She Walks in Beauty: A woman’s journey through poems
She walks in beauty: A woman’s journey through poems
Caroline Kennedy
మా ఊరి లైబ్రరీలో ఈబుక్స్ కిండిల్ లో చదివే ఫార్మాట్లో రావు. కానీ, వాటికి ఒక మొబైల్ ఆప్ ఉంది. నాకూ రోజూ సీటు దొరకని ఒక ట్రెయిను ప్రయాణం పోనూ రానూ చెరో అరగంట ఉన్నందువల్ల, కొంచెం మొబైల్ స్క్రీన్ మీద చదవడానికి అనువుగా ఉండేవి ఏమిటి? అని ఆలోచిస్తే కవిత్వం నయం అనిపించింది. సహజంగా కవిత్వం అంటే భయం ఉన్నా, ఈ పుస్తకానికి రాసిన పరిచయం (ఒకావిడ సేకరించిన – పలువురు ప్రముఖులు రాసిన కవితలు) చూసి సాహసించాను. పుస్తకాల ఎంపికలో నేను తీసుకున్న మంచి నిర్ణయాల్లో ఒకటి అనిపించింది చివరికి వచ్చేసరికి. అందుకని దీని గురించి సంక్షిప్తంగా ఇక్కడ రాసుకుంటున్నా.
పుస్తకం రచయిత్రికి నచ్చిన కవితల సంకలనం. కవితలని జీవితంలోని వివిధ దశలుగా విభజించారు. మొదట శీర్షిక చూసి మహిళల రచనలు మాత్రమే ఉన్నాయనుకున్నాను కానీ అందరివీ ఉన్నాయి. కాకపోతే స్త్రీ జీవితంలోని దశల వారీగా విభజించారు.
* Falling in love
* Making love
* Breaking up
* Marriage
* Love itself
* Work
* Beauty, clothes and things of this world
* Motherhood
* Silence and Solitude
* Growing up and Growing old
* Death and grief
* Friendship
* How to live
– అన్నవి పుస్తకంలోని వివిధ దశలు, జీవిత ఘటనలు. ప్రతి భాగానికి రచయిత్రి గొప్ప పరిచయ వాక్యాలు రాసింది. కొన్ని చోట్ల అక్కడ ఉన్న కవితల కన్నా ఆవిడ పరిచయ వాక్యాలే గొప్పగా అనిపించాయి. వాటికోసమే పుస్తకం చదవొచ్చు అసలు. అంత నచ్చాయి నాకు.
ఇందులో Work; Growing up and Growing old అన్న రెండు భాగాలు నాకు ప్రత్యేకంగా నచ్చాయి. ఉద్యోగాలు చేసే మహిళల గురించి, అలాగే మహిళలకి సహజంగా వచ్చే శారీరక మార్పులు, మహిళలకే పరిమితమైన కొన్ని జబ్బులు – వీటి గురించి కూడా కవితలు రాశారని నాకు ఇప్పటిదాకా తెలీదు – ఇవి చూసేదాకా. కొన్ని అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాను. ప్రేమ, పెళ్ళి, వీటి చుట్టూ తిరిగినవి, స్నేహాలు, మరణాలు, బ్రతకడం ఎలా? – ఇలా అన్ని శీర్షికలూ నాకు నచ్చాయి – కొన్ని కవితలు మరీ పెద్దగా ఉండి బోరు కొట్టించాయి కానీ, ఇందాక అన్నట్లు రచయిత్రి రాసిన గొప్ప పరిచయాల మీద గౌరవంతో ఆ నచ్చని కవితలు మాత్రం తిప్పేస్తూ మిగితావి ఆపకుండా చదివాను. కొన్ని మళ్ళీ మళ్ళీ చదివాను.
“It concerns itself with the fundamental questions and reconnects us with our deepest emotions. When everyday life distracts us, poetry can help us feel centered. When the way forward seems blocked and the burdens of work and family overwhelms us, poetry can help us find our voice. This is as true for young women as it is for those of us who are older”
– అంటుంది ఒకచోట. ఈ పుస్తకం నాకు అలాంటి అనుభవాన్నే ఇచ్చింది. అసలు కవిత్వమంటే మొహంలో రంగులు మారే నాకు ఈ పుస్తకం నచ్చి, ఇప్పటికే ఒక స్నేహితురాలికి కానుక ఇచ్చేలా చేసిందంటే ఇంక ఊహించుకోవచ్చు నామీద పడ్డ ప్రభావం! ఈవిడ ప్రభావంలోనే వెంట వెంటనే రెండు కవిత్వ పుస్తకాలు అరువు తీసుకున్నాను లైబ్రరీ నుండి – వాటిలో ఒకటి చేతులెత్తేసి వెనక్కిచ్చాను. ఇంకోటి ఇప్పటికి చాలా బాగుంది. సరే, పుస్తకం నుండి నాకు నచ్చిన కొన్ని కవితలను ఉటంకించి ముగిస్తాను ఇప్పటికి.
Come to the orchard in spring
There is light and wine, and
sweethearts in the pomegranate
flowers
If you do not come, these do not matter.
If you do come, these do not matter.
– Rumi
***********
పేరు తెలియని రచయిత రాసిన కవిత ఒకటి, వర్కింగ్ వుమెన్ గురించి:
Here lies a poor woman who always
was tired,
For she lived in a place where help
wasn’t hired,
Her last words on earth were, “Dear friends,
I am going,
Where washing ain’t done nor cooking,
nor sewing,
And everything there is exact to my
wishes,
For there they don’t eat, there’s no
washing of dishes,
I’ll be where loud anthems will always
be ringing
But having no voice, I’ll get clear of
the singing.
Don’t mourn for me now; don’t mourn
for me never,
For I’m going to do nothing for ever
and ever.
**********
“By the time you swear you’re his,
Shivering and sighing.
And he vows his passion is,
Infinite, undying.
Lady make note of this —
One of you is lying.”
– Dorothy Parker
***********
Lucille Clifton అనే ఆవిడవి రెండు కవితలు బాగా నచ్చాయి.
to my last period
well girl, goodbye,
after thirty eight years.
thirty-eight years and you
never arrived
splendid in your red dress
without trouble for me
somewhere, somehow
now it is done,
and i feel just like
the grandmothers who,
after the hussy has gone
sit holding her photograph
and sighing, wasn’t she
beautiful? wasn’t she beautiful?
**********
lumpectomy eve
all night i dream of lips
that nursed and nursed
and the lonely nipple
lost in loss and the need
to feed that turns at last
on itself that will kill
its body for its hunger’s sake
all night i hear the whispering
the soft
love calls you to this knife
for love for love
all night it is the one breast
comforting the other
(ఈ రచయిత్రి కవితలు కొన్ని ఇక్కడ చదవొచ్చు)
********
From: Summer with Monika
Roger McGough
away from you
I feel a great emptiness
a gnawling emptiness
with you
I get that reassuring feeling
of wanting to escape.
************
అన్నట్లు, రచయిత్రి పేరు గురించి నేను అంతగా గమనించలేదు కానీ, పుస్తకం ముగిసే సమయానికి ఈవిడ వేరే ఏం పుస్తకాలు వేసిందో తెలుసుకుందామని చూస్తూ ఉంటే తెలిసిన విషయం – ఆమె జాన్ ఎఫ్.కెన్నెడీ కూతురు! పుస్తకంలో వాళ్ళ అమ్మా-నాన్నల ప్రస్తావన ఉంది కానీ, పేర్లు ఎక్కడా చెప్పలేదు అనుకుంటాను.
Leave a Reply