ఓ ప్రభుత్వ గ్రంథాలయంలో
రాసి పంపిన వారు: మేధ
మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మతో మాట్లాడుతుంటే మాటల మధ్యలో తను పనిచేసే ఊళ్ళో ఉన్న గ్రంధాలయం గురించి వచ్చింది. అప్పటివరకూ నాకు తెలియదు ఆ ఊళ్ళో లైబ్రరీ ఉన్న సంగతి.. ఆ మాట వినగానే పుస్తకం.నెట్ గుర్తొచ్చింది.. ఎటూ పూర్ణిమ, సౌమ్య నగరాలు, దేశాలు తిరుగుతున్నారు, మనం కాస్త గ్రామాలకి వెళదాం అనిపించింది.. ఆ ఆలోచనకి ప్రతిరూపమే ఈ ఇంటర్వ్యూ.. ఆలోచన నాదైనా, ఇదంతా చేసింది మా అమ్మగారు.. చేసినందుకు తనకు, సహకరించినందుకు లైబ్రేరియన్ గారికి కృతజ్ఞతలు..ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వచ్చేస్తా..
ఎన్నేళ్ళ నుండి ఉంది ఈ గ్రంధాలయం?
లై: దాదాపు యాభైయేళ్ళ నుండి ..
గ్రంధాలయంలో ఉన్న పుస్తకాలు, వాటి వివరాలు..?
లై: పుస్తకాలు రమారమి 13000 వరకూ ఉన్నాయి.. అన్ని వర్గాలకి సంబంధించి ఉదా: నవలలు, కధలు, సాహిత్యం, ఆధ్యాత్మికం, చరిత్ర, పిల్లల పుస్తకాలు, టెక్నాలజీ, సైన్స్, కొన్ని పోటీ పరీక్షలకి సంబంధించినవి.. ఇలా అన్నింటికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి..
తెలుగు పుస్తకాలు కాకుండా వేరే భాషలకి సంబంధించిన పుస్తకాలు..?
లై: చాలా కొధ్ది మొత్తంలో ఇంగ్లీషు పుస్తకాలున్నాయి..
సాధారణంగా గ్రంధాలయానికి ఎక్కువ ఎవరు వస్తుంటారు..?
లై: పెద్దవాళ్ళు, మహిళలు.. మహిళలు ఇక్కడే కూర్చుని చదవరు కానీ, రెగ్యులర్ గా వచ్చి వాళ్ళకి కావలసిన పుస్తకాలని తీసుకు వెళుతుంటారు.. ఇక పిల్లలు సెలవుల్లో తప్పించి, మామూలు రోజుల్లో తక్కువే..
గ్రంధాలయంలో క్రొత్త పుస్తకాల ఎంపిక ఎలా జరుగుతుంది…?
లై: ఇక్కడ ఉన్నది శాఖా గ్రంధాలయం.. గుంటూరులో ఉన్న ప్రధాన గ్రంధాలయం నుండి రెండు నెలలకోసారి క్రొత్త పుస్తకాలు పంపిస్తూ ఉంటారు.. ఒకవేళ ఎవరైనా ఏదైనా పుస్తకం కావాలంటే దాని వివరాలను ప్రధాన గ్రంధాలయానికి పంపిస్తాము, వాళ్ళ వీలు ప్రకారం వాటిని పంపిస్తారు.
పుస్తకాలకి సంబంధించి ప్రభుత్వ గ్రాంటులు ఏమైనా..?
లై: రెండు నెలలోకోసారి పుస్తకాలు పంపించడమే కాకుండా, విడిగా సంవత్సరానికి 24000/- గ్రాంటు వస్తుంది.. దాన్ని డైలీ/వీక్లీ/మంత్లీ మ్యాగజైన్స్ కొనడానికి ఉపయోగిస్తాము..
NRIs నుండి సహాయ-సహకారాలు..?
లై: అలాంటిదేమీ లేదు.. ఊళ్ళో జరిగే ఎన్నో అభివృధ్ధి కార్యక్రమాలకి సహకరిస్తున్నారు కానీ, లైబ్రరీకి సంబంధించి ఎన్ని సార్లు అడిగినా, ఎవరూ ప్రతిస్పందిచడం లేదు..
గ్రంధాలయాలు ప్రజలకి మరింత చేరువకావడానికి ఏమైనా ప్రయత్నాలు..?
లై: ప్రతీ సంవత్సరం నవంబరు 14-21 వరకూ గ్రంధాలయవారోత్సవాలు జరుపుతాం.. ఆ సమయంలో, ఊళ్ళో సమావేశాలు అవి జరిపి, ఇక్కడ అందుబాటులో ఉన్న పుస్తకాల గురించి చెబుతాం.. అలానే కొన్ని ప్రత్యేక సందర్భాలలో (గాంధీ జయంతి, బాలల దినోత్సవం..) పిల్లలకి పోటీలు పెడుతూ ఉంటాం..
ఇతరత్రా సమస్యలు.. ఏమైనా..?
లై: ప్రస్తుతం గ్రంధాలయానికి సరియైన భవన సదుపాయం లేదు.. దీని వల్ల వర్షాకాలంలో పుస్తకాలు తడిసి పాడయిపోవడం, చెదలు పట్టడం జరుగుతోంది.. వసతి సదుపాయం బావుంటే, ఎక్కువమంది రావడానికి, చదువుకోవడానికి వీలుగా ఉంటుంది..
(ఈ ఇంటర్వ్యూ జరిపిన గ్రంథాలయం గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం నూతక్కి లో ఉంది.)
కొత్తపాళీ
very nice.
gaddeswarup
If possible, please look at the libraries in Nadimpalli (Repalle Taluk) and Gurram Jashua Library in Veluru (near Narasaraopet). We send books there off and on; to the second one through Sri Navodaya Ramamohana Rao.
వేణూ శ్రీకాంత్
మంచి ప్రయత్నం. అభినందనలు.
Prabhakar Mandaara
ముఖాముఖి చాలా బావుంది.
మరోసారి గ్రంధాలయోద్యమం వస్తే తప్ప ఇప్పటి మన గ్రంధాలయాలు బాగుపడవు.
చాలా గ్రంధాలయాల్లో పనికొచ్చే పుస్తకాలకంటే, పనికి రాని, ఎవరూ చదవడానికి ఇష్టపడని, ఎవరూ ముట్టుకోని పుస్తకాలే ఎక్కువగా కనిపిస్తాయి.
పుస్తకాల కొనుగోళ్లలో ఆశ్రిత పక్షపాతం, కమిషన్లు, వ్యక్తిగత రాగ ద్వేషాలే అందుకు ప్రధాన కారణం.
గ్రంధాలయాల నిర్వహణ కూడా దయనీయంగా, యాంత్రికంగా వుంటుంది.
ఈ విషయాలన్నీ కవర్ చేస్తూ మరిన్ని గ్రందాలయాలపై పరిశీలనా వ్యాసాలూ, ముఖా ముఖి లు ప్రచురిస్తే బావుంటుంది.
రవి
చక్కగా బావుంది, ముఖాముఖి. పరిస్థితులను చక్కగా ప్రతిబింబించింది.
vinay chakravarthi
good village lo libraray means.chaala great……..
ma village lo building vundi excellent building but no books………memu start cheyaalanukuntunnam but fail avutundane bhayam…peddavaallu teesukelli teesuku raakapote…………
Sreenivas Paruchuri
WHAT! You interviewed the Nutakki librarian!! Could you please send me a note off-line: sreeni at gmx.de నేనా వూళ్ళో అఆల నుండి పదవ తరగతి వరకు చదువుకున్నాను. నా పుస్తకాల పిచ్చికి పునాదులు ఆ వూరి లైబ్రరీలో వున్నాయి.
— శ్రీనివాస్