The Crock of Gold: James Stephens
అసలు పుస్తకాల గురించి పరిచయాలు, సమీక్షలు రాయటం ఎంతటి వృధా ప్రయాసో తెలిసొచ్చేలా చేసే పుస్తకాలు కొన్ని ఉంటాయి. పుస్తకం చదివేశాం కనుక, అలవాటుగా దాని గురించి రాద్దామని కూర్చున్నప్పుడల్లా, మళ్ళీ పుస్తకం చేతిలోకి తీసుకోవడం, మధ్య మధ్యలో చదువుతూ అలానే గంటలు గంటలు గడిపేయడం, తీరా రాద్దామనుకున్న ప్రయత్నాన్ని అక్కడే వదిలిపెట్టేయటం.
అట్లాంటి ఓ పుస్తకం గడిచిన వారాల్లో చదివాను. ఇప్పుడు దాని గురించి రాయడమంటే నాకు గగనంలా ఉంది. అందుకని ఆ పుస్తకం గురించి కన్నా, దాని చుట్టూ కబుర్లు చెప్పాలని ప్లాన్. ఆ కబుర్లు ఎంత ఆసక్తికరంగా ఉంటాయనేది నాకు అనుమానమే! అందుకని, మాజిక్ గురించి చెప్పే పుస్తకాలు కాక, మాజికల్ పుస్తకం ఒకటి చదవాలన్న ఆసక్తి ఉన్నవారు, ఈ ఆర్టికల్ కింద ఉన్న లింక్‍ను క్లిక్ చేసి, ఈబుక్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోవడం మొదలుపెట్టడం ఉత్తమం. ఐరిష్ జానపద కథలను, ఫిలాసఫీని, రచన నాటి పరిస్థితులు ఊహాతీతంగా అల్లి, అరుదైన కథను, సున్నితమైన హాస్యాన్ని అందించే ఈ పుస్తకం, ఫిక్షన్ ప్రేమికులు మిస్ కాకూడదని నా అభిప్రాయం.
డబ్లిన్‍లో “డబ్లిన్ రైటర్స్ మ్యూజియం” అని ఒకటి ఉంది. (దీని గురించి మరిన్ని వివరాలు త్వరలో రాస్తాను.) ఐరిష్ సాహిత్యంలో క్రాష్ కోర్సు చేయాలంటే ఈ మ్యూజియంకు వెళ్ళాలి. జానపద కథలు తర్వాత, పుస్తకాలు పుట్టుకొచ్చాక, రచయితలు తయారయ్యాక, ఐరిష్ సాహిత్యంలో ఎవరెవరు వచ్చారు? ఏమేం రాశారు? అన్న సంగతులన్నీ చెప్పుకొస్తారు. అక్కడే నాకు జేమ్స్ స్టీఫన్స్ గురించి తెల్సింది. జేమ్స్ జాయిస్ రాయాలనుకున్న ఒకానొక పుస్తకం ఆయన రాయలేకపోతే, స్టీఫన్స్ అది పూర్తి చేయాలని ఆయన కోరికట. ఇద్దరి పేర్లు జేమ్స్ కావడంతో, జేమ్సెస్ జాయిస్ స్టీఫన్స్ అని రచనపై పేరు వేయించుకోవాలనుకున్నారట. కాకపోతే, జాయిసే ఆ రచనను పూర్తి చేయటంతో, సమిష్టి వ్యవసాయానికి అవకాశం లేకపోయింది. స్టీఫన్స్ గురించి ముందుగా తెల్సే విషయాల్లో ఇది ఒకటి అయినా, నేను ఆయనను చదవాలనుకోవడానికి కారణం, ఆయన రాసిన “Irish Folk Tales” అన్న పుస్తకం గురించి తెలిసాక. ఇందులో ఆయన ప్రఖ్యాత జానపద కథలన్నీ మళ్ళీ చెప్పుకొచ్చారట.
ట్రినిటి కాలేజ్‌కి వెళ్ళినప్పుడు, అక్కడ ఓ పుస్తకాల షాపులో స్టీఫన్స్ రాసిన “The crock of Gold” అనే పుస్తకం చూశాను. తగ్గింపు ధరలో దొరుకుతున్నందున మరో ఆలోచన లేకుండా కొన్నాను. ఇంటికొచ్చాక చదివాకే తెలిసింది, ఆరు యూరోలకు నేను ఇంటికి నిజంగానే Crock of Goldను తెచ్చుకున్నానని.
కథ ఎలా ఉన్నా, పుస్తకం చదవడం మొదలెట్టినప్పుడు కథనం నన్ను చాలా ఆకట్టుకుంది. ఫిక్షన్ విషయంలో, “Show. Don’t tell.” అన్న సూత్రాన్ని కొంచెం ఎక్కువగా రెకమెండ్ చేస్తారనుకుంటాను. కానీ, చూపించడానికి తెగ ప్రయాసపడకుండా, అలతి పదాల్లోనే బోలెడంత కథలను చెప్పుకుపోయే కథలంటే నాకీ మధ్య ఎక్కువ ఇష్టం కలుగుతుంది. ఈ నవలలో నరేషన్ కూడా అదే కోవకి చెందుతుంది. ఇది ఇద్దరి ప్రొఫెసర్ల కథ. వాళ్ళ భార్యల కథ. వాళ్ళ పిల్లల కథ. వాళ్ళు ఐరిష్ జానపద పాత్రలతో కలిసి ఏమేం చేశారన్న కథ. కథ ఒక చోట మొదలై, ఎక్కడెక్కడికో ప్రయాణించి, ఎక్కడో ముగుస్తుంది. కానీ, దారంతా బోలెడన్ని విశేషాలు, మాయలూ – మంత్రాలు, ఊహించని పరిణామాలు – బోలెడన్ని ఎదురవుతాయి. వీటి అన్నింటి వల్ల కలిగే శ్రమ తెలియనివ్వకుండా, కథనం హాయిగా, నవ్వులతో సరదాగా సాగిపోతుంది.
ఈ రచనలోని హాస్యం, వెటకారం అర్థమవ్వాలంటే ఐరిష్ ఫోక్‌లోర్‍తో బాగా పరిచయం ఉండాలని ఇంటర్నెట్‍లో రివ్యూలు రాసిన కొందరి అభిప్రాయం. నాకు దానిపై అంత ఐడియా లేకపోవటంతో, ఈ పుస్తకం ఎంత వరకూ అర్థమవుతుందోనన్న అనుమానం కలిగింది. కానీ ఒక రచనను అనేక contextలలో చదువుకోవచ్చు. అనేక levelsలో అర్థం చేసుకోవచ్చు. ఐరిష్ జానపద సాహిత్యంపై మాత్రం ఈ పుస్తకం చాలా ఆసక్తి రేపింది. ముఖ్యంగా, లెప్రికాన్ అనే కారెక్టర్ గురించి. ఈ కథ దాదాపుగా ఆ జాతి గురించే! లెప్రికాన్‍లు ఒక కుండలో బంగారు నాణెలు వేసి, దాన్ని దాచుకుంటారు. అయితే, ఒకానొక రోజు అది దొంగలించబడుతుంది. అది ప్రొఫెసర్ చేశాడని, అతడి పిల్లలను కిడ్నాప్ చేస్తారు వాళ్ళు. ఆ కిడ్నాప్ నుండి, తన స్నేహితుడైన మరో ప్రొఫెసర్‍ని హత్య చేశాడన్న ఆరోపణ నుండి ప్రొఫెసర్ ఎలా తప్పించుకుంటాడు. దానికి అతడి భార్య ఎలా సాయపడుతుందనేది మూల కథ. అయితే, ఇందులో మరిన్ని sub plots కూడా ఉన్నాయి. అవన్నీ ఆశ్చర్యపరివే విధంగా ఉంటాయి.
ఈ నవలలో నాకు నచ్చిన కొన్ని passages.
“A thought is a real thing and words are only its raiment, but a thought is as shy as a virgin; unless it is fittingly appareled we may not look on its shadowy nakedness: it will fly from us and only return again in the darkness crying in a thin, childish voice which we may not comprehend until, with aching wings, listening and divining, we at last fashion for it those symbols which are its protection and its banner.”
“Do you know that talk is a real thing? There is more power in speech than many people conceive. Thoughts come from God, they are born through the marriage of the head and the lungs. The head moulds the thoughts into the form of words, then it is borne and sounded on the air which has been already in the secret kingdoms of the body, which goes in bearing life and come out freighted with wisdom. For this reason a lie is very terrible, because it is turning mighty and incomprehensible things to base uses, and is burdening the life-giving element with a foul return for its goodness; but those who speak the truth and whose words are the symbols of wisdom and beauty, these purify the whole world and daunt contagion. The only trouble the body can know is disease. All other miseries come from the brain, and, as these belong to thought, they can be driven out by their master as unruly and unpleasant vagabonds; for a mental trouble should be spoken to, confronted, reprimanded and so dismissed. The brain cannot afford to harbour any but pleasant and eager citizens who will do their part in making laughter and holiness for the world, for that is the duty of thought.”
“The toxin generates the anti-toxin. The end lies concealed in the beginning. All bodies grow around a skeleton. Life is a petticoat about death.”
ఈ రచన ఆన్లైన్‌లో లభ్యం, బొమ్మలతో సహా – ఇక్కడ.
Fiction
Paperback
230
Leave a Reply