Lost Symbol: Dan Brown
వ్యాసం రాసిపంపినవారు: మలక్‍పేట రౌడీ
నేను ముందే చెప్పాను – ఏం చెప్పానంటే “ఇప్పటిదాకా ఒక్క బుక్ రివ్యూ కూడా వ్రాయలేదు, నాలాంటివాడి రివ్యూ ప్రచురిస్తే మీ సైటేమౌతుందో అని భయంగా ఉంది” అని –
“ఏమి ఫరవాలేదు – నీకెందుకూ? మేమున్నాం కదా!” అని సంపాదకురాళ్ళిద్దరూ భరోసా ఇచ్చారు. సరే! “కందకి లేని దురద కత్తిపీటకెందుకు? చదివేవాళ్ళుండాలేగాని ప్రపంచంలో కీబోర్డులన్నీ మనవే కదా!” అనుకుని దీనిని మీ అందరి మీదకి వదులుతున్నా. “దీనిని” అంటే – డెన్ బ్రౌన్ వ్రాసిన “లాస్ట్ సింబల్” నవల మీద రివ్యూ ని .. పుస్తకం కొన్న రోజు అట్లాంటాలో వరదలు! (ఆ రోజు అక్కడే ఉన్నా) చదవడం పూర్తి చేసిన రోజు ఆంధ్రాలో వరదలు!!
తనతో తనే పోటీ పడడం చాలా కష్టం. “అనుకున్నది ఒక్కటీ , అయినది ఒక్కటి బోల్తా కొట్టావులే చదువరి మామా!” అనేటట్టు సాగే డిజిటల్ ఫోర్ట్రెస్, డిసెప్షన్ పాయింట్, ఏంజెల్స్ & డీమన్స్, డావించి కోడ్ లాంటి రచనలతో సూపర్ రచయిత అయిన డెన్ బ్రౌన్ గత నెల అట్టహాసంగా విడుదలైన తన లాస్ట్ సింబల్ నవలని(విడుదలైన రెండోరోజు నేనెక్కిన ఫ్లైట్ లో కనీసం ఎనిమిది మంది చేతిలో ఈ పుస్తకం చూశా) తన మునుపటి నవలల స్థాయికి తీసుకెళ్ళే ప్రయత్నమైతే చేశారు. న్యూయార్క్ టైంస్, డెన్వర్ పోస్ట్, వాషింగ్టన్ పోస్ట్ బుక్ వరల్డ్, చికాగో ట్రిబ్యూన్ లాంటి పత్రికలు నవలని ఆకాశానికెత్తేశాయి.
ఇంకా చదవగలుగుతున్నారా? పడిపోలేదా?? అయితే నా రివ్యూ చదవగల ఓపిక, శక్తి మీకున్నట్టే – ఇక మొదలెడతా –
ఇక కధలోకొస్తే:
ఆరంభంలో మన చిరంజీవిలానో, బాలయ్యలనో హీరో గారు ఆకాశాన్ని, భూమిని చీల్చుకుని ప్రవేశించరు. చాలా సీధాసాదాగా ఒక పీడకల నేపధ్యంలో హీరో రాబర్ట్ లేంగ్డన్ గారి ఇంట్రో ఉంటుంది. లేంగ్డన్ తన మిత్రుడు పీటర్ సాల్మన్ ఆహ్వానం పై వాషింగ్డన్ డీసీ కేపిటల్ బిల్డింగులో ఉపన్యాసమివ్వడానికి వెళ్ళడంతో డ్రామా మొదలవుతుంది. తీరా అక్కడికి వెళ్ళాక ఆ ఆహ్వానం పంపించింది పీటర్ సాల్మన్ కాదనీ, మరెవరో అని తెలియడంతో కధ “బ్రౌన్” తరహా మలుపు తిరుగుతుంది. ఈ లోగా మలక్ (అవును నిజంగానే) అనే పాత్ర రంగప్రవేశం చేసి సంచలనాలు సృష్టిస్తూ ఉంటుంది. లేంగ్డన్కేమో అనుకోని కష్టాలు మొదలవుతాయి. సి.ఐ.ఏ. రంగ ప్రవేశం చేస్తుంది. పీటర్ సాల్మన్ చెల్లెలు కేథరీన్ ఒక సైంటిస్టుగా పాఠకులకి పరిచయమౌతుంది. ఈలోగా పీటర్ సాల్మన్ అంతర్ధానం, ఆయన “మేసన్” జీవితపు వివిధకోణాల వర్ణనలతో కధ రసకందాయంలో పడుతుంది.
దేనినైనా వర్ణించడంలో బ్రౌన్ కి బ్రౌనే సాటి. కధ మధ్యలో వర్ణనలని, ఫ్లేష్ బేక్ లని చాలా చక్కగా ఇరికిస్తారాయన. నాసా గురించి డిసెప్షన్ పాయింట్లో, కంప్యూటర్ సెక్యూరిటీ గురించి డిజిటల్ ఫోర్ట్రెస్ లో, వేటికన్ గురించి ఏంజెల్స్ & డీమన్స్ లో ఇంకా లాస్ట్ సప్పర్ తదితర విషయాల గురించి డావించీ కోడ్ లో ఆయన వర్ణన అమోఘం. ఈ నవలలో ఆయన కేపిటల్ బిల్డింగుని వర్ణిస్తారు. కానీ అక్కడక్కడ మరీ ఎక్కువ వర్ణించేశారేమో అనిపిస్తుంది. పేజీలకి పేజీలు వర్ణనలకి కేటాయించారు రచయిత. అంతేకాక మలక్ పాత్ర వర్ణన కూడా సాగదీయబడి, కాస్తంత విసుగు తెప్పిస్తుంది. – మొదటిసారి బ్రౌన్ నవల చదువుతున్నవారికి ఫరవాలేదు గానీ, మిగతావి చదివినవరికి చిరాకెయ్యడం ఖాయం. అయితే కధ మొదలయ్యే తీరు, తిరిగే మలుపులు పాఠకులని ముందుకి కదిలేలా చేస్తాయి. మధ్యమధ్యలో ఊపిరిబిగపట్టే క్షణాలు కూడా ఉంటాయి గానీ, మునుపటి నవలల అనుభూతి రాదు – బహుశ: అవి చదివిన వాళ్ళకి రచయిత శైలి అలవాటయిపోవడం వల్లనేమో. కొత్తదనం లోపించింది అన్న భావనకూడా అక్కడక్కడ కలుగుతుంది. పాఠకులు కధలో మునిగిపోవడానికి అవసరమైన మసాలా ఉన్నా, అమేరికనైజ్డ్ మసాలాలా ఘాటులేకుండా లేకుండా ఉంటుంది.
కధ మధ్యకొచ్చేసరికి మలక్ గారి విశ్వరూపం బయటపడుతుంది. కేపిటల్ బిల్డింగులో దేనికోసమో ఒక వైపు హీరోగారూ ఆయనతో కలిసి ఒక సీ ఐ యే మహిళా అధికారి, మరొక వైపునుండి మలక్ ప్రయత్నిస్తూ ఉంటారు. మన మలక్ గారు బ్లాగరులనే కాదు, సీ ఐ యే ని కూడ కాల్చుకు తింటారండోయ్. ఆ అధికారికి ఎందుకో మలక్ అంటే దడ. దీనిని సిణిమాగా తెలుగులో తీస్తే ఆ అధికారికి మలక్ గుర్తొచ్చినప్పుడల్లా
” అదిరేటి ట్రేప్ మీరేస్తే, దానికి ఝలక్కు నేనిస్తే,
దడ … మీకు దడ …
కేపిటల్ లోకి మీరొస్తే, మీ కళ్ళుగప్పి నే పోతే ..
దడ … మీకు దడ ..”
అనే పాట సరిగ్గా సరిపోతుంది :))
మలక్ అంటే సి.ఐ.ఏ కి ఎందుకంత భయమో అనేది సస్పెన్సులో ఒక భాగం. కానీ “మలక్ ని ఆపకపోతే దేశానికే ప్రమాదం” అనే సి.ఐ.ఏ అధికారి మాట కొంత ఆసక్తి కలిగిస్తుంది.
ఈ లోగా పీటర్ ని ఎత్తుకెళ్ళింది మలకే నని తెలుస్తుంది. అతన్ని వదిలిపెట్టడానికి కొన్ని షరతులు విధిస్తాడు. ఆ షరతులకి ఒప్పుకోవడలో హీరో కి, సి.ఐ.ఏ కి విభేదాలు తలెత్తుతాయ్, దానితో హీరో సి.ఐ.ఏ నుండి పారిపోతాడు. పారిపోతూ పారిపోతూ పీటర్ చెల్లెలు కేథరీన్ ని కలుస్తాడు. ఈ కేథరీన్ తన మీద దాడీచేసిన మలక్ ని తప్పించుకుని పారిపోయి వస్తుంది అప్పటికే. ఈ దశ లో వీరు చెయ్యాల్సిన పని, పీటర్ ని విడిపించడం, అతన్ని విడిపించాలంటే అప్పటిదాకా లభ్యమైన “క్లూ” లతో ఒక రహస్యాన్ని చేదించడం. దానికోసం వీరిద్దరూ పడే కష్టాల మధ్య కధ సాగుతుంది – ఒక వైపు శి ఐ ఏ, మరొకవైపు మలక్ వెంబడిస్తుండగా. అసలీ మలక్ గాడు ఎవడు, వీళ్ళని ఎందుకింత వేధిస్తున్నాడు, వీడంటే సీ.ఐ.ఏ కి ఎందుకు భయం అనే ప్రశ్నలు పాఠకులలో రేకెత్తించి వదిలేస్తారు రచయిత.
కధ మధ్యభాగం మాత్రం రచయిత అద్భుతంగా మలచారు. అనుకోని మలుపులు, ఊహించని సంఘటనలతో పేజీలు పరిగెడుతుంటాయ్. జరిగే సంఘటనలని చాలా తెలివితో “హై ఐ.క్యూ.” సన్నివేశాలుగా తీర్చిదిద్దినందుకు రచయితని మెచ్చుకోవాల్సిందే (అయితే కొన్ని హై ఐ.క్యూ. సన్నివేశాలు ఊహించగలిగినవిగానే ఉన్నాయి). కానీ రచయిత చేసిన చిన్న తప్పు జపాన్ నేపధ్యం గల పాత్రని సి ఐ ఏ అధికారిగా పెట్టడం. దానివల్ల ఆమె పాత్ర పాసిటివో నెగెటివో ఊహించడం పాఠకులకి సులువైపోతుంది, రాజకీయకారణాల వల్ల. హిందూ కుటుంబ నేపధ్యంలో తీసిన సినిమాలో ఒకే ఒక ముస్లిం పాత్ర ఉంటే ఆ పాత్ర విలన్ అయ్యే అవకాశం ఎంత శాతం ఉంటుందో ఊహించలేమా?
హీరో హీరోయిన్లు మలక్ చేతిలో చిక్కడం, మలక్ సీ ఐ ఏ ని బోల్తాకొట్టించడం, మలక్ తెలుసుకోవాలనుకుంటున్న అతి పెద్ద రహస్యం (“లాస్ట్ సింబల్“)తో ముగింపు మొదలవుతుంది. ఆ రహస్యం తెలియాలంటే హీరో దగ్గర ఉన క్లూలు అర్ధం చేసుకోవాలి అవేమో ఆయనగారికి తప్ప మరెవరికీ అర్ధంకావు (మధ్యలో హీరోయిన్ కూడ సహాయపడుతుంది అనుకోండి). ఆ రహస్యం మలక్ కి తెలుస్తుందా, హీరో చెప్తాడా, చైప్ప్నా మలక్ కి అర్ధమవుతుందా, అసలు ఈ మలక్ పాత కధ ఏమిటి అనే విషయాలు తెలుస్తాయ్. చివరకి ఆ రహస్యపు లాస్ట్ సింబల్ అనేది ఏమిటో పాఠకులకి తెలియడంతో కధ ముగుస్తుంది.
ఏదేదొ జరుగుతుందనే అంచనాల్లో ఉన్నవారికి ముగింపు చాలా పేలవంగా అనిపిస్తుంది. రచయిత పాఠకులని హిమాలయాల మీదకి తీసుకెళ్ళి ఒక్క సారి కింద పడేసినట్టు అనిపిస్తుంది. ఆఖరి 20-30 పేజీలు చాలా మందికి నచ్చకపోవచ్చు కూడా. అయితే పాఠకుల అంచనాలకి భిన్నంగా ముగింపు పెట్టాలన్నది రచయిత ఉద్దేశ్యం కావచ్చు (రాంగోపాల్ వర్మ లా). ఏవేవో ఊహల్లోకి తీసుకెళ్ళే కొన్ని సంఘటనలు ఏమీ కానట్టు తేలిపోతాయి. ఏమయ్యిందో అర్ధమయ్యేలోపు కధ అయిపోతుంది. “ఏదేదో ఊహించుకున్నామే, అప్పుడే అయిపోయిందా?” అనే భావన పాఠకులకి కలుగుతుంది. విభిన్నమైన ముగింపయినా ఇది డేన్ బ్రౌన్ తరహా ముగింపు అయితే కాదు.
పోతే, మత గ్రంధాలలో ఉండే సైన్సును అక్కడక్కడ స్పృశిస్తూ, వాటో మధ్య సంబంధాన్ని వర్ణించే పుటలు పాఠకులలో ఆసక్తి రేకెత్తించవచ్చు. (నాస్తిక వాదులు దీనిని చదివి ఏమంటారో మరి) – ఉపనిషత్తులని వాడుకున్నామన్న హైసెన్బర్గ్, ష్రోడింగర్ల ఒప్పుకోలును ఈ నవల ఉదహరిస్తుంది.
మొత్తానికి ఇది “ఫరవాలేదు” అనిపించే నవల. చదవని వాళ్ళు “అయ్యో చదవలేకపోయామే” అని అస్సలు బాధపడక్కరలేదు. బ్రౌన్ రచనా శైలి, తెలివైన సన్నివేశాలు, వివరణాత్మక వర్ణనలు, ఔకోని మలుపులు ఈ నవలకి తలమానికాలయితే, పేలవమైన ముగింపు, కొన్ని చోట్ల సాగదీయబడిన వర్ణనలు, ఊహించగలిగిన సన్నివేశాలు పాఠకులని నిరాశపరిచే అంశాలు.
ఈ నవలకి నా రేటింగ్ 3/5 (అయిదుకి మూడు మార్కులు)
prathi venkateswara rao
the best of dan brown is angels and demons.
no dispute
Malakpet Rowdy
hmmm … hope Pustakam editors aint mad us for converting this comment box into a chat window .. hehe
Lost mind
Lol yes. But you right in the sense that this book is a let down
Malakpet Rowdy
Well, you aint too far away from me. Round off 2.5 and you’ll end up with 3 :))
Lost mind
Just finished reading it. I would not give more than 2.5 for this
Malakpet Rowdy
There is one on filestube.com
Malakpet Rowdy
But I’ll try to get some info
Malakpet Rowdy
Not sure whether a kindle version is available yet.
prashant krishna
is it possible to download the book from any website..plzz provide links…
Malakpet Rowdy
Like Dhana and Hari, even my fav. novel is Angels & Demons.
హరి దోర్నాల
నిస్సందేహంగా ‘ఏంజెల్స్ అండ్ డెమొన్స్’ డాన్ బ్రౌన్ అత్యత్తమ నవల. అలవాటు ప్రకారం ఈ నవల కూడా చదువుదామనకున్నాను. సమీక్షను చుస్తే అవసరం లేదేమో అనిపిస్తుంది.
Dhanaraj Manmadha
Bro Malak,
Your review is more readable than the novel, I wonder how you were able to read it. He developed a technique, and used it effectively in the past novels. As per the suspense, and readability, A & D is the best of his, though way behind many great novels, DF is subtle, and exciting, raw. The dVC is a bit lucky, and became popular because of it’s controversy rather than it content. And his others are well behind the standards of good novels, then there is no question of greatness in his. Only popular. That’s all. Hell. What G says is right. He became another Teja. Hehehe
Dhanaraj Manmadha
మరీ అంత చెత్తైతే కాదు కానీ, ఏదో craper అనొచ్చు.
Lost mind
You don’t need to be so diplomatic Ma’lakh, but that is a nice way of saying that it is a crap
Lost mind
It should have been named The lost mind
కన్నగాడు
“(అయితే కొన్ని హై ఐ.క్యూ. సన్నివేశాలు ఊహించగలిగినవిగానే ఉన్నాయి)”, నాకొక్కడికే అనుకున్నా దాదాపు అన్ని సన్నివేశాలు ఓ రెండు పేజీలముందే ఊహించే విధంగా ఉన్నాయి.
RK
Interesting!
Indian Minerva
అకటా…! దేవదాసు నవల్లో సైతమూ కామెడీ యుండునా!!? 🙂
ఏదిఏమైననూ..,మరొక్కమారు మేము బ్రౌను దొరగారిని ఆదరించి (అం)తరించెదము.
Malakpet Rowdy
“Last Brown” – LOL Geetachaarya
గీతాచార్య
The lost symbol బదులు The last Brown అని పెట్టాల్సింది. మళ్ళా ఇలాగే వ్రాస్తే ఇదే చివరాఖరి నవలౌతుంది. దీన్ని చదివేకన్నా శరత్ దేవదాసు నయం. కాస్త కామెడి అన్నా ఉంటుంది. 😉 అసలీ నవలే పెద్ద కామెడీ. విసిగించేశాడు.
గీతాచార్య
అయితే Malak the Mayhem అన్నమాట! 😉
దాణా బ్రౌను, Dirty ANalysis Brown అని మా ఫ్రెండ్స్ ఎంత మొత్తుకున్నా ఆ సస్పెన్స్ తోనే చదివించే తీరు మాత్రం ముచ్చటగొల్పుతుంది.
ఇంతకు ముందు నవలకి రెండేళ్ళ మించి గ్యాప్ తీసుకోలేదు. ఈసారి ఎక్కువ గ్యాప్ తీసుకుని గురుడు ముంచేశాడు. నా రేటింగ్… 2.5.
ఎంత సస్పెన్సైనా వేరే నవళ్ళాలో కూడా ఉంటుంది కదా! పైగా శైలి మరీ ఒకేలా తయారయి పోయింది. తేజ లవ్ స్టోరీల్లా.