సినిమా ఒక ఆల్కెమీ
వ్యాసకర్త: Nagendra Kasi
(ఇది మొదట ఫేస్బుక్ లో వచ్చిన పోస్టు. పుస్తకం.నెట్ లో తిరిగి వేసుకునేందుకు అనుమతించినందుకు రచయితకు ధన్యవాదాలు)
*************
వెంకట్ “సోల్ సర్కస్“ కథ చదివినప్పుడు చాల త్వరగా exhaust అయిపోతాడు, ఓ రెండు మూడు కథలు రాసిన తర్వాత vaccum create అయిపోతుంది అనుకున్నా. ఎందుకంటే ఆ కథ అంత ఇంటెన్సిటీ తో ఉండడమ. కొన్ని కథలు మన conscious కి సంబంధించి, మన జ్ఞానానికి సంబంధించి purity of art form ని డిమాండ్ చేస్తాయి. మన morale ని అడుగుతాయ్, మన stand చెప్పమంటాయ్. ప్రతీ అక్షరం గుండె కెళ్ళే రక్తాన్ని ఒక్కోసారి ఆపేసి ఊపిరాడని స్థితి కి తీసుకువెళ్లి మనల్ని నరకయాతన పెడతాయ్. అదిగో అప్పుడే మనం నిలబడాలి- ఆ స్థితి లో రాయాలి. రాసి వదిలేసిన దాన్ని ప్రపంచం ఏమైనా చేసుకొనీ- ఆ కథ తో మనకున్న ఆపేక్షని బొడ్డు తాడు తెంపినట్టు తెంపేయాలి. వెంకట్ అలాగే రాస్తాడు, తను రాసిన కథ తో కూడా అతని వైఖరి కూడా ఇలానే ఉంటుదని నా నమ్మకం.
తెలుగులో మంచి వచనం అంటే నాకు చలానికి మొదటి స్థానం ఇవ్వాలని అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడున్నా గోదారి మీద వెన్నెల్లా మిల మిలా మెరుస్తాయ్ ఆయన అక్షరాలు. తర్వాత బాల గోపాల్ వచనం బావుంటుంది.కొత్తగా రాస్తున్న వాళ్ళలో మంచి వచనం రాయగలిగిన, రాస్తున్న వాడు వెంకట్.
‘ఇది పొగడ్డం కాదు గానీ’ అని చెప్పి చాలామంది పొగడ్త కున్న మంచి లక్షణాన్ని dilute చేసి పడేసారు. So ఇది నిజంగా పొగడ్త. (ముందు పుస్తకాలకి “ముందు మాటలూ, పరిచయ వాక్యాలూ రాయడం బాన్ చేయాలబ్బా, చదవాలనుకునే వాళ్ళకి ఒక పర్స్పెక్టివ్ ఇచ్చి, infulence చేసేస్తున్నాయ్. వెనక రాసుకోండి.NP. సినిమా మొదలైనప్పుడు ప్రొడ్యూసర్లు, క్రిటిక్ లు, లేకపోతే వెల్ విషెర్స్ వచ్చి ఈ సినిమా ఇది, డైరెక్టర్ కి ఇంత టాలెంట్ ఉంది అని ఒక పది నిమిషాలు మాట్లాడితే ఎలా వుంటుంది? తెలుగులో రచనకు సంభందించి బ్రేక్ చేయాల్సిన విషయాలు చాల ఉన్నాయి లెండి !!!!)
సినిమా ఒక ఆల్కెమీ – Yes it is.
FADE IN:
సినిమా మీద ప్రేమ – Set up
సినిమా ని అనుభూతి చెందడం- Confrontation
సినిమా అతనికి దక్కడం – Resolution
వెంకట్ సినిమాను పట్టుకున్నాడు అనేకంటే సినిమా అతనికి దొరికింది, అది లేకపోతే “ప్రేమే అసంభవం ఐన చోట అది నాకు అనివార్యమైంది“ అనే లాగ్ లైన్ రాయలేడు. అంత poetic temperament ని ట్రిగ్గర్ చేయదు.
ఫిజ్ కరాల్దో – సినిమా గురించి చెప్పేటప్పుడు మాత్రం ఆ సినిమా కి సంబంధించి అంటే ఒక సాహస యాత్ర కథ గురించి కాకుండా దర్శకుడి (వెర్నెర్ హేర్జాగ్) సాహసాన్ని కోట్ చేస్తూ మొదలు పెట్టాడు “అతడు సినిమాని జయించాడు’ అని. కారణం ఏమైనా గానీ సాహస కథ గురించి చెప్పిన ప్రయత్నం బావుంది. సాహసం అంటే ఏ మేకనాస్ గోల్డ్ లాంటి సినిమాలు తప్ప ఇలాంటి సినిమాలు తెలియని నాకు ఇదొక మంచి సినిమా. అతని ఫిల్మో గ్రఫి బకెట్ లిస్టు లో చేరింది కేవలం ఈ సినిమా పరిచయం వల్ల.
బ్లో అప్ (Michelangelo Antonioni) గురించి రాస్తూ” ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టు చిత్రీకరించడం మాత్రమే కళ కాదని ఆధునిక మానవుడు భావించాడు“ అని ఇంట్రో రాసాడు. నిజం చెప్పాలంటే ఆధునిక మానవుడే కాదు, ఆదిమ మానవుడు కూడా తనకున్న పరిమితులతో, పనిముట్లతో చాలా fictional elements సృష్టిస్తూనే వచ్చాడు. సినిమాలో తన దగ్గర లేని బాల్ అడగడం తోనే సినిమా సోల్ మొత్తం దాగి ఉంది, కథానాయకుడు వాళ్ల ప్రపంచం లోకి వెళ్ళడం తోనే క్లైమాక్స్ అయిపోయింది. దాన్ని కొంచెం సులభతరం చేసి ఆ పాత్రని తెర మీద మాయం చేయించాడు. అసలు ఈ సినిమా ని ఎంచుకోవడం లోనే వెంకట్ సక్సెస్ అయిపోయాడు. లాస్ట్ పేరా లో వివరణ ఈ సినిమా గురించిన లోతైన ఆలోచనని మనకి చెప్తాడు రచయిత. ఇది Add on.
Drama ని సింహాసనం మీద కూర్చో బెట్టిన వాడు Woody Allen. మిడ్ నైట్ ఇన్ పారిస్ ని చూసిన తర్వాత, నా వెర్షన్ లో, నాకు గోదావరి తో ఉన్న nostalgic moment తో కాల్పనిక ప్రపంచం నిర్మించుకొని దాంట్లో గడిపాను, హీరో ఎలా అయితే పారిస్ లో వెనుకటి కాలానికి వెళ్ళిపోతాడో అలా. అంత ఇంపాక్ట్ create చేసింది ఈ సినిమా. సినిమా గురించి రాసిందంతా ఒక ఎత్తైతే మొదటి జీవితం గురించీ, woody allen గురించి వెంకట్ అద్బుతం గా చెప్పాడు. (Woody సినిమాల లో Blue Jasmine కూడా బావుంటుంది. పతనమైపోతున్న వ్యక్తి వాదాన్ని, ఆ సంఘర్షణ ని బాగా చూపిస్తాడు, వెంకట్ చెప్పిన సినిమాల తో బాటు ఇది కూడా ఆడ్ చేసుకోండి.)
IN THE MOOD FOR LOVE, POETRY, SHANSHO DAYU- ఈ సినిమాలు చూసి మళ్ళీ పుస్తకం లో వెంకట్ ఏం రాసాడో చూసుకోవాలి. పరిచయం బట్టి మంచి సినిమాలని తెలుస్తున్నా గానీ ఆ సినిమాలు ఇంకా ఏవో డిమాండ్ చేస్తున్నాయ్ ముఖ్యంగా పోయెట్రీ అనే సినిమా. దాన్ని రాతలో కుదించ లేం అన్నది అర్థం అవుతున్నది. కాని ఆ ప్రయత్నం చేయడానికి రచయిత ఎంత కష్ట పడి ఉంటాడో మరి.
Bicycle Theives అనే సినిమాని చూడకుండా, అది పుట్టిన సామాజిక పరిస్థితుల్ని అధ్యయనం చేయకుండా సినిమాలకి పనిచేయడం అంటే పెన్ లేకుండా పరీక్షకు వెళ్ళడం లాగే అనిపిస్తుంది నాకు. ఏమీ రాయలేం. ఇది రోజూ చూసే, జరిగే కథే అని మొదలు పెడతాడు – ముమ్మాటికి నిజం. అందుకే శక్తివంతమైన శ్రీశ్రీ ని ఆవహించుకొని “జీవితమొక పద్మ వ్యూహం” అని పేరు పెట్టి మరీ లోపలికి లాక్కేలతాడు రచయిత వెంకట్. ఒక పరమాద్భుత మైన సినిమా. సినిమా చూసి అప్పుడు ఈ పుస్తకం లోనిది చదవండి. ముందు మాత్రం చదవకండి. ఇంట్రో, డైరెక్టర్ గురించి తప్ప.
ఒక మనిషి ఇంకో మనిషిని కలవటం కన్నా ఇంకో అపూర్వ సన్నివేశం ఏముంటుంది ?
ఎంత simplify చేసేసాడు మొత్తం కథని. ఇది కూడా చూడాలి, తర్వాతే ఏమైనా రాసేది దీని గురించి.
Gondry “Adaptation” చూసిన తర్వాత అతని ఫిల్మోగ్రఫీ లో సినిమాలన్నీ వరసపెట్టి చూసేయాలని నిర్ణయం తీసుకొని, అమలు చేయలేకపోయాను.
ETERNAL SUNSHINE OF THE SPOTLESS MIND ని వెంటనే చూసేయలన్న ఉత్సుకత రేకెత్తించింది సినిమా గురించిన write up.
TOKYO STORY: ఇది నా కథ , మీ కథ , మనందరి కథ అన్నాడు మొదట్లోనే – చెప్పేదేముంది ఇది విశ్వ జనీనమైన కథ. అన్ని స్థల కాలాదులకూ సరిపడే కథ – జీవితం లో ఒకే ఒక సినిమాని చూసే అవకాశం మిగిలి ఉంటే దేన్నే ఎన్నుకుంటాను, ఇంకా దీని గురించి ఎన్ని మాటలు రాయగలం. నిజంగా రాయగలమా ????
మిజోగుచి గురించిన పరిచయం బావుంది.
CITIZEN KANE: ఈ సినిమా చూడకపోతే మోక్షం రాదు సినిమా వాడికి. అంతే. నేనేం చెప్పను, రాయను.
STALKER
A SEPARATION
REVOLUTIONARY ROAD
CHILDREN OF HEAVEN
WILD STRAWBERRIES
SHADOWS OF FORGOTTEN ANCESTORS
GETTING HOME
GRAVE OF THE FIRFLIES (చదువుతుంటేనే ఏడుపొచ్చింది, సినిమా చూస్తే ఉండగలమా ?)
AS IT IS HEAVEN
KRAMER VS KRAMER
EK DOCTOR KA MOUTH
POOJAPHALAM
చాలా ఇంటరెస్టింగ్ సినిమా “MAN FROM THE EARTH” మైండ్ బ్లోయింగ్, ఈ సినిమా ఎలా పట్టుకున్నాడో మరి?
ఇలా ఒకటా, రెండా, ౩౦ సినిమాల గురించిన అధ్యయనం, విశ్లేషణ దానికి తనదైన వ్యాఖ్య రాయాలంటే ఎంత నిజాయితీ, నిబద్ధత, ప్రేమ ఉండాలి.
సినిమా నీకు దొరికింది వెంకట్.
శ్రీశ్రీ మహాప్రస్థానం గురించి పిచ్చి రెడ్డి అనే ఒక MA స్టూడెంట్ “చలం యోగ్యతా పత్రం చదివితే చాలు, మీ పద్యాలు ఇక చదవక్కరలేదు అంటాను దానికి మీరేమి అంటారు” అని ఒక ఉత్తరం రాశాడంట.
దానికి శ్రీశ్రీ జవాబు “మీరు సార్థక నామధేయులు” అని .
అలా వెంకట్ రాసిన ఈ పుస్తకం తోనే ఆగిపోకుండా అతనిని అలా రాయించిన సినిమాలు చూస్తే పుస్తకానికి అతను పడ్డ శ్రమకు ఫలితం.
మొన్న ఎవరో సాఫ్ట్ కాపీ అడిగారు వెంకట్ ని FB లో – నాకే చాలా బాధ అనిపించింది. ఎంత పాషన్ తో రాసినా ఎన్ని scarifice చేయాలో మనం అర్థం చేసుకోవాలి. తెలుగు రచయిత చాలా చులకన అందరికీ. కొత్తగా రాసేవాడైతే వాడ్ని ఫుట్బాల్ చేసి అందరూ మెస్సి లూ, రోనాల్డో లు అయిపోతారు. ఇంత మంచి పుస్తకం ఇచ్చి నందుకు, మహి బెజవాడ సెక్యులర్ ఆఫీస్ Artio లో (ప్రదీప్ అద్వైతం పెట్టిన పేరు) వెంకట్ కి ట్రీట్ ఇవ్వాలి. ఇది రాసిన తర్వాత వెంకట్ మీద ఉండే అతి పెద్ద pressure ఏంటంటే తన మొదటి సినిమా ఎలా ఉంటుందనే !!!! త్వరగానే, త్వరలోనే దాన్ని successful గా దాటేస్తాడ ని కోరుకుంటూ … All the very best my dear.
FADEOUT
Leave a Reply