ఆటా గలాట్టా గురించి
వ్రాసిన వారు: రహ్మానుద్దీన్ షేక్
బెంగుళూరు వాసులకు ముఖ్యంగా కోరమంగళ పరిసర ప్రాంతాల వారికి అతి చేరువలో ఒక తెలుగు పుస్తకాల అంగడి ఉంది. ఈ దుకాణం వెలసి దాదాపు ఆరు నెలలవుతోంది. ఆటా గలాట్టా అనే పేరుతో కోరమంగళ మొదటి బ్లాక్ దగ్గరలో ఒక భవ్యమయిన మూడంతస్తుల భవనంలో ఉందీ పుస్తకాల క్రయశాల. కింద భాగంలో బేకరీ, పైన పుస్తకాల అంగడి, మధ్యలో ఖాళీ స్థలం – ఇది హ్యారీ పాటర్ లో రూం ఆఫ్ రిక్వైర్మెంట్ వంటిది. ఆ ఖాళీ స్థలం ఓ రోజు పుస్తకావిష్కరణ సభకు సాక్ష్యమయితే, మరో రోజు నృత్య ప్రదర్శనకు వేదికవుతుంది. నాటకాలు, పుస్తక-కవితా-కథా పఠనాలు, వర్క్‍షాపులు, పుట్టిన రోజు పండుగలు; ఒకటేంటి ఆ ఫ్రీ ఓపెన్ స్పేస్ లో అన్నీ ఫైన్ ఆర్ట్సూ వెలుస్తాయి.
ప్రముఖ రచయితలతో అట్టహాసంగా మొదలయిన ఈ అంగడి, తెలుగు విభాగంలో వేయి పడగలు, అమరావతి కథలు మొ॥ప్రముఖ పుస్తకాలు మధుబాబు, యండమూరి, రంగనాయకమ్మ మొ॥ ప్రముఖ రచయితల పుస్తకాలతో కళకళలాడుతూ ఉంటుంది. తెలుగే కాకుండా, ఇక్కడ తమిళ-మళయాళ-కన్నడ-హిందీ-ఆంగ్ల పుస్తకాలు కూడా దొరుకుతాయి. కేవలం భారతీయ పుస్తకాలనే అమ్మనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
చిరునామా:
2nd Main Rd, Koramangala 1st Block, Ejipura, Bengaluru.
ఫోన్: 080-30181626
పనివేళలు: ఆది, మంగళ-శని: 11:00–20:00; సోమ: సెలవు
వీరిగురించి టైంస్ ఆఫ్ ఇండియా లో, హిందూలో వచ్చిన పరిచయ వ్యాసాలు వరుసగా ఇక్కడ మరియు ఇక్కడ చదవవచ్చు.
rahimanuddin
ఓ రెణ్ణెల్ల క్రితం ఆట్టాగలాట్టా వారి అంగడి చిరునామా మారింది. కొత్త చిరునామా :
134, 1st A Main Road KHB Colony, 5th Block Koramangala Bangalore, Karnataka 560095
080 3018 1626
ఇది హొసూర్ రోడ్ లో ఫోరం మాల్ తరువాత వచ్చే సెంట్ జాన్స్ హాస్పిటల్ ముందు వచ్చే సందులో ఉంది. కోరమంగల నుండి వచ్చే వారు జ్యోతి నివాస్ కాలేజీ వైపు వస్తే, కాలేజీ ముందే ఆట్టా గలాట్టా ఉంటుంది.
కొత్తగా ఆంధ్ర నగరి అనే పుస్తకం అందుబాటులో ఉంది.
ఇంకా మధుబాబు, యండమూరి, రంగనాయకమ్మ, రావి శాస్త్రి మొ॥ వారి రచనలు చూడవచ్చు.
suchithra sidlagatta
చాలా రోజులుగా, బెంగళూరు లో ఒక తెలుగు పుస్తకాల షాప్ ఉంటే ఎంత బాగుండేది అనుకుంటున్న నాకు మీ టపా ద్వారా సమాధానం దొరికింది. ధన్యవాదాలు.
can’t wait to visit it.