2020 పుస్తకాలు: శ్యామ్ గ్రంధి

వ్యాసకర్త: శ్యామ్ గ్రంధి

NR Nandi థ్రిల్లర్ నావెల్స్ చదివాను. ఒక మంచి రైటర్ ఎవరంటే బుక్ అయిపోయిన తర్వాత కూడా అతని రచన మనల్ని haunt చేస్తది.

ద్రిష్టి, డిసెంబర్ 1,99,999, మరో మొహెంజదారో లాంటి గొప్ప రచనలు చేసి జనాలకి ఒక thrill తో పాటు మంచి eye opener లాంటి subjects తో page turners రాయడంలో ఇతను దిట్ట.

And ఇంకో specialty ఏంటంటే abrupt endings(కొన్ని నొవెల్స్ లో) అలా వదిలేస్తారు చాలా చిరాకు వస్తది అలాంటప్పుడు గొప్ప రైటర్ కాబట్టే చిరాకుని కూడా భరించగలం

————————————————–
అంతఃర్ముఖం- యండమూరి వీరేంద్రనాథ్
ఒక ట్రాజెడీ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళారు. కొద్దిగా రైటింగ్ పరంగా మధ్యలో average అనిపించినా చివరికి వచ్చేసరికి మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తది కథలోని subject.

————————————————–
నా ఇష్టం-RGV
వోడ్కా విత్ వర్మ- Sira sri

ఎదుటి వ్యక్తి జీవితం లో తొంగి చూడ్డం మనకి అలవాటే. అందులోను RGV గారు మంచి వుంది చెడు వుంది. ఏది దాచుకోకుండా చూపించారు. నీకు ఏది కావాలో అదే choose చేస్కో అనే సిద్ధాంతం బుక్ మొత్తం వినిపిస్తది. ఒక interesting read!

———————————————-

మా దిగువ గోదావరి కథలు, పోలమరిన జ్ఞాపకాలు(FB) – Vamsi 

వంశి గారి రచన ఒక స్పర్శ! ఇంతకంటే ఎం చెప్పగలం!

————————————————————

చలం కథలు

ఒక different style రైటింగ్ తో అందరి హృదయాలను తాకుతారు చలం. మన అందరికి లోపల వుండే ఫీలింగ్స్ కాని వ్యవ్యక్త పరచలేం. చలం గారు ఒక్కరే ధైర్యంగా చెప్పగలరు. అలాంటి రైటర్ ఆ కలం లో ఇలాంటి బోల్డ్ subjects రాసి survive అయ్యారంటే నిజంగా hatsoff తప్పనిసరిగా చదవాల్సిన కథలు!

——————————————–

త్రిపుర కథలు

ఇలా కూడా కథలు రాస్తారా అనిపించే రైటర్ ఒక abstract గా, వెరైటీ subjects తో రాసే కథకుడు, చదువుతున్నంత సేపు ఒక నది ప్రవాహం లో కొట్టుకుపోతున్నాం అనే ఫీలింగ్  త్రిపుర లో సెటిల్ అయిన మన తెలుగు ని మర్చిపోకుండా, అక్కడ తాలూకు మనుషులు ని స్ఫూర్తి తీసుకొని ఒక ఫ్యూషన్ style రైటింగ్ మనల్ని కచ్చితంగా నచ్చుతుంది.

——————————————-

R.S Sudarshanam short stories

ఈ పుస్తకం నేను 2019 లో చదివిన, పైన చదివిన మంచి పుస్తకాల కి పునాది వేసింది ఈ బుక్ చాలా డెప్త్ వుండే కథలు రాయడం మాములు విషయం కాదు. 

ప్రతి పాత్రని ఎంతో హృద్యంగా తీర్చిదిద్దారు, అన్ని కథలు లో మనిషి సైకాలజీ ని ఇతివృత్తంగా తీసుకొంటారు. నా లాంటి ఒక beginner కి మొదటి పుస్తకమే ఇంత మంచిది దొరకడం అదృష్టం

Happy learning and Happy reading and read at your own pace!

You Might Also Like

Leave a Reply