిప్పకుండా చదివి, మెడనొప్పి తెప్పించుకునే మూడ్ లో ఉన్నప్పుడు ఓక చూపు చూడొచ్చు.
ramanjineyulu
naku five point some one nachchaledu. one night at the call centre,three mistakes of my life farvaledu. oho anentha goppaga yem vundavu. meeru chadavalanukunte yandamoori veerendranath gari rachanalu chadivandi tharvatha meere voppukuntaru. meeku intrest vunte
vennello aadapilla
sampoorna premayanam
priyuralu piliche
maro hiroshima
nallanchu thellacheera
dabbu to the power of dabbu
vijayaniki ayidu metlu
veellani yem cheddam
thappu cheddam randi
ee pusthakaalu chadavandi
venkat
త్రీ మిస్టేక్స్ నవల చివరకు వఛ్హేసరికి మరీ డ్రామా లా వుందనిపించింది
Chandritha
Chetan “One Night @ Call centre” ని Bollywood లో “Hello” గా తీసారు. Salman, katrina guest roles చేసారు. “Five Point Someone” ని “3 Idiots” గా Aamir Khan, Sharman Joshi and Madhavan తో తీస్తున్నారు. యింకా “3 Mistakes” కూడా ఎవరో కొన్నారంట Movie తీయడానికి.
Chetan రాసిన వాటిల్లో One Night తప్పించి అన్నీ చదివేసా, recent గా release అయిన 2 states కూడా Chetan Style లొనే ఉంది. Swathi గారు అన్నట్లు Chetan novels time pass కి బాగుంటాయి.
సౌమ్య
నేను ౫ పాయింట్ సమ్వన్ చదివింది బీటెక్ ఫైనలియర్ లో. ఇంకా కాలేజీలో ఉన్నందుకో ఏమో, అప్పట్లో అది బాగా అనిపించింది. వన్ నైట్… మహా చిరాకు పుట్టించింది. అందుకే మూడు తప్పుల్ని చదివేందుకు వెనుకాడా. కానీ, మీరన్నట్లు, టైమ్ పాస్ కి మూడు తప్పులు బానే ఉంది. ఈ నాలుగో నవల నేనింకా చదవలేదు లెండి.
@సంతోష్: one night… ని కూడా సినిమాగా తీసారు. దాని పేరు “హెలో”. బాగా ఆడలేదనుకుంటాను. “3 idiots” లో – అమీర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషి కదా.. ఆ మధ్య టీవీ లోచూపించారు దీని గురించి…..
సంతోష్
నేను మొదట “three mistakes of my life” చదివానండి..
అది నచ్చి తర్వాత “five point someone” చదివా…
అది కూడా కాలేజి క్లాసుల్లో..
నేను చదవడంతో మా స్నెహితులందరూ చదివారు….
ఏదో చేతన్ భగత్ పుస్తకాల వారోత్సవాలు జరిగినట్టు..
రెండోది అంత నచ్చలేదని …
ఇహ “one night at call centre”చదవదలచలేదు…..
మీరనుకున్నట్టు ఆయన నవలను ఒక సినిమాగా తీసారు గాని …అది “five point someone”…సినిమా పేరు “3 idiots”..సల్మాన్ ఖాన్ హేరో…
ఇంకో విషయం…
ఈ మధ్యనే చేతన్ మరో నవల”2 States : The Story of My Marriage” కూడా ప్రచురితమైనది…
మన “శశి థరూర్” గారు ఆవిష్కరించారు…