ప్రేమలేఖలు – చలం
వ్యాసం రాసి పంపిన వారు: రమణి
చలం గారి ప్రేమలేఖలు గురించి రాయడానికి కొంచం సాహసం చేసానేమో అనుకొంటున్నాను , అసలు నేనెంతదాన్ని, కాని ఎంతో కొంత రాయగలగాలి అని అనిపించి కనీసం .1% రాయగలిగినా ధన్యురాలినే . చలంగారి పుస్తకాలన్ని పెళ్ళికి ముందు చదివినవే. అందులో ఈ ప్రేమలేఖలు ఒకటి.
ప్రస్తుత సాంకేతిక తరంలో ప్రేమలేఖలు కాగితం రూపేణా ఉండడంలేదు కాని 1986 లో వచ్చిన ఈ పుస్తకం మటుకు ప్రేమలేఖల గొప్పదనాన్ని సూటిగా నిర్మొహమాటంగా తను ప్రేమించినవారికి ప్రేమని వ్యక్తం చేసే విధానాన్ని వివరిస్తుంది
*******
“ప్రియురాలు దగ్గిర లేనప్పుడు ఆమెతో ఇంటిమేట్‌గా మాట్లాడడం ప్రేమలేఖ! అంతరంగికుడైన మిత్రుడితో హృదయంలోని మార్ధవ్యంతో అభిప్రాయాల్ని చెప్పుకోవడమే ప్రేమలేఖ! మన ఆత్మని వాళ్ళ ఆత్మలతో దూరాన్ని కాలాన్ని జయించి,ఐక్యం చెయ్యడానికి చేసే ప్రయత్నమే ప్రేమలేఖ. సర్వకాల సర్వావస్తల్లో నిన్నే అన్వేషిస్తున్నానని జ్ఞాపకం చెయ్యడమే ప్రేమలేఖ.
ఈ ప్రప్రంచమే, ఈ సృష్టి సౌందర్యమే ఒక పెద్ద ప్రేమలేఖ. ”
ఎంత గొప్ప నిర్వచనం. “హృదయంలోని మార్ధవమైన అభిప్రాయలని చెప్పడం” అర్ధం చేసుకొనేవారి మనసుకి సున్నితంగా స్పృశిస్తుందీ వాక్యం. హృదయాలని తట్టిలేపి మరీ మధురమైన అనుభూతికి లోను చేస్తుంది. అంత గొప్ప నిర్వచనమిది. కాని ధైర్యం చేసి ఇంతటి భావజాలంతో ఎంతమంది స్త్రీలు తమ ప్రేమని వ్యక్తం చేయగలుగుతున్నారు? అంటారు చలం గారు. ఒకవేళ స్త్రీ ఎన్నడో తప్పనిసరి అయి ఉత్తరం రాసినా ఆ ఉత్తరం చివరనే రాసి ఉంటుంది “ఈ ఉత్తరం చదివిన క్షణాన్నేఅ దీన్ని చింపివేయండి. నా మీద ఒట్టు, చింపకపోతే ఇక జన్మలో మీతో మాట్లాడను. ప్రేమ బైటపడితే నా ప్రాణాలు దక్కవనే సంగతి మీకు తెలుసు కదా..
నిజమైన ప్రేమ ఉత్తరం చింపడంలో ఉంటుందా? ఉత్తరం దాచుకోడంలో ఉంటుందా? ఏమో…
రోజు పోస్ట్‌లో వెళ్ళేవి, ప్రేమలేఖలు కాని లక్షల ఉత్తరాలు అన్ని చికాకు వ్యవహారలకోసం దొంగ మర్యాదలకోసం, నోటీసులు, తగాదాలు .. మొత్తానికి విసుక్కొంటూ రాసేవి, యేడుస్తూ చదివేవి అంటారు చలంగారు.
నిజమే మరి ఈ సృష్టి సౌందర్యమే ఒక పెద్ద ప్రేమలేఖ అయినప్పుడు మిగతావన్ని లెక్కలోకి రావు కదా. కాని నిర్వ్యాజ్యమైన స్నేహం , స్వచ్ఛమైన హృదయాలు ఉంటేనే కాని మధురమైన లేఖలు పుట్టవంటారు. ఒకవేళ అలాంటి స్నేహం ఉన్నా ఉత్తరాలల్లో ఆ సంబంధాన్ని వ్యక్తపరుచుకొనే అభిలాషగాని, అభిరుచి గాని శక్తి గాని ఉన్నవారు అరుదు , “మిత్రత్వం మీన్స్ ఫర్ ఏన్ ఎండ్ కాక ఎండ్ ఇన్ ఇట్‌సెల్ఫ్” అయినప్పుడే కవిత్వం ఉదయిస్తుందంటారు చలం గారు ఇందులో, అలా చెప్తూనే లేఖలనేవి ఎలా ఉండాలో కూడా చెబుతున్నారు.
లేఖ కంటిన్యూస్ థాట్‌గా ఉండాలి. చాలా ప్రియమైన మిత్రుడితో చల్లని కాలవ ఒడ్డునగాని, వెచ్చని గదిలో టీ, సిగరెట్లముందుగాని కూచున్నాప్పుడు ఎట్లా మాట్లాడతాము! అట్లా ఉండాలి వుత్తరం. అంత నాచురల్‌గా వుత్తరం చదివే వారికి ఆ రాసేవారిని కలుసుకొఇ మాట్లాడుతున్నాము అనిపించాలి. ఉత్తరం చేతుల్లో పుట్టుకొని చదివేవారు డే డ్రీంస్‌లోకి , కలలలోకి వెళ్ళకపోతే ఆ ఉత్తరం వచ్చి ప్రయోజనం లేదుట.
“ఎంకెవ్వరని లోకమెపుడైనా కదిపితే
వెలుగునీడలవైపు వేలు చూపింతు”
అన్న నండూరి వారిని గుర్తుచేసుకొంటూ …..
“కనపడవు కాని నాకు నీవు చిరుపరిచయవు. నీ రూపం గోచరము. నీ స్వభావం మనోభావాని కతీతము, కాని నీకన్నా నాకు హృదయానుగతమేది లేదు. నీ నామ మనుసృతం. కలలో విన్న గానంవలె ప్రతి నిమిషమూ నా చెవుల ధ్వనిస్తోంది. నా వేపు నడిచి వచ్చే నీ మృదు పారజము అస్తమయ మేఘాలకి ఎఱ్ఱని రంగు వేస్తోంది. నన్ను వెతుకుతో వచ్చే నీ అడుగుల చప్పుడు నా హృదయంలో ప్రతి నిమిషం ధ్వనిస్తోంది. నా పరమావధి నీవు. ”
అని కానరాని ప్రియురాలికి ప్రేమలేఖ రాసుకొనే ఈ ప్రేమలేఖల గొప్పదనం ఎంత చెప్పినా తక్కువే.
******
అరుణా పబ్లిషర్స్
విజయవాడ
varaprasad
ayya chalam gurtocchinapudalla pustakam andubatulo vundadu,kasinta meelantollu punyam kattukoni online lo unchadi saamee,avasaramaite royalty kadadam.babbabu kasinta ee upakaram cheyyandi,eemadye netloki vacchanu anduke ee vinglish gola,kasta anubhavam vacchaka tappanisariga telugulone rasta…varaprasad.
g rama krishna
న దగ్గర ఈ ప్రేమలేఖలు పుస్తకం ఉంది కావాలి అనతి ఇస్తాను నా సెల్ నెంబర్ 9989439941 మది పాలకొల్
rachanenisrinu
naku chalam prema lekhalu pustakam kavali.daya chesi ah pustakam ekkada dorukuthundo kasta cheptara…iam from hyderabad………….na mail i.d rachanenisrinu@gmail.com…….deeniki koncham mail chestara??
B J S REDDY
సర్ , మీకు ప్రేమలేఖలు పుస్తకం దొరికుంటే నాకు దయచేసి కొంచెం మెయిల్ చెయ్యరా
B J S REDDY
నా మెయిల్ ఇది, haibsr@gmail.com
Lingaiah
prema O anuboothi…danni parichayam O madhuram ..
S S N MURTY
hrudayaspandanala sakshm prema
teepi gurtula mananm prema
anuragalaantaralanu aadimi unnade prema
premanedi kadu bavana , adi hrudayantarala spandana
SSN Murty
talasila raghu sekhar
చలం ఒక ప్రేమ రచైత గొప్పగా ప్రేమలేఖలు రాశారు ప్రేమ రుచి చూపారు ప్రతి వస్తువు లొ అందము చూశారు
భావన
బాగుందండి పరిచయం. ఇంకా రాయవలసింది. నిజమే చలం ప్రేమ లేఖలు పరిచయం చేయటం ఒక విధం గా సాహసమే కాని ఏదో మన శక్తి కొద్ది మనం అంతే. నేను కనీసం ఒక రెండు వేల సార్లు ఐనా చదివి వుంటాను ఆ పుస్తకం అంటే అతిశయోక్తి కాదేమో. ఎన్ని పుస్తకాలు చిరిగిపోయినాయో నా చేతిలో ఆ బస్సులు లలో ట్రైన్ ల లో చదివి చదివి. ఇప్పటికి మనసు కలత పడినా కనుల వెనుక కలల వెలుగు విరజిమ్మినా చదివే ఏకైక పుస్తకం అదే. మీరు రాసింది చూసేక నాకు కూడా రాయాలనిపిస్తోంది. మళ్ళీ మీరన్నట్ళు జంకు గా కూడా వుంది.
శివ శంకర్
ఆ పుస్తకం ఉంటే pdf లాంటివి పంపగలరా.
Rambabu
మీరు రాసిన వ్యాసం బాగుందండి. నిజమే మీరన్నట్టు చలం ప్రేమలేఖల గొప్పదనం గురుంచి ఎంత చెప్పిన తక్కువే.
john
ఈ ప్రేమలేఖల గొప్పదనం ఎంత చెప్పినా తక్కువే.
Praveen
>>>>>
ప్రేమ బైటపడితే నా ప్రాణాలు దక్కవనే సంగతి మీకు తెలుసు కదా..
>>>>>
ప్రేమ విషయంలో మనవాళ్ళు ఇంకా అంత చాదస్తంలో ఉన్నారు. ప్రేమ దాచుకోవలసిన రహస్యంగా ఉండే పరిస్థితులు ఉండకూడదనే కోరుకుంటున్నాను.
బొల్లోజు బాబా
చలం ప్రేమలేఖలు భావుకతకు పరాకాష్ట.
ఈ మధ్యే ప్రేమలేఖలు అనే టాగ్ లైను తో విదేహ అనే పేరుతో ఓ పుస్తకం విడుదలయింది. క్రిష్ణ మోహన్ రచయిత.
చలం ప్రేమలేఖల పై ఉన్న గౌరవంతో ఆ పేరు పెట్టుకొన్నందుకు వెంటనే కొనేసాను.
చదివాకా తనివి తీరక మరలా చలం పుస్తకాన్ని చదవవలసి వచ్చింది.
పరిచయం బాగుంది.
మీకు నచ్చిన మరి కొన్ని వాక్యాలను రుచిచూపించాల్సింది.
బొల్లోజు బాబా