“అక్షరార్చన” సాహిత్య వ్యాస సంకలనము

రాసిన వారు: పి.కుసుమ కుమారి
*****************
“అక్షరార్చన” 36 వ్యాసముల రత్న మాలిక. పాటీబండ మాధవ శర్మగారి షష్ఠి పూర్తి సన్మాన సంచిక ఇది. వ్యాసముల జాబితా:

1) సాహితీ సంపత్తిః (జమ్ములమడక మాధవరామశర్మ );
2) ప్రమేయము-ప్రమాణములు(డా. ధూళిపాళ శ్రీరామమూర్తి);
3) సంస్కృత వ్యాకరణంలో మహేంద్ర మహేశ సంప్రదాయాలు (శ్రీ ఎస్.పి.ఎస్. వేంకటేశ్వరాచార్యులు);
4) మేఘ దూతకు రామాయణంతో ఉన్న సంబంధం;
5) కాటయ వేముడు-కవ్వడి:- (శ్రీ చెలమచెర్ల రంగాచార్యులు)
6) బాలసరస్వతి- తిరుమల బుక్కపట్టణం శ్రీవాసాచార్యులు:- ఆచార్య డా.బి. రామరాజు;
7) The Name of the Sanskrit Poetics :- Dr. P. Sriramachandrudu;
8 ) రసము – లోకము :- (డా. తుమ్మపూడి కోటేశ్వరరావు);
9) రసము – కెథార్పిస్ :- ఆచార్య డా. కాకర్ల వెంకటరామనరసింహము;
1). Riti and Guna :- (Dr. P. G. Lalye);;
11) శ్రీ మహా భారతమున వేదవ్యాసుడు:- (డా. కేతవరపు రామకోటిశాస్త్రి);
12) ఉదంకుడా? ఉదంకులా? :- ఆచార్య శ్రీ ఖండవల్లి లక్ష్మీ నిరంజనం;
13) నన్నయ యతి ప్రాసలు:- నిడదవోలు వేంకటరావు ;
14) ఎఱ్ఱాప్రెగడ(e~r~raapragDa) నృసింహ పురాణమునకు మూలము:- (డా. యశోదా రెడ్డి) ;
15) హంస డిభకోపాఖ్యానము – సంవిధాన శిల్పము :- (డా. జి. వి. సుబ్రహ్మణ్యం);
16) వీరభద్రవిజయము – ప్రకృతి వర్ణనలు :- ( శ్రీ పి. వి. చలపతిరావు) ;
17) పారిజాతాపహరణ ప్రబంధ రచనా కాలము :- (డా. పల్లా దుర్గయ్య) ;
18) మన సంకీర్తన భాండాగాగారము :- (డా. వేటూరి ఆనందమూర్తి) ;
19) శ్రీ శివ శంకరుల పద్య నాటికలు :- ( శ్రీ నోరి నరసింహమూర్తి) ;
2). అమర సింహ చరిత్రము :- ( శ్రీమతి వి. సీతా కళ్యాణి ) ;
21. బ్రహ్మశ్రీ పోకూరి కాశీపత్యావధానులు గారు :- ( డా. హరి శివకుమార్) ;
22. ఆంధ్ర విమర్శ వాఙ్మయము :- (ఆచార్య డా. దివాకర్ల వేంకటావధాని) ;
23. సాహిత్యము – యాదార్ధ్యము :- (శ్రీ ఇరివెంటి కృష్ణమూర్తి ) ;
24. అపవాదు :- (శ్రీ కొత్తపల్లి శ్రీ ఆంజనేయ శర్మ ) ;
25. హాస్యము – గురజాడ :- (శ్రీ ఎల్. మోహన్) ;
26. కవిత్వ తవ విచారము :- (శ్రీ ఎస్వీ. జోగారావు);
27. వర్తమాన సాహిత్య విమర్శ: పరికరాలు, ప్రమాణాలు :- ( డా. అడపా రామకృష్ణరావు ) ;
28. మాండలికాలు :- (శ్రీ పోరంకి దక్షిణామూర్తి );
29. తెలుగులో ‘ అని ’చేసే పని :- ( డా చేకూరి రామారావు );
30. తెలుగు భాషలో మార్పులు-చేర్పులు :- డా. శ్రీ మతి నాయని కృష్ణకుమారి ;
31. ఆదికవి పంపడు – :- (శ్రీ ఎం. ఎన్. మహాంతయ్య ) ;
32. హిందీలో లక్షణ గ్రంధాలు :- ( డా. భండారం భీమసేన జ్యోస్యులు ‘నిర్మల్ ’) ;
33. ప్రసన్న కుసుమాయుధము :- ( శ్రీ కె. శ్యాం ప్రకాశ రావు ) ;
35. శ్రీ పాటిబండ మాధవ శర్మ గారి రచనల విశిష్టతలు :-
౧] అనువాదములు – వ్యాఖ్యానములు :- ( డా. హరిశివ కుమార్ )
౨] రాజ శిల్పి – ఇంద్రాణి :- శ్రీ ఎల్. చంద్రమోహన్
౩) చారుణి :- (శ్రీ ఉత్పల సత్యనారాయణాచార్య )
౪] ఆంధ్ర మహాభారతము – ఛందశ్శిల్పము :- ( డా. జి. వి. సుబ్రహ్మణ్యం ) ;
36. కవితా నీరాజనము:- ( ప్రముఖ కవులు)

ఈ గ్రంథములోని పరిజ్ఞానమునకు మచ్చుతునకగా ఒక వ్యాసమును గమనించుదామా? డాక్టర్ హరి శివకుమార్ విపుల సోదాహరణ వ్యాసములోని ఈ అంశమును గమనించండి! “అక్షరార్చన” లోని ప్రతి అక్షరమూ సుధా రస బిందు తుల్యానుభూతికి యోగ్యత కలదేనని బోధపడుతుంది. ద్వాదశ రాసులను, అంశములను ఆధారముగా చేసుకొని పోకూరి కాశీపత్యావధానులు రాసిన పద్యంలో చిత్రితమైన చమత్కారము.

“ఆమె కన్య” – కాబట్టి కవి, కన్యా రాశి నుండి ప్రారంభించిన వర్ణన ఇది.

“పై గేరి నొక యింటి పడుచు నీ యెలనాగ;
యందంబుచే సిగ్గు నొందఁ జేసి
దాని మూడవ యింటి దానిని బొమలచే;
వంచె నాల్గవ యింట మించు దాని;
జంఘలచే గుల్ల సలిపె నైదవ యింట;
గల దానిఁ జనులచే వెలితిఁ జేసె;
నాఱవ యింట బరగు దానిఁ
గౌనుచే నోరుఁ దెరిపించెఁ గడమ వాటి
నెదురఁ బని లేదు గాని తొమ్మిదవ యింటి
దాని కెనగాక నీ కేలు బూనదలఁచె.”

“సిద్ధయోగి చరిత్రము” తారక, సాంఖ్య, అమనస్కాది యోగములు ఉన్నవి. వేదాంత పరమైన ఈ పొత్తములో – భాగవతములో ఎన్నెన్ని పోకడలు ఉన్నాయో అన్నన్ని రకాల పోకడలు ఉన్నవి. అందుచేతనే “సిద్ధయోగి చరిత్రము”నకు “పిల్ల భాగవతము” అని ప్రసిద్ధి వచ్చింది. బ్రహ్మశ్రీ బిరుదాంకితులు పోకూరి కాశీపత్యావధానులు రచించిన “సిద్ధయోగి చరిత్రము” అయిదు ఆశ్వాసముల కావ్యము. “సిద్ధయోగి చరిత్రము” లో కథానాయిక గూర్చి చేసిన ఊహా కల్పనకు అద్దం పట్టిన ఈ పద్దెము పోకడలను చూడండి.

సిద్ధుని భార్య అచ్చాంబీ దేవినివసిస్తూన్న ఊరు చాలా గొప్పది. అందులోని స్త్రీలు బహు సౌందర్యరాసులు. అందులోనూ- అచ్చాంబీ దేవి ఉన్న – పై వీధిలో ఉన్నవారు అందగత్తెలు; అచ్చాంబీ దేవి- ఆ వీధిలోని మొదటి యింటిలోని సుందరిని సిగ్గు పడేటట్లు చేసినది. దాని మూడవ ఇంటిలోని దానిని- అచ్చాంబీ దేవి తన కనుబొమ్మలచే ఓడించినది. నాలుగవ గృహములోని వనితను- అచ్చాంబీ దేవి తన జంఘలచే ఓటమిపాలు చేసినది. ఐదవ ఇంటిలోని పడుచును- అచ్చాంబీ దేవి తన స్థనములచే వెలితి పడేటట్లుగా చేసినది. ఆఱవ ఇంట ఉంటూన్న యెలనాగను, తనకు పై వారి ఇంటిలో కలిసేటట్లు చేసినది అచ్చాంబీ దేవి. పదకొండవ (పదునొకండవ) నివాసములో ఉన్న అతివను- అచ్చాంబీ దేవి తన కౌను/ మేనుచే ఓటమిపాలు చేసినది.
తక్కిన ఇళ్ళలో ఉన్న వారలు- ఏమంత సొగసులు లేనివారలు- కానీ…. ఒక్క తొమ్మిదవ ఇంటిలోని అచ్చాంబీ దేవిని మాత్రము జయించజాలక, సిద్ధని వివాహం చేసుకొనడానికి పరిణయం చేసుకొనగా-ఆమె నీ కేలు పట్టుకొన నిశ్చయించినది.
ఈ భావము మన జ్యోతిష్య శాస్త్ర బద్ధ ద్వాదశ (12)రాసులకు అన్వయిస్తూ కవికి గల అగణిత విజ్ఞాన పరిచయములకు తార్కాణముగా నిలుస్తూన్న ఈ పద్యము 5 వ ఆశ్వాసములోని 62 వ పద్యరత్నము ఇది. ఇప్పుడు కవి కలము చేసిన ఆ అన్వయ చమత్కారములను పరికించుదాము.

భావ విపులీకరణ:-
అచ్చాంబీ దేవి పెళ్ళి కావలసిన కన్య.
కాబట్టి కవి ఇక్కడ- అక్కడి నుండే ఆరంభించిన వైనం ఇది.
1) మొదటి ఇంటిలోని “కన్య” ను – అచ్చాంబీ దేవి తన అందముచే సిగ్గిలజేసినది.
2) దానినుంచీ- మూడవ రాశి ఐనట్టి “ధనుస్సు”ను – అచ్చాంబీ దేవి తన కనుబొమ్మలచే వంగిపోయేట్లు చేసినది.
3) నాలుగవ ఇంట నుండు “మకరము”ను జంఘలచే గుల్ల చేసెను; అనగా మొసలి పై భాగము గుల్ల గుల్లగా ఆయెను.
4) అయిదవ ఇంటి దానిని చనులచే/ స్థనములచే వెలితిపడజేసెను.
5) ఆరవ రాశి మీనరాశి. అచ్చాంబీ దేవి తన కనుగవతో- చేపను (వారి=)జలములలో కలియఁ జేసినది.
6) పదకొండవది “సింహ రాశి”. ఆమె సింగమును తన కౌను చేత నోరు తెరిపించినది. తక్కిన రాశులను గురించి వేరే చెప్పనక్కరలేదు గాని,

ఒక్క తొమ్మిదవ రాశి ఐనట్టి “మిథునము” ను ఓడించలేక పోయింది ఆవిడ. ఆ అచ్చాంబీ దేవి ” మిథున రాశి పైన సైతము – గెలుపు సాధించి తీరెదను” అనే దృఢసంకల్పముతో ఒక నిర్ణయాన్ని తీసుకున్నది-అదే “సిద్ధా! నీ కేలును పట్టుట (= వివాహం చేసుకొనుట)” మాచర్లలో నివసిస్తూన్న – నిగారి అముద్రిత గ్రంథములూ, ఇతర వివరాలతో పాటు పాఠకులకు అందించిన ఇట్టి వ్యాస రత్నాలతో సమకూర్చిన పొత్తము ఈ “అక్షరార్చన”.

ఈ పుస్తకం – 328 పేజీలతో, సారస్వత దిగ్గజములు అందించిన అద్భుత వ్యాస సంకలనము. ఎడిటర్స్:- దివాకర్ల వేంకటావధాని ,పల్లా దుర్గయ్య, డా. జి.వి. సుబ్రహ్మణ్యం సంపాదక వర్గము ఈ అమూల్య సంకలనాన్ని వెలువరించినారు.

The Secretary,
Dr.P. Madhava Sarma shahithi Puthi Sanmana Sangham,
SriVani; 1-8-702/105 ;
Nallakunta, Hyderabad- 50044
Pub:- 1972, price:- 20/- ;

*********

\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\

You Might Also Like

One Comment

  1. రాఘవుఁడు

    దూరంగా ఉన్నవారు ఈ పుస్తకం తెప్పించుకోవాలంటే మార్గం? ప్రస్తుతానికి బయట అంగళ్లలో దొఱుకుతోందా? ౧౯౭౨ నాటిది కాబట్టి చిఱునామా మారిపోయి ఉండవచ్చు. ప్రస్తుతపు వివరాలు తెలియజేయగలరా? ఫోను నెంబరు ఏమైనా ఉందాండీ?

Leave a Reply