The Invention of Solitude: Paul Auster

ఓ రెండు మూడేళ్ళ క్రితం, ఈ పుస్తకం ఎన్నుకోవడానికి కారణం, దీని టైటిల్‍లో solitude అన్న పదం ఉండడం. Paul Auster ఎవరో, ఎలాంటి పుస్తకాలు రాస్తారో లాంటి బేసిక్ విషయాలను కూడా పట్టించుకోకుండా,  కేవలం ఆ పదం ఉందనే, ఈ పుస్తకం చదవటం మొదలెట్టాను. మొదట కొన్ని పేజీలలోనే, ఇది పాల్ తండ్రి మరణం గురించి ఆయన రాసుకున్న అనుభవాలు, ఆలోచనలు అని అర్థమయ్యింది.  కొన్ని పేజీల వరకూ తండ్రి మరణించాడని తెలిపే కాల్ ఎలా వచ్చింది, ఆయన అంత్యక్రియలు ఎలా జరిగాయి వగైరాల గురించి వివరాలు ఉంటాయి. ఈ రచనను చదవటం మొదలెట్టేటప్పటికి Julian Barnes రాసిన Nothing to be frightened of, అనే రచన అప్పుడే చదివి ఉన్నాను. ఆ పుస్తకం దాదాపుగా ఇలానే మొదలవుతుంది. జూలియన్ తల్లిదండ్రులు ఎలా చనిపోయారో, ఆ మృత్యువులను దగ్గరగా చూసిన విషయాలను తన అన్నతో పంచుకున్న ఆలోచనలను మనకి చెప్పుకొస్తుంటారు. కానీ, అది తన ఆటోబ్రయోగ్రఫీ కాదని, మృత్యువుకి సంబంధించిన విషయాలను, దేవుని గురించి అనేక అంశాలను లేవదీస్తారు. ఏదో ఒక చోట, జూలియన్ వ్యక్తిగత అనుభవాలు మరుగునపడిపోయి, మృత్యువును గురించి చర్చే ఉంటుందా పుస్తకంలో.

కానీ పాల్ పుస్తకం అలా ఉండదు. పేజీలు తిరగేస్తున్న కొద్దీ, ఆయన వ్యక్తిగత అనుభవాలు ఇంకా ఇంకా చిక్కబడతాయి. వాళ్ళ కుటుంబం గురించి ఎన్నో రహస్యాలు బయటపడతాయి. మరి అంత వ్యక్తిగతమైన అంశాలు ఉన్న పుస్తకాన్ని ఇలా పబ్లిక్‌ ఎలా చేస్తారో నాకు అర్థం కాని విషయం.  అందులోనూ పాల్, తన తండ్రిని పోగొట్టుకోవడం అనేది ఒక రకమైన బాధ అయితే, అసలు ఆ తండ్రితో అతనికి ఏనాడూ సాన్నిహిత్యం లేదు – అంటే తండ్రిని ఎప్పుడూ అందుకోలేకపోయాడన్న క్షోభను వివరిస్తూ ఆయన రాసిన వచనం చదవటం నా వల్ల కాలేదు, అప్పుడు నేనున్న పరిస్థితుల్లో. ఏడ్చేవాళ్ళకి ఎంత తలనొప్పి వస్తుందో, ఏడుపును అర్థం చేసుకున్నవాళ్ళకి అంతే భారంగా తయారవుతుంది తల! అందుకే ఒక యాభై, అరవై పేజీలు చదివాక చదవటం ఆపేశాను.

మళ్ళీ మొన్నటి వారం తెరిచాను. తెరవడానికి గల ముఖ్య కారణం పాల్ రాసిన వచనం. ఆయన ఇంగ్లీషు. అంత చిక్కని వచనం చదవాలనిపించినప్పుడల్లా పాల్ గుర్తుకొస్తుండడంతో మళ్ళీ తెరిచాను. ఏముందో  ముందే తెల్సు కాబట్టి, ఈ సారి చదవటం తేలికైంది. రచనను రెండు భాగాలుగా విడదీశారు. ౧) తండ్రి చనిపోయాడన్న వార్త తెల్సిన క్షణం నుండి ఆయన చేసినవి, చూసినవి, ఆలోచించినవి. ౨) తన గురించి తానే మూడో వ్యక్తిగా చెప్పుకురావటం.

మొదటి భాగంలో, తన తండ్రి, వాళ్ళ తల్లిదండ్రుల గురించి మొత్తం ఫామిలీ చరిత్ర మన ముందు ఉంచుతారు. వాళ్ళ నాన్న ఎప్పుడూ, ఏమీ పట్టనట్టు ఉంటారనీ, ఎప్పుడూ దగ్గరకు తీసుకోలేదనీ, ఎప్పుడూ తనని ఆదరించలేదనీ ఎన్నెన్నో చెప్పుకొస్తాడు ఈయన. ఆయన మాటల ప్రకారం, వాళ్ళ అమ్మ అంటే ఇష్టం చిన్నప్పటి నుండి. కానీ ఎందుకో ఆవిడ ప్రస్తావన మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. ఆల్మోస్టు వాళ్ళ నాన్న మీద మెడిటేట్ చేసి రాసినట్టు ఉంటుంది. మనకు దగ్గరైన వాళ్ళ గురించికన్నా, మనకి దగ్గరవ్వాలని ఎంతున్నా దూరంగా ఉండిపోయిన వాళ్ళను గురించే ఎక్కువ ఆలోచిస్తామేమో మరి!

పోయిన మనిషిని గురించి, ఆ తర్వాత మిగిలిన మనుషుల ముందుండే సవాళ్ళనూ ఇలా చెప్పుకొస్తారు.

“There is nothing more terrible, I learned, than having to face the objects of a dead man. Things are inert: that have meaning only in function of the life that makes use of them. When that life ends, the things change, even though they remain the same. […] they say something to us, standing there not as objects but as remnants of thought, of consciousness, emblems of the solitude in which a man comes to make decisions about himself.” 

“When a man walks into a room and you shake hands with him, you do not feel that you are shaking hands with him. Death changes that. This is the body of X, not this is X. The syntax is entirely different. Now we are talking about two things instead of one, implying that the man continues to exist, but only as an idea, a cluster of images and memories in the minds of the other people. As for the body, it is no more than flesh and bones, a heap of pure matter.”

తండ్రిని గురించి ఉన్న మొదటి భాగాన్ని ఇలా ముగిస్తారు:

“Nothing now for several days…In spite of the excuses I have made for myself, I understand what is happening. The closer I come to the end of what I am able to say, the more reluctant I am to say anything. I want to postpone the moment of ending, and in this way delude myself into thinking that I have only just begun, that the better part of my story still lies ahead. No matter how useless these words might seem to be, they have nevertheless stood between me and a silence that continues to terrify me. When I step into this silence, it will mean that my father has vanished forever.”

మొదటి భాగం పూర్తయ్యాక, Book of memory అంటూ మొదలైన రెండో భాగం చదవడం అనవసరం అనిపించింది. కానీ పుస్తకానికి ఈ రెండో భాగమే హైలైట్. ఇందులో, తన గురించిన విషయాలనే third person narrativeలో చెప్పుకొస్తాడు. తన వైవాహిక జీవితం, అందులోని ఒడిదుడుకులు గురించి ఎవరి గురించో చెప్తున్నట్టు రాసుకొస్తాడు. అలా చెప్తూ, చెప్తూ తన తండ్రి నడిచిన దారుల్లోనే తనూ నడుస్తున్న భావన కలిగిస్తాడు. ఒక మగవాడు, భర్తగా, తండ్రిగా విఫలమైతే  (లేదా, అలా అనిపించుకుంటే), బహుశా, ఆ వైఫల్యాన్ని అతని కొడుకులు మాత్రమే అర్థం చేసుకోగలరేమోనని అనిపించింది, ఈయన dejavu experiences చదువుతుంటే. పైగా ఈ భాగంలో రచయితకు ఇష్టమైన రచయితలు, రచనలు, ఆయన చదువుకున్నవి, రాసుకున్నవి అన్నింటికీ గురించి ఉండడంతో, చదువుకోడానికి బాగుంటుంది. పైగా ఆయన ఇంగ్లీషు చిక్కగా, మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేంతగా ఉంటుంది.

అయితే, ఇంతలేసి పర్సనల్ విషయాలను కుమ్మరించిన పుస్తకాలను చదవడం ఎందుకని అనిపించచ్చు. ఎప్పుడూ దగ్గరకు రానివ్వని తండ్రిని గురించి రాస్తూ ఇలా అంటాడు —

“Impossible, I realize, to enter another’s solitude. If it is true that we can ever come to know another human being, even to a small degree, it is only to the extent that he is willing to make himself known. A man will say: I am cold. Or else he will say nothing, and we will see him shivering. Either way, we will know that he is cold. But what of the man who says nothing and does not shiver? Where all is intractable, here all is hermetic and evasive, one can do no more than observe. But whether one can make sense of what he observes is another matter entirely” 

 

కొన్ని ఏకాంతాల్లోకి తేలిగ్గానే జొరబడచ్చు. పైగా ఇలాంటి రచయితలైతే కూర్చీ వేసి, కూల్ డ్రింక్ ఇచ్చి మరీ ఆతిధ్యం ఇస్తారు తమ ఏకాంతాల్లోకి పిలిచి మరీ. అలా పంచుకున్న కబుర్ల మూటలేవో ఎంతదాకా మోసుకెళ్తాం? మోసుకెళ్ళి మాత్రం ఏం చేసుకుంటాం? Do such works prepare you for the worst? Can such things be learnt from elsewhere? ఏమో. సాహిత్యం పనే ఇదనుకుంటా.. వెళ్ళని తీరాలకు తీసుకెళ్ళడం, తెల్సిన దారులలోనే తప్పిపోయేట్టు చేయటం.

The Invention of Solitude
Paul Auster
Non Fiction

You Might Also Like

4 Comments

  1. venkat.b.rao

    “You think it will never happen to you, that it cannot happen to you, that you are the only person in the world to whom none of these things will ever happen, and then, one by one, they all begin to happen to you, in the same way they happen to everyone else.”

    Paul Auster’s auto-biographical novel – ‘The Winter Journal’ లో మొదటి పేరా మొదటి లైను ఇది. Paul Auster వి నేను చదివిన మొదటి మాటలు కూడా ఇవే! ఈ మాటలని ఇలా రాయాలంటే కనీసం సగం జీవితం గడిచిపోయి ఉండాలి. ఇందులోని సంగతి సరిగ్గా అర్ధం కావాలంటే కూడా సగం జీవితమన్నా అయిపోయి వుండాలి. అలాంటి స్థితిలోనే ఉన్నాను కనుక నాకు బాగా అర్ధమయింది ఈ వాక్యం. ఇది నేనే గదా అంపించేంత దగ్గరగా అర్ధమై అద్దంలోకి చూసినట్లు ఇంత clear గా చూడడం ఎలా సాధ్యమయింది అనిపించింది. ఒక నిమిషం తరువాత అతడు కూడా ఇదే అయుండొచ్చునుగదా అనుకుంటే సమాధాన పడి, ఒకింత సంతోషపడీ…

    అతనకి 62 ఏళ్ళ వయసులో Paul Auster వ్రాసిన వాక్యం ఇది.

    స్థూలంగా చూస్తే జీవితం అదే! అదే బాల్యం, కౌమారం, యవ్వనం, పెళ్ళి, తల్లవడం/తండ్రవడం…ఇత్యాదిగా సంగతులన్నీ అదే వరసలో జరిగేవే! అయినా, వ్యక్తిగతాలైన భయాలు ఎన్నెన్నో అనుమానాలకు ‘అవకాశం’ కల్పిస్తాయి. ఎన్నీన్నో సందేహాలనూ రేకెత్తిస్తాయి. జీవితంలో సాధారణంగా జరిగే…జరగాల్సిన సంగతులెన్నో తన విషయంలో అద్భుతాలయ్యేంతగా సందేహంలో పడేస్తాయి.

    అయితే ఇందులోని అసలు ఆనందమంతా అన్నీ ఒకటొకటిగా జరిగేసిన తరువాత ‘అరే అన్నీ మామూలుగానే జరిగాయే!’ అనుకుని ఆశ్చర్యపోవడంలోనే వుంటుంది. ఎంత ఎక్కువగా సందేహ పడతామో, అంత ఎక్కువగా సంతోషాశ్చరయాలకు లోనుకావడం జరుగుతుంది. అలా జీవితంలో అతి సాధారణంగా జరిగే సంగతులు కూడా వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడల్లా, అత్యద్భుత ఆనంద క్షణాలకి కారకాలై సాహిత్యంలో అంతే అద్భుతమైన వాక్య నిర్మాణానికి దారి తీస్తాయి.
    నూటికి తొంభైతొమ్మిది పాళ్ళు సాధారణ మయింది జీవితం. అందులోంచి సౌందర్యాన్ని వెలికితీయాలంటే మాటలకు ఎంతగానో అలంకరణ చెయ్యాలి. అందులో సిధ్ధహస్తుడు Paul Auster.

    ఏ నిజమయినా అందంగా ఒక్కసారే చెప్పబడుతుంది. ఆ అందంగా ఎవరు చేబుతారో అతడి పేర ఆ నిజం నిలబడిపోతుంది.

    Paul Auster రచనలకు సంబంధించి ఇది ఒక పార్శ్వం! మాటను సాధారణంగా ఊహించలేని మరొక మాటతో జతకట్టించి ఒక కొత్త వింత అర్ధాన్ని స్ఫురింపజేసేలా మెరిపించడం ఇతని ప్రత్యేకత. సాధారణమైన మనసుకి invention, solitude అనే మాటలు ఒకదానితో ఒకటి పొసగేవిగా కనబడవు. ఇతని కల్పనలో ఇవి రెండూ కలిసి giving birth to a child అనే విశేషార్ధంలోనూ, indicative of father-hood గానూ ఉత్ప్రేక్షించబడిందని నేను అర్ధం చేసుకున్నాను…every birth is a solitude in itelf…ప్రతి పుట్టుకా దానికదే ఒక ఏకాంతం కాబట్టి!

    Paul Auster కు బాగా పేరు తెచ్చిపెట్టిన The New York Trilogy మూడు విడి కథల సంకలనం…గురించి ప్రత్యేకంగా ఒక వ్యాసం వ్రాయాలి. అలాగే The Music of Chance ని గురించి కూడా! ఈ వ్యాఖ్యలో నిడివి సరిపోదు గనుక ఇక్కడితో ఆపుతున్నాను.

    ధన్యవాదాలు!

  2. Purnima

    Thanks for leaving this comment. I was in a dilemma whether to pick another Paul Auster’s work or not, but now after your comment, fetched few other works of his. Thanks for sharing your thoughts on his works and looking forward to you writing about his works.

  3. venkat.b.rao

    నేను చదివినంతలో ముగ్గురు రచయితల ఇంగ్లీషు వచనం చదువుతున్న అంతలోనే బాగా ప్రభావితం చేసిదిగా అనిపించినింది. ఆ మువ్వుతూ Graham Greene, Sir V.S. Naipaul, Paul Auster ! ఈ మువ్వురిలో ఎవరు? ఒక్కరు… అనేది మాత్రం సాధ్యమయ్యే సంగతిలా నాకు అనిపించదు. Paul ఆస్టర్ వి ఇప్పటి వరకు నేను చదివిన పుస్తకాలు The Winter Journal, The New York Trilogy, The Music of Chance! ఈ మూడింటిలోనూ కొన్ని కొన్ని passages చాలా disturb చేస్తాయి…అంటే ఇక్కడ disturb అనే మాట negative sense లో కాదు…తప్పనిసరిగా ఆలోచింపజేసేవిగా అనీ…అక్కడ ఆగి ఆలోచించకుండా… ఇంకొక్క పదం కూడా ముందుకు వెళ్ళనీకుండా చేసేవిగా ఉంటాయని!….ఇంకా వివరాలతో విశదంగా రాసే స్థితిలో నేనిప్పుడు లేను.

    కనుక…thanks for introducing Paul Auster here! అన్న మాటలతో ప్రస్తుతానికి ముగిస్తాను.

Leave a Reply