పెద్రో పారమో
వ్యాసకర్త: రోహిత్
*************
ప్రతీ వస్తువుకీ సెంటర్ ఆఫ్ గ్రావిటి ఉంటుందనీ, ఆ వస్తువు బరువంతా ఆ బిందువు దగ్గర కేంద్రీకరింపబడి ఉంటుందనీ చిన్నప్పుడు ఫిజిక్సు పాఠ్యపుస్తకంలో చదివినట్టు గుర్తు. అలాగే కథకూ, నవలకూ లేదా నవలికకూ కేంద్రంగా ఓ అంశం ఉంటుంది. ఆ అంశం చుట్టూ పొరలు పొరలు గా పై మూడూ అల్లబడి ఉంటాయి. కథ నడిచే కొద్దీ ఆ అంశం స్ఫష్టమవుతూ ఉంటుంది. కథకుడు తన కథ ద్వారా ఆ అంశాన్ని పాఠకునికి కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తాడు. అలాంటి ప్రయత్నాన్నే కథా నిర్మాణం అంటారు. ఒక్కొక్క కథకుడికీ తనదైన ప్రత్యేక నిర్మాణ శైలి ఉంటుంది. కర్ట్ వానెగట్ ది ఖచ్చితమైన క్లుప్తమైన శైలి, మార్కేజ్ ది మాంత్రిక వాస్తవికత తో కూడిన చిక్కనైన శైలి.
పెద్రో పారమో(Pedro Páramo), ఓ నవలిక. దీన్ని ఐదారు గంటల్లో చదివేయవచ్చు. కాని, నేను ఈ పుస్తకాన్ని గత రెండు సంవత్సరాలుగా చదువుతూనే ఉన్నాను. నిజానికి కథా నిర్మాణం ఓ చిక్కుముడి లాగా ఉంటుంది. కథ లోని పాత్రలను నిరంతరాయంగా, స్వేచ్ఛగా మాట్లాడించటం చేత నైరూప్యంగా అగుపించవచ్చు. నిశ్శబ్దాలతో, అర్థాంతరమైన సన్నివేశాలతో కట్టబడిన ఈ నిర్మాణంలో అన్ని సంఘటనలూ ఒకే సారి జరుగుతూంటాయి- “సమయం కాని ఓ సమయం లో” అని వాన్ రుల్ఫో (Juan Rulfo) తన కథా నిర్మాణం గురించి వివరిస్తాడు.
చనిపోతూన్న తన తల్లికిచ్చిన మాట కోసం, తన తండ్రిని వెతుక్కుంటూ కొమాల (Comala) అనే ఊరికెళతాడు వాన్ ప్రెసియదో (Juan Preciado). అది జ్ఞాపకాలతో భ్రాంతులతో నిండిన ఊరు. ఇక్కడ గత కాలపు ఆత్మలు, దెయ్యాలు తిరుగుతుంటాయి. కథ సమాంతరంగా రెండు ప్రపంచాలలో జరుగుతూంటుంది . ఆద్యంతం ఈ ఆత్మల ప్రవచనాలూ, గుసగుసలూ, మూలుగులూ, ఏడుపుల సమాహారంగా సాగుతుంది. వాస్తవ ప్రపంచానికీ, భ్రాంతుల ప్రపంచానికి మధ్య జరిగిన కరచాలనం – ఈ కథ. గత, ప్రస్తుత, భవిష్యత్ కాలాలలో కథ ఊగిసలాడుతూంటుంది. అప్పటి మెక్సికో లోని నియంతృత్వ పాలనకి సింబాలిక్ గా, విప్లవం తరువాత విఛ్ఛిన్నమయిన భ్రాంతులకు ప్రతీకగా- ఈ కథలోని సన్నివేశాలు రూపుదిద్దుకుంటాయి.
మెక్సికో కి చందిన వాన్ రుల్ఫో రాసిన ఏకైక నవలిక పెద్రో పారమో. తన జీవితంలో ఈ నవలిక, మరొక కథల సంపుటిని మాత్రమే ప్రచురించాడు వాన్ రుల్ఫో. లేటిన్ అమెరికన్ సాహిత్య వేదిక పై ఈ రెండు పుస్తకాలూ రుల్ఫో ని అపూర్వమైన కథకుడిగా నిలబెట్టాయి. పగలంతా సామాన్య జీవితం గడుపుతూ రాత్రి పుస్తకాలు చదువుతూ, సంగీతం వింటూ ఉండేవాడని సూసన్ సోంటాగ్ రుల్ఫో గురించి ఈ నవలికకు రాసిన ముందు మాటలో చెబుతుంది. 1986 లో మరణించడానికి కొన్ని రోజుల ముందు ‘లా కార్దిల్లెరా’ అనే నవలను దహనం చేస్తాడు. లేటిన్ అమెరికన్ సాహిత్యం లో మార్కేజ్, బోర్హేస్, కోర్టజార్ ల సరసన నిలిచిన గొప్ప రచయిత వాన్ రుల్ఫో. పెద్రో పారమో మార్కేజ్ కి కంఠస్థం వస్తుందట!
test
test
test
test
test
100
purchased
Sashanka
ఈ మొత్తం నవలకి సారంగ పత్రికలో చందు చేసిన తెలుగు అనువాదం వచ్చింది.
http://magazine.saarangabooks.com/2014/10/02/%E0%B0%AA%E0%B1%86%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8B-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B0%E0%B0%AE%E0%B1%8A-%E0%B1%A9/
కొంచెం ఓపిగ్గా వెతకండి.
-శశాంక
సౌమ్య
శశాంక గారికి:
“కొంచెం ఓపికగా వెదకండి” అనడంలో మీ ఉద్దేశ్యం? ఎవరికి చెబుతున్నారు? పుస్తకం.నెట్ నిర్వహకులకా? వ్యాస రచయితకా? ఈ రచనకి తెలుగు అనువాదాలు లేవు అని వ్యాసంలో నాకైతే కనబడలేదు.