2020లో నేను చదివిన పుస్తకాలు: వి.శ్రీనివాసరావు
వ్యాసకర్త: వి.శ్రీనివాసరావు,ఖమ్మం
- డయ్యింగ్ టు బి మి బై అనితా మూర్జాని (Dying to be me: Anita Murjani): కేన్సర్ కు గురై, చావును చవిచూసి,తిరిగి భూమ్మీదకు వచ్చి ఆరోగ్యవంతురాలైన అనితా మూర్జాని స్వీయ అనుభవాల మాలిక.
- వాట్ ఇఫ్ దిస్ ఈజ్ హెవెన్:అనితా మూర్జాని: సాధారణంగా సమాజంలో అనుకునేది ఏమిటి?అపోహలు ఏ విధంగా ,నిజం ఏమిటి అన్న విషయాలను తన నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ను ప్రాతిపదికగా చెబుతూ జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించడం ఎలానో మూర్జానీ మనకు వివరిస్తారు.
- “శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర” -ముదిగొండ వీరభద్రయ్య : భగవాన్ శ్రీ రమణ మహర్షి స్వయంగా చెప్పిన విషయాలతో కూర్చిన జీవిత చరిత్ర.చాలా ఆసక్తి దాయకంగా ఉంది.
- ఆనంద అల -ఆశించు సాధించు -సద్గురు జగ్గీ వాసుదేవ్: జీవితాన్ని ఎలా ఆహ్లాదంగా మార్చుకోవాలో ,సమస్యలతో ఎలా వ్యవహరించాలో సద్గురు జగ్గీ వాసుదెవ్ గారి చిట్కాలూ ,పరిష్కారాలూ .
- సూపర్ 30 విజనరీస్-సునీల్ ధవళ : 30 మంది వ్యాపార విజేతల నిజ జీవితాల సమాహరం.ప్రేరణాత్మకంగా ఉంది.
- స్వరలహరి-పి.బి.శ్రీనివాస్: సంగీత దర్శకులపై వ్యాసమాలిక .
- వందే వాల్మీకి కోకిలం-ఉప్పులూరి కామేశ్వరరావు:నేటి ఆలోచనతో ,నాటి రామయణాన్ని ,వాల్మీకి విశిష్టతనూ, ధర్మ సమన్వయం గావిస్తారు.
- శ్రీరామదూతం శిరసా నమామి- ఉప్పులూరి కామేశ్వరరావు :హనుమంతుడి పాత్ర ద్వారా వ్యక్తిత్వ వికాసం ఎలా అన్నది తెలియ పరచారు.
- సుందరాకాండము-ఉప్పులూరి కామేశ్వరరావు: ఫిజిక్స్ పరంగా హనుమంతుని సముద్ర లంఘనాన్ని చాలా బాగా విశ్లేషించి తెలియపరచారు. సరళానువాదం చదివించేలా ఉంది.
- మనస్సుని జయించండి -ఏకనాథ్ ఈశ్వరన్: తన స్వీయ అనుభవం నుండి, వివిధ మార్గాలను సూచించారు.
- ఓ వయోలిన్ కథ-డా.కప్పగంతు రామకృష్ణ : డా.అన్నవరపు రామస్వామి గారి జీవిత చరిత్ర .
- మధుమేహం-సమదర్శిని: డా.జాసన్ ఫంగ్ వ్రాసిన ‘ ద్ డయాబెటిక్ కోడ్ ‘ కు అనువాదం ,చదువరికి చాలా ఉపయోగంగా,ఇందులో చెప్పిన విషయాలు పరిశీలిస్తే ,దయాబెటిస్ తప్పక కంట్రోల్ అయ్యే మూలం అర్ధం అవుతుంది.
- న్యూరోకేర్- డా.ముదిరెడ్డి చంద్రశేఖరరెడ్డి : న్యూరో సమస్యలూ ,ప్రాధమిక అవగాహనా,సూచనలు తమదైన అనుభవం నుండి వివరించారు. ప్రతి ఒక్కరి వద్దా ఉండాల్సిన పుస్తకం.
- రివర్సింగ్ డయాబెటిస్ ఇన్ 21 డేస్ -డా.నందితాషా : ఇందులో చెప్పిన విధంగా టీ,పాలు,పాల పదార్ధాలు,పెరుగు ఆపివేయగా ,నా షుగర్ ఫాస్టింగ్ 258 నుండి 180కి 16 రొజులలో వచ్చింది. ప్రతీ షుగర్ పేషంటూ చదివి, ఆచరించి, బాగా మెరుగు పడే అవకాశం ఉంది.
- శ్రీ స్కంద రత్నావళి -డా.మహాభాష్యం చిత్తరంజన్ : స్వయంగా శ్రీ సుబ్రహ్మణ్యులే అనుగ్రహించగా పెల్లుబికిన “నేను ‘ తత్వం,మరి ఇతర భక్తి పూర్వక కీర్తనలు.
- ఇకిగాయ్ : ఆనందమయమైన చిరాయుస్షుకు జపనీయుల రహస్యం -తెలుగు అనువాద పుస్తకం -సరళంగా వుంది. వెల ఎక్కువగా అనిపించింది.
కొనడం జరిగింది చదవాల్సి వుంది ఈ క్రింది పుస్తకాలు:
- వైద్య జ్యోతిష్యం -రూపెనగుంట్ల సత్యనారాయణ శర్మ
- ట్రాంక్విలిటీ ఇన్ టర్మాయిల్ – శ్రీరాం సర్
- నిత్య జీవితంలో భౌతిక శాస్త్రం :కె.బి.గోపాలం గారి అనువాద పుస్తకం
- ద హార్ట్ ఫుల్ నెస్ వే -కమలేష్ డి పటేల్
- డిజైనింగ్ డెస్టినీ – కమలేష్ డి పటేల్
- ద హిమాలయన్ మాస్టర్స్ – పండిట్ రాజ్మణి త్రిగుణాయత్
- శ్రీసుబ్రహ్మణ్యతత్వం -డా.మహాభాష్యం చిత్తరంజన్
- పదవులతో ప్రమేయం లేని నాయకుడు :రాబిన్ శర్మ అనువాద పుస్తకం.
కోవిడ్ వల్ల పుస్తక పఠనం పెరిగింది. నెట్ కి మరింత అంకితం అవ్వడం జరిగింది. పుస్తక పఠనం నాకు మంచి విషయాలను నేర్పింది.
Leave a Reply