’కవిత్వం ప్రచురణలు’ని స్మరించుకుందాం

వ్యాసకర్త – అనిల్ బత్తుల

1990 ఏప్రియల్ నుండి 1995 వరకు అయిదేళ్లు, పద్నాలుగు పుస్తకాలు. ఆధునిక తెలుగు కవిత్వంలోని భిన్నధోరణులను. ఇతర భాషా అనువాదాలను మన పాఠకులకు పరిచయం చేయటం కోసం ‘ కవిత్వం ప్రచురణలు ‘ ప్రారంభించారు. 1990 ఏప్రిల్ నుండి 1991 మార్చి వరకు వరసగా నెలకు ఒకటి చొప్పున 12 పుస్తకాలు ప్రచురించారు. తరువాతి రెండు పుస్తకాలు వీలు వెంబడి ప్రచురించారు.
త్రిపురనేని శ్రీనివాస్ సృష్టించిన ‘కవిత్వం ప్రచురణలు’ అపూర్వ సంచలనం. ‘కవిత్వం ప్రచురణలు ‘ పుస్తకాలు వైవిధ్యంగా వుండేవి. వినూత్న కవిత్వం, వైవిధ్యమైన పుస్తకాల సైజు, చక్కటి లే అవుట్ . ఒక పుస్తకానికి మరొక పుస్తకానికి సంబంధం లేకుండా భలే వుండేవి. తెలుగులో పుస్తకాల సైజ్ అండ్ లేఅవుట్ లో మొనాటమీని బ్రేక్ చేసాడు. ఆ పుస్తకాలు చూడగానే ఇతను భవిష్యత్తు లోకి తొంగిచూస్తున్న కవి, పబ్లిషర్ అనిపిస్తుంది. మరలా తెలుగులో అటువంటి వైవిధ్య పుస్తకాల విప్లవం వస్తుందేమో చూడాలి.


‘కవిత్వం ప్రచురణలు’ పుస్తకాల జాబితా:

  1. క్రితం తర్వాత… ఆరుగురు యువ కవుల సంయుక్త కవిత (ఏప్రియల్, 1990)
  2. యెక్కడైనా యిక్కడే… ప్రీతిష్‌నంది కవిత్వానువాదం, త్రిపురనేని శ్రీనివాస్‌ (మే 1990)
  3. 19 కవితలు… గాలి నాసరరెడ్డి (జూన్, 1990)
  4. ఒఖడే… స్మైల్‌ (జులై, 1990)
  5. బతికిన క్షణాలు… వేగుంట మోహనప్రసాద్‌ (ఆగస్ట్, 1990)
  6. ఇక ఈ క్షణం… నీలిమా గోపీచంద్‌ (సెప్టెంబర్, 1990)
  7. ఫోర్త్‌ పర్సన్‌ సింగులర్‌… గుడిహాళం రఘునాథం (అక్టోబర్, 1990)
  8. బాధలూ- సందర్భాలూ… త్రిపుర (నవంబర్, 1990)
  9. గురిచూసి పాడే పాట…స్త్రీ వాద కవితలు (డిసెంబర్ 1990)
  10. ఎన్నెలో ఎన్నెలో… రావిశాస్త్రి కవిత్వం (జనవరి, 1991)
  11. పుట్టుమచ్చ… ఖాదర్‌ మొహియుద్దీన్‌ (ఫిబ్రవరి, 1991)
  12. మరోవైపు… దేశ దేశాల కవిత్వం, త్రిపురనేని శ్రీనివాస్‌ (మార్చి, 1991)
  13. స్వప్నలిపి…అజంతా (జనవరి 1993)
  14. చిక్కనవుతున్న పాట… దళిత కవిత్వం.
  15. 1997లో క‌విత్వం ప్ర‌చుర‌ణ‌లు 15వ పుస్త‌కంగా ‘హో ‘… త్రిపుర‌నేని శ్రీ‌నివాస్ క‌విత్వాన్ని, అతని స్నేహితులు ప్ర‌చురించారు. త్రిపురనేని శ్రీనివాస్‌ కవితలు, ప్రచురణలు తెలుగు సమాజానికి అవ్యాజమైన ప్రేమతో ఆయన బహుకరించిన అమూల్యమైన కానుకలు. త్రిపురనేని శ్రీనివాస్ ని, ‘కవిత్వం ప్రచురణలు’ ని స్మరించుకుందాం.

PS: కవిత్వం ప్రచురణలు – 15 పుస్తకాల కవర్ పేజీలు సేకరించటానికి సహకరించిన మిత్రులు గాలి నాసరరెడ్డి, నామాడి శ్రీధర్, వేమన వసంతలక్ష్మి గార్లకు ధన్యవాదాలు.

You Might Also Like

Leave a Reply