తెలుగు వారి ఆత్మకథలు లేదా స్వీయ చరిత్రల జాబితా

వ్యాసకర్త: అనిల్ బత్తుల

జాబితా తయారుచేసినది: అనిల్ బత్తుల, 9676365115 [ April 2021]
ఈ జాబితా తయారుచేయటంలో సహకరించిన మిత్రులు: జంపాల చౌదరి, జి.యస్.చలం మరియు ఇతర ఫేస్ బుక్ మిత్రులు.

జీవిత చరిత్రలు, అనువాద ఆత్మకథలు ఈ జాబితాలో చేర్చటం లేదు. ఇది సంగ్రం కాదు, నాకు గుర్తున్నవీ, మిత్రులు సూచించినవి ఇందులో చేరాయి. కొన్ని మిస్ అయి వుండొచ్చు. స్టార్[*] గుర్తు వున్నవి మార్కట్ లో ప్రస్తుతం కొనటానికి దొరకవు. భవిష్యత్తులో రీప్రింట్ అవుతాయో కావో తెలియదు. అవి చదవాలని ఆసక్తి వుంటే గ్రంధాలయాల్లో లేదా పాత పుస్తకాల షాపుల్లో ప్రయత్నించండి. వరస సంఖ్యకు ప్రాముఖ్యం లేదు.

PDF download:

  1. కళాప్రపూర్ణ దువ్వూరి వెంకటరమణ శాస్త్రి స్వీయ చరిత్ర
  2. హంపీ నుండి హరప్పా దాకా – తిరుమల రామచంద్ర
  3. *నా స్మృతిపథంలో..సాగుతున్న యాత్ర – ఆచంట జానకిరాం
  4. చలం ఆత్మకథ
  5. నా ఎరుక – ఆదిభట్ల నారాయణదాసు
  6. మా బడి – తెన్నేటి కోదండరామయ్య
  7. నా చిన్ననాటి ముచ్చట్లు – డా.కె.యెన్.కేసరి
  8. *మారుతున్న సమాజం, నా జ్ఞాపకాలు – మామిడిపూడి వెంకట రంగయ్య
  9. *నా జీవితయాత్ర[3 భాగాలు] – టంగుటూరి ప్రకాశం
  10. *నా స్నేహితులు – మణిమానిక్యం నరసింహా రావు
  11. అనుభవాలూ జ్ఞాపకాలూనూ – శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి
  12. నేనూ నా దేశం – దరిసి చెంచయ్య
  13. *శతపత్రము – గడియారం రామకృష్ణ శర్మ
  14. జీవన యానం గడచిన గుర్తులు – డా. దాశరధి రంగాచార్య
  15. యాత్రాస్మృతి – దాశరధి కృష్ణమాచార్య
  16. చిలకమర్తి లక్ష్మీనర సింహం స్వీయచరిత్రము
  17. పింజారి – షేక్ నాజర్ ఆత్మకథ
  18. ఇంటిపేరు ఇంద్రగంటి – శ్రీకాంతశర్మ ఆత్మకథ
  19. కందుకూరి వీరేశలింగం స్వీయచరిత్ర
  20. ఇదీ నా గొడవ – కాళోజీ ఆత్మకథ
  21. విప్లవ పథం లో నా పయనం[2 భాగాలు] – పుచ్చలపల్లి సుందరయ్య
  22. నా గొంతే తుపాకీ పాట – మల్లు స్వరాజ్యం ఆత్మ కథ
  23. నిర్జన వారధి – కొండపల్లి కోటేశ్వరమ్మ
  24. నెమరేసిన మెమొరీస్ – ముళ్లపూడి శ్రీదేవి
  25. నా అంతరంగ కథనం – బుచ్చిబాబు
  26. సాలగ్రామం – డా. కపిలవాయి లింగమూర్తి
  27. అధ్యాపకుడి ఆత్మకథ – డా. కండ్లకుంట అళహ సింగరాచార్యులు
  28. జీవన వాహిని స్వీయ జీవిత సమీక్ష – అక్కిరాజు రమాపతిరావు
  29. ఓ అనాత్మవాది ఆత్మకథ – అన్నపరెడ్డి బుధ్ధఘోషుడు
  30. *గమనాగమనం, గమ్యం దిశగా గమనం[2 భాగాలు] – ఆలూరి భుజంగరావు
  31. *యాది – సామల సదాశివ
  32. *కలాలు కన్నీళ్లు, పూలు ముళ్ళు[2 భాగాలు] – డా. అవంత్స సోమసుందర్
  33. *నామిని నంబర్ ఒన్ పుడింగి
  34. *బాలి చిత్రమైన జీవితం
  35. *సొంత కథ – రాంబట్ల కృష్ణమూర్తి
  36. కొండ వెంకటప్పయ్య స్వీయ చరిత్ర
  37. *తుమ్మపూడి – సంజీవ దేవ్ స్వీయచరిత్ర
  38. కోతి కొమ్మచ్చి, ఇంకోతి కొమ్మచ్చి, మొక్కోతి కొమ్మచ్చి[3 భాగాలు] – ముళ్ళపూడి వెంకట రమణ
  39. *ఆ రామ గోపాలం – భమిడిపాటి రామ గోపాలం
  40. నవ్విపోదురుగాక – కాట్రగడ్ద మురారి
  41. *అమ్మకడుపు చల్లగా – గొల్లపూడి మారుతీరావు ఆత్మకథ
  42. *అనగనగా ఒక రాకుమారుడు – కాంతారావు స్వీయచరిత్ర
  43. *ఇదీ నా కథ – మల్లెమాల
  44. *నాలో నేను – డా. భానుమతీ రామకృష్ణ
  45. ముసురు – ముదిగంటి సుజాతారెడ్డి
  46. *నాగావళి నుంచి మంజీర వరకు – రావి కొండలరావు
  47. *ఆత్మకథ – విశ్వనాధ సత్యనారాయణ
  48. *ఆత్మచరిత్రము – రాయసము వెంకట శివుడు
  49. * జ్ఞాపకాలు వ్యాపకాలు – పైడి లక్ష్మయ్య
  50. *స్వీయ జీవిత సమీక్ష – కామరాజు హనుమంతరావు
  51. అనంతం – శ్రీశ్రీ
  52. మా జ్ఞాపకాలు – శివరాజు సుబ్బలక్ష్మి
  53. వెలుగు దారులలో – నంబూరి పరిపూర్ణ స్వీయచరిత్ర
  54. *కనకపుష్యరాగం – పాణకా కనకమ్మ స్వీయచరిత్ర
  55. బతుకుబాటలో కొండగుర్తులు – భద్రిరాజు కృష్ణమూర్తి ఆత్మకథ
  56. బతుకు పుస్తకం – డా. వుప్పల లక్ష్మణరావు
  57. *నేనూ నా జీవితం – అక్కినేని నాగేశ్వరరావు
  58. నాన్న నేను – బుజ్జాయి
  59. *బీదబ్రతుకు – యలమంచిలి వెంకటప్పయ్య
  60. *నా జీవనపథంలో – రావినారాయణ రెడ్ది స్వీయచరిత్ర
  61. *జననీ జన్మభూమిశ్చ -గోపరాజు సీతాదేవి స్వీయచరిత్ర
  62. *స్వీయ చరిత్ర – డా. బెజవాడ గోపాలరెడ్డి
  63. చదువు తీర్చిన జీవితం – కాళ్ళకూరి శేషమ్మ
  64. ఇదండీ నా కథ – ఎ.జీ.కృష్ణమూర్తి
  65. నవ్యాంధ్రము నా జీవితకథ – అయ్యదేవర కాళేశ్వరరావు
  66. నా జీవన నౌక – గొట్టిపాటి బ్రహ్మయ్య
  67. అరవై వసంతాల నా రాజకీయ ప్రస్థానం – చేగొండి వెంకట హర రామ జోగయ్య
  68. కల నిజమైతే – కళ్లం అంజిరెడ్డి
  69. ఐనా నేను ఓడిపోలేదు – జ్యోతిరెడ్డి
  70. *శ్రీశ్రీ సంసార ప్రస్థానం[3 భాగాలు] – సరోజా శ్రీశ్రీ
  71. నా ఇష్టం – రాం గోపాల్ వర్మ
  72. బీనాదేవీయం – బీనాదేవి
  73. ఒదిగిన కాలం – డా. నోరి దత్తాత్రేయుడు
  74. నేనూ శాంత కూడా – చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ
  75. విధి నా సారధి – పొత్తూరి వెంకటేశ్వరరావు
  76. అసమాన అనసూయ – డా. అవసరాల అనసూయాదేవి
  77. ఉత్సాహమే ఊపిరిగా – డా.ముక్కామల అప్పారావు
  78. *తీపి గురుతులు చేదు జ్ఞాపకాలు – గుమ్మడి వేంకటేశ్వరరావు
  79. నా జ్ఞాపకాలు – యాగా వేనుగోపాల్ రెడ్డి
  80. పదండి ముందుకు – విజ్ఞాన్ రత్తయ్య జీవన కెరటాలు
  81. గోరాతో నా జీవితం – సరస్వతీ గోరా
  82. *పాతివ్రత్యం నుంచి ఫెమినిజం దాకా- మల్లాది సుబ్బమ్మ
  83. గ్లాచ్యు మిచ్యూ – జయదేవ్
  84. *బతుకు మాట- కుందుర్తి
  85. *పడుగు పేకల మధ్య జీవితం – శీలా వీర్రాజు
  86. నా పొగరు మిమ్మల్ని గాయపరిచిందా? అయితే సంతోషం – యం.యఫ్.గోపీనాథ్
  87. రాళ్ళు రప్పలు- తాపీ ధర్మారావు
  88. తెలంగాణా సాయుధ పోరాటం నా అనుభవాలు – నల్లా నరసింహులు
  89. *మనస్సాక్షి – గజ్జెల మల్లారెడ్డి
  90. *జమునా తీరం – జమున స్వీయ చరిత్ర
  91. *ప్రజ్ఞా ప్రభాకరము – వేటూరి ప్రభాకర శాస్త్రి ఆత్మకథ
  92. *సాహిత్యమే శ్వాసగా – డా. ద్వా.నా.శాస్త్రి
  93. *స్వేచ్చా భారతం – భాట్టం శ్రీరామమూర్తి స్వీయ చరిత్ర
  94. బతుకు వెతుకులాట – సడ్లపల్లె చిదంబర రెడ్డి
  95. వసంతం నుండి శిసిరం దాకా – డా.యు.ఎ.నరసిం హ మూర్తి
  96. *అనుభవాలూ జ్ఞాపకాలూ – జోళదరాశి కె.దొడ్డనగౌడ
  97. *శ్రీ కృష్ణ స్వీయ చరిత్రము – శ్రీపాద కృష్ణమూర్తి
  98. *స్వీయ చరిత్ర – కొండా వెంకటరంగారెడ్డి
  99. ఫ్లాష్ బ్యాక్ – ఐ.వెంకట్రావ్
  100. *నా జీవిత స్మృతులు – ఠాగూర్
  101. అప్పుడు ఇప్పుడు – జి.కృష్ణ
  102. మా కుటుంబం – కవన శర్మ
  103. విధ్యార్థి జీవితం జ్ఞాపకాలు – కోదాటి
  104. ప్రజాసేవలో అనుభవాలు – ఎ.కె.గోపాలన్
  105. *అనగనగా ఒక చిత్రకారుడు – అన్వర్
  106. సినిమా పోస్టర్ – ఈశ్వర్
  107. గురవాయణం – డాక్టర్ గురవారెడ్డి
  108. నాన్నతో నేను – విశ్వం
  109. *స్వీయ చరిత్ర – సత్తిరాజు సీతారామయ్య
  110. *జీవిత చరిత్రము – ధూపాటి వెంకటరమణాచార్యులు
  111. *స్వాతంత్ర సమరయోధుని జీవిత సంఘర్షణలు – గుంటూరు కేసరి నడింపల్లి ఆత్మకథ
  112. *నట స్థానం -స్థానం
  113. *మిత్రులూ నేనూ – గొర్రెపాటి వెంకట సుబ్బయ్య
  114. *ఆత్మచరితము – ఏడిదము సత్యవతి
  115. నా జ్ఞాపకాలు క్షేత్ర పరిశొధనలో అనుభవాలు – వకుళాభరణం లలిత
  116. నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు – శారదా శ్రీనివాసన్
  117. *ఛాయా చిత్ర కథనం – అబ్బూరి ఛాయాదేవి
  118. *జీవితమే నవీనం – వెనిగళ్ళ కోమల
  119. అదృష్టవంతుని ఆత్మకథ – డి.వి.సరసరాజు స్వీయ చరిత్ర
  120. *స్వీయ చరిత్ర – వి.నాగయ్య
  121. *నా జ్ఞాపకాలు – నాగళ్ళ రాజేశ్వరమ్మ
  122. *స్మృతులు – దుర్బా కృష్ణమూర్తి
  123. అనుభవాలు జ్ఞాపకాలు – లావు బాలగంగాధరరావు
  124. ఉద్యమమే ఉపిరిగా – చల్లపల్లి శ్రీనివాసరావు
  125. *విప్లవపథంలో నేను నా కలం – తిరునగరి రామాంజనేయులు
  126. ధర్మబిక్షం మాట ముచ్చట
  127. కలగన్నది కనుగొన్నది[2 భాగాలు]- చెరుకూరి సత్యనారాయణ జ్ఞాపకాలు
  128. *అనుభవాలు జ్ఞాపకాలు – మువ్వల పెరుమాళ్ళు
  129. *నా జీవిత ప్రస్థానం – నాదెండ్ల భాస్కరరావు
  130. *నా జీవిత కథ – జలగం వెంగళరావు
  131. *గతం స్వగతం[2 భాగాలు] – పర్వతనేని ఉపేంధ్ర
  132. * రజనీ ఆత్మకథా విభావరి
  133. *పులుల బోను నేను – ఆచార్య కొలకలూరి ఇనాక్
  134. *అక్షరాన్వేషణ[2 భాగాలు] – ఫోలవరపు కోటేశ్వరరావు
  135. రిజర్వు బాంకు రాతిగోడల వెనకాల – దువ్వూరి సుబ్బారావు
  136. *రామయ్య జ్ఞాపకాలు – చుక్కా రామయ్య
  137. *జ్ఞాపకాలం – కంటమనేనిరవీంద్రరావు
  138. *ఏడుపదులు – ఎం.వి.రామమూర్తి
  139. *విన్నంత కన్నంత – బూదరాజు రాధాకృష్ణ
  140. విమర్శ పరామర్శ, ఓ జర్నలిస్టు ఐదు దశాబ్ధాల అనుభవాలు – వి.హనుమంతరావు
  141. ఆకాశవాణిలో నా అనుభవాలు – డి.వెంకటరామయ్య
  142. *77 ఏళ్ల నాటకానుభవం – రావి వెంకటచెలం
  143. *ప్రసన్నకవి సుందరాచారి నేను – వై.కె.వి.యన్.ఆచార్య
  144. పోలీసు సాక్షిగా – రావులపాటి సీతారాం రావు
  145. * అమెరికాలో అబ్ధుల్ ఖాదర్ అంతరంగ కథనం అను ఆత్మకథాత్మక యథాత్మకరచన
  146. *నా జీవిత చరిత్ర – విన్నకోట వెంకటేశ్వరరావు
  147. నేలా నింగీ నేనూ – డా.ప్రయోగ మురళీ మోహన కృష్ణ
  148. *మా తరాలు – బాబూ రాజేంద్రప్రసాద్, భారతీదేవి
  149. మాదిరాజు రామకోటేశ్వరమ్మ స్వీయచరిత్ర
  150. ఇది నా జీవితం, మృత్యోర్మా అమృతంగమయ – హేమలతాలవణం

You Might Also Like

6 Comments

  1. Madhu

    Good effort. If any other autobiographies left out can be added.

  2. leol

    ధన్యవాదాలు అనిల్ గారు! మీ అనువాదాల చిట్టా కూడా పుస్తకంలో పంచుకోండి. కొనటానికి దొరకని పుస్తకాల హక్కులు ఎవరి వద్ద ఉన్నాయో. ఏదైనా Crowd Funding సైటు ద్వారా అవసరమైనన్ని కాపీల వరకు ప్రచురించినా ఎంత బాగుంటుంది. నా వరకు ఈ పుస్తకాల కోసం ఎప్పటి నుండో వెతుకుతున్నాను –

    శతపత్రము – గడియారం రామకృష్ణ శర్మ
    యాది – సామల సదాశివ
    తుమ్మపూడి – సంజీవ దేవ్ స్వీయచరిత్ర
    అనగనగా ఒక రాకుమారుడు – కాంతారావు స్వీయచరిత్ర
    ఆత్మకథ – విశ్వనాధ సత్యనారాయణ
    తీపి గురుతులు చేదు జ్ఞాపకాలు – గుమ్మడి వేంకటేశ్వరరావు
    ప్రజ్ఞా ప్రభాకరము – వేటూరి ప్రభాకర శాస్త్రి ఆత్మకథ
    సాహిత్యమే శ్వాసగా – డా. ద్వా.నా.శాస్త్రి
    ఛాయా చిత్ర కథనం – అబ్బూరి ఛాయాదేవి
    స్వీయ చరిత్ర – వి.నాగయ్య
    పులుల బోను నేను – ఆచార్య కొలకలూరి ఇనాక్
    విన్నంత కన్నంత – బూదరాజు రాధాకృష్ణ

  3. Srikar

    అనిల్ గారు, Many Thanks అండీ.

  4. srinivasa rao .v

    ఆత్మ కథలు అంటే నాకిష్టం. ఒక మనిషి జీవితాన్ని,జీవిత కాలం అనుభవాలనీ అవి మనకు పంచుతాయి.అవి చదవడం, స్వంతం చేసికోవడం ఒక చక్కని అనుభూతి. శ్రీపాద వారి ‘ అనుభవాలూ-జ్ఞాపకాలూ’,విశ్వం గారి ‘నేనూ-నాన్నా అలాగే బుజ్జాయి గారి నాన్న నేనూ పుస్తకం,కాంతారావు గారి ‘ అనగనగా ఒక రాకుమారుడు ఐతే చెప్పనే అక్కర్లేదు. హంపీ నుండి హరప్పా దాక-రామచంద్ర గారు ఎన్ని విశేషాలు పంచుతారో. రావికొండలరావు గారి ‘ నాగవళి నుంచి మంజీరా నిండా ఎన్ని వ్యక్తిత్వ వికాస పాఠాలో, నాగయ్య గారి స్వీయ చరిత్ర -పెద్ద ఆర్ధిక పాఠమే.
    ఇంకా ఇలాంటివి ఇన్ని వున్నయి అని తెలిసింది మీ కృషి ద్వారా.
    ధన్యవాదాలు అనిల్ గారు. ఈ లిస్ట్ ప్రింట్ ఎప్పుడూ ప్రక్కనే వుంచుకొంటాను, ఏ విజయవాడో ,హైదరాబాదో వెళ్లినపుడు చక్కగా ఉపయోగిస్తుంది.
    శ్రీనివాసరావు.వి

  5. బాపూజీ కానూరు

    మంచి సేకరణ. తెలుగు వచ్చిన ఆత్మకధలపై పరిశోధన జరగాలి.
    ఏదైనా విశ్వవిద్యాలయం ఇందుకు నడుం కట్టాలి. అనిల్ బత్తుల గారు ఎంతో శ్రమతో సేకరించిన ఈ జాబితా పరిశోధక విద్యార్థులకు ఎంతో ఉపకరిస్తుంది.

  6. తాడిగడప శ్యామలరావు

    ఈ‌క్రింది ఆత్మకథల పుస్తకాలు archive.org లో లభిస్తున్నాయి.
    1. ఆత్మకథ: వేలూరి శివరామశాస్త్రి
    2. రంగస్థలి అనుభవాల తోరణాలు – తుర్లపాటి రాధాకృష్ణమూర్తి
    3. సి.వి.కె.రావ్ ఆత్మకథ: సి.వి.కె. రావ్‌

Leave a Reply