పుస్తకం
All about booksపుస్తకభాష

February 22, 2010

చివరకు మిగిలేది…

More articles by »
Written by: అతిథి
Tags: , ,

రాసిన వారు: Halley
************************

గమనిక : ఈ వ్యాసం ఏదో అక్షరాలు గుణింతాలు సమాసాలు గట్రా తెలిసినందువలన తెలుగు చదవటం అబ్బిన ఒక సామాన్య తెలుగు పాఠకుడు రాసిన వ్యాసం. నాకు “విమర్శక రత్న” వంటి బిరుదులు లేవు . సినిమా భాషలో చెప్పాలంటే నేను నేల ప్రేక్షకుడిలా నేల పాఠకుడిని . నేల పాఠకులకి రెవ్యూలు రాసే హక్కులు లేవు అవి కేవలం వేద పండితులే వ్రాయవలెను అన్న అభిప్రాయం ఉన్నవాళ్ళు దయ వుంచి ఈ రెవ్యూ చదవకండి .

“చివరకు మిగిలేది” – బుచ్చిబాబు – 90/- – విశాలాంధ్ర

నేను తెలుగు సాహిత్యంలో కొంచెం వీకు . నాకు బుచ్చిబాబు అంటే “చివరకు మిగిలేది” తెలుసు అంతే .  మొన్నామధ్యన ఈ నవల చదవటం జరిగినది . నాకు నచ్చినది కనుక ఈ నవల గురించి పది మందికి తెలియజెప్పాలని ఇదిగో పుస్తకం.నెట్లో ఇలా రాయవలసి వచ్చింది.

ఇక కథ విషయానికి వస్తే .. కథానాయకుడు దయానిధి జీవితం తాలూకా కష్టాలూ , సుఖాలు , ప్రశ్నలు , సవాళ్ళూ … (అంటే సవాల్ ఔర్ జవాబ్ లో సవాల్ కాదు ! .. బస్తీ మే సవాల్ లో సవాల్ ! ).. ఈ ప్రయాణంలో అతనికి ఎదురయ్యే మనుషులు .. అతన్ని నీడలా వెంటాడే అతని గతం ..ఆడుగడుగునా సంఘం నుంచి అతనికి ఎదురయ్యే ఛీత్కారాలు .. ఇవన్ని కలిపి ఒన్ టు థ్రీ మహరజ మిక్సిలో కలిపేస్తే కథ రెడీ . 1930-1950 ప్రాంతం కథ ఇది .

రాజమౌళి సినిమాలోలాగ ఈ నవలలో కథానాయికలకి పెద్దగా ప్రాముఖ్యత ఉండదు . అంటే ఉన్న నలుగురు హిరోయిన్లు (మరే మీరు త్తఫ్ఫుగా చదవలేదు ! .. నలుగురు !.. ఐతే అందరు మెయిన్ హీరొయిన్సు కాదు లెండి ) దయానిధి ఫాన్స్ !. దయానిధి యెం.బి.బి.యస్ చదివిన డాక్టరు . అతను వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక తక్కువ కులం అమ్మాయితో ఒక “ఎఫైర్” (అదేంటో తెలుగులో వ్యవహారం అంటే ఆ ఫీలింగు రాదు !) నడుపుతూ ఉంటాడు . ఈ అమ్మాయి పేరు కోమలి . ఇది ప్రేమో , కామమో … కొంచెం రుచి కొంచెం చిక్కదనం లాగా కొంచెం కామం కొంచెం ప్రేమో నాకు ఆట్టే అర్థం కాలేదు !. ఈ వ్యవహారానికి దయానిధి అమ్మ తప్పితే ఇంక ఎవరి దగ్గర నుంచీ సపోర్టు దొరకదు అతనికి . కోమలి వాళ్ళ కుటుంబం మరియు దయానిధి వాళ్ళ అమ్మగారు అదో టైపు (అదేంటో తెలుగులో అదో రకం అంటే ఆ ఫీలింగు రాదు! )  అని లోకులు కూస్త్టూ ఉంటారు . తన తల్లి మరణించిన తర్వాత సంఘం నుంచి ఇటువంటి కామెంట్సు మరీ ఎక్కువ అయిపోతాయి ( శేంపిల్ : అమ్మ బుద్ధులే కొడుక్కి వచ్చాయి . లేకపొతే ఆ కోమలితో ప్రేమలు ఏంటి !).ఇదిలా సాగుతూండగా మరొక రెండు ఆడ పాత్రలు ప్రవేశ పెడతారు రచయిత… ఒకరు అమృతం.. మరొకరు సుశీల. అమృతంకి పెళ్ళి అయిపోయినా కూడా వరసకి బావ అయిన దయానిధి అంటే ఒక “ఇది” ( బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్  “అది ఒక ఇది లే … ” ) . సుశీలకి దయానిధి అంటే ఇష్టమే కానీ దయానిధి అమృతంతోనూ మరియు కోమలితోనూ చనువుగా ఉండటం చూసి కాబోలు .. ఇష్టం బయటకి చెప్పదు . నిజానికి సుశీలకి దయానిధికి పెళ్ళి జరగటానికి ఆట్టే అడ్డంకులు లేవు అనట్టు గానే అనిపిస్తుంది . వీరు కాకుండా అమృతం తమ్ముడుగా జగన్నాథ్ పాఠకులకి కామిక్ రిలీఫ్ పంచుతాడు ( శేంపిల్ :  “…. కరెక్టు జగ్గూ !” నిధి అందుకున్నాడు . జగ్గన్నాథ్ : జగ్గూ – A jug the crow and the jug – దారుణం , నాథ్ అనండి ) . నమ్మిన బంటు పాత్రలో నారయ్య …  పాత సినిమాలలో జగ్గయ్య , గుమ్మడి, నాగయ్య లాగా అలరిస్తాడు ( నారయ్య అన్న పేరు వింటేనే పాత్ర అర్థం అయ్యుంటుంది చాలా మందికి !  ఇదే నవలలో కథానయకుడి పేరు “నారయ్య ” నౌకరు పేరు “దయానిధి” అంటే ఛీ అంటారేమో ! ) .

కోమలి వ్యవహారం ముదిరి పాకాన పడి, నానా గొడవ జరిగి మొత్థానికి కొన్ని పదుల పేజీలు అయ్యాక కోమలి ఇంకెవరితోనో ఊరు వదిలి పోతుంది , దయానిధికి ఇందిరతో వివాహం జరుగుతుంది . కుటుంబ కలహాలు , దయనిధి కాంగ్రెస్సువాదం , మామగారితో దాని గురించి పట్టింపులు వగైరా కారణాల వలన ఇందిరకు దూరంగా ఉండవలసి వచ్చి అతను మద్రాసులో ఒంటరిగా ప్రాక్టీసు  పెడతాడు .  తిరిగి మళ్ళీ రోస్ అని ఒక ఆడ అసిస్టెంట్ అతని దగ్గర జీతం లేకుండా పని చేయటం , శ్యామల అనే ఒక ఆడపేషంటు అతని ఆసుపత్రిలో కొన్ని దినములు ట్రీట్మెంట్ కోసమని ఉండటం వల్ల సంఘంలో మళ్ళీ రకరకాల పుకార్ల్లు పుడతాయి ( కోమలి , అమృతం, ఇందిర , సుశీల , రోస్ , శ్యామల , నాగమణి (సొంత ఊరిలో ఎదురింటి అమ్మాయి) – ఒక్క దయానిధికి ఇంత మందితో చనువు ఉంటే మన సంఘం ఊరుకుంటుందా ! ). ఈ పుకార్లతో  ప్రాక్టీసు దెబ్బతిని దయనిధి రాయలసీమలో కొత్త జీవితం మొదలుపెడతాడు.

“నరసింహ” సినిమాలో రజనీకాంతుకు గ్రనేటు కొండ దొరికినట్టు (నిజానికి నవలే పాతది కనుక “నరసింహ” సినిమానే కాపీ అని అనుకుందాం)  దయానిధికి వజ్రాలగని తాలూకు ఆనవాళ్ళు దొరకటంతో దశ తిరిగి ధనవంతుడు అయిపోతాడు ( ఇటువంటివన్నీ సినిమాలలో లేదా నవలలో మాత్రమే  జరుగును !). ఎప్పుడో ఊరు వదిలి వెళ్ళిన కోమలి తిరిగి దయానిధి సరసన చేరుతుంది , వచ్చిన డబ్బుతో దయానిధి పెట్టిన ఆసుపత్రి పనులలో సాయపడుతూ , అపుడపుడూ పాత ప్రేమను గుర్తుకు తెస్తూ దయానిధితో కాలం గడుపుతూ ఉంటుంది.

సుశీల మరియు ఇందిరల మరణం , అమృతానికి ఒక బిడ్డ జన్మించటం ( ఇది దయానిధి-అమృతం ల అక్రమ సంతానం అన్నట్టుగా అనిపించటానికి కావలసినన్ని హింట్లు ఇస్తాడు రచయిత ! ) , దయానిధి మిత్రుల జీవితాలు , జగన్నాథ్ కెరీరు బాపతు వగైరా సంఘటనలు మిగిలిన పేజీలను నింపుతాయి . దయానిధి సర్కారు జిల్లా వాడు అని అతను రాయలసీమలో ఆస్తులు కలిగి ఉండకూడదని ( మన తె.రా.స కూతల మల్లే ! ) అతనికి నలుగురు పెళ్ళాలనీ అతను అంత మంచి వాడేమీ కాదని అల్లర్లు రేగటంతో నారయ్య మరణం .. దయనిధి కోమలి ఊరు వదిలి పారిపోవటంతో కథ ముగుస్తుంది.

జీవితానికి అర్థం యేమిటి ? అన్న ప్రశ్నతో మొదలు అయిన ఈ నవల . చివరకు మిగిలేది .. సమాధానం తెలుసుకోటానికి చేసిన ప్రయత్నాలు వాటి తాలూకా జ్ఞాపకాలు – తనను తాను సమాధానపరుచుకోవటం … అన్న దయానిధి స్వగతంతో ముగుస్తుంది !

రచయిత అక్కడక్కడ అడిగే ఫిలసాఫికల్ ప్రశ్నలు నవల చదివాక కూడా వెంటాడతాయి. సంఘం (దాని కట్టుబాట్లు) మరియు గతం ఒక మనిషి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చక్కగా వివరించారు.  అయితే నవల మగవారికి మరియు మగరాయుళ్ళవంటి ఆడవారికి మాత్రమే నచ్చుతుంది యేమో !   నవల చివరి పేజిలో ఒక మిని-సమీక్ష ఉంది .. అందులో ఎవరో ఒకాయన (ఒకావిడ ? .. వద్దు అలా చూడకండి నేను ఫెమినిష్టుని కాను . ఏదో ఆడో మగో తెలియక అలా రాసాను అంతే) ఇలా రాసారు .. తెలుగు కల్పనాసాహిత్యంలో చివరికంటా మిగిలేది ఈ “చివరకు మిగిలేది” అని … నిజమేనేమో ! . లేకపోతే ఎపుడో అరవై యేళ్ళ క్రిందటి నవల నేను ఇప్పుడు చదవటం ఏమిటి !About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.87 Comments


 
 

 1. sarath

  నేను ఈ పుస్తకం గురించి అనేకసార్లు విని,కొని చదవటం జరిగింది,అందుకు దాని వేల కూడా కొంత కారణం కావచు,అది వేరే సంగతి.కాని మిగతా పుస్తకాలతో పోలిస్తే,ఇది అంత వేగంగా చదువగలిగే,మల్లి మల్లి చదవలినిపించే పుస్తకమైతే కాదు.ఓకే అనిపించే మామూలు పుస్తకం అంతే.


 2. Dr. Murthy Remilla

  “chivaraku migiledi”naa daggara vundi. urgent gaa chadavaali. ivaale Gopichand ” Pandita parameswara sastry veelunaama” dorikthe konnanu.


 3. murthy

  నేను నిర్ణయించు కున్నా గఠ్ఠిగా, హీ పుస్తకం చదవాలని…
  79 +1= 80 మొత్తం నాతో కలిపి.


 4. prakash

  @Purnima:

  poornima gaaru.. keka ga chepparu. ee sahitee parulatho chastunnanu. pratidaanni vallu alagae artham chesukovalantaru. evadi istam vaadidi. raajamouli cinema lu @NEECHAMATA@ evaro madam rasaru. naku chirakesindi.

  NO ONE IS WRONG. NONE ARE CORRECT. EVERYTHING SHOULD BE ACCEPTABLE IN THEIR WAY !


 5. BHARATH

  Chivaraku Migiledi: As per my understanding, a great novel in telugu literature. Now this discussions, by all the above elightened people
  show how we understand the great things.

  When I saw Devedas of ANR at early teens I got headache. But same picture I saw at 30s I understand the irony of life. Now I feel, the 40s sentiments, social systems of Bengal urban educated families.Their limitations, human emotions etc.

  That’s all.

  In a society like ours every comment is to be respected, accepted and taken in a good spirit. after all it is thier personal belief may be taken serious or may be views leniently.

  Bharath


 6. sreeranganayaki

  we cry for an ice cream in our childhood days,,later 4 education, then job, marriage again 4 life, crying begging r comon factors.we hav so many weaknesses very often it wil come. after reading novelcame 2 know about block holes in our childhood days, parents should take care their childrenup 2 15 years.if our childhood is good everything wil b fine otherwise no chance 2 mould our life.. if u cant follow read dr.papinenisivasankar’s poem pempakam . a famous telugu poet critic shortywriter he is trying 2 plough our minds & heart if both r clean world wil b rainbow


 7. తాడేపల్లి హరికృష్ణ

  చివరీకి మిగిలేది కన్యా శుల్కంలాగే ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక గంగిగోవు. దాని మనం ఏమీ అనకూడదు. ఎదురుపడితే చెవల మధ్యనా తోకవైపూ ఓ సారి చూసేశి, స్పృశించి తలకి రాసుకుని ఓ నమస్కారం చేసి వెళ్ళిపోవాలి గాని అంతకన్న ఎక్కువ మాట్లడటానికి ఎన్ని దమ్ములు కావాలి? Oraganized religionకి ప్రత్యామ్నాయంగా శూన్యవాదాన్ని నవలా రూపంగా అందించాడు కనక తప్పనిసరిగా ఇది గొప్పనవల కావలసిందేను. ఇక స్త్రీపురుష పరస్పరాకర్షణంటారా – అది లేకుంటే రామాయణమెక్కడిది, భారతమెక్కడిది, సాహిత్యమెక్కడిది, సినిమా ఎక్కడిది, మనుగడెక్కడిది? కృష్ణమూర్తి తత్త్వాన్ని బోధించిన కృష్ణమూర్తి గారికి చెల్లింది మూడుఖండాల పౌరిడిగా తత్త్వబోధ చేసుకోడానికి. మరి దయానిధి మూడు ప్రాంతాల పౌరిడిగా అగచాట్లు గరిచాడు. తక్కిన సామాన్యులందరూ సంసారరథచక్రాలనీడ్వవల్సిందేను, వెచ్చాలు కొనవల్సిందేను, డాక్టరు ఫీజులిచ్చుకోవలసిందేను, ఎలక్షన్లలో వోట్లు వెయ్యవలసిందేను. ఖాళీ చీట్లు అన్నిటికీ పనికిరావు.

  – తాడేపల్లి హరికృష్ణ


 8. ఇంకో నేల ప్రేక్షకుడు

  రివ్యూ ఎవరైనా, ఎలాగైనా చెయ్యొచ్చు.కాని దాని ప్రచురించే ముందు ఎడిటర్ ఒక్కసారి అది ప్రచురనార్హమైనదో కాదో చూడాలి.ఒకవేళ మన ఖర్మ కాలి ప్రచురిస్తే “Silence is sometimes the severest criticism ” అని గుర్తించి ఇటువంటి వాటిని పట్టించుకోకుండా వదిలెయ్యాలి.అనవసరంగా ఈ సమీక్ష గురించి చర్చించి దీని విలువని పెంచుతున్నారు. Douglas adams చెప్పినట్టు “All opinions are not equal ” అనేది చాలా నిజము.


 9. ఈ టపా గురించి ఒక స్నేహితుని ద్వారా విన్నాకా చదవాలని కుతూహలం కలిగి ఇవాళ మొత్తం కామెంట్లతో సహా చదివేను. మరి అంతా చదివాకా ఓ రాయెయ్యకుండా ఉండలేకపోతున్నా.

  హేలీ గారూ, భలేగా రాశారు. నేనే ఈ నవల చదివి ఉంటే, ఖచ్చితంగా ఇలాగే, లేకపోతే ఇంతకంటే కొంటెగా రాసేవాణ్ణి. (నాకు సినిమా నాలెడ్జి తక్కువ కాబట్టి మీరిచ్చినంత మంచి ఉపమానాలు ఇవ్వలేకపోయేవాణ్ణనుకోండి.)

  అయిదారేళ్ళ క్రితం హైదరాబాదు నుంచి లండన్ వెడుతున్నాను. ఫ్లైటులో సినిమాలు వేస్తారుగా. అన్ని సినిమాలూ కాస్త,కాస్త ముక్క చూసి, ఆఖరికి ఒక సినిమాకి ఫిక్సయ్యాను. సినిమా యావత్తూ మంచి కామెడీగా ఎంజాయ్ చేసాను. ఫ్లైటు దిగాకా నాతో పాటూ ప్రయాణం చేసిన, ఇంగ్లీషు సాహిత్యంతో పరిచయం ఉన్న ఒక ఇలైటిస్టు కొలీగ్ తో కబుర్లు చెప్తున్నా. ప్రయాణం బాగుంది, మంచి సినిమా చూసాను అన్నాను. ఏం చూసావని అడిగింది. జేన్ ఆస్టిన్ రాసిన ప్రైడ్ అండ్ ప్రిజుడిస్ పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా చూసా, మంచి కామెడీగా ఉందిలే అన్నాను. ఆ అమ్మాయి షాకయింది. కామెడీ ఏంటి అంది. ఆ పాతకాలం జనాలు, వాళ్ళ వాటాలు, వాళ్ళు బిగుసుకుపోయి చెప్పే డైలాగులు, అపార్థాలు, వాళ్ళ దరిద్రపుగొట్టు సమస్యలు అన్నీ భలే ఉన్నాయిలే అన్నా. ఆ అమ్మాయికి ఏం అనాలో కూడా అర్థంకాక నవ్వేసి ఊరుకుంది.

  మన పాత్తెలుగు సినిమాల్లో కూడా అపార్థాలు చేసేసుకోడాలు, ఆపళంగా కొవ్వుత్తులైపోడాలు, కన్నీళ్ళు కార్చెయ్యడాలూ అన్నీ నాకు చాలా కృతకంగా, హాస్యంగా అనిపిస్తాయి. జెనరేషన్ గేప్ కదా. ఎటొచ్చీ మనం ఏమన్నా అంటే జనాలు బాధపడిపోతారు.

  అఫ్ కోర్స్, నేనూ బాధపడతాను – నాకు బాగా తెలిసిన, నా మనసుకి దగ్గరైన వాటిని ఎవళ్ళైనా తేలిక చేసి మాట్లాడితే. ఎటొచ్చీ ఈ మధ్యే తెలుస్తోంది, బాధపడ్డం కన్నా నవ్వేసి ఊరుకోడం బెటరని – నా పాత కోలీగు లాగే.

  మీ రివ్యూ మాత్రం – it really rocks for me!!


 10. G

  Another clasSICK (novel) debate 🙁

  When will people take positive outta something? రచయిత సరిగా తన అభిప్రాయాలను చెప్పలేదు. బాగానే ఉంది. మరి వ్యాఖ్యాతలు?

  How can you say a novel is a classic? It depends on the reader. Writer writes for his own sake, and reader understands according to his ability. ఇది ఇలాగే చదువు అని చెప్పటం ఎంత వరకూ సబబు?


 11. లక్షీనారాయణ

  మన కవులు చెప్పిన విధంగా “చినిగిన చొక్కా అయిన తొడుక్కొ మంచి పుస్తకం కొనుక్కొ” అన్నారు. ఆ విధంగానె నేను పుస్తకం కొంటె ఇలాంటిదే కొంటాను.


 12. Viswanath

  @కత్తి మహేష్ కుమార్:

  – abhiprayam lonu, vyakta parachatam lonu, abhipraya theevratha lonu difference undi thappa … rendu almost okkate …

  – meeru enduku ilanti reviews rayatam antunnaru … vallu enduku “Droupathi” lanti pustakam raytam antunnnaru …

  – Idi bhavaprakatana swetcha ayyithe …. adi kuda bhava prakatane …

  – Ee review mimmalni ekkado touch chesindi kabatte meeru discourage chestunnaru (leka pothe intha hot hot responses ravu kada :))… same is the case with droupathi …

  ==========
  Viswanath


 
   Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

Ngũgĩ wa Thiong’o’s “Education for a national culture”

Article By: Halley ఈ పరిచయం ప్రసిద్ధ ఆఫ్రికా రచయిత గూగి (Ngũgĩ wa Thiong’o) రాసిన Education for a national culture అన్న వ్యాసం ...
by అతిథి
3

 
 

రాళ్ళపల్లి సాహిత్య సంగీత వ్యాసాలు

వ్యాసకర్త: Halley ******************* ఈ పరిచయ వ్యాసం ఎమెస్కో వారు ప్రచురించిన “రాళ్ళపల్లి సాహిత్య సం...
by అతిథి
2

 
 

శతపత్రము – గడియారం రామకృష్ణశర్మ ఆత్మకథ

వ్యాసకర్త: Halley *************** ఈ వ్యాసం గడియారం రామకృష్ణ శర్మ గారి ఆత్మకథ “శతపత్రం” గురించి. ...
by అతిథి
4

 

 

Douglas M Knight Jr’s “Balasaraswathi: Her art and life”

వ్యాసకర్త: Halley ************* ఈ పరిచయం ‘డగ్లస్ ఎం నైట్ Jr’ రాసిన “బాలసరస్వతి: హర్ ఆర్ట్ అండ్ ల...
by అతిథి
0

 
 

అంతశ్చేతనని తట్టి కుదిపే “బుచ్చిబాబు కథలు”

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్ *********** లబ్దప్రతిష్ఠులైన అలనాటి రచయితల కథలను నేటి తరానిక...
by Somasankar Kolluri
1

 
 

Rearming Hinduism – Vamsee Juluri

వ్యాసకర్త: Halley ********** ఈ పరిచయం వంశీ జూలూరి గారు రాసిన Rearming Hinduism: Nature, History and the Return of Indian Intelligence అనే పుస్...
by అతిథి
2