నిర్జన వారధి — కొండపల్లి కోటేశ్వరమ్మ

వ్యాసకర్త: శ్రీ అట్లూరి
****
నిజానికి ఈ పుస్తకం కోసం విశాలాంధ్ర, నవోదయ బుక్స్ షాప్స్ వెతికించాను. కానీ దొరకలేదు. ఇంకా దాని గురించి ఎక్కువ అలోచించలేదు. తరవాత నేను  ఏ పుస్తకం చదవాలి ఆలోచిస్తుంటే నువ్వు తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది అని చెప్పారు శ్రీ పొట్లూరి  సత్యనారాయణ గారు.  కినిగే లో పుస్తకం కొని దాదాపు గా ఒక నెల పక్కన పెట్టాల్సి వచ్చింది కొన్ని కారణాల వల్ల. మొన్న చదవటం మొదలు పెట్టాను.

ఒక మనిషి జీవితం లో ఇంత బాధ ఉంటుందా! అసలు ఇన్ని బాధలు భరించి ఉండటం సాధ్యమేనా! అమ్మో పుస్తకం పూర్తి చేసాక అర్జెంట్ గా ఒక్కసారి ఆవిడ ని చూసి, ఆవిడ పాదాలు తాకాలని అనిపించింది.

మనం అత్యంత అభిమానించే మనిషి ని ఎక్కువగా దగ్గరగా ఉండకపోవడం వల్ల మనకు అయన అంటే ఉండే సదభిప్రాయం అలాగే ఉంటుంది అని ఉద్దేశం. మనం వారు కూడా మనలాంటి మనిషే అన్నది మనం మనసులో అనుకోకపోవడం వల్ల మనకి వారి మీద ఉండే అంచనాలు ఎక్కువ ఉండటం వల్లన మనం గాయపడుతూ ఉంటాం అప్పుడప్పుడు, అది మనం దూరంగా ఉండటం వల్ల అంతగా ఉండక పొవచ్చు. అలాగే సీతారామయ్య గారు కోటేశ్వరమ్మ గారిని వదిలేసి వెళ్ళిపోయారు అన్నది జీర్ణించుకోవడానికి నాకు దాదాపు గా రెండు రోజులు పట్టింది. ఎంతసేపు హౌ కాన్ హి డు that అని నన్ను నేను ప్రశించుకోవడమే సరిపోయింది.

ఒకరకంగా పెళ్లికి ముందర కోటేశ్వరమ్మ గారి జీవితం ఆనందంగా ఉంది అని అనుకోవచ్చు. పెళ్లి తరవాత ఆవిడ ఎక్కడ సొంతంగా నిర్ణయాలు తీసుకునే విధంగా లేకుండా పోయాయి. సుందరయ్య గారివి, సీతారామయ్య గారివి సిద్ధాంతాలు నమ్మి కమ్మూనిస్ట్ గా ఆవిడ చేసిన త్యాగాలు, ఆవిడ తో పాటు గా ఉన్న వారి త్యాగాలు మరువరానివి, మరచిపొలేనివి.

పిల్లలని కంటే సమస్యలు రావొచ్చు అని డాక్టర్ దగ్గరకి వెళ్ళే దారి కూడా లేక నాటు వైద్యం తో ప్రాణం మీదకి తెచ్చుకోవడం, రోజుల తరబడి తిండి లేకుండా ఉండటం, చవకగా వచ్చే పళ్ళు తిని గడపటం, కొబ్బరి నీళ్ళు తాగి ఎన్నికల ప్రచారం లో తిరగడం, జైలు జీవితం. అన్ని ఒక ఎత్తు.

సీతారామయ్య గారు వదిలేసి వెళ్ళిపోతే ఒంటరిగా జీవిత పోరాటం సాగించడం ఒక ఎత్తు. ముప్పై అయిదేళ్ళకే దాదాపుగా ఒక జీవితాన్ని చూసి, ఆ తరవాత మళ్లీ చదువు ప్రారంభించి మళ్లీ జీవితాన్ని మొదలుపెట్టడం ఇంకో ఎత్తు. ముప్పై అయిదేళ్ళ వయసులో ఒంటరిగా చేతిలో రూపాయి లేకుండా చదువు ప్రారంభించి, పిల్లలకి దూరంగా బతుకు పోరాటం ప్రారంబించి, మధ్యలో జీవితం ఒక గాడిన పడుతోంది అనుకున్న సమయంలో చందు మరణం, రమేష్ మరణం, అరుణ ఆత్మహత్య ఇలా దెబ్బ మీద దెబ్బ తగిలినా మొండి దైర్యంతో జీవిత పోరాటాన్ని సాగిస్తున్న కోటేశ్వరమ్మ జీవితాన్ని ఏంతో ఆదర్శం గా తీసుకొవచ్చు.

నమ్ముకున్న పార్టి , రెండు ముక్కలు కావడం, రెండింటికి నెల నెల పది రూపాయిలు పంపడం లాంటివి చదువుతుంటే బాధవేస్తుంది. సీతారామయ్య గారు పోయినప్పుడు పార్టి రాకపోవడం మనషులు, మనష్యుల కన్నా పార్టికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం చాల అశ్యరాన్ని కలిగిస్తుంది. అలాగే మోటూరి ఉదయం గారి మీద సుందరయ్య గారి మీద వ్యాసాలు మనకి తెలీని చాల విషయాలు మనకి తెలియజేస్తాయి. తప్పక చదవాల్సిన పుస్తకం.

***
ఈ పుస్తకంపై జంపాల చౌదరి గారి పరిచయం ఇక్కడ.

You Might Also Like

2 Comments

  1. D.L.vidya

    నిర్జన వారధి చదివాక ఆమె పాదాలు తాకాలనిపించింది అన్నారు.నాకూ అలాగే అనిపించింది.ఆమెలో నాకు అపూర్వంగా అనిపించిన విషయాలు, తన కస్ట్తాల గురించీ,తనను కస్టపెట్టినవాళ్ళ గురించీ, చాలా మామూలుగా రాయడం,ఏ భావోద్వేగమూ కనపడనీయకుండా. కానీ ఆ భావోద్వేగం మనకి మాత్రం కలుగుతుంది.కమూనిస్టులలోనూ మంచివాళ్ళూ ఉంటారు వేరే వాళ్ళూ ఉంటారు అనే రాసేరు కానీ చెడ్డవాళ్ళు అన్న పదం కూడా వాడలేదు.భర్త నుంది విడిపోవలసిన పరిస్తితులు వచ్చినా ఆయనని పన్నెత్తు మాతైనా అనని ఆమె ఆయన బాధపదుతూ చూదాలనుకుంటున్నా ఆత్మాభిమానం వల్ల వెళ్లడానికి ఇష్టపడలేదు. కరకుగా అలాగే ఉండిపొక నలుగురూ చెబితే నిర్వికారంగా వెళ్ళనూ వెల్లింది. ఆయన పోయినప్పుడు ఆయనలోని ఒకప్పుడయినా తను అనుభవించిన మంచిని గుర్తుచేసుకుని బాధతో స్పందించింది.పుచ్చలప్ల్లి సుందరయ్యలాంటి ప్రముఖులతో దగ్గర పరిచయాలున్నా కష్ట్కాలంలో కూడా ఎవరి ఇళ్ళలోనూ ఉండలేదు.ఉద్యోగం సంపాదించగల చదువు లేకపోయినా, అప్పుడు చదువుకుని చిన్న ఉద్యోగం చేసుకుంది శ్రీమంతుల ఇంట్లో పుత్తిన ఆమె.మంచి రచనలు చేయగలిగిన ఆమె బ్రతుకుతెరువుకి కళనిగాక శ్రమనే నమ్ముకుంది.(ఆమె కధలూ,కవిత్వాలూ రాశేరు,సంగీతం వచ్చును
    మంచి కంఠం, కానీ వాతి వేటినీ బ్రతుకుతెరువుకు ఉపయోగించుకోలేదు.)అత్తమీది బొమ్మలో మంచి చీరలో నగలతో చాలా అందంగా కనిపిస్తారు.అయినా నగల మీద మోజు ఉన్న మనిషి కాదు.ఎన్నోసార్లు తన నగలని త్రుణప్రాయంగా సమర్పించిన మనిషి,హ్రుదయ నిరాడంబరత్వం అంతే అది.నగలు ఒంతిప్యిని లేకుండా ఉందదమూ నిరాడంబరత్వమే,కానీ అది హ్రుదయంలో కూదా ఉండదం అసలైన నిరాడంబరత్వం. నగలూ తాలీ గాజులూ ధరించని ఉదయం లాంతి వాళ్ళు కూడా మనకి దర్సన్మిస్తారు ఈ పుస్తకంలో.కోతెస్వరమ్మ హ్రుదయం నిరాడంబరం కాబట్తి ఆమె నగలు ధ్రించే దాంబికురాలిలా అసలు అగుపించరు.నగలు ధరించదమే ఆదంబరం అనే నిర్ణయంలో ఉన్నవళ్ళు ఆమె హ్రుదయనిరాదంబరత్వంలో లీనమైపోయి ఆమె వొంతిమీది నగలపై ద్రుష్టి నిలపనేలేరు.ఆమె జీవితం కష్టాల మయం. కొదుకు చందూ మీద ఆమె రాసుకున్న కవిత చదువుతూ ఉంటే మనసూ రోదించి గొంతు గద్ఘధం అయిపోతుంది.ఈకాలంలో మనం రంగనాయకమ్మగారి పుస్తకాలు చదివి,సింపుల్ మేరేగిని,బొత్లూ,తాలీ,గాజులూ,నగలూ కోరని నిరాదంబరత్వాన్నీ ఆరాధనాపూర్వకంగా మనసులో కలల్లో కల్లలో నింపుకుంతున్నామే, అవ్న్నీ ఆమె కాలంలో కమ్మూనిష్తుల్లో ఉందేవి అని ఆమె పుస్తకంలో తెలుస్తుంది.ఆమె గొప్ప కమ్మూనిష్త్,గొప్ప క్షమా గునం,ఆత్మగౌరవం గల మనిషి.ఆత్మగౌరవం క్షమా గుణానికి విరుధ్యం కాదు.తొంభై రెండేల్ల వయసులో చిన్నప్పట్నించీ జరిగిన విషయాలనన్నిటినీ గుర్తుచేసుకుని ఒక చరిత్రాత్మక గ్రంధం రాశేరు ఆమె.నిర్జన వారధి కేవలం ఆత్మ కధే కాదు, అది ఓ చరిత్ర పుస్తకం కూడా,ఓ వినూత్న కలాఖందం కూడా.ఆ కరుణామయికి మనహ్పూర్వక పాదాభినందనాలు.

  2. Mauli

    @ఒకరకంగా పెళ్లికి ముందర కోటేశ్వరమ్మ గారి జీవితం ఆనందంగా ఉంది అని అనుకోవచ్చు. పెళ్లి తరవాత ఆవిడ ఎక్కడ సొంతంగా నిర్ణయాలు తీసుకునే విధంగా లేకుండా పోయాయి. సుందరయ్య గారివి, సీతారామయ్య గారివి సిద్ధాంతాలు నమ్మి కమ్మూనిస్ట్ గా ఆవిడ చేసిన త్యాగాలు, ఆవిడ తో పాటు గా ఉన్న వారి త్యాగాలు మరువరానివి, మరచిపొలేనివి.@

    Correct

Leave a Reply