గత సంవత్సరం నేను చదివిన పుస్తకాలు

వ్యాసకర్త: శ్రీ అట్లూరి

***********

గత సంవత్సరం నేను చదివిన పుస్తకాలు … ఎక్కువగా నేను చదివినవి ఇంగ్లీష్ పుస్తకాలే .. తెలుగు పుస్తకాలు కొన్ని కొన్నప్పటికీ కొత్తగా చదివినవి చాలా తక్కువ ఇంగ్లీష్ పుస్తకాలతో పోలిస్తే ) . ఒక కారణం ఆన్లైన్ లో తెలుగు పుస్తకాలు (పిడిఫ్ )  లో దొరకకపోవడం. రెండోది మరీ చదవాలి అని అనిపించకపోవడం .  గత రెండేళ్లుగా నేను ఫిజికల్ పుస్తకాలు కొనడం మానేసాను . ఇంటినిండా అవే ఉండటం తో . ఎక్కువగా కినిగె లో కానీ, అమెజాన్ కిండిల్ లో కొంటాను .

Parveen Babi: A Life  – Karishma Upadhyay  
ఈ పుస్తకం నిజానికి గత సంవత్సరం (2020 ) Timepass: The Memoirs of Protima Bedi  –  Pooja Bedi పుస్తకం చదివినప్పుడు ఈ పుస్తకం రాబోతోంది అని విన్నా . పర్వీన్ బాబీ ఒక సెన్సేషన్.. అర్త్ సినిమా కొంచం ఆమె జీవితం ఆధారం అని అప్పట్లో అనేవారు . ఈ పుస్తకం చదివాక చాలా జాలి వేసింది . పడి లేచిన కెరటం .. పర్వీన్ బాబీ / కబీర్ బేడీ ల గురించి  ప్రొతిమా బేడీ గారు ఒక వెర్షన్ రాసారు … ఈ పుస్తకం లో ఇంకో వర్షన్ … మూడో వర్షన్ కబీర్ బేడీ వెర్షన్ (అది ఇంకో పుస్తకం ) .  

The Carpet Weaver by Nemat Sadat  
ఇది నీమాట్ సాదత్ మొదటి రచన . ఒకరకం గా ఆటోబయో అనొచ్చు ఏమో .  కథాకాలం 1977 ఆఫ్గనిస్తాన్  .. అప్పట్లో గే అన్న పదం వింటేనే అక్కడ చంపేసేవారు అక్కడ . ఆ టైం లో కథానాయకుడు కనిష్క్ తన స్నేహితుడు తో ప్రేమలో పడతాడు .  ఈ లోపల యుద్ధం .. జీవితం చెల్లా చెదురు అవుతుంది . మంచి కథనం. చదివాక ఒకటి రెండు రోజులు మీతో ఆ కథ తిరుగుతూ ఉంటుంది .  తప్పక చదవాల్సిన కథ .

Three weeks with my Brother by Nicholas Sparks .
 నికోలస్ స్పార్క్స్ అనగానే గుర్తువొచ్చేది మనకి నోట్ బుక్ .. మెసేజ్ ఇన్ ది బాటిల్ సినిమాలు . మంచి రొమాంటిక్ రైటర్ గా పేరు పొందిన స్పార్క్స్ నుంచి వచ్చిన సెమి ఆటోబయో ఈ పుస్తకం .  దీంట్లో నాకు బాగా నచ్చింది వాళ్ళ అబ్బాయి కోసం భార్యాభర్తలు పడిన కష్టం .  వాళ్ళ అంకితభావం ..  ఈ పుస్తకం చదువుతుంటే మనం మన బాల్యం లో కి తెలీకుండా నే నడుచుకుంటూ వెళ్ళిపోతాం.  
three things what the authors said are so true ..
A. It’s your life + social commentary.
 B. What you want and what you get are usually two entirely different things.
C. No one ever said that life was fair.
తప్పక చదవాల్సిన పుస్తకం .

నిశ్శబ్ద విస్ఫోటనం – యండమూరి వీరేంద్రనాథ్
ఇది అతి సాధారణమైన నవల . అయన మాములుగా రాసినదానికి దీనికి ఎక్కువ తేడా లేదు .  అత్యంత తెలివి తేటలు … భారత / రామాయణ / భాగవతాలు అవలీలగా చదివేసి (ఆ పిల్లకి శకుని కథ తేలీదు మళ్ళి – శ్రీ కృష్ణ పాండవీయం సినిమా చూడలేదు అనుకుంటా ) … అమ్మాయి .. హీరో తో కలిసి ప్రపంచాన్ని ఎలా కాపాడేసింది అన్నది కథ .  కినిగె లో కొని చదవండి .  

The Beauty of Living Twice by Sharon Stone
షరాన్ స్టోన్ అనగానే మనకి గుర్తు వచ్చేది బేసిక్ ఇంస్టింక్ట్ సినిమా . అప్పట్లో ఆదో పెద్ద హిట్ సినిమా .  కానీ ఈ అమ్మాయి కి ఆ పేరు రావడానికి ముందు పడిన కష్టం . ఆ తరవాత ఆమె జీవితం లో జరిగిన విషయాలు మనకి ఎక్కువగా తెలీదు .  She is a fighter on her own way .  ఆవిడ ప్రేమా / పెళ్ళి / విడాకుల గురించి అయితే ఈ పుస్తకం చదవద్దు .  ఇది ఎక్కువగా ఆ అమ్మాయి జీవితం లో జరిగిన ఒడిదుడుకులు, సహాయపడినవారు , తాను ఏ విధంగా సమాజానికి సేవ చేసిందో చదవాలంటే ఇది ఆ పుస్తకం . అద్దాల ప్రపంచం లో ఉండేవాళ్ళ జీవితాలు కనపడినంత అందంగా ఉండవు అనడానికి ఈ పుస్తకం ఒక ఉదాహరణ .

I Came Upon a Lighthouse: A Short Memoir of Life with Ratan Tata by  Shantanu Naidu  and  Sanjana Desai
ఈ పుస్తకం నేను అసలు కొనాలనే అనుకోలేదు . కాకపోతే అమెజాన్ వాడు కొనరా బాబు … ఇంకా కోనేలేదా … కొంటావా లేదా అని కొనేదాకా రెకమెండేషన్ లిస్ట్ లో చూపిస్తా ఉంటేవాడి బాధ పడలేక కొన్నా . కానీ మంచి పుస్తకం రతన్ టాటా గారి గురించి వచ్చిన మంచి పుస్తకాలలో ఇది ఒకటి .

Stories I Must Tell: The Emotional Life of an Actor by Kabir Bedi  .. రచ్చ గెలిచి ఇంట గెలవాలనుకొన్న కబీర్ బేడీ కథ ఇది . కబీర్ జీవితం లో చాలా మంది అమ్మాయిలు … దానికి తోడు ఇంటర్నేషనల్ ఆక్టర్ .. బోలెడు డ్రామా ..  ముందు గా నేను చదివింది ఈయన మొదటి భార్య కథ .. తరవాత ఒకప్పటి ప్రేయసి కథ … మిగిలింది వారి అమ్మగారి కథ .  అది ఇంకా బోలెడు డ్రామా ఉన్న కథ … (ఇంగ్లాండ్ లో పుట్టి భారత దేశం లో స్వతంత్ర పోరాటం లో పాల్గొని చివరి రోజుల్లో బుద్ధిస్ట్ నన్ గా మారారు ఆవిడ ) ఓవరాల్ గా ఈయన కథ పాస్ మార్కులు మాత్రమే .

Unscripted: Conversations on Life and Cinema by Vidhu Vinod Chopra and Abhijat Joshi
అభిజిత్ జోషి రాసిన ఈ బుక్ … ఈ సంవత్సరం నాకు నచ్చిన పుస్తకాలలో ఒకటి .  బాగా చిన్నప్పుడు చూసిన ఖమోషి సినిమా .. ఆ తరవాత వచ్చిన పరిందా సినిమా … 1942 లవ్ స్టోరీ ..  3 ఇడియట్స్ .. గట్రా నాకు నచ్చిన సినిమాలా గురించి .. అవి వెలుగు చూడటానికి ముందు ఏం జరిగింది లాంటి ఆసక్తి కరమైన పుస్తకం . మంచి కథనం .  కొన్ని మరీ సినిమాటిక్ గా ఉన్నా .. నాకైతే నచ్చింది .

Looking Inwards by Swami Purnachaitanya
ఇది కూడా అమెజాన్ వాడి రెకమెండేషన్ .  కానీ నచ్చింది . పుస్తకం కవర్ చూస్తే దేశి లాగా కనపడలేదు . అది ఒక కారణం పుస్తకం కొనడానికి . ఎక్కడో ఆస్ట్రేలియా లో పుట్టి భారతదేశం వచ్చి మన శాస్త్రాలు చదివి వాటి మీద పట్టు సాధించడం నాకు నచ్చింది.  మెడిటేషన్ గట్రా లాంటివి చేసేవాళ్ళకి నచ్చే పుస్తకం .

Notes from Nepal by Joshi Mukard  
నా కిడ్నీ అమ్మినా టెలీఫోటో లెన్స్ కొనలేను .. అందుకని లాండ్స్కేప్ ఫోటోగ్రాఫర్ గా మారాను … ఇది జోషి మూకార్డ్ గారి లైన్ .. పుస్తకం కొనడానికి ఇది ఒక కారణం.  ట్రావెలాగ్ పుస్తకాల లో మంచి హాస్యం ఈ పుస్తకం లక్షణం . ఇతనికి బ్లాగ్ కూడా ఉంది .

The Non-Conformist: Memories of My Father Balraj Sahni – Parikshat Sahni
Do Bheega Jamin సినిమా చూసి బాల్రాజ్ గారికి అభిమాని ని అయ్యాను.  ఆయన మీద పుస్తకం అని ఈ పుస్తకం రెండేళ్ల క్రితం కొన్నా .. కానీ చదవడం కుదరలేదు . ఈ పుస్తకం లో బాల్రాజ్ గారి గురించి తక్కువ .. పరీక్షిత్ సహానీ గురించి ఎక్కువ ..  కొన్న రెండేళ్లు చదవలేనందుకు ఏం బాధపడలేదు .  బాగానే రాసారు .. కానీ సొంత సోది ఎక్కువ వల్ల కొంచం చిరాకు వచ్చింది .  పుస్తకం పేరు చూసి మోసపోవద్దు .

Such Kahu Toh – Neena gupta
నీనా గుప్తా అనగానే మనకి గుర్తుకు వచ్చేది ఖాంధాన్ , ఉత్సవ్ సినిమాలు ఈ మధ్య వచ్చిన బాధాయి హో సినిమా .   కాకపోతే జనాలకి ఎక్కువ గా గుర్తు ఉంది ఆ అమ్మాయి వివియన్ రిచర్డ్స్ తో నడిపిన ప్రేమాయణం దానివల్ల కలిగిన పరిణామాలు.  కానీ ఈ పుస్తకం చదివితే కొన్ని చోట్ల మనకి తెలీని  ఆ అమ్మాయి మీద  మనకి ఉన్న అభిప్రాయాలూ చాలా వరకు మారతాయి . నిజాయితీగా రాసిన పుస్తకం .  

Nambiarswami: The Good, the Bad and the Holy  by his Grand son M.N. Dipak Nambiar
ఈ పుస్తకం కూడా దాదాపు గా కొన్న రెండేళ్ల తరవాత చదవటం మొదలు పెట్టాను . చిన్న పుస్తకమే …  దీపక్ తన తాతగారి కి ట్రిబ్యూట్ గా రాసిన పుస్తకం ఇది . ఈ పుస్తకం లో నంబియార్ గారి చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలు బాగా ఉన్నాయి . అయన దాదాపు గా అందరు హీరోలకి సమఉజ్జిగా చాలా సినిమాలు చేశారు. అంతే కాకుండా అందరితో మంచిగా ఉన్నారు .  అయన అయ్యప్ప స్వాములకు చేసిన సేవ చాలా గొప్పది . ఓవరాల్ గా మంచి ట్రిబ్యూట్ ఈ పుస్తకం .

Change Makers – Gayatri Rangachari Shah’ and Mallika kapur
ఇది ఇరవై మంది స్త్రీలు చిత్రపరిశ్రమ లో ఎలా రాణించారో తెలిపే పుస్తకం . ఒక్కరో ఇద్దరో తప్ప ఇరవై మంది లో అందరూ ఎక్కడా సినిమా బ్యాక్గ్రౌండ్ లేనివాళ్ళే . అలాంటి  వాళ్ళు సినిమా రంగంలో నిలదొక్కుకోకడమే కాక ఎలాంటి మార్పు తెచ్చారో తెలిపే పుస్తకం ఇది . దీంట్లో స్టంట్ ఆర్టిస్ట్ గా అమ్మాయి రాణించడం .. కెమెరా వుమన్ గా రాణించడం వాళ్ళ దానికోసం పడిన కష్టాలు , కళ్ళ వెంట నీరు తెప్పించక మానవు.  మంచి స్ఫూర్తిదాయకమైన పుస్తకం .

Great Folk Tales of Bihar by Nalin Verma
చదివిన వాటిలో అతిసాధారణం నుంచి చెత్త లో కి చేరే పుస్తకం ఇది . దీంట్లో ముందుమాట చాలా బాగుంది .. కథల్లో రెండో మూడో పర్వాలేదు . కొన్ని కథలు అయితే మరీ అడల్ట్ కంటెంట్ ఉన్న కథలు .  మొత్తానికి నాకు నాట్ ఓకే పుస్తకం .

గురవాయణం  – డాక్టర్ గురువా రెడ్డి  

పుస్తకం చదువుతుంటే ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన సంఘటనలు చాలా గుర్తుకు వస్తాయి . మన చుట్టూ ఉన్న మనుషులు మనకి దగ్గరవాళ్ళ గురించి బోలెడు కబుర్లు .  మన పక్కన ఉండి మాట్లాడుతున్న ఫీలింగ్ .

An Actor’s Actor: An Authorized Biography of Sanjeev Kumar by Hanif Zaveri (Author), Sumant Batra (Author)
చిన్నప్పటి నుంచి సంజీవ్ కుమార్ గారి సినిమాలు చూసి పెరిగి ఆయనగురించి పుస్తకం వస్తోంది అని , రాగానే కొని చదివాను . మంచి నటుడు .. మంచి వ్యక్తి .. తాగుడు , సిగెరెట్ వల్ల జీవితం ఎలా తలకిందులు అవుతుందో ఈయన జీవితం ఒక ఉదాహరణ .  

Goldie by Anitaa Padhye  
ఇది విజయానంద్ మీద పుస్తకం . చిన్నప్పుడు మార్నింగ్ షోస్ లో ఈయన సినిమాలు అన్ని వరసపెట్టి చూసా . తీసిరి మంజిల్ , జూనీ మేర నామ్ , జెవెల్ థీఫ్ , గైడ్  గట్రా .. ఇలాంటి పుస్తకాలలో ఉన్న సమస్య ఏంటి అంటే రాసేవాళ్ళు … ప్రపంచం లో ఉన్న గొప్పతనం అంతా వీరికే అంటగట్టే ప్రయత్నం చేస్తారు . దీంట్లో కూడా అదే జరిగింది .

This Life At Play: Memoirs by Girish Karnad (Author, Translator), Srinath Perur (Translator)
ఈ పుస్తకం కోసం దాదాపు గా ఒక ఏడాది వెతికాను . అప్పటికి ఇది ఇంకా అనువాదం కాలేదు కన్నడ నుంచి .  అమెజాన్ లో ప్రీ ఆర్డర్ పెట్టి మరీ కొన్నా . కానీ పిచ్చ బోర్ కొట్టింది . కారణం నాకు కన్నడ హిస్టరీ మీద ఏ మాత్రం జ్ఞానం లేకపోవడం . కొన్ని చోట్ల చాలా బాగుంది . కొన్ని చోట్ల అమితమైన బోర్ కొట్టింది . గిరీష్ కర్నాడ్ గారు నాకు అమితంగా నచ్చే నటుడు. కానీ ఈ పుస్తకం నాకు నచ్చిందా అంటే నాకు డౌటే .

The Boys: A Memoir of Hollywood and Family by Ron Howard (Author), Clint Howard (Author)
రాన్ హేవార్డ్ అంటే మనకి (నాకు ) తెలిసింది willow (my favorite movie of all the time), EdTV, Beautiful mind, Apollo 13 etc దర్శకుడు. కానీ అతను బాలనటుడి గా , నటుడుగా బోలెడు సినిమాలు చేసాడు. ఆరేళ్ళ వయసులో నటుడిగా మొదలు పెట్టి ఎలా నేర్చుకున్నాడో తెలిపే పుస్తకం . హాలీవుడ్ లో అందరు తల్లి తండ్రుల్లాగా కాక వాళ్ళ తల్లి తండ్రులు వీరి సంపాదన మీద ఆధారపడకుండా వీరికి ఎలా మార్గదర్శకులు అయ్యారో తెలిపే పుస్తకం . నాకు నచ్చింది .

ఇవి అన్ని కాక సగం సగం చదివినవి ఇంకో ఎనిమిది ఉన్నాయి … అవి ఈ సంవత్సరం పూర్తీ చేసే అవకాశం ఉంది .

తెలుగు లో ఇవి కాక చదివినవి
బాలాజీ టాకీస్ ప్రేమ బంధం – గోపిని కరుణాకర్
ఐదో గోడ – కల్పనా రెంటాల  
బోలెడు షాడో పుస్తకాలు ,
చందమామ కథలు  1 , 2 – వసుంధర
చివరి చరణం – శ్రీ రమణ
సింహాచలం సంపెంగలు – శ్రీ రమణ
రామాయణం – శ్రీ రమణ
నేను వండిన రుచులు చెప్పిన కథలు – సంధ్య ఎల్లాప్రగడ (పరమ బోర్ )
జి ఎస్ లక్ష్మి హాస్య కథలు (హాస్యం ఎక్కడా ? బుక్ లో కనపడేలా మరి ! )
విప్లవ తపస్వి పి వి – ఏ కృష్ణ రావు
కొత్త (కరోనా ) కథలు – కొన్ని చదివాను .. చాలా చదవాలి ..
పొలమారిన జ్ఞాపకాలు – వంశి  … కొన్ని చదివాను .. చాలా చదవాలి … కానీ అదే శైలి … కొత్తదనం లోపించింది .

This Article is dedicated two people from the film industry who loved me most  : Sri Ganesh Patro (death anniversary on 5 jan) and Sri Sirivennela garu …

You Might Also Like

3 Comments

  1. sri

    అవునండి .. నాకు సినిమా రంగం లో కొంచం ప్రవేశం ఉంది . అందువల్ల ఆ పుస్తకాలు మీద ఇంటరెస్ట్ ఎక్కువ . ఎవరి పిచ్చి వారికీ ఆనందం . వాళ్ళు కూడా కష్టపడకుండా పైకి రాలేదు కదా . ఈ సంవత్సరం కూడా ఇవే ఎక్కువ ఉన్నాయ్ అండి

  2. B.Ramnarayana

    Most of the english books read by you are related to cine field.

    1. సౌమ్య

      అయితే ఏమైందండీ? సినిమా పుస్తకాలు పుస్తకాలు కావా?

Leave a Reply