పుస్తకం
All about booksపుస్తకభాష

September 9, 2011

గ్రూచో మార్క్స్…నమో నమః

More articles by »
Written by: Purnima

కొమ్మ కొమ్మకో సన్నాయీఈఈఈ.. అన్నారు వేటూరి గారు.

కొమ్మ కొమ్మకు బోలెడు ’ఫన్ను’లున్నాయి అన్నారు కోతి కొమ్మచ్చి ఆడి, ఆడించిన రమణజీ!

ఇంకేం? బెమ్మాండం! అనుకుంటూ బాపురమణ-దండు తయారయ్యింది కొమ్మకొమ్మనా, “హై హై నాయకా!” అని ఉద్ఘోషిస్తూ. అప్పుడు ఉన్నట్టుండి, బాపూ-రమణలు “హై హై నాయకా!” అని మొదలెట్టారు. ఇదేంటి చెప్మా అని అనుకోబోయే లోపే, తెరపై “గ్రూచో మార్క్స్” సాక్షాత్కరించారు.

“ఆరాధ్యులకే ఆరాధ్యుడా! దర్శన భాగ్యమిమ్ము” అని నేను ప్రార్థించాను.

అవి ఆర్తనాదాలుగా వినిపించి ఓ ఫ్రెండు గబగబా యూ ట్యూబ్‍లో ఉన్న గ్రూచో తాలూకా వీడియో తాలూకా లింకలన్నీ పంపింది. తిరస్కరించాను. స్టేజి మీద చూస్తే, ఆయనలోని నటుడే కనిపిస్తాడు. నాకు గ్రీన్ రూం విశేషాలు కావాలిగా మరి! ఎలా?

“”గ్రూచో ఆండ్ మీ” వస్తున్నాం, ఈ లోపు ఆయన ఉత్తరాలు చదువుకో..” అన్న అశరీరవాణి అంది.

దీపావళి పండుక్కి అంతా టపాసులు కొనుక్కుంటుంటే నేను గ్రూచో బ్రాండ్ “క్రాకర్స్” కి సిద్ధపడ్డాను.

గ్రూచో ఉత్తరాలను తెరవబోతుండుగా, “ఎవరో ఎవరికో రాసిన ఉత్తరాలు చదివేస్తావా? నీ కక్కుర్తి నువ్వూనూ” అని నన్ను దెప్పటం తప్ప మరో  పని లేని అంతరాత్మకు ఇవ్వాల్సిన కౌంటర్ ఆలోచిస్తూనే, మొదటి పేజీ తెరిచాను. గ్రూచోని ఆయన ఉత్తరాలను పంపించమని అభ్యర్ధిస్తూ పంపిన లేఖకి, ఆయన జవాబు.

“YOUR LETTER RECEIVED AND PROMPTLY BURNED. I PREFER NOT TO HAVE STRANGERS PRYING INTO MY MAIL…” అని చదవగానే నన్ను నేను తిట్టుకోబోయాను. ఆ వెంటనే వచ్చిన వాక్యాలు – “…WOULD DISCUSS THIS IN DETAIL BUT MY SECRETARY HAS A DATE IN FIVE MINUTES — WITH ME.” – చదివి, “హిహిహి” అని నవ్వుకున్నాను. నా mini existential dilemma ను లైబ్రరి ఆఫ్ కాంగ్రెస్ వాళ్ళు అప్పుడెప్పుడో పరిష్కరించి పెట్టారు. ముందుతరాల వాళ్ళల్లో హాస్యానికి సంబంధించిన ఏ పరిశోధన చేయాలన్నా, గ్రూచో హాస్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఉండడం అసాధ్యమని తలచి ఈ సారి అభ్యర్థించకుండా ఆజ్ఞాపించారు. అందుమూలన ఆయన రాసిన, ఆయనకు రాయబడ్డ లేఖా సంపుటి మనకి అందుబాటులో ఉంది.

నటుల్లో కొందరు స్విఛాఫ్-స్విచాన్ తరహా ఉంటారు. లైట్లు, కెమారా నడుస్తున్నంత వరకే వీరు ’పాత్ర’ ధోరణిలో ఉంటారు. అవి ఆగిపోగానే అచ్చు వాళ్ళ తరహా వాళ్ళకి వచ్చేస్తుంది. ప్రాత్రల తీరుతెన్నులకీ, నటుల ఆచారవ్యవహారాలకీ పొంతన ఉండాలని ఏమీ లేదు. అందుకని, గ్రూచో రంగస్థలం, సినిమాల్లో హాస్యగాడుగారే అయినా, నిజజీవితంలో ఎలా ఉంటారోనని నాకు మా చెడ్డ అనుమానం వేసేసింది. ఆయన సినిమాలు చూడకుండ, పుస్తకాలను ఎంచుకున్నది ఈ విషయం తేల్చుకోడానికే. ఉత్తరాలు మొదలయ్యాయి.

“అర్థరాత్రుళ్ళు ఎంటా నవ్వులు? బుద్ధిలేకుండా!”

లాభం లేదు. ’ప్రేమ గుడ్డిది’ అన్న శిలాశాసనంలా ’నవ్వు బుద్ధిలేనిది’ అని కూడా ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే?! ఉత్త్తరాలేగా, నిద్రపోయే లోపు ఓ రెండు పేజీలు చదువుకుంటే కొంత బెరుకు పోతుందిగా అని మొదలెట్టాను. నాకేం తెల్సు, నిద్రే పోతుందని? అదేలే, నిద్రలే పోతాయని? ఆయనలా రాస్తున్నారు మరి! ఒక బిజినెస్ ఉత్తరం. పరిస్థితి చాలా ఇరాకటంగా ఉంది. “కాసబ్లాంకా” అన్న పేరును సినిమా టైటిల్లో వాడడంపై వార్నర్ బ్రదర్స్, మార్క్స్ బ్రదర్స్ మధ్య వివాదం. “కాసబ్లాంక అన్న పేరుతో మేం సినిమా తీసేసాం. అందుకని మీరు ఇప్పుడు, “నైట్ ఇన్ కాసబ్లాంక” తీయడానికి మేం ఒప్పుకోం” అని వార్నర్ బ్రదర్స్ అభ్యంతరం. ఈయన వాదించటం మొదలెట్టారు. ఎలా?

ఇలా..

“I just don’t understand your attitude. Even if you plan on re-releasing your picture, I am sure that the average movie fan could learn in time to distinguish between Ingrid Bergman and Harpo. I don’t know whether I could, but I certainly would like to try.”

నవ్వకేం చేస్తాం? ఈ దెబ్బతో నాకర్థమయ్యిపోయింది, నాటకాలూ, సినిమాల్లో పాత్రలకోసమే కాదు, అసలుకి గ్రూచో బుర్రలోని హాస్యపు గని ఉంది, కాస్త రెచ్చగొట్టాలే గాని, టన్నుల కొద్దీ నవ్వులు బయటకొస్తాయని. (This letter online.)

ఉత్తరాలని వ్యాపారం, వ్యక్తిగత జీవితం, టివి రంగం, హాలీవుడ్, ఇతర ప్రముఖ రచయితలతో సంభాషణ లాంటి ఎన్నో విభాగాల్లో పొందుపరిచారు. సమయం ఏదైనా, సందర్భం ఎలాంటిదైనా, అవతలున్నది ఎవరైనా గ్రూచో-ఇజం ప్రతి ఉత్తరంలో ప్రస్ఫుటంగా కనిపిస్త్తుంది. నవ్విస్తుంది.

నవ్వుల తెర తొలగిస్తే ఈ హాస్యఱేడు నిండు పున్నమి లాంటి మనసు కలవాడు. ఉత్తరాలను రాసేటప్పుడు ఉపయోగించేది సిరా మాత్రమే కాదు. సిరా కన్నా ఎక్కువగా రాసిన వాళ్ళ మనసే కనిపిస్తుంది. తన వాళ్ళకు రాసుకున్న అన్ని ఉత్తరాల్లో గ్రూచోది ఎంతటి నిండైన వ్యక్తిత్వమో అర్థమవుతుంది. రాయడం ఈయనకు ఇష్టం గానీ, అవతలి వాళ్ళు బదులివ్వాలని లేదుగా! వాళ్ళకి నచ్చాలని లేదుగా! వాళ్ళ సమయం వృధా చేస్తున్నా అన్న అపరాధ భావన కలగించచ్చుగా! ఇవ్వన్నీ గ్రూచోను తీవ్రంగా ఇబ్బంది పెట్టించేస్తుంటాయి. తత్ఫలితంగా తూలే మాటలు:

“I would have answered your letter sooner, but you didn’t send one.”

“Corresponding with you is like writing letters to an empty coal mine or an aching void.”

ఇహ, ఉత్తరాలు చదవడానికి బద్ధకించి, బదులివ్వటమనే ఊసే ఎత్తని తన కుటుంబ సభ్యులకు ఈయన పెంపుడు కుక్క రాసినట్టూ, ఆయన నటించిన పాత్రలు రాసినట్టూ రాస్తారు, వాళ్ళచే చదివించాలన్న తాపత్రయంతో. ఉత్తరాల్లో సాహిత్య లోతులు వెతుక్కోవడం మనోభావాలకు మేకప్ వేసుకోవడమంత అసహ్యంగా ఉంటుంది. ఎంత బాగా రాసినా అది ఎవరికి రాసారో, వాళ్ళ మనసును తాకలేకపోతే ఎంత అందమైన అక్షరాలైనా వృధా పోవటమేగా! గ్రూచో ప్రపంచ ప్రఖ్యాతి కమెడియన్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. ఆయన రచనా ప్రతిభను తెల్సుకోడానికి కాదు. ఆయన మనసు పరిమళాలను ఇప్పటికీ ఆస్వాదించడానికి.

హారీ పాటర్ సీరిస్‍లో నేను చూసిన ఏకైక సినిమాలో ఒక మాజిక్ ఉంటుంది. అందులో జ్ఞాపకాలను ద్రవం రూపేణ భద్రపరుస్తారు. ఆనక, ఆ ద్రవాన్ని ఒక టబ్బులో వేస్తే ఎవరి జ్ఞాపకాలను వాళ్ళే మూడో వ్యక్తిగా చూసుకోవచ్చు. దీనికేదో పేరుండాలి. గుర్తు రావటం లేదు. అలానే హారీ పాటర్ మాజిక్‍లు లేని మన లోకంలో ఎప్పటి అనుభవాలనూ, భావావేశాలనూ తాజాగా, వేడిగా, వాడిగా పట్టుకోగలిగి, భద్రపర్చుకునే వీలుండేవి ఉత్తరాలే. ఎన్నాళ్ళైనా అవి తరగని, చెదరని గనులే! స్నేహితుల సంగతేమో గాని, ఓ మనిషి రాసే ఉత్తరాలను బట్టి అతని వ్యక్తిత్వాన్ని ఇట్టే చెప్పేయచ్చు. ఆ లెక్కన గ్రూచోకి పెద్ద ఫ్లయింగ్ కిస్ ఇచ్చేసాను. అంత అపురూపం ఆ మనిషి.

సరే! ఇవి అయ్యాక, “గ్రూచో ఆండ్ మీ” ప్రాప్తించింది. కారణాంతరాల వల్ల ప్రదిక్షిణలు చేస్తూ చదువుకోవాల్సి వచ్చింది. నాలుగు అడుగులు వేయ.. పగలబడి నవ్వా.. మళ్ళీ నడవ! అలా సాగింది గ్రూచోతో నడక.

ఈయన సినిమాలూ, గట్రా చూడలేదని చెప్పానుగా. ఆయన స్టేజిపై ఏ తరహా హాస్యాన్ని పండిస్తారో తెలీదు. కాని జీవితంలో పండించిన హాస్యం మాత్రం అంతా, ఇంతా కాదు.

ఉన్న బలహీనతల్లో అతి పెద్ద బలహీనత, మగువలు. ఆడగాలి సోకితే చాలు, ఒళ్ళు పులకరించిపోయి, తలపైకి జేజమ్మ (అనుష్క కాదు.)  వచ్చి, ఏదో తింగరి పని చేసి, చావు తప్పి కన్ను లొట్టపోయాక, అప్పుడు తెలివొస్తుంది. పోనీ ఒకసారి అయ్యాక, ఊరుకోవాలిగా. ఊహు. కామెడీ అవ్వమంటే అవ్వదు మరి? ఈయన ఆడిన కోతి కొమ్మచ్చిలో బోలెడు కొమ్మలు. కొలో..కొలో..కొలో కోలమ్మ.. కొమ్మలందరూ మాంచి జోరు! 😉

తాగేవాడు తాగుబోతు. వలచినవాడు వాగుబోతు. తెలీదంటూనే ప్రేమను నిర్వచించకుండా ఉండలేకపోవడమే ప్రేమించడమంటే! ఇదో వీరి థీసిస్:

“Love is a many-splendoured thing. I don’t quite know what this means, but song- writers have to make a living, too. I suppose it means that love is all-important. It’s a word that is difficult to contain in any specific mould. Today the word “love” is flung around so carelessly that it’s almost meaningless. One man will say, “I love Cheddar cheese”; a girl will say, “I love Paris in the spring”; a boy will say, “I love the way Mickey Mantle swings from both sides of the plate”; and someone will sing, “I love to see the evening sun go down.” This character is probably a burglar. The word “love” should be confined to just one subject — the relationship between a male and a female, a man and a woman, a boy and a girl.”

ఈ ప్రేమాయణాలతో పాటు బోలెడు జీవితయాణంలో విశేషాలు కూడా చెప్పుకొచ్చారు. బడాయిలు పోయేటప్పుడు కూడా, సాథారణ పాఠకుడికి అసూయ, ఆత్మనూన్యతా భావాల్లాంటివి కలగకుండా చాకచక్యంగా చెప్పుకొచ్చారు. బాధల కాకరరసంలో వీలైనంత హాస్యపు బెల్లం కలిపారు.

ఆయనకి రాయటమంటే ఇష్టమని చెప్పారు. అంతే ఇష్టంగా రాసుకున్న పుస్తకం ఇది. ఆత్మకథలు చదివేటప్పుడు అంతలేసి గొప్ప వ్యక్తుల జీవితపు విశేషాలను తెల్సుకోవాలనే కుతూహలం ఉండడం సహజం. కానీ చదువుతున్న కొద్దీ, ఆ కుతూహలం కొంచెం కొంచెంగా తగ్గుతూ వాళ్ళు చెప్పుకొచ్చే కష్టసుఖాలను జాగ్రత్తగా handle చేయాల్సిన బాధ్యత పాఠకులుగా మనమీద పడిపోతుంది. ఎంతైనా ఒక జీవితాన్ని కాచి, వడపోసి ఇచ్చిన తేనీయాలు కదా, ఆత్మకథలంటే!

ఒక నిండైన వ్యక్తిత్వంతో పరిచయం ఏర్పడాలంటే తప్పక చదవాల్సిన పుస్తకం. హాస్యనటుడన్న పదంలానే హాస్యజీవి అన్న పదం ఉండుంటే, అందుకు సరైన వ్యక్తి గ్రూచో మార్క్స్.

అందుకని ఆయనకు నా తరఫున ఒక.. హై హై నాయకా!

(ముఖ్య గమనిక: అసలు సంగతే మర్చిపోబోయాను. మీ కలల వీధుల్లోకి ఆంజిలినా జోలీ, పెనిలోప్ క్రజ్ లాంటి హాలివుడ్ సుందరాంగులకు
మాత్రమే ప్రవేశార్హత ఉన్నట్టయితే, వారితో డేటింగ్ చేసే సౌభాగ్యం కోసం విదేశీ భాషలనూ, వంటలనూ అలవాటు చేసుకోవటం మీకు పరిపాటి అయితే గ్రూచోను తప్పక చదవండి. మీక్కావాల్సిన టిప్స్ దొరక్కుండా ఉండవు. పైగా ఇంతటి అనుభవజ్ఞులు ఉండే చాలా అవకాశాలు తక్కువ. ఆలోచించుకోండి.

ముఖ్య గమనిక ౨: ఇంత గొప్ప సాయం చేసిన నాకేం ఇవ్వాలని ఆలోచించక్కర్లేదు. అది నేను చూసుకుంటాగా!)

Details:

Groucho and Me

By Groucho Marx

Buy Groucho And Me from Flipkart.com

The Groucho Letters: Letters from and to Groucho Marx

By Groucho Marx

No. of Pages: 319

Buy The Groucho Letters: Letters To And From Groucho Marx from Flipkart.com

 About the Author(s)

Purnima

Software engineer by profession, Hyderabadi at heart, laidback by choice, an introvert by default, schizophrenic at will etc. etc... so much so about her, to give you enough to guess what she might come up about the worlds of words she wanders.. keep guessing..8 Comments


 1. @జీడిపప్పు: మీరు గ్రూచో అమెరికా బయట చాప్లిన్ అంత బాగా ఎందుకు ప్రాచుర్యం పొందలేదని అన్నాక, కొంచెం ఆలోచించాను. (నేను ఇద్దరి సినిమాలూ చూడలేదు. అందుకని వ్యాఖ్యానించటం ఎందుకని ఊరుకున్నాను.)

  కాకపోతే ఇక్కడ నాకో తమాషాగా ఒకటి గుర్తొచ్చింది:

  ’గ్రూచో ఆండ్ మీ’ పుస్తకంలో గ్రూచో ఏదో టూర్ చేస్తున్నప్పుడు అక్కడ ఒకతను నాటిక వేయడం, దానికి జనాలు జోహార్లు అర్పించడం, ఆనక ఆ నటుడే ప్రపంచ ప్రఖ్యాతి చెందాడని చెప్తూ చివర్న ’చాప్లిన్’ పేరు చెప్తారు. అప్పటిదాకా ఏదో సాధారణ సంఘటన గురించి వివరిస్తున్నట్టు ఉంటూ ఒకసారిగా చాప్లిన్ పేరు బయటపడుతుంది. చాప్లిన్‍కు డబ్బూ, పేరూ వచ్చాక ఆయన స్థితిగతుల గురించి కొంచెం చెప్తారు. అంతే!

  నేను చదివిన ఒక రాహుల్ ద్రావిడ్ బయోగ్రఫీలో కూడా నూనుగు మీసాల, ఉంగరాల జుట్టుతో, బక్కపల్చని అబ్బాయంటూ పరిచయం చేస్తూ చివర్న అతడు ’సచిన్’ అని చెప్తారు. అదీ గుర్తొస్త!

  నాకు అట్టే వీళ్ళిద్దరి సినిమాల గురించి తెలియకపోయినా నా అనుమానం ఏంటంటే గ్రూచోది భాషాసంబంధితమైన హాస్యం, అందులోనూ అమెరికన్ స్లాంగ్ ప్రధాన హాస్యం మూలన ఆయనకు చార్లీ అంత పేరు రాలేదేమో బయట.

  ఉదా: Outside of a dog, book is man’s best friend. Inside of a dog it’s too dark to read.

  ఇది అర్థం చేసుకుని ఆస్వాదించాలంటే ఇంగ్లీషు చదవటం ఒక్కటే వస్తే సరిపోదుగా. ఔట్‍సైడ్ ఆఫ్ డాగ్ లో ఉందిగా మతలబంతా!

  ఇలా అని నేననుకుంటున్నాను. ఇంకెవ్వరైనా ఏమైనా అసలు కారణాలు చెప్తారేమోనని.


 2. Anu Mullapudi

  Purnima:

  That was an excellent article. Really enjoyed reading it, and now went to dig out the book from the recesses of my bookshelf. Sadly, our shelves these days are covered with Marketing and business books, had forgotten what it is to laugh aloud!

  I remember the times when we used to pile into my uncle’s studio and watch these films back to back… And my dad would pull out the darndest of quotes at random times and keep us giggling…
  One of them:

  I don’t care to belong to a club that accepts people like me as members.

  Thanks for the memories and the laughter..
  Best wishes to you and Sowmya… and pustakam.net!


 3. @jeedipappu: You may ROFL to your heart’s content. That hidden sarcasm of yours was at our expense. My folks who chanced upon that blog post had just one question to ask: “All this for running a book website? Are you sure?”

  But then, I’m super-thrilled to have an admirer in you. Thank you! (Not an iota of sarcasm in it.)

  Anyway, continue with your ROFL-ing! I lack that kind of sense of humour.. so please excuse me!

  Good day!

  Regards,
  Purnima


 4. lollll Poornimagaaru.. Couldn’t stop ROFL. I thought you guys knew the hidden sarcasm involved in those posts, which was aimed at then so-popular so called “Kathi Mahesh”!! Everyone who is familiar with those discussions is well aware that i don’t have an iota of anti – feelings towards this site (In fact, I do have admiration for your wonderful effort and I visit this site every now and then!)

  I hope you’ll realize all my sarcasm was against senseless claims Kathi Mahesh made.

  I will try to write a detailed post in my blog.

  @ జైలుపక్షి – Cheer up buddy 🙂


 5. @జైలుపక్షి: That may be because in later years, according to some, pustakam.net has grown (or fallen?) to be a mere “ఆడ సైటు” and that it’s administrators are, “పాపం, అమ్మాయిలు.. అమాయకులు.. భయపడి..”.

  I guess, at least I failed to enjoy the act where numerous Jandhyalian characters pop out (of otherwise sane people??) and they tend to pull each other’s hair and strip their own clothes. (Thanks to a good friend of mine for the image!)


 6. జైలుపక్షి

  (అందరికీ నమస్కారం: ఇది పూర్తిగా వ్యాసానికి సంబంధం లేని వ్యాఖ్య. క్షమించండి=

  జీడిపప్పు గారికి: గతంలో రెండేళ్ళ నాడు, పుస్తకం.నెట్ నిర్వహకులు జైలుకి అని ఒక పోస్టు రాసిన జీడిపప్పు గారు మీరే కదూ? వాళ్ళు జైలు నుంచి విడుదలైపోయారు…పాప ప్రక్షాళన జరిగిపోయింది. కనుక, నేనొచ్చి వాళ్ళని చూడొచ్చు అనుకున్నారు అనమాట.

  అప్పట్నుంచి వెదుకుతున్నా మీకోసం. మీరా ఎక్కడా మీ సొంత ఐడీ రాయను అని మీకు మీరే మరో బ్లాగులో ప్రకటించుకున్నారు. అంత బాగా ప్రకటించాక ఎక్కడని వెదుకుతాం ఇక? ఇప్పుడు కూడా వీళ్ళకి ఇచ్చి ఉండరు. అయినా, మళ్ళీ వీళ్ళని అడగడం…మీరో, నేనో కేసు పెట్టడం, వీళ్ళు జైలుకి పోవడం..ఎందుకులెద్దూ పాపం.

  ఇక్కడ వద్దు కానీ, (మీ అంత మర్యాదగలవారు ఖైదీలు నడిపే సైటులో ఎందుకండీ వ్యాఖ్యానాలు రాయడం!!) – మీ బ్లాగులోనే సీజన్ 2 మొదలుపెట్టుకుని, జైలుఖైదీల సైటులో వాళ్ళ కొత్త ఖైదీ స్నేహితులు కొత్త వాళ్ళని అవమానిస్తున్నారు అనేసి సీజన్ మొదలుపెట్టండి. మీకు హిట్లు బా వస్తాయి. ఇక, మీ ప్రతిభకి, ఎలాగో కాలక్షేపానికి కొదువ ఉండదు. నిజం.

  (సంబంధం లేని కామెంటుకి పూర్ణిమ గారికి, వారి ఖైదీ ముఠా వారికి క్షమాపణలతో…)


 7. Boy! Can’t believe this. పుస్తకం.నెట్‍ను పప్పులూ, దినుసులూ ఫాలో అవుతుంటాయా? నాకు తెలీదే! చెదురు మదరు సంఘటనల్లో మా మీద రాళ్ళేయడమే తప్ప, ఇలా వచ్చి అచ్చంగా అభినందిస్తారని అస్సలు తెలీదు.

  ఏది ఏమైననూ తరించితిమి!


 8. Wondeful Article. గ్రూచో అమెరికా బయట చార్లీ చాప్లిన్ అంతలా ప్రాచుర్యం పొందలేదు ఎందుకో! చాప్లిన్ సినిమాల్లాగే గ్రూచో సినిమాలు కూడా ఆద్యంతం కడుపుబ్బా నవ్విస్తాయి. ఈయన ఒక పాపులర్ టీవీ టాక్ షో నడిపి తన సమాధానాలతో అందరినీ నవ్వులపువ్వుల్లో ముంచెత్తేవాడు.

  అన్నట్టు గ్రూచో నటించిన Duck Soup తప్పక చూడవలసిన ఆల్ టైం క్లాసిక్. ఇందులో ప్రతి డైలాగూ, ప్రతిసీనూ తెగనవ్విస్తాయి. ఈ సినిమా/సీన్లు నెట్‌లో దొరుకుతాయి అనుకుంటాను  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

అలుకు మొలకలు పుస్తక సమీక్ష

వ్యాసకర్త: గంభీరావుపేట యాదగిరి ******************* ఆధునిక సాహిత్యంలో సిద్ధిపేటకు ఒక ప్రత్యేక స్...
by అతిథి
0

 
 

ఒంటరి – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల

వ్యాసకర్త: శ్రీలత శ్రీరాం (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ లో వచ్చింది. పుస్తకం.నెట్ లో వేసుకు...
by అతిథి
1

 
 

శప్తభూమి నవల గురించి

వ్యాసకర్త: స్వర్ణ కిలారి (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
1

 

 

Diwali in Muzaffarnagar: Tanuj Solanki

ఇదో కథల సంపుటి. ఢిల్లీకి దగ్గర్లో ఉన్న ముజఫర్‍నగర్‌లో కొన్ని జీవితాలకు సంబంధించిన క...
by Purnima
0

 
 

సవరలు – జి.వి.రామమూర్తి

ఈమధ్య “ఫీల్డ్ లింగ్విస్టిక్స్” అన్న కోర్సులో విద్యార్థిగా చేరాక మామూలుగా ఆధుని...
by సౌమ్య
0

 
 

శప్తభూమి – బండి నారాయణస్వామి నవల

వ్యాసకర్త: శ్రీరాం కణ్ణన్ (వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
0