దర్గామిట్ట కతలు

దర్గామిట్ట కథలు

“దర్గామిట్ట కతలు” — ఈ పుస్తకం బావుంటుంది.. చదవమని చాలా మంది చెప్పారు.. అయినా ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చా.. చివరికి మొన్నా మధ్య పుస్తకోత్సవం (బెంగళూరు) లో కూడా పెద్ద పట్టించుకోలేదు.. కొన్ని పుస్తకాలు తీసుకుని, కౌంటర్ దాకా వెళ్ళిన తరువాత హంపీ నుండి హరప్పా దాకా గుర్తుకు వచ్చింది.. మళ్ళీ వెనక్కి వచ్చా..  అది దొరకలేదు కానీ, ఈ పుస్తకం కనిపించింది.. తీసుకుందామా, వద్దా అని కాసేపు ఊగిసలాడి సరే ఎలా ఉంటుందో చూద్దామని తీసుకున్నా..

పుస్తకం పేరు చూసి, హైదరాబాద్ లో ఏ పాత బస్తీ కి సంబంధించిన కధో అనుకున్నా.. దర్గా మిట్ట నెల్లూరులో ఉంది అని తెలుసు కానీ, ఈ రెంటిని అన్వయించుకోలేకపోయా.. ఇది వ్రాసింది ముస్లిం, అదీనూ పాత బస్తీ కి సంబంధించినది కాబట్టి హిందువులతో పడ్డ గొడవలూ, అవీ-ఇవీ ఉంటాయేమో అనుకుంటూ పుస్తకం తెరిచా (ముందు మాట చదివే వరకూ ఇదే అభిప్రాయం!)..

కతల వెనక కత చదివేసరికి అప్పటివరకూ ఉన్న అభిప్రాయం మొత్తం మారిపోయింది.. వెనక కధే ఇలాగుంటే ఇక ముందున్న కధలు ఎలా ఉన్నాయో అనుకుంటూ, గబగబా పేజీలు తిప్పా..

************************************************************************************

సేమ్యా పాయసం, సేమ్యా ఉప్మా అంటూ తినడమే తప్ప సేమ్యాలు ఎలా వస్తాయో, వాటి తయారీ విధానం ఎలానో తెలుసా.. అసలు వాటిని చేత్తో కూడా తయారు చేయచ్చు అనే సంగతి తెలుసా..?! అయితే అర్జెంటుగా “సేమ్యాల ముగ్గు” చదవాల్సిందే…

కొరియాలో ఉన్నప్పుడు మా గెస్ట్ హౌస్ లో వారానికి రెండు సార్లు చేపల వంటాకాలు ఉండేవి.. మా స్నేహితులు బావుంది, బావుంది అంటూ లొట్టలు వేసుకుని తినే వాళ్ళు.. ఒకసారి అడిగా, అవి ఏ రకం చేపలు అని? దానికి మాకేం తెలుసు.. తినడం మాత్రం మహ బాగా తెలుసు అని చక్కా పోయారు! చేపల్లో సముద్రం చేపలు, మంచినీటి చేపలు మళ్ళీ వాటిల్లో ఎన్నో ఉపరకాలు.. అవన్నీ ఏంటా అని కుతూహలంగా ఉందా.. అయితే “చీదరలు – వంజరాలు” చూడండి మరి.. మాకు ఆల్రెడీ అన్ని రకాలు తెలుసంటారా.. అయినా కూడా చదవాల్సిందే.. మరి డబుల్ చెక్ చేసుకోవాలి కదా!!

ఇంట్లోని పిల్లలందరిలో పెద్దవాళ్ళకి ఉండే గౌరవమూ అదీ, చిన్నవాళ్ళకి ఉండే గారాబమూ ఇదీ, మధ్యలో వాళ్ళకి ఉండదు.. మరి ఆ పెద్దోళ్ళలో చిన్నోడు – చిన్నోళ్ళలో పెద్దోడు ఎన్ని నకరాలు చేశాడో తెలియాలంటే ఆలస్యం చేయకుండా “నేను నేలలో – మా అమ్మ బెంచీలో” కి పేజీలు త్రిప్పండి..

అన్నీ చిలిపి, తుంటరి పనులేనా ఇంకేలేవా అంటే.. మనసు మూగవోయే “మా అన్నే గానీ చదివుంటే”, ” బాగారంగడిలో నౌకరి” కూడా ఉన్నాయి… “నమ్మకం పోతే పనోడు బతికిన ఒకటే, సచ్చినా ఒకటేరా “ అని ఒక్క మాటలో జీవిత సత్యాన్ని చెప్పే కధలు కూడా ఉన్నాయి..

అయినా అది త్రికోణమితి, ఇది జ్యామితి అంటూ వర్గీకరించడానికి ఇవేమీ లెక్కలు కావు.. జీవితం.. లెక్కల్లో పట్టబధ్రుడైన ఒక వ్యక్తి జీవన గమనం.. మనసు పొరల్లో హత్తుకు పోయిన ఘటనలు.. కళ్ళ ముందు జరిగిన నిలువెత్తు సంఘటనలు..

ఈదేసిన గోదారి, దాటేసిన కష్టాలు తీయగా ఉంటాయంటారు ముళ్ళపూడి వారు.. మరి అలాంటి మహానుభావుడితో ముందుమాట వ్రాయించి మరీ మన ముందుకు ఈ కధలు తీసుకు వచ్చారు ఖాదిర్ బాబు గారు.. ఇంతకీ మీకు ‘ఖ’ ఎలా పలకాలో తెలుసా.. అయితే “మీసాల సుబ్బరాజు” కధ చదవాల్సిందే..  🙂

**********************************
దర్గామిట్ట కతలు (Dargamitta Kathalu – Khadeer babu)
-మహమ్మద్ ఖాదిర్ బాబు
కావలి ప్రచురణలు
వెల – 60/-

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసం రాసినవారు: మేధ

You Might Also Like

37 Comments

  1. ANILREDDY

    ఖాదిర్ బాబు గారు రాసిన దర్గా మిట్ట కథలు, పోలేరమ్మ బండ కథలు..మరియు మెట్రో కథలను ఇక్కడ పొందవచ్చు…..

    https://www.kahaniya.com/87034bb7ca49f28de66f64c12c4eca

  2. Manohar Mane

    దుర్గా మిట్తా కథలు,అమరావతి కథలు రెండు గొప్ప పుస్తకలే.
    ఒకదానితోమరోదాన్ని పోల్చటం సభబే కాని ఒకటి బాగా లెదనటం
    సరికాదు.నిజంగా రెండు మంచి పుస్తకాలే.

  3. Manu

    il just say they r wondrful.

  4. Swetha

    నేను దర్గా మిట్ట కథలు మరియు పోలేరమ్మ బండ కథలు పుస్తకాల కోసం చాల వెతికాను కానీ దొరకలేదు. ప్లీజ్ ఎవరి డెగర ఐన ఉంటె నాకు షేర్ చేయండి. థంక్ యు

    1. సుదర్శన్

      విశాలాంధ్ర బుక్ హౌస్

    2. Anil kumar

      Flipkart lo undi… Nenu e roje order petta

  5. hazarath reddy

    ఈ పుస్తకం గురించి చాలా చోట్ల వెతికాను. కాని ఎక్కడా దొరకడం లేదు. ఈ పుస్తకం ఎవరి దగ్గరైనా ఉంటే సమాచారం అందించగలరు. జెరాక్స్ తీసుకుని వెంటనే మీకు అందివ్వగలను. పుస్తక ప్రియులు అర్థం చేసుకోగలరని మనవి. పుస్తకం ఉన్న యెడల ఈ నంబర్ కి కాల్ చేయలగలరు.
    9959977511

    1. Anil kumar

      Flipkart lo undi… Try there

  6. P Balasundaram

    chaala baagundi

  7. NOOR AHAMED

    “దర్గామిట్ట కతలు” పుస్తక పరిచయాన్ని చూసాకా ,చాలా రోజులు తరువాత ఓ బాల్య స్నేహితుడిని మళ్లీ కలుసుకున్న అనుభూతి కలిగింది .ఆంద్ర జ్యోతి లో క్రమం తప్పకుండాఈ కథల్ని చదివే నేను ..అది పుస్తకం గా వచ్చాక ,నేను మా నాన్న తో గొడవపడి డబ్బులు తీసుకుని ( ఎందుకంటే ,అప్పటికి నేను సంపాదనా పరుడిని కాదు )ఆ డబ్బులని మనియార్డరు చేసి పుస్తకాన్ని తెప్పించుకొని ,బైండింగు చేయించుకొని అపురూపం గా దాచుకున్న ఆ “జ్ఞాపకం” ఇప్పటికీ..అపురూపమే!! ఖదీర్ బాబూ కనిపిస్తే ..నల్లా వెంకటరెడ్డి ఎలా ఉన్నాడో అడగాలని ఉంది .

    1. hazarath reddy

      నూర్ అహ్మద్ గారు నమస్తే. నా పేరు హజరత్ రెడ్డి 99 టీవీలో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. మీ దగ్గర దర్గామిట్ట కథలు బుక్ ఉంటే తెలుపగలరు. జిరాక్స్ తీసుకుని వెంటనే అందివ్వగలను. ఈ పుస్తక మిత్రుడి వేదన అర్థం చేసుకోగలరని మనవి. ఈ విషయంపై సమాచారం 9959977511 ఈ నెంబర్ కు అందివ్వగలరు

  8. jaya

    avunu nenu chadivaanu..chaduvtune unnanu….buluganTe bulugaa venkaTReDDaa, palleToori shadeelojajjanaka, naa peru peTTindi meesala subbaraju…aalif bete..maa nayannamaku gori kaDite, maa amma poola vyaparam..paapamanta maa ammakenanTa…ee kadhalloni patralu mana munde tirugutu mana madhyane unna bhavananu kaigistaay….kaLLaku kaTTinaTlu raasina mohammad khadir ( aa khaa elaa palakaalo..pustakam chadivinaa naaku raaledu :P) babu gaaru nijamgaa bhinandaneeyulu…chadivi daachukuni..malli malli chadivi aanandinchalsina pustakam 🙂

  9. Ahmad

    I read the short story (Semya Muggulu) in Sakshi Paper. Khadir Babu is excellent and unique. I surprised after reading the story. He is not complaining about the society. He tried to introduce common Andhra Muslim’s life style. I am happy and proud being a telugu litereature reader.

  10. Ravindranth Nalam

    Eee pusthakam eppudu chadivina manasu vo vintha anubhoothi ki guri avuthundi. Anni pustakalu andariki nacha vala sina pani ledu. Kaani eee pustakam manalni thatti lepu thundi. Samajam lo ni vivksha antarleenam ga manaku telustayi. Chaalamandi kurra vaallu, maa chinna thanam lo, “saayubu pillalla tho thiragadduraa” ane maata costa zilla lo vine untaru.

    Endukani eee vivaksha, jeevana madhuryam panchu ko neekunda chadastapu pedda vallu mana baalyanni chidimesaaremo. Mana kallaku poralu kramme laaga chesaremo. Lenatlyithe mana anda ri ki khadeer babu lanti mitru lu unde vaaru.

    Naa pustaka la beeruvu ki andam thechchina naaa manasuku entho nachina pustakam Darga mitta kathalu. Naa chinni library lo Malladi,Sreepada,Chalam,Kodvatiganti,Illeramma,Naamini, Amaratvathi, Kadhala prakkana, konte gaa navvuthu, chadivina tharuvaatha mana lanu arthi gi gurihesthu, mithunam laaga aaa kattu kune eee pustakam , abba entha manchi pustakamo kadaa. Eee madhya vachina Saleem gaari katha llo rani gaaru kooda mareee nachestunnadi.

  11. Suresh

    khadeer baabu phone no. : 9705348198. Aadito matladalante ee no. use chesukovachchu. aademee feel kaadu.

    Ativrushti

  12. srinu.kudupudi

    lalitha sravanthi garu…!
    !meeku “james band “cinemalu nacchinattu.. ,
    mana viswanadh gari cinemalu “swathi mutyam,sagara samgamam”..nacchavanukontaa…
    alaa ani viswanadh garu “kalatapaswi “kadu analemu kadaaa?!
    ee.. storys meeku nacchakapovadam ….????!!!

  13. srinu.kudupudi

    “దర్గామిట్ట కతలు” పుస్తక పరిచయాన్ని చూసాకా ,చాలా రోజులు తరువాత ఓ బాల్య స్నేహితుడిని మళ్లీ కలుసుకున్న అనుభూతి కలిగింది .ఆంద్ర జ్యోతి లో క్రమం తప్పకుండాఈ కథల్ని చదివే నేను ..అది పుస్తకం గా వచ్చాక ,నేను మా నాన్న తో గొడవపడి డబ్బులు తీసుకుని ( ఎందుకంటే ,అప్పటికి నేను సంపాదనా పరుడిని కాదు )ఆ డబ్బులని మనియార్డరు చేసి పుస్తకాన్ని తెప్పించుకొని ,బైండింగు చేయించుకొని అపురూపం గా దాచుకున్న ఆ “జ్ఞాపకం” ఇప్పటికీ..అపురూపమే!! ఖదీర్ బాబూ కనిపిస్తే ..నల్లా వెంకటరెడ్డి ఎలా ఉన్నాడో అడగాలని ఉంది .

  14. srinu.kudupudi

    “దర్గామిట్ట కతలు” పుస్తక పరిచయాన్ని చూసాకా ,చాలా రోజులు తరువాత ఓ బాల్య స్నేహితుడిని మళ్లీ కలుసుకున్న అనుభూతి కలిగింది .ఆంద్ర జ్యోతి లో క్రమం తప్పకుండాఈ కథల్ని చదివే నేను ..అది పుస్తకం గా వచ్చాక ,నేను మా నాన్న తో గొడవపడి డబ్బులు తీసుకుని ( ఎందుకంటే ,అప్పటికి నేను సంపాదనా పరుడిని కాదు )ఆ డబ్బులని మనియార్డరు చేసి పుస్తకాన్ని తెప్పించుకొని ,బైండింగు చేయించుకొని అపురూపం గా దాచుకున్న ఆ “జ్ఞాపకం” ఇప్పటికీ..అపురూపమే!! ఖదీర్ బాబూ కనిపిస్తే ..నల్లా వెంకటరెడ్డి ఎలా ఉన్నాడో అడగాలని ఉంది .

  15. raamudu

    చిత్రమైన పరిస్తితి. ఇక్కడ వార్తలని చదువుతున్న వాళ్ళు కొద్దొ గొప్పొ కలిగిన వాళ్ళే అయ్యుంటారని నా ఉద్దేశం. వీళ్ళె పుస్తకాలని Photocopy చేసి పంపమంటున్నారు. వ్రాసె వాళ్ళకు అమ్మే వాళ్ళకు ప్రోత్సాహాం యెక్కడి నుంచి వస్తుంది? కొంచెం ఆలొచించండి………………….

  16. Sathish

    babu ….annayya…

    Konchem aa book naaku mail chestava…plese tell me. I will give my mailid. Zerox teyinchukoni istanu ventane neeku pamputanu.

    vuntanu …tondaraga reply iyyi …..

  17. Sathish

    babu ….annayya…

    Konthem a book naaku mail chestava…plese tell me. I will give my mailid. Zerox teyinchukoni istanu ventane neeku pamputanu.

    vuntanu …tondaraga reply iyyi …..

  18. jallipalli krishna rao

    ఈ అన్ని కథలకంటే నాకు అమరావతి కథలు చాల బాగా నచ్చాయి. ఆంధ్ర జ్యోతి లో చదివాను. పుస్తకంగా వచ్చాక కొన్నాను కూడా. పత్రికలో చదివేసిన తరువాత కూడా పుస్తకాన్ని కొన్నాను అని అంటే అర్థం (నేనే కాదు… చాలా మంది చాలా పుస్తకాలని … పత్రికలలో చదివేసిన తరువాత కూడా కొంటుంటారు) అది తప్పక గొప్ప రచన అని అర్థం. అమరావతి కథలని హిందీ వారు టి.వి కథలుగా నిర్మించారు. తరువాత వాటిని మనవారు డబ్బింగ్ చేసి ప్రసారం చేసారు. అంత గొప్ప పుస్తకం అమరావతి కథలు. శంకరమంచి సత్యం గారు దీని రచయత.

  19. ఆరి సీతారామయ్య

    దర్గామిట్టా కథలు నచ్చిన వారికి నామిని సుబ్రమణ్యం గారి పచ్చనాకు సాచ్చిగా, సోమరాజు సుశీల గారి ఇల్లేరమ్మ కథలు కూడా నచ్చవచ్చు.

  20. p.masthan khan

    durgamitta -kathalu…..a collection of short stories encountering mal perception of the life.a condition which we can see in this collection is the touch of sensitive human relations…in the explosive fragmented lives of the contemporary society.

    experiences of the writer is narcotive in such descritions beyond the language and text of the collection.
    writer has to change alittle bit model of conversation in the story..
    be creative while ur writing ..and thinking …lenin dhanisetty,vaddera chandi das ,ellora,influenced me a lot in the writing style of the stories..

  21. శ్రీరామ్ వేలమూరి

    లలితాస్రవంతి గారూ ,పదుగురికీ నచ్చినవి మీకుకూడా నచ్చాలని ఎక్కడా లేదు.అసలు అమరావతి కధలతో దర్గామిట్ట కధలను పోల్చటం సరి కాదు. వంశీ గారి పసలపూడి కధలు, బీవిఎస్ రామారావు గారి గోదావరి కథలు,నామిని వారి సినబ్బ కథలు వాటికవే ప్రత్యేకం,మనకు పరిచయం లేని ప్రాంతాల నాగరికతల్లోకి మనలని ఆయా రచయితలు తీసుకువెళ్ళి ,ఆ యాసలలో మాట్లాడించి నప్పుడు మనకు కలిగే అనుభూతులు వైయుక్తికాలు .

  22. poornima

    I read one very good review on the same in poddu. I think it was written by Sodhana sudhakar garu.

  23. lalithasravanthi

    దర్గా మిట్ట కథల గురించి చాలా గొప్పగా విని, కొందరి బలవంతం మూలాన నేను చదివాను
    విచిత్రం ఏంటి అంటే ఎంతో గొప్పగా విన్న పుస్తకం ఇంతేనా అనిపించింది
    నిక్కచ్చిగా చెప్పాలి అంటే” నాకు అస్సలు నచ్చని పుస్తకం”
    కారణం…….నా దృష్టిలో కథ అంటే ఒక అనుభూతిని కలిగించేది, కథ అప్పుడే అయిపోయిందా అనిపించాలి, ఆ కథలోని ప్రతి పాత్రలో మనల్ని మనం చూడగలగాలి, పుస్తకం మూసినా కూడా ఆ అనుభూతిలో గడపగలగాలి, ఆ కథని ప్రతి నిత్యం ఏదో రూపం గా చూడగలగాలి
    ఇంకా ఆశ్చర్య పోయింది ఎందుకంటే దీనికి ముందు మాట రాసింది ముళ్ళపూడి వారు
    అమరావతి కథలు ఒక్క సారి చదవండి, 2 పుటలలో ఎంతో లోతైన భావన్ని చెప్తారు రచయిత. దీనికి కూడా ముళ్ళపూడి వారే ముందు మాట రాసింది, అది చూసే కొన్నా కూడా
    ఈ పుస్తకం లో మాత్రం ఆయనే నన్ను బోల్తా కొట్టించారు
    ఎంతో మంది గొప్పగా చెప్పే కథలు, నాకు చాలా మామూలుగా అనిపించాయి. అలాంటి సన్నివేశాలు ప్రతి ఒక్కరి జీవితం లో ఉంటాయి, అంత గొప్పవా చెప్పుకోవడానికి ఏమీ లేదు, ప్రతి ముస్లిం పేద కుటుంబం లో జరిగే కథలే అవి.

    1. g b sastry

      Ms Poornima gaaru,
      Sri M B S Prasad gaaru has written a book by name Kshetra kadhalu. where in he dealt extensively on Amaravati kadhalu,Sinabba kadhalu,darga mitta kadhalu.
      Suggest you read them for a different perspective view of subject stories you can be assured that Sri Mullapudi gaaru mimmani bOltaa koTTincha lEdu

  24. మేధ

    @వేణూ శ్రీకాంత్: ఏ ఇద్దరు మనుషులు ఒకేలా వ్రాయలేరు కదా.. కాబట్టి మీరు కూడా త్వరలో ఈ పుస్తకమ్మీద వ్రాయాలని మనవి…

  25. వేణూ శ్రీకాంత్

    హా మేధ గారు, ఎప్పుడో చదివిన ఈ పుస్తకం పై వ్యాసం రాయాలని మళ్ళీ నిన్ననే తిరగేసాను ఈ లోగా మీరు రాసేసారు 🙂 చాలా మంచి పుస్తకం. మీ పరిచయం కూడా చాలా బాగుంది.

  26. మేధ

    @పూర్ణిమ: మరి ఎప్పుడు కొంటున్నారు..?!

    @రవి: ఓహ్ అలాగా.. మరి అయితే ఇంకెందుకాలస్యం మొదలెట్టేయండి!

    @Dreamer: ఆ పుస్తకం పేరు కూడా విన్నాను.. కానీ ఇది చదివిన తరువాత చూద్దాం లే అని, తీసుకోలేదు.. ఈ సారి తప్పకుండా చదవాలి…

  27. Dreamer

    దీని తరువాయి భాగం పోలేరమ్మ బండ కూడా చాలా చాలా బావుంటుంది (దీనికన్నాకూడా).
    ఆ పుస్తకం చదివి నేనూ మా తమ్ముడూ ఒక నెలరోజులుపాటు నెల్లూరుయాసలో మాట్లాడుకున్నాం, అంత నచ్చేసింది పుస్తకమూ, నెల్లూరు యాసా కూడాను 🙂

  28. రవి

    చిన్నప్పుడెప్పుడో ఈ పుస్తకం ఆంధ్రజ్యోతి లో కథల రూపంలో వచ్చేప్పుడు, చదివినట్టు గుర్తు. ఇప్పుడొకటీ గుర్తు లేవు. ఈ సారి చదవాలి.

  29. పూర్ణిమ

    హహహ.. నేనిప్పుడు ఆ “నాకేంటి?” సినిమానే చూస్తున్నా! 🙂

  30. సౌమ్య

    @purnima: పుస్తకం.నెట్ పుస్తకాల కొనుగోలుకి ఈ విధంగా పనికొస్తోందన్నమాట. పబ్లిషర్ల దగ్గరికెళ్ళి పుస్తకం.నెట్ టీం “నాకేంటి?” అని కోటా శ్రీనివాస రావు లా అడిగితే ఎలా ఉంటుంది అన్న దృశ్యం ఊహించుకుంటున్నా. :))

  31. పూర్ణిమ

    బాగుంది! ఇప్పటికిప్పుడు చదివేలా రాశారు, కానీ నా దగ్గరీ పుస్తకం లేదాయె! ఖచ్చితంగా కొనాల్సిందే!

Leave a Reply