Tree, My Guru – పరిచయం

వ్యాసం వ్రాసిన వారు: కే.చంద్రహాస్
******

(కేశవరావు గారు మే 6న కన్ను మూశారు. వారి మృతితో మనం ఒక మంచి అనువాదకుణ్ని కోల్పోయాం. ఇస్మాయిల్ కవితలకు ఆయన చేసిన అనువాదం Tree,My Guru. ఆ పుస్తకం గురించి ఒక చిన్న వ్యాసం.)

కవిత్వం అంటే చిక్కదనం. ఒక మాటకూడా ఎక్కువ వుండదు. భావం విశాలం, అప్పుడప్పుడూ నిగూఢం, నిక్షిప్తం. కవి రాసిన అక్షరాలకు రెక్కలొచ్చి, దూరతీరాలకు ప్రయాణం చేస్తాయి. కొత్త కొత్త అందాలని సంతరించుకుంటాయి గేయాలు. చదువరి హృదయంలోతులను శోధిస్తాయి. నిక్షిప్తమైన భావాలను ఒక్కసారిగా ఎగదోస్తే అవి పైకి ఉబికి ప్రవాహంలా పొంగి పొర్లుతాయి. ఒక్క కవిత్వానికే ఇంత మహత్తు వుంది. ఇంకే సాహిత్య ప్రక్రియకూ ఇంత power లేదు. ఇస్మాయిల్ (1928-2003) రాసిన 35 తెలుగు కవితలను ఇంగ్లీషులోకి అనువదించి, పేజీకి ఒకవేపు ఇంగ్లీష్ ఇంకోవేపు తెలుగు ఎదురెదురుగా ప్రచురించారు. పుస్తకం title “Tree, My Guru” ఒక కవిత శీర్షిక కూడా. కవిగా ఇస్మాయిల్ తెలుగువారికి సుపరిచితులే. కాకినాడ వాస్తవ్యులు. దేవులపల్లి కృష్ణ శాస్త్రి తన గురువని చెప్పేవారు. రవీంద్రులంటేనూ ఇష్టమే. ఆయన హైకూలు రాసారు. తక్కువలో ఎక్కువ భావాన్ని ప్రదర్శించిన కవులలో ఇస్మాయిల్ అగ్రగణ్య్లులుగా చెపుతారు.
అనువాదకులు D. కేశవరావు గారైనా, చాలా సంవత్సరాలుగా తను, కవి ఇద్దరూ కలిసి అనువదించామని ఆయనే చెప్పారు ముందుమాటలో. తమ్మినేని యదుకుల భూషణ్ ఈ పుస్తకం ద్విభాషా ప్రచురణకు పూనుకున్నారు. యదుకుల భూషణ్ రాసిన పరిచయం ‘The Eternal Child’ గా పుస్తకంలో ముద్రించారు. మచ్చుకి కొన్ని గేయాలు రెండు భాషల్లో:

చెట్టు నా ఆదర్శం
తరుచాపము వీడిపోయి
గురిమరచిన బాణంలా
తిరుగాడును పిట్ట.

ధరణి గుట్టు తెరవబోయి
బిరడాలో ఇస్క్ర్రూలా
ఇరుక్కున్న పురుగు.

పురుగుసగం, సగం పిట్ట
ధరనుచొచ్చి, దివినివిచ్చి
విరులుతాల్చు తరువు.

Tree My Guru
Flung from the tree-bow
The sparrow flits
like a forgetful arrow.

The worm
wriggling to uncork
the secret earth,
gets stuck like a corkscrew.

Part worm, part bird,
the tree,
probing the earth and spanning the sky
gets crowned with flowers.

పాట
సెలయేరా, సెలయేరా!
గలగలమంటో నిత్యం
ఎలా పాడగలుగుతున్నావు?

చూడు, నా బతుకునిండా రాళ్ళు.
పాడకుంటే ఎలా?

Song
How can you sing,
O stream,
that interminable murmuring song?

Look, how can I stop singing?
–my life is full of stones.

Boulevards of Paris
ఇటిక మీద ఇటిక పేర్చి
ఈ మహనగరాన్ని నిర్మించారు.
ఐతే, అది బతకలేదు.

అప్పుడు చెస్ట్ నట్ చెట్ల వరసల
పచ్చటి బాకుల్ని
ఆ శవం గుండెల్లోకి
కస్సుమని దింపారు.

అప్పుడది లేచి
అద్భుతంగా పాడింది.

Boulevards of Paris
They built this city
brick by careful brick,
but it did not live.

Then they stabbed
the heart of the corpse
with rapiers of chestnut-rows:

the city then woke up
and sang magnificently.

సృష్టి
ఆడదీ, మగాడూ
ఏమి సృష్టి!
ఒకళ్ళ ఆనందాని కొకళ్ళు
వత్తీ, మంటలా.

ఆడదీ, మగాడూ
ఒకళ్ళ నాశనాని కొకళ్ళు
వత్తీ, మంటలా.

Creation
Man and Woman—
a strange creation:

each for the other’s happiness,
like a wick and a flame;

each for the other’s perdition,
like a wick and a flame.

చార్లీ చాప్లిన్
నా చిన్నప్పుడు కడుపుబ్బించే
నవ్వుమాత్రలిచ్చి
జీవిత జ్వరాన్ని మాన్చేవాడు.

ఇప్పుడు విషాద
కషాయ మిచ్చి
నయం చేస్తున్నాడు.

ఏ వయస్సుకి ఏ మందివ్వాలో
ఈ విదూషకుడికి తెలుసు.

Charlie Chaplin
In my younger days
he used to cure
life’s fretful fever
with *simples of fun.

Now he cures it
with the bitter extract
of sorrow.

This tramp dispenses
medicine suited
to one’s age.
(*simple= a medicinal herb)


ఆత్మహత్య
తనని బాధిస్తున్న
ప్రపంచపు ముల్లుని
పీకి పారేసి

ఈ పిల్ల చక చకా
ఎటో నడచిపోయింది.

Suicide
Pulling out
the world-thorn
that had been pricking her sorely,
she walked away
briskly.

ఒకో చోట తెలుగుకంటే అనువాదమే అందంగా వున్నట్లు అనిపించింది నాకు.

You Might Also Like

7 Comments

  1. తమ్మినేని యదుకుల భూషణ్.

    అప్పట్లో ఈ పుస్తకం మీద చాలా సమీక్షలే వచ్చాయి, మచ్చుకు ..

    1. తమ్మినేని యదుకుల భూషణ్.

      త్రివేణిలో వచ్చిన సమీక్షకోసం క్లిక్ చేయండి.
      క్లిక్ చేయండి.
      museindia లో వచ్చిన సమీక్ష కోసం క్లిక్ చేయండి

      ఏ కారణం చేతైనా లింకులు కనిపించక పోతే URLs విడిగా మరొక్క సారి:

      http://yabaluri.org/TRIVENI/CDWEB/bookreviewsapr2008.htm
      http://www.museindia.com/viewarticle.asp?myr=2008&issid=20&id=1177

  2. Kinige Newsletter 26 May 2012 | Kinige Blog

    […] Tree, My Guruపరిచయం ‘కినిగె’పై […]

  3. సురేశ్ కొలిచాల

    Ramarao Kanneganti wrote a review on this book in English when the book was released in 2008: http://eemaata.com/em/issues/200809/1335.html
    “The first translation was perhaps one of the best. Consider how a phrase like dharanu chochchi, divini vichchi gets translated to “probing the earth and spanning the sky”. Instead of obsessing with the accuracy, the translator got three things right: image, cadence, and the register […]”

  4. Purnima

    తెలుగేతురలతో తెలుగు సాహిత్యం గురించి మాట్లాడేడప్పుడు ఇలాంటి అనువాదాలు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. అందుకని ఇలాంటి పరిచయ వ్యాసాలు లేదా సమీక్షలు ఇంగ్లీషులో కూడా వస్తే, తెలుగురాని వాళ్ళకు కూడా మన సాహిత్యాన్ని పరిచయం చేయొచ్చు. ఆసక్తిగలవారు తప్పక రాయగలరని ఆశిస్తున్నాను.

  5. Indian Minerva

    Wow!!

Leave a Reply