Quiet – Susan Cain

వ్యాసకర్త: Nagini Kandala
*****************
చాలా ఏళ్ల క్రితం చూసిన బసు ఛటర్జీ సినిమా Piya ka ghar లో ఒక సన్నివేశంలో ఒక పాత్రధారి అంటారు, “మనుషులు కూడా మొక్కల లాంటివాళ్ళే, కొన్ని మొక్కలు ఎలాంటి చోటైనా చిన్న దారి చేసుకుని సులభంగా పెరుగుతాయి, కానీ కొన్ని మొక్కల పెరుగుదలకు అనుకూలమైన వాతావరణం అవసరం” అని. చాలా లోతైన విషయాన్ని ఇంత మామూలు మాటల్లో చెప్పడం బసు ఛటర్జీ ప్రత్యేకత. ఈ పుస్తకం చదివేటప్పుడు ఆ మాటలు గుర్తొచ్చాయి. మనుషులు కూడా అంతే కదా! కొందరు సమూహాల్లో శాంతిని వెతుక్కుంటే మరి కొందరు ఏకాంతంలో ఆనందాన్ని పొందుతారు. ‘Quiet’ గురించి చెప్పే ముందు ఒక చిన్న సంఘటన చెప్పాలి. ఆ మధ్య ఒక సంభాషణలో మిత్రులు ఒకరితో ‘ఈ సోషలైజ్ అవ్వడం చాలా exhausting గా ఉంటుందని’ అంటే, చాలా వింతగా చూస్తూ, తాము ఎంత బాగా సోషలైజ్ అవుతారో, తరచూ పార్టీలకు హాజరై, అందరితో కలిసిమెలిసి ఒక ‘ఐడియెల్ లైఫ్’ ఎలా లీడ్ చేస్తున్నారో అనర్గళంగా ఒక గంటసేపు ఉపన్యసించారు. అప్పుడు సమాధానంగా ‘It’s not that we hate people. It’s just our life style, we like it this way” అని ఏదో తప్పు చేస్తున్నట్లు గిల్టీ ఫీల్ తో సంజాయిషీ ఇచ్చినా కూడా వారి కళ్ళతోనే సంధించిన ఒక రకమైన తిరస్కార బాణాలు గుచ్చుకోక మానలేదు.ఈ గుచ్చుకోవడం తాలూకూ నొప్పి వద్దే మొదలవుతుంది ఈ ‘Quiet’:The Power of Introverts in a World That Can’t Stop Talking అనే పుస్తకం. 2012లో అమెరికన్ రచయిత్రి Susan Cain రాసిన ఈ నాన్ ఫిక్షన్ రచన New York Times బెస్ట్ సెల్లర్ గా నిలవడమే కాకుండా సుమారు 36 ప్రపంచ భాషల్లోకి అనువదించబడింది..

1921 లో తొలిసారిగా విఖ్యాత సైకాలజిస్ట్ Carl jung రాసిన పుస్తకంలోని సైకాలజీ టైప్స్ లో ‘introvert , extrovert’ పదాల ఆవిర్భావం జరిగింది అంటారు. మనుషులను స్వభావాల రీత్యా ఇంట్రావర్ట్ – ఎక్ట్రావర్ట్ అనడం చూస్తుంటాం. మొదట Rosa Parks అనే African American civil rights activist గురించి చెప్తూ, సున్నితమైన స్వభావురాలైన ఆమె ఒక బస్ డ్రైవర్ శ్వేత జాతీయులకి సంబంధించిన సీట్ లోనుంచి లేవమని ఆమెను ఆజ్ఞాపించగా, ఆ అవమానానికి ఎలా ఎదురుతిరిగారో, ఆ సంఘటనలో హింస, హడావుడి లేకుండా సున్నితంగానే తన మతాన్ని చాటి ఆమె కనబరిచిన ధైర్యసాహసాలతో మార్టిన్ లూథర్ కింగ్ Jr. civil rights movement లో ఎలా భాగస్వాములయ్యారో మనకు చెప్తారు. ఇక్కడ గమనించవలసిన విషయం “The first lady of civil rights” and “The mother of the freedom movement” గా యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ చేత మన్ననలందుకున్న Rosa Parks మృదుభాషి, ఇంట్రావర్ట్ కావడం. కానీ ఆమె మృదుస్వభావం ఆమె మనోనిబ్బరాన్ని, సంఘజీవిగా ఆమె ఉనికిని ఎంతమాత్రం ప్రభావితం చెయ్యలేదు. ఇంట్రావర్ట్స్ అంటే పిరికి వాళ్ళు, సామాజిక బాధ్యత లేనివాళ్ళు అని ముద్ర వెయ్యడం ఈ Extrovert సమాజం చేసే అతి పెద్ద తప్పని ఈ ఉదాహరణ ద్వారా నిరూపిస్తారు రచయిత్రి. ఒక సందర్భంలో మహాత్మా గాంధీ గురించి ప్రస్తావిస్తూ, స్వభావరీత్యా ఇంట్రావర్ట్, మితభాషి అయిన ఆయన అకుంఠిత దీక్ష, పట్టుదల బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూడా తలవంచేలా ఎలా చేశాయో గుర్తు చేస్తారు. ఈ క్రమంలో చరిత్రలో నిశ్శబ్దంగా ఉంటూనే తమ ఉనికిని చాటుకున్న వివిధ రంగాలకు చెందిన శక్తివంతమైన ఇంట్రావర్ట్స్: ఐన్స్టీన్, బిల్ గేట్స్, T.S.Eliot, Eleanor Roosevelt, Al Gore, Warren Buffett వంటి పలువురి స్వభావాలను గురించి విశ్లేషించారు. ఉత్తర దక్షిణ ధృవాల్లాంటి Eleanor Roosevelt (Introvert) – Franklin D. Roosevelt (Extrovert) దాంపత్యాన్ని ఉదాహరిస్తూ ఫ్రాంక్లిన్ charming/Outgoing పెర్సొనాలిటీకి Eleanor stable/deep/సెన్సిటివ్ పెర్సొనాలిటీ పరిపూర్ణతని చేకూర్చిందనీ, ఈ రెండు స్వభావాలను సమన్వయం చేసుకోగలిగితే అద్భుతాలు సృష్టించగలమనీ అంటారు Susan.

Yet today we make room for a remarkably narrow range of personality styles. We’re told that to be great is to be bold, to be happy is to be sociable.We see ourselves as a nation of extroverts.

ఈ రోజుల్లో కెరీర్, relationships ఇలా చాలా విషయాల్లో Presentation మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ రంగాల్లో నైపుణ్యం ఉన్నవాళ్ళు జీవితంలో ఇంట్రావర్ట్స్ కంటే కొంచెం త్వరగా పైకి ఎదుగుతున్నారు. అంతే కాకుండా మానవ సంబంధాల్లో కూడా మంచివారిగా, గొప్ప వారిగా, ప్రేమాభిమానాలు పుష్కలంగా ఉన్నవారిగా గణించబడుతున్నారు. వీటికన్నిటికీ కారణం ఇది extrovert పక్షపాత సంస్కృతి అంటారు రచయిత్రి. మరి టెక్నికల్ గా తమతమ రంగాల్లో నిష్ణాతులైనవాళ్లు కూడా కేవలం ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లేని కారణంగా వారి ప్రతిభకి గుర్తింపు లేక వెనకబడుతున్నారు.

“where people’s respect for others is based on their verbal abilities, not their originality or insight. You have to be someone who speaks well and calls attention to yourself. It’s an elitism based on something other than merit.”

“Respect for individual human personality has with us reached its lowest point,” observed one intellectual in 1921, “and it is delightfully ironical that no nation is so constantly talking about personality as we are. We actually have schools for ‘self-expression’ and ‘self-development,’ although we seem usually to mean the expression and development of the personality of a successful real estate agent.”

“all talking is selling and all selling involves talking”
Introversion ను లోపంగా భావించడానికి కారణాలను విశ్లేషిస్తూ 20 వ శతాబ్దంలో ఈ Extrovert ideal కి అంకురార్పణ చేసిన Dale Carnegie ప్రస్థానాన్ని ఉదహరించారు. ఒక రైతు బిడ్డ నుంచి సేల్స్ మాన్ గా ఆ పై పబ్లిక్ స్పీకింగ్ ఐకాన్ గా ఆయన metamorphosis ఇరవయ్యో శతాబ్దపు ‘Extrovart ideal’ సంస్కృతికి ఎలా బీజం వేసిందో చెప్తూ, ఈ evolution మనిషి ఉనికి ఏమిటీ, మనం మనిషిలో ఆరాధించే విషయం ఏమిటి మొదలు ఉద్యోగాల్లో ఇంటర్వ్యూ లలో ఎలా ప్రవర్తించాలి, ఉద్యోగుల్లో ఏ లక్షణాలు ఉండాలి, ఎటువంటి వారితో రిలేషన్స్ ఏర్పరుచుకోవాలి, పిల్లల్ని ఎలా పెంచాలి వరకూ పలు సామాన్య విషయాల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి అంటారు. Cultural historian Warren Susman మాటల్లో America, ‘Culture of Character’ నుంచి ‘Culture of Personality’ కి ఎలా మారిపోయిందో, దాని కారణంగా మనకు తెలీని పర్సనల్ ఏంగ్జైటీలు మానవ జీవితాల్లోకి మహమ్మారిలా ఎలా ప్రవేశించాయో చెప్తారు. ఈ క్రమంలో పలువురు వ్యక్తిత్వ వికాస నిపుణులు, సైకాలజిస్ట్లు చేసిన విశ్లేషణలను ఈ పుస్తకంలో క్రమబద్ధీకరించారు. మనుషులతో కలవలేకపోవడం, మాట్లాడలేకపోవడం, ఏకాంతం కోరుకోవడం లాంటివి తప్పేమీ కాదని, ఆ స్వభావం సృజనాత్మకతను పెంపొందించి అద్భుతాలు సృష్టించగలదని చెప్పడమే కాకుండా, ఆమె చేసిన విశ్లేషణలు పలువు వ్యక్తిత్వ వికాస నిపుణుల రీసెర్చ్ కి సంబంధించిన సవివరమైన ఆధారాలతో సహా మనకు నిరూపిస్తారు. Extrovert దేశాల్లో అగ్రస్థానం లో ఉన్న అమెరికా తో పాటు, introvert కల్చర్ కలిగిన Finland (అన్నిటికంటే గొప్ప introvert కల్చర్ అట), చైనా లాంటి దేశాల గురించి కూడా రాశారు. Asian culture లో introversion గురించి చెప్తూ,

Asians are “not uncomfortable with who they are, but are uncomfortable with expressing who they are. In a group, there’s always that pressure to be outgoing. When they don’t live up to it, you can see it in their faces.”

19 వ శతాబ్దం నుంచి 20 వ శతాబ్ది చివరకు వచ్చేసరికి Carnegie సంచలనం కారణంగా వ్యక్తిత్వ వికాస గ్రంథాల్లోని

Citizenship/Duty/Work/Golden deeds/Honor/Reputation/Morals/Manners/Integrity వంటి లక్షణాలు Magnetic/Fascinating/Stunning/Attractive/Glowing/Dominant/Forceful/Energetic లాంటి వాస్తవికతకు దూరంగా ఉండే ఫాషనబుల్ పదాలతో రీప్లేస్ చేయబడ్డాయి అన్నారు.

ఒక్కో చాప్టర్ మొదలు పెట్టేటప్పుడు ముందుగా చార్లెస్ డార్విన్, విలియం జేమ్స్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, మహాత్మా గాంధీ, RICHARD HOFSTADTER, రోబెర్ట్ రుబిన్ వంటి కొందరు introverts, రైటర్స్ మరియు సైకాలజిస్ట్స్ మాటల్ని quote చేశారు.

A man has as many social selves as there are distinct groups of persons about whose opinion he cares. He generally shows a different side of himself to each of these different groups. —WILLIAM JAMES

The meeting of two personalities is like the contact of two chemical substances; if there is any reaction, both are transformed. —CARL JUNG

Our culture made a virtue of living only as extroverts. We discouraged the inner journey, the quest for a center. So we lost our center and have to find it again. —ANAÏS NIN

Some people are more certain of everything than I am of anything. —ROBERT RUBIN, In an Uncertain World.

మనిషి సోషలైజేషన్, కెరీర్ బిల్డింగ్, రిలేషన్షిప్స్ తదితర అంశాల్లో తన ముద్రను వేసే క్రమంలో సహజత్వాన్ని కోల్పోయి యాంత్రికతను అడాప్ట్ చేసుకోవడం మొదలుపెట్టాడు. పర్సనాలిటీ,ఆటిట్యూడ్ లతో అసలు సిసలు క్యారెక్టర్ ను తెర వెనక్కి నెట్టేసాడు. ఆ విధంగా కళ్లకు కనిపించేవి, చెవులకు వినిపించేవే నిజమని నమ్మడం Extrovert సంస్కృతికి మరింత ఊతమిచ్చింది. సో ఇందులో కీలక పాత్ర పోషించే కమ్యూనికేషన్ స్కిల్స్, presentation లాంటి అంశాల్లో వెనకబడి ఉండే introvert స్వభావాన్ని ఒక లోపంగా, introverts ని anti-social గా భావించడం ఎక్కువైంది. ఈ పుస్తకంలో Susan విశ్లేషణలు కేవలం introversion ని సమర్థించే దిశగా కాకుండా ‘introversion లోపం కాదు’ అనేె దిశగా ఉంటాయి. ఈ క్రమంలో extroversion లో ఉండే లోటుపాటుల్నీ, ఒక్కోసారి extroverts తొందరపాటు, త్వరిత నిర్ణయాలు ఆర్థిక సామాజిక అంశాలపై చూపించే చెడు ప్రభావాల గురించే కాకుండా introversion ఆత్మన్యూనతగా, isolation గా మారకుండా దాన్ని బాలన్స్ చేసుకుని, అధిగమించే పద్ధతులు కూడా చెప్తారు. మొదట్లో ఎక్ట్రావర్ట్ vs ఇంట్రావర్ట్ గా మొదలయ్యే రచన క్రమేపీ ఆ రెండు వైరుధ్యాల మధ్య సమన్వయం చెయ్యడంతో ముగుస్తుంది. పదాల అల్లికలో తడబడే ఇంట్రావర్ట్స్ కు తన స్వరాన్ని అందించి, వారి భావాలకి పుస్తకరూపం ఇచ్చిన Susan Cain కు కృతజ్ఞతలు.

పుస్తకం నుండి మరి కొన్ని నచ్చిన లైన్స్:

“Neither E=mc2 nor Paradise Lost was dashed off by a party animal.”

Yet today we make room for a remarkably narrow range of personality styles. We’re told that to be great is to be bold, to be happy is to be sociable.We see ourselves as a nation of extroverts.

introverts prefer to work independently, and solitude can be a catalyst to innovation.

Newton was one of the world’s great introverts. William Wordsworth described him as “A mind forever / Voyaging through strange seas of Thought alone.”

It has many powerful advocates. “Innovation—the heart of the knowledge economy—is fundamentally social,” writes the prominent journalist Malcolm Gladwell. “None of us is as smart as all of us,” declares the organizational consultant Warren Bennis, in his book Organizing Genius, whose opening chapter heralds the rise of the “Great Group” and “The End of the Great Man.”

Kafka, for example, couldn’t bear to be near even his adoring fiancée while he worked: You once said that you would like to sit beside me while I write. Listen, in that case I could not write at all. For writing means revealing oneself to excess; that utmost of self-revelation and surrender, in which a human being, when involved with others, would feel he was losing himself, and from which, therefore, he will always shrink as long as he is in his right mind.… That is why one can never be alone enough when one writes, why there can never be enough silence around one when one writes, why even night is not night enough.

Bill Gates is never going to be Bill Clinton, no matter how he polishes his social skills, and Bill Clinton can never be Bill Gates, no matter how much time he spends alone with a computer. We might call this the “rubber band theory” of personality. We are like rubber bands at rest. We are elastic and can stretch ourselves, but only so much.

Persistence isn’t very glamorous. If genius is one percent inspiration and ninety-nine percent perspiration, then as a culture we tend to lionize the one percent. We love its flash and dazzle. But great power lies in the other ninety-nine percent.“It’s not that I’m so smart,” said Einstein, who was a consummate introvert. “It’s that I stay with problems longer.”

In the United States, he warned, you need style as well as substance if you want to get ahead. It may not be fair, and it might not be the best way of judging a person’s contribution to the bottom line, “but if you don’t have charisma you can be the most brilliant person in the world and you’ll still be disrespected.

But when we began talking about Asian concepts of “soft power”—what Ni calls leadership “by water rather than by fire”—I started to see a side of him that was less impressed by Western styles of communication. “In Asian cultures,” Ni said, “there’s often a subtle way to get what you want. It’s not always aggressive, but it can be very determined and very skillful. In the end, much is achieved because of it. Aggressive power beats you up; soft power wins you over.”

Conviction is conviction, the kids from Cupertino taught me, at whatever decibel level it’s expressed.

So when introverts assume the observer role, as when they write novels, or contemplate unified field theory—or fall quiet at dinner parties—they’re not demonstrating a failure of will or a lack of energy. They’re simply doing what they’re constitutionally suited for.

You Might Also Like

One Comment

  1. లియో

    ఈ పుస్తకం గ్రంధాలయం నుంచి తెచ్చాను కానీ పూర్తి చేసే లోపే తిరిగి యిచ్చివేయవలసి వచ్చింది. మీ మాటలు – “ఈ క్రమంలో extroversion లో ఉండే లోటుపాటుల్నీ, ఒక్కోసారి extroverts తొందరపాటు, త్వరిత నిర్ణయాలు ఆర్థిక సామాజిక అంశాలపై చూపించే చెడు ప్రభావాల గురించే కాకుండా introversion ఆత్మన్యూనతగా, isolation గా మారకుండా దాన్ని బాలన్స్ చేసుకుని, అధిగమించే పద్ధతులు కూడా చెప్తారు. మొదట్లో ఎక్ట్రావర్ట్ vs ఇంట్రావర్ట్ గా మొదలయ్యే రచన క్రమేపీ ఆ రెండు వైరుధ్యాల మధ్య సమన్వయం చెయ్యడంతో ముగుస్తుంది.” చూసాక పుస్తకం మళ్ళీ చదవాలని అనిపిస్తుంది.

    రచయిత టెడ్ టాక్ యిక్కడ – https://www.ted.com/talks/susan_cain_the_power_of_introverts

Leave a Reply