The Immoralist By Andre Gide
వ్యాసకర్త: నాగిని
There is nothing more tragic for a man who has been expecting to die than a long convalescence.After that touch from the wing of Death, what seemed important is so no longer; other things become so which had at first seemed unimportant, or which one did not even know existed. The miscellaneous mass of acquired knowledge of every kind that has overlain the mind gets peeled off in places like a mask of paint, exposing the bare skin-the very flesh of the authentic creature that had lain hidden beneath it.
తీవ్రమైన క్షయ వ్యాధి బారినపడి మృత్యుముఖం నుంచి బయటపడ్డ Michel అంతరంగం ఇది..అతని మానసిన పరిణామానికి బీజం పడ్డది ఇక్కడే..పెళ్లి చేసుకుని భార్యతో హనీమూన్ కి Tunis వెళ్ళిన Michel క్షయ వ్యాధి బారినపడతాడు..భార్య Marceline ప్రేమపూర్వకమైన సపర్యలతో కోలుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన అతను, జీవితాన్ని తాత్విక దృష్టి తో చూడటం మొదలుపెడతాడు..ఇక్కడ Michel జీవితం ఆ వ్యాధి బారిన పడకముందూ,పడ్డ తరువాత అని రెండు దర్పణాల్లోంచి చూపిస్తారు..Marceline పై ప్రేమ లేకపోయినప్పటికీ తండ్రి మాట మన్నించి ఆమెను వివాహమాడినప్పటి సాధారణ మానసిక స్థాయి నుంచి తన ఆత్మశోధనలో భాగంగా ఆమెను చావుకు దగ్గర చేసే వరకూ Michel జీవితం మనల్ని అనేక చీకటి దారుల్లోంచి నడిపిస్తుంది..
ఒక సందర్భంలో Michel,Marceline తో అనే మాటలు అతని దృక్పధానికి అద్దం పడతాయి:
I have a horror of honest folk. I may have nothing to fear from them,but I have nothing to learn either. And besides, they have nothing to say..Honest Swiss nation! What does their health do for them? They have neither crimes, nor history, nor literature, nor arts..a hardy rose-tree, without thorns or flowers.
Michale వాదన ఏకపక్షం గా ఉండకుండా Gide, నాణానికి రెండో వైపును Marceline ప్రసంగాల ద్వారా ఎత్తి చూపిస్తాడు..ఆమె మరణానికి చేరువవుతున్న సందర్భంలో భర్త Michel లోని మార్పును చూసి,”నేను మీ సిద్ధాంతాల్ని అర్ధం చేసుకోగలను,కానీ అవి ఈ భూమ్మీద బలహీనులను పరిగణనలోకి తీసుకోవు.””అంటుంది. భర్తలోని స్వార్ధచింతన,పరిధులు దాటిన స్వీయ స్పృహ ను గురించి ఆమె తన అంతరంగాన్ని అలా వ్యక్తపరుస్తుంది..
Marceline did not mistake my thoughts; when I came back from the port, I did not conceal from herwhat sort of wretches I had been frequenting. Every kind of thing goes to the making of man. Marceline knew well enough what I was trying so furiously to discover; and as I reproached her for being too apt to credit everyone she knew with special virtues of her own invention, “You,” said she, “are never satisfied until you have made people exhibit some vice. Don’t you understand that by looking at any particular trait, we develop and exaggerate it? And that we make a man become what we think him?”
స్వేఛ్చ గురించి ప్రస్తావిస్తూ,
To know how to free oneself is nothing; the arduous thing is to know what to do with one’s freedom.
అంటారు ఒక చోట..
మరో చోట తన వాదనను ఒక లెక్చర్ లో వినిపిస్తూ,లాటిన్ civilization లో ఆర్టిస్టిక్ కల్చర్ ను ఉదహరిస్తూ ఈ విధంగా అంటారు..పుస్తకంలోని సారాంశం ఈ పారాలో సంక్షిప్తీకరించినట్లుగా ఉంటుంది..
My lectures began soon after; the subject was congenial and I poured into the first · of them all my newly born passion. Speaking of the later Latin civilization,I depicted artistic culture as welling up in a whole people, like a secretion, which is at first a sign of plethora, of a superabundance of health, but which afterwards stiffens, hardens, forbids the perfect contact of the mind with nature, hides under the persistent appearance of life a diminution of life, turns into an outside sheath, in which the cramped mind languishes and pines, in which at last it dies. Finally, pushing my thought to its logical conclusion,I showed culture, born of life, as the destroyer of life.The historians criticized a tendency, as they phrased it, to too rapid generalization. Other people blamed my method; and those who complimented me were those who understood me least.
Michel సిద్ధాంతాలకు సజీవ దర్పణం Menalque పాత్ర…Menalque తన తాత్విక దృష్టితో సమాజాన్నిలెక్క చెయ్యకుండా తన వాదానికి కట్టుబడి ఏకాంతంలో బ్రతుకుతుంటాడు..దుఖ్హ హేతువైన ప్రతీది తొలుత సంతోషాన్నిస్తుందనీ ,ఏదైనా సొంతం అనేది లేనప్పుడే మనిషి జాగరూకతతో ఉండి జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాడు అదే సొంతం(సెక్యూరిటీ) అనేది ఉంటే మనిషి మనశ్శాంతిగా నిద్రపోతాడనీ(it is absence from life) అంటాడు..ఒక సందర్భం లో Marceline ఆ సుషుప్తి ని ‘సంతోషం/తృప్తి’ అంటే,Michel దాన్ని ‘విశ్రాంతి’ అంటాడు..ఇలా అనుక్షణం అంతః చేతనతో తాత్విక సంబంధిత విషయాలను గురించి ముఖ్యపాత్ర అయిన Michel ప్రస్తావించడం జరుగుతూ ఉంటుంది..
Menalque వాదన:
So, in the very midst of my riches, I maintain the sensation of a state of precariousness, by which means I aggravate, or at any rate intensify, my life. I will not say I like danger, but I like life to be hazardous,and I want it to demand at every moment the whole of my courage, my happiness, my health . .
మరో చోట,
“Indeed, I hope so,” answered Menalque. “If only the people we know could persuade themselvesof the truth of this! But most of them believe that it is only by constraint they can get any good out of themselves, and so they live in a state of psychological distortion. It is his own self that each of them is most afraid of resembling. Each of them sets up a pattern and imitates it; he doesn’t even choose the pattern he imitates; he accepts a pattern that has been chosen for him. And yet I verily believe there are other things to be read in man. But people don’t dare to-they don’t dare to turn the page. Laws of imitation! Laws of fear, I call them. The fear of finding oneself alone-that is what they suffer from and so they don’t find themselves at all. I detest such moral agoraphobia-the most odious cowardice, I call it. Why, one always has to be alone to invent anything-but they don’t want to invent anything. The part in each of us that we feel is different from other people is just the part that is rare, the part that makes our special value-and that is the very thing people try to suppress. They go on imitating. And yet they think they love life.”
మితిమీరిన స్వేచ్ఛావాదం,అంతర్లీనంగా వెలుగుచూసే విశృంఖలత,విస్మయపరిచే అంతః చేతన,ఆత్మశోధన వెరసి Andre Gide ‘ఇమ్మోరలిస్ట్’…ఈ పుస్తకం తొలి ప్రచురణ Scandalous work గా ముద్ర వేయబడింది…Gide రచనలో తిరుగుబాటు ధోరణి,ధిక్కార స్వరం చిరపరచితంగా,Camus ను గుర్తుకు తెచ్చింది..రచనలో పొయెటిక్ టోన్,ఇంకా చార్లీ,ముక్తిర్ వంటి బాలుర పట్ల Michelకు కలిగే ఆకర్షణ వంటివి నబకోవ్ Lolita ను గుర్తుకు తెచ్చాయి..కొంతకాలం క్రితం Lolita చదవడం మొదలుపెట్టి,చదవలేక ప్రక్కన పెట్టేశాను..కానీ Gide రచనలో మార్మికత ఎక్కువ..అదే చివరి వరకూ ఈ పుస్తకాన్ని చదివించింది..Camus లోని rebellious self righteousness నీ,నబకోవ్ లోని paedophillic behaviour నీ తనదైన శైలి లో వ్యక్తపరుస్తూనే తను చెప్పదలుచుకున్న విషయాన్ని అస్పష్టంగా సూచనామాత్రం గా మన ఊహకి వదిలేస్తారు..చివరకు రచయిత వెల్లడించిన స్వీయకేంద్రీకృత సిద్ధాంతాల్లో Morality-Immorality ల గురించి ఒక నిర్ధారణ కు రావడానికి మనకి ఒక్క ఆధారం కూడా మిగల్చకపోవడం Gide రచనలోని ప్రత్యేకత..ఆస్కార్ వైల్డ్ scandalous,controversial లైఫ్ ని సమర్ధిస్తూ Gide రాసిన వైల్డ్ బయోగ్రఫీని బట్టి చూస్తే వారిరువురి భావాలకీ సారూప్యత ఉందనిపిస్తుంది..ఈ రచనలో వాదనలు ఎలా ఉన్నా,తాత్వికత ముసుగులో జీవితంలోని క్షణాలను ఒడిసిపట్టుకోవాలనే తాపత్రయం అంతర్లీనంగా ప్రస్ఫుతమవుతూ,మనకి అది అత్యాశగా,వాస్తవానికి దూరంగా అనిపిస్తుంది..
The Immoralist
Leave a Reply