The Last Lecture: Randy Pausch

వ్యాసకర్త: భారతి కోడె

చాలా ఆలస్యంగా చదివాను ఈ పుస్తకాన్ని. ఇన్నాళ్లు ఎందుకు మిస్ అయ్యానా అనిపించింది పూర్తి చేయగానే.

Carnegie Mellon University లో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ గా పని చేసిన రాండి తనకు కాన్సర్ వ్యాధి ఉందని, ఇంకా కొన్ని నెలలు మాత్రమే బతికి ఉంటానని తెలిసిన తర్వాత రాసిన పుస్తకం ఇది. ఒక భర్తగా, ముగ్గురు చిన్న పిల్లలకి తండ్రిగా, ఎంతో మంది విద్యార్థులకు గురువుగా తాను మరణించే ముందు వారందరకీ తాను చెప్పాలనుకున్న దానిని తాను పని చేసిన యూనివర్సిటీ లో నే ఇచ్చిన “లాస్ట్ లెక్చర్” ద్వారా చెప్పే ప్రయత్నం చేసాడు రాండి.

ఆ యూనివర్సిటీ లో ప్రతి ఏటా ఎవరో ఒక గెస్ట్ స్పీకర్ ని పిలిచి “లాస్ట్ లెక్చర్” ని నిర్వహించే ఒక పద్దతి ఉంది. అందులో ఆ speakers త్వరలో వాళ్ళు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతున్నట్లైతే, ఇదే వారు ఇచ్చే చివరి లెక్చర్ అయినట్లయితే వారు అందరికీ ఏమి చెప్పాలనుకుంటున్నారో ఊహించుకుని అదే మాట్లాడాల్సి ఉంటుంది. రాండి అలా ఊహించుకోవాల్సిన అవసరం రాలేదు. అది నిజంగానే అతనికి లాస్ట్ లెక్చర్.
ఆరేళ్ళు, మూడేళ్లు, పద్దెనిమిది నెలల వయసు ఉన్న ముగ్గురు పిల్లలను వదిలి వారికోసం ఇంకా ఏమీ చేయకుండానే తాను మరణిస్తున్నానే బాధతో ఉన్న రాండి భార్య వద్దంటున్నా వినకుండా ఈ లాస్ట్ లెక్చర్ ఇవ్వడానికి సిద్ధ పడతాడు. దానిని రికార్డు చేసి ఉంచమని, అందులో తన పిల్లలు పెద్దయ్యాక వారికి తానేమి చెప్పాలనుకుంటాడో అది రికార్డు చేయాలనుకుంటున్నానని చెబుతాడు. కాన్సర్, కీమో థెరపీ తో బాధ పడుతూనే లెక్చర్ సిద్ధం చేసుకుని దాదాపు రెండు గంటల పాటు ప్రసంగం చేస్తాడు.

ఆ ప్రసంగం అంతా తాను ఈ ప్రపంచం నుండి ఏమి తీసుకున్నానో, ఈ ప్రపంచానికి తానేమి వదిలి వెళ్తున్నాడో చెప్పే ప్రయత్నం చేస్తాడు. రాండి చెప్పిన వాటి నుండి కొన్ని పాఠాలు

• Not everything needs to be fixed
• Time is all you have. And you may find one day that you have less than you think
• Luck is where preparation meets opportunity. If you want to pursue your dream, you keep on preparing yourself till you find the right opportunity
• Complaining does not work as a strategy. Any time we spend whining is unlikely to help us achieve our goal. And it won’t make us happier.
• Look for the best in everybody. When you’re frustrated with people, when they’ve made you angry, it just may be because you haven’t given them enough time. Everybody has a good side. Just keep waiting. It will come out.
• Showing gratitude is one of the simplest yet powerful things humans can do for each other
• Be prepared for everything and anything-good, bad, worse and best
• When we are connected to others, we become better people
• Don’t hesitate to ask- Ask questions, Ask support, Ask help – Just ask

ఇవి కొన్ని మాత్రమే. ప్రతి ఒక్క మెసేజ్ కి తన జీవితంలో జరిగిన ఒక సంఘటననో, అనుభవాన్నో ఉదాహరణగా ఇస్తూ రాండి ఇచ్చిన ఈ లాస్ట్ లెక్చర్ అత్యంత ప్రభావవంతమైన పుస్తకాలలో ఒకటి. ప్రొఫెసర్ గా పని చేసిన రాండి ఏదో ఒక సందర్భంలో మరొక ప్రొఫెసర్ తో అంటారు, నిజమైన టీచర్ తన విద్యార్థులను self-reflection వైపు ప్రోత్సహించాలి అని. రాండి అలాంటి నిజమైన టీచర్. తన విద్యార్థులనే కాదు పుస్తకం చదివిన మనల్నందరినీ కూడా self-reflection చేసేలా చేస్తాడు. After completing the book, you can’t help but start thinking ‘if you have only few days on this earth, what is the legacy you would like to leave behind’. మీరింకా చదివి ఉండకపోతే మాత్రం don’t miss this book. రాండి ఇచ్చిన లెక్చర్ వీడియో యూట్యూబ్ లో కూడా ఉంది. ఒక వేళ పుస్తకం చదవలేకపోతే ఆ వీడియో చూడొచ్చు. But book is more detailed.

P.S: పుస్తకం చదవాలనుకుంటే మాత్రం పక్కన ఒక కర్చీఫో, నాలుగు టిష్యూ పేపర్లో పెట్టుకుని చదవండి. I am sure you will feel emotional by the time you finish this.

You Might Also Like

Leave a Reply