“హృదయాక్షరాలు” – నానీలు

వ్యాసకర్త: కాదంబరి

******

రచయిత్రి పాతూరి అన్నపూర్ణ సున్నిత భావాలు – సొగసైన 257 నానీలు  – “హృదయాక్షరాలు” గా రూపుదాల్చాయి. “నిద్రలో కూడా అక్షరాల కలలే – నిజమైన కవికి – ఇంకేం కావాలి?” అంటూ హైకూ సంపుటికి ప్రధమ పుష్పాన్ని అందించారు. ఈ వాక్యాలు ప్రతి కవికీ వర్తిస్తాయి. సార్వత్రిక భావజాలం కలిగిన దార్శనిక కవయిత్రి పాతూరి అన్నపూర్ణ – అని ఋజువు చేస్తున్నది ఈ మొదటి నానీ.

కవిత్వంగా ఉద్వేగభరితమైన – ఆమె మనోభావాలు వెల్లడి ఔతుంటే, అప్పటి స్థితిని చక్కగా వ్యక్తీకరించారు పాతూరి అన్నపూర్ణ.
“నేను కూడా ప్రవహిస్తున్నాను –
మదిలోని కవిత్వం నదిగా మారాక” –  [ 7 ]  
నేనొక అద్భుతం, నేనొక ఆనందం,
నేనొక ఆవేశం, అవును! నేనొక స్త్రీని!! –  [ 5 ]  –
 

ఆడదానిగా పుట్టినందుకుకు గర్వపడే ఆలోచనలు, సంఘ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
అన్నపూర్ణ గారి సూక్ష్మ కవితలు – 1. వృత్తి పట్ల అంకితభావం, 2. స్త్రీ ఔన్నత్య 3. సమాజ స్వరూపం, 4. ప్రకృతి, పక్షి, వృక్షాలు- పోలికలుగా గైకొనుట ; 5. సంఘసేవ ; 6. కవి, అక్షరమ్ములకు స్వరూపదాయినులు ఐన – కాగితం, పుస్తకం – పట్ల గౌరవం – ఇత్యాది  –
చిరుజల్లులతో ఈ రచన గుబాళించింది.

“కాగితాన్ని చులకన చేయకు,
అండగా అక్షరాలున్నాయి”
–  [20 ]

“పుస్తకం చదివాక, అక్షరాలు వెంటాడాయి,
రచయిత, సఫలమైనట్లే”
– [58] – అన్నారు  అన్నపూర్ణ.

నిజమే కదా! హైకూలు, కవిత్వం పట్ల మమకారం ఉన్న కవి హృదయాలలో కృతజ్ఞతాభావం వెల్లివిరుస్తుంటాయి. ,  –  
“దరిద్రం ఉండచ్చు, తప్పులేదు,
భావదారిద్ర్యం మాత్రం, మంచిదికాదు” ;

హృదయాక్షరాల పారిజాతాలను వెదజల్లిన కవయిత్రి – ఆణిముత్యాలు కొన్ని ;-

“పద్యం మహాహృద్యం, మినీకవిత్వానికి,
ఎప్పుడో పునాది వేసింది”
[178] ;

హైకూలు, కవిత్వం పట్ల మమకారం ఉన్నకవుల హృదయాలలో కృతజ్ఞతాభావం వెల్లివిరుస్తాయి.

“హృదయమది,
పుష్పకవిమానం కాదు,
బరువెక్కువైతే, బ్రద్దలవుతుంది
 [173] ;

“క్షణంలో మెరిసిన, భావాలను,
నిమిషాలలో నింపాను, నానీలు ఉన్నాయిగా”
[35] ;

“నానీల నాన్నతో, మాట్లాడాను,
మనసు తడిసింది,
అక్షరాల వర్షంతో”
[30]  ;

“గుండెకు గాయమయింది,
కవిత్వమే దానికి మందు”
[202]  ; 
జననీ జన్మభూమిశ్చ – అని శ్రీరామ ఉవాచ. 

అన్నపూర్ణ – “జన్మభూమికి, తిరిగివచ్చాను,
నాలోని మనిషికి, జీవకళ వచ్చింది”
–  [42] – అన్నారు.

ప్రపంచం చిన్న కుటీరంగా మారుతున్న ఈనాడు  ఇది అనేకమందికి నేడు అనుభవైకవేద్యమే కదా!

 “అమ్మనాన్న మాత్రమే, ఒంటరివాళ్ళు కాదు,
దేశం దాటిన పిల్లలు కూడా!” 
– అన్నారు.  

ఇతిహాసాల ప్రభావం మన సమాజం రూపురేఖలను తీర్చిదిద్దాయి. అందుకే ఈమె అన్నారు –
జీవితాన్ని మధించాలనుకున్నావా?
మహా భారతాన్ని చదువు
” – [110] –  simple గా చెప్పేసారు.

[115] రాజకీయం, నేర్చుకోవాలా, రామాయణ, భారతాలు, తిరగేస్తే~ సరి ;  
ప్రాచీన సాహిత్యాభిలాష, ఇతిహాస గౌరవం కలిగిన కలం ఈమెది.

మనిషి జీవితంలో వివిధ దశలు నాలుగు అంచెలుగా ….

బాల్యం కలలా మిగిలింది, వర్తమానాన్ని యదార్ధంగా చూపిస్తూ! [56]

జీవితం ;- జీవితంలో మరణంవరకు,
ప్రతి పేజీ దాకా, కొత్త అధ్యాయమే!
[102] –

ఎంత చక్కని నిర్వచనం – జీవితం పట్ల రచయిత్రికి ఉన్న సదవగాహన – ప్రస్ఫుటం.  “బ్రతుకు డైరీ” లో మెరిసే వాక్కులు ఇవి.

జీవితం, ఎవరిది వారిదే, కలిసి ఉంటేనే కదా, జీవన సాఫల్యం. –  [110]

“జీవితంలో స్వప్నాలని కంటాము,
కానీ, జీవితమే స్వప్నం కాకూడదు.  –  [92]
– 

నిజానికి జీవితం, ఓ యుద్ధం, మరణం వరకు

తప్పదు పోరాటం [165]

గాలిపటం, క్రింద పడుతూ పైకి వెళ్తోంది

జీవితానికి, అర్ధం చెబుతున్నది – [186] ;
[188] – జీవితంలో కోల్పోయాను, తెలిసేసరికి, జీవితం, ఇంకేం మిగిలింది – అన్నారు.

అన్నపూర్ణ తేనీలు ;-  లిపి, “అక్షరం ఉన్నది కాబట్టే, సారస్వత బృందావనం – గుబాళిస్తున్నది. అట్లాగే – హృదయస్పందనలు, ఊహలు, భావ వ్యక్తీకరణలు – సాహిత్య సృజనల ద్వారా సాధ్యమై, అక్షరసంపద ఇతోధికంగా అభివృద్ధి పొందుతున్నది. రచనాలోకం ఇందుకు ఆలవాలం….. , అందువలననే – కవయిత్రి కలం – అక్షరమాలల తోరణాల పుష్పాలను పూసింది.
మొగ్గదశలోనే, పువ్వు పరిమళించదు,
రాస్తుంటేనే, రాణిస్తుంది కవనం
”  [130] ;
కలలు, కవితగా మారాక,
కాగితం, అక్షరాలను హత్తుకుంటుంది 
“[37 & 20] ;
కలానికి కాగితానికి, తెలీదు, అక్షరాలకింత, శక్తి ఉందని” –  [107] ;;
మేధోమధనం, జరుగుతున్నది, మరిన్ని నానీల, పుట్టుక కోసం “[77] ;

 మాటలు, మౌనము – సవ్వడి – సద్దు – సమతూకం వేయగలిగినప్పుడు – పదాలు – కవితలు ఔతాయి ఈ మాదిరిగా,  – నిశ్శబ్దమూ గొప్పదే ;-
ఒక్కొక్కప్పుడు – నిశ్శబ్దమూ గొప్పదే –
మనసుని పదును పెడుతుంది
 [140 ]
అక్షరాలకు, అగ్గి ఉందా!
అందుకే కవిత్వం, నిరంతరం ప్రజ్వలితం
 [157]

వృత్తి – ఉపాధ్యాయుని విలువ:
అక్షరజ్ఞానం, గురువు పెట్టిన బిక్ష,
వత్తి లేనప్పుడు, వెలుగూ ఉండదు 
[171]
అక్షరాలు, ఎదురుచూస్తున్నాయి,
రాతలు చేతలుగా మారాలని
 [105] ;  
అక్షరదీపాలు, వెలుగుతూనే ఉంటాయి,
ప్రమిదల్లో, కవిత్వం ఉందిగా!
[27] –
అనే తేనె పద్యాన్ని ముక్తాయింపుగా చేసారు.

రచయిత్రి ఔచిత్యం కి నిదర్శనం.
నిద్రలేని రాత్రులు, గడిపాను,
నిద్రమీద పుస్తకం, రాయడానికి
 [ 21 ] ;

ఆమె శ్రమ వమ్ము కాలేదు………. – ఇంత చక్కని ‘భావ ఆణిముత్యం ‘ వెలిసింది కదా!
అన్నిటినీ, జయించానుగాని, అంతరాత్మ ముందు, అపజయం పాలయ్యాను” [4] ;

కాగితం, పుస్తకం, అక్షరం – అవినాభావసంబంధం అందరికీ విదితమైన విషయమే!
కవి మనసు – నిరంతరం – అక్షర స్పర్శలోనే పునర్ నవీకరణను పొందుతుంటుంది కదూ!

వేగంగా మారిపోతున్న నేటి సమాజంలో తల్లిదండ్రులకు ఉన్న స్థానం గురించి ఎక్కువగా మధనపడ్డారు.

ఆ దంపతులు, డబ్బున్నపేదలయ్యారు,
పిల్లలు, విదేశాలకు ఎగిరిపోయారు.
” [39] – ………….  అనుకున్నారు.
రొమ్ము గుద్దినా, క్షమించేది అమ్మ,
అర్ధం కావాలంటే, జన్మ చాలదు.
” [69] ;;
పిల్లల్ని, తలిదండ్రులు ప్రేమిస్తారు,
వృద్ధాప్యం, వాళ్ళ ప్రేమను కోరుతుంది
 [156]
ఎప్పుడు కొవ్వొత్తిని చూసినా, గుర్తొచ్చేది మాత్రం, తల్లితండ్రులే”  –  [132]

స్నేహం 86 ; పల్లెలు – 88, 89, 104 131 ;
అమ్మానాన్నల,
అలసిన గుండెలకి, సాంత్వన,
ప్రేమించే సంతానమే
” [200]

అట్లాగే రేపటి – తల్లిదండ్రులు – స్థానాన్ని భర్తీ చేసేది నేటి యువ దంపతులే కదా! అందుకే, రచయిత్రి కలం – ఈ విధంగా చెప్పారు –
కన్నీళ్ళు తుడిచేందుకు అమ్మ లేదు,
ఆలికి ఆ స్థానం దక్కింది.
” [85]
 “గడియారంలో,
ముళ్ళతో పరిగెత్తేలోలకం,
ఇదండీ ఇల్లాలి వాలకం
” [149] ;
భార్యాభర్తలు, జోడు గుర్రాలు,
అడుగులు సమానమైతే,
జీవితం సాఫల్యం
” [154] ;

లోకం పోకడలు, general విషయాలు – నిర్వచనాలతో సమానం – 193 హైకూ- లో నుడువులు ఇవి ….. ,
దరిద్రం ఉండచ్చు, తప్పులేదు,
భావ దారిద్ర్యం మాత్రం, మంచిదికాదు
”  ;

పాతూరి అన్నపూర్ణ గారి విశ్లేషణలో – మనం ప్రతిరోజూ చూస్తున్న- రాయి – శిల – కళారూపిణులు అయి, సాక్షాత్కరించిన వైనం- సుందరతరమైనది …. , రాయి, శిల – కవితా రూపం పొందిన సొగసులు ….
ఒక్క రాయికి బదులుగా పది రాళ్ళు,
విమర్శ నుండి, పాఠాలు నేర్చుకుందాం
 ;  [34 ] ;

రాయే కదా అని
పారేయకు
శిల్పం చెక్కు
నీపేరును నిలబెడుతుంది
 [44]  

చాకలి బండ ఐనా,
దేవుని కొండ ఐనా,
రాయి చేసుకున్న, అదృష్టమే
 ; [203]

మారుతున్న సామాజిక వ్యవస్థలో – పెద్దలు – నేటి యువతీ యువకులు, రేపటి పౌరులు అయిన పిల్లలు – విచిత్రమైనఅవస్థలు పడుతూనే ఉన్నారు, గమనించండి – ద్రవిస్తున్న కవయిత్రి పలుకులను ………. ,

అమ్మనాన మాత్రమే ఒంటరివాళ్ళు కాదు,
దేశం దాటిన పిల్లలు కూడా!
” [74] –
ఏక పక్షంగా కాకుండా, పిల్లల గురించి కాస్త – మనసు పెట్టి ఆలోచిస్తే – ఈ పలుకులు నూటికి నూరు శాతం నిజం.

మాతృస్వామ్య, పితృస్వామ్య వ్యవస్థలు ;-
కాగితం, పుస్తకం, అక్షరం – అవినాభావసంబంధం అందరికీ విదితమైన విషయమే!
కవి మనసు – నిరంతరం – అక్షర స్పర్శలోనే పునర్ నవీకరణను పొందుతుంటుంది.

ప్రయాణంలో పదనిసలు ;- 
ప్రయాణం – చేసేటప్పుడు మదిలో దొరలిన భావాలు, “పద్యాలు – దొరలు” ఐన వైనం చూద్దాం.

ప్రయాణంలో, ఒంటరితనమూ అదృష్టమే,
ఆలోచనలు, అక్షరాలవుతాయి 
[25] – అన్నారు ఈమె.
“ప్రయాణంలో పదనిసలు, పరిచయం, పరిణయంగా మారింది” –  [147] ;

ఆకాశంలో, హరివిల్లు విరిసింది,
ఎంతగొప్ప చిత్రకారుడు, సృష్టికర్త
” –  [205]

దేవుడి ఉనికిని – ఆమె – పిల్లలు, వైద్యుడు – తన పరిసర అంశాల ద్వారా గుర్తించారు.
గుళ్ళో మోగే గంటలు,
దేవుడికే కాదు,
భక్తులకూ, మేలుకొలుపే 
” [155]
దేవాలయాలు,
పావురాల నిలయాలు,
అందుకే, శాంతి వాతావరణం
” [100]

నమ్మకం – అమూల్యవరం – కవి విశ్వాసం విలువను ఇట్లా చెప్పారు –
దేవుడు ఉన్నాడా? లేడా?
నమ్మకమే మంచిది,
మనిషికి ఆలంబన?
”  [33]
గ్రామదేవతలు, ఊరికి కాపలా,
ధైర్యాన్ని ఇచ్చే నమ్మకం, మంచిదే!
”   [26] ;

నమ్మకం ;- స్వతహాగా రచయిత్రి, దైవభక్తి కలిగిఉన్న వ్యక్తి, ఐతే నాస్తికులంటే ఆమెకి ఆట్టే విముఖత లేదు –
దేవుడు ఉన్నాడా?, లేడా?,
నమ్మకమే మంచిది, మనిషికి ఆలంబన
 [33] –
ఓటమితో చెలిమి చేయకు, నమ్మకం కలిమి, చేజారుతుంది [189]  ;
జాబిల్లి ;- వెన్నెల చిన్నబోయింది,
చందమామను చూపించే,
కవులు కరువైనారు
 [80] –
అని, కాలవిపరిణామానికి ఖిన్నులైనారు రచయిత్రి. అది సరే గానీ, జోలపాటలు, పాడుతూ, బిడ్డలకు గోరుముద్దలు తినిపించేటప్పుడు – తల్లి చందమామను చూపించేది – ఇప్పుడు ఫ్లాట్స్, నాలుగు గోడల మధ్య ఉంటున్న వ్యవస్థ, ఉరుకులపరుగుల జీవనయానంలో – చంద్రుడు – అసలుగుర్తున్నాడా ఈ మనుషులకి??

పాతూరి అన్నపూర్ణ క్లుప్తంగా వేసిన పదాలతో, ఎంతో భావం ఇమిడించారు.
చెట్టు ;- మానవులకు, ప్రాణికోటికి – ఆక్సిజన్ అందిస్తూ, మనుగడకు మూలస్తంభం ఐనది తరువు. వృక్షం పట్ల కృతజ్ఞత వెలిబుచ్చడం మన విధి, కవులు అక్షరీకరించారు పలు రీతులలో.
చెట్టు మహాత్యాగి,
కూల్చినా మనిషికి,
బహు రూపాలను, అందిస్తుంది.
”  – [204] ;
చెట్టు, నాప్రియనేస్తం,
ఎన్నోకవితలను,
కొమ్మల్లోంచి రాల్చింది
”  [27]
చెట్టు, నేలని మర్చిపోలేదు, వేళ్ళ నుండే, ఆహారాన్ని తీసుకుంటున్నది” [153]

కొన్నిసార్లు చిరు హాస్యం అన్నపూర్ణ తేనీలు – మెరిపించినవి.
మా పెరటి చెట్టు పళ్ళు, ఎంతో రుచి,
మాకు కాదు, పక్కింటి వాళ్ళకి
.” – [23 ] హైకూ ;

పక్షి,  – ప్రకృతి – కవులకు ఎన్నో ఉపమానాలను అందించే ఘన నిధులు. మంచి ఊహలు – మంచి కవితాపంక్తులను చదువరికి అందిస్తాయి అనడానికి అన్నపూర్ణగారి ఈ నానీ తార్కాణం.
కవిత్వం, ఎగిరొచ్చిన పక్షి,
ముక్కున కలలని, కరుచుకుని వాలింది
” [24]  ;
పాతూరి అన్నపూర్ణగారు – ప్రకృతి ప్రేమిక – పూలు, చెట్లు – పక్షులు – వర్ణన తీరు చక్కనిది. పక్షులలో – కాకి / వాయస – నల్లని రూపు – ప్రజల శీతకన్నుకు కారణం ఔతున్నది.
కోడి వలె – దీని స్థానం కూడా ఎంచదగినదే, గమనించండి.

కాకిగోల అంటూ, విసుక్కోకు, ఆ గోలే, మనుష్యుల్ని లేపుతుంది” – [66] –
ఔను, నిజమే కదా!
ఫ్లెమింగోలు
వలసపోయాయి,
వసంతాన్ని తెచ్చి, పంచడానికి
”  – [55] –
ఇది ఆమె చూసిన కొత్త కోణం. 127, 11 , 24 – 179  ;
పురివిప్పిన,
నెమలిని చూశాను,
కళ్ళున్నందుకు, సార్ధకత!
”  – [179] ;

ప్రేమభావం, తత్వం గురించి ఆమె భావాలు వెల్లడి ఐనవి కవితారూపంలో :
“ప్రేమ – కన్నీరు తుడుస్తుంది,
కన్నీరు పెట్టిస్తుంది,
అందుకే అజరామరం”
– [70] ;
ప్రేమ కలిగిన గాయం, బాధామయం,
మరొకరికి, ఆ గాయం చేయకు
” – [114]
గెలుపు కోసం, అబద్ధాల గతం,
గెలిచాక, అబద్ధాలే జీవితం
”  [113]
బాల్యం, కలలా మిగిలింది, వర్తమానాన్ని, యదార్ధంగా చూపిస్తూ ! [56] ;;
వస్తువు గొప్పదనం, వాడకాన్ని బట్టి,
అగ్గిపుల్ల, దేన్నైనా అంటిస్తుంది
” [112]
తప్పును క్షమించడం, మానవత్వం, మళ్ళీ ప్రేమించడం మహనీయత్వం ; [79] ;;
అప్పుడప్పుడు, గాయాలు తగలాలి, జీవితం విలువ, తెలియాలిగా” –  [83] ;

ప్రాచీనకాలంలో – హిందూదేశాన్ని – “చేనేత పనితనం” ప్రపంచంలో హిందూదేశాన్ని శిఖరాగ్రాలలో నిలబెట్టింది. కానీ నేడు వారి దుస్థితి కళ్ళకట్టినట్లు కనబడుతూనే ఉంది కదా.

” పడుగుపేకలు, ఆడుతూనేఉంటాయి,
నేతన్న, గుండె ఆడేంత వరకు

రాజకీయాలు – దేశం ఆర్ధిక పరిస్థితుల పట్ల అభిప్రాయాలు కనిపిస్తాయి.
సరిహద్దుల్లో సైనికులు కాపలా, కాని దొంగలు పడ్డారు, దేశంలోపల” [201] –
కాలం చిలికిన చక్కని అభివ్యక్తీకరణలు. రాజకీయం నేర్చుకోవాలంటే ఏం చేయాలో – 110, 115` haiku` లలో చెప్పారు. అందరం తెలివైన వాళ్ళమే, అయినా మోస పోతాం, ఐదేళ్ళకో సారి
కేవలం గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ – అనేటటువంటి భావజాలం కాదు అన్నపూర్ణ గారిది.

ప్రాచీన నాగరికతకు ఆదిమూలం అయిన – హిందూ సంస్కృతి – సహజంగానే సాహిత్య, ఇతిహాసములకు పెన్నిధి అయినది. పౌరాణిక సారస్వతం పరిశీలించిన కవులకు, కావ్య సృజనకర్తల రచనలలో -, పురాణ గాధలలోని వస్తు, పాత్రలను, గుణగణాలను –  పాలలో తేనె వలె కలిసిపోతుంటాయి. ఇతిహాసాలు, ప్రాచీన గేయకర్తలు ;-  పాతూరి అన్నపూర్ణ కలంలో – సున్నిత పదముల అల్లికలు ఐనాయి.
ఆకాశగంగ అయినా,
ప్రవాహం నేలపైనే
ఒదగడంలోనే – ఉంది అందం
” ;  [15 ] ;
అన్నమయ్య పాటలు మధురం,
రాయించుకున్న వెంకన్న,
మధురాతిమధురం
” [47]
కష్టాలొచ్చినా, పర్యవసానం జ్ఞానం!
 ఇదే రామదాసు కీర్తనల , సారం !!
” – [95] ;

***

ADDRESS ;- P. Annapurna, 1156/28-1, Prasanthi Nagar, Nawalak Gardens, Nellore-524 002. Mobile : 9490230939.
printed at : Dronam Rajuvari street, Nellore-524 001
ph : 0861-2328371

You Might Also Like

Leave a Reply