నాలో నేను – డా. భానుమతీ రామకృష్ణ ఆత్మకథ
[సెప్టెంబర్ 7, భానుమతి రామకృష్ణ జన్మదినం. ఆ సందర్భంగా ఆవిడ ఆత్మకథను గురించిన పరిచయ వ్యాసం]
“నాలో నేను” గురించి చిన్నప్పట్నుంచి వింటున్నాను. భానుమతి గారి గురించి కూడానూ. అయితే, ఒకానొక దశలో “ఆవిడకి పొగరు, ఆవిడని భరించలేము” మార్కు కథలు మాత్రమే విన్నాను. అడపాదడపా టీవీల్లో ఆవిడలోని బహుముఖ ప్రజ్ఞ గురించి విని, “ఓహో!” అనుకున్నాను. “అత్తగారి కథలు” చదివాక “అరే! భలే రాసారే! ఇంకా ఏమేమి రాసారో!” అనుకున్నాను. “నగుమోము గనలేని…”, “నేనె రాధనోయీ…” వంటి పాటలు విన్నప్పూడు “ఎంత బా పాడుతున్నారో…” అనుకున్నాను. ఆవిడకి హస్తసాముద్రికం, జ్యోతిష్యం వంటి వ్యవహారాల్లో పరిచయం ఉందనీ, సినిమాల్లో దర్శకత్వం, ఎడిటింగ్, సంగీత దర్శకత్వం ఇలా వివిధ విభాగాలతో పరిచయం కూడా ఉందనీ తెలిసాక – “వావ్!” అనుకున్నాను.
ఈ నేపథ్యంలో 2006 ప్రాంతంలో మొదటిసారి “నాలోనేను” పుస్తకం చదివాను. ఈ మూడేళ్ళలో ఈ పుస్తకం పేజీలు ఎన్నిసార్లు తిప్పానో లెక్కలేదు. భానుమతి గారి జీవితం గురించి తెలుసుకోడానికే కాదు, ఆవిడలోని రచయిత్రి ని మళ్ళీ మళ్ళీ చూడ్డానికి కూడా ఈ పుస్తకం ఎంతో దోహదపడింది. నటి, దర్శకురాలు, సంగీత దర్శకురాలు, గాయని, రచయిత్రి, వివిధ శాస్త్రాలతో పరిచయమున్న వ్యక్తి, ఇవన్నీకాక భర్తనీ, కొడుకునీ అమితంగా ప్రేమించే ఇల్లాలు, ఓ సాధారణ భారతీయ గృహిణి, ఓ గారాల కూతురు -ఇలా ఎన్నో పాత్రలను తన పరిధుల్లోనే perfectగా ఒకే జీవితంలో పోషించిన భానుమతి గారు ఇదంతా ఎలా చేయగలిగారు? అన్న కుతూహలం కలవారికి ఈ పుస్తకం పాఠ్యగ్రంథం.
రచనా శైలి పరంగా చూస్తే నాకు భానుమతి గారు ఎదుట నిలబడి మాట్లాడుతున్నట్లే ఉండిండి. అక్కడక్కడా తొంగి చూసే ఆ విరుపులైతే ఆవిడ గొంతులో ఖంగుమని మ్రోగుతున్నట్లే అనిపించింది. ఎక్కడా వదలని హాస్యము, వ్యంగ్యమూ కూడా పెద్ద ప్లస్ పాయింట్లు. “కృష్ణ ప్రేమ”తో మొదలై “రామకృష్ణ ప్రేమ” గా మారిన తమ ప్రేమకథని వర్ణించిన తీరు చూస్తే-ఆవిడ రొమాంటిక్ కథలు, అపరాథ పరిశోధన థీములు కూడా ప్రయత్నించి ఉండాల్సిందేమో అనిపించింది. ఈ భాగం మాత్రం ఎన్నిసార్లు చదివినా బోరు కోట్టదు.
“భానుమతి” అంటే ఏమిటి? అన్నది ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. ఆవిడలో ఉన్న లోపాలు తీసుకుని, వాటిని మాత్రం highlight చేసి – “ఆవిడకి పొగరు. NTR,ANRలను పట్టుకుని వాడు వీడు అంటుంది, ఆమె రాసేది నేను చదివేదేంటి?” అనుకునేవాళ్ళకి ఇక నేనేమీ చెప్పలేను. (వ్యక్తిగతంగా నేనైతే ఏళ్ళ తరబడి ఉన్న పరిచయం వల్ల ఏర్పడ్డ చనువు కాబోలనుకుని వదిలేస్తాను. మనకి వాళ్ళూ గొప్ప కానీ, ఆవిడకి స్నేహితులే కదా .. హీహీ). “పొగరుబోతు వ్యక్తులు రాసినది నేను చదవను” అనొచ్చు. దానికీ దీనికీ సంబంధం ఏమిటీ అనేది దానికి రెండో పక్క వాదం. ఈపుస్తకం మొదటి సారి చదువుతున్నప్పుడు… బాగుంది, చదవమంటే, ఇదే వాదం నడిచింది ఓ స్నేహితుడితో 😉 వద్దన్నా అది గుర్తొచ్చింది ఇప్పుడు.
అందర్నీ “ఒరేయ్! ఒసేయ్!” అనేసే మోడర్న్ థియేటర్స్ టి.ఆర్.సుందరం గారు భానుమతిని మాత్రం “భానుమతి గారు, మీరు” అనడం, పనిలో చండశాసనుడని పేరుపడ్డ ‘జెమినీ’ వాసన్ గారు “పనిలో నేను యముణ్ణి అంటారు. భానుమతి నన్ను మించిన మనిషి” అని అన్నారని చదువుతూ ఉంటే, “ఔరా!” అనిపించక మానదు. ఇలాంటి సంఘటనలు ఎన్నోఈ పుస్తకంలో! భానుమతిని ఓ child prodigy” గా ఉన్నప్పట్నుంచి చివరిదాకా ఇలా ఎంతమంది ఎన్నిసార్లు ప్రత్యేకంగా గౌరవించారో లెక్కలేదు.
ఈ పుస్తకంలో కొంత స్తోత్కర్ష లేకపోలేదు. కానీ, ఆత్మకథల్లో అది సహజం అనిపిస్తుంది. ఎవరినీ విమర్శించలేదు పెద్దగా. తనకి పొగరు – అని వినబడే వ్యాఖ్యానాల గురించి ఆవిడే చాలా ఓపెన్ గా ఈ పుస్తకం లో రాసుకున్నారు. అంతవరకూ ఈ పుస్తకం చాలా objectiveగా, balancedగా ఉన్నట్లు లెక్క. భానుమతి అంటే ఎవరో తెలుసుకోవాలనుకున్నే వారికి, భానుమతి అంటే ఏమిటో తెలుసుకోవాలనుకునేవారికీ, ఆవిడని నటిగానో, సంగీత్జ్ఞురాలిగానో అభిమానించే వారికీ, ఆవిడ రచనల్ని అభిమానించేవారికీ, “ఏం చూస్కుని ఆవిడకంత పొగరు?” అన్న విషయం పై ఆలోచించేవారికి – అందరికీ ఇది తప్పక చదవాల్సిన పుస్తకం.
pavani
Bhanimati gari ” nalo nenu” ekkada dorukutundo cbeppi punyam kattukoroooo.. plz
sridhar
namaskaaramandi
naaku oka help cheyara…
nalo nenu bhanumathi gaari book online lo download link unte naaku send cheyagalarani …naa mail ki koruchunnanu…
thq
పుస్తకం » Blog Archive » మళ్ళీ మళ్ళీ చదివే పుస్తకాలు
[…] : అత్తగారి కథలు, నాలోనేను; జరూక్ శాస్త్రి కథలు, శ్రీపాద కథలు, […]
అబ్రకదబ్ర
>> “సినిమాల్లో దర్శకత్వం, ఎడిటింగ్, సంగీత దర్శకత్వం ఇలా వివిధ విభాగాలతో పరిచయం కూడా ఉందనీ”
ఉత్తి పరిచయమే కాదు, అనుభవమూ ఉంది.
subhadra
nenu chadavanuknna pustkam gurimchi chepparu.good baagaa raasaru.
XYZ
nice …………