పుస్తకం
All about booksపుస్తకభాష

November 7, 2017

We Are What We Pretend To Be – Kurt Vonnegut

More articles by »
Written by: అతిథి
Tags: , ,

వ్యాసకర్త: Naagini Kandala
**********************

ఒక ప్రక్కన వేరే పుస్తకాలు చదువుతున్నా,’మరి నేను రాసిన కథలెప్పుడు వింటావు ‘ అని వెంటాడి వేధించే రచయితలు కొందరుంటారు. Kurt Vonnegut అలాంటి ఒక రచయిత. ఆయన డిస్టోపియన్ నవలిక 2BR02B చదివాకా ఆయన మిగతా రచనలేవీ చదవకపోవడం క్షమించరాని నేరం. అందువల్ల పాపప్రక్షాళన లో భాగంగా ‘We Are What We Pretend To Be’ చదవడం జరిగింది. ఈ పుస్తకం ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఉన్న రెండు నవలికలూ ఆయన జీవితకాలంలో చేసిన మొదటి, చివరి రచనలు. దీనికి Vonnegut కుమార్తె Nanette Vonnegut ముందుమాట రాశారు. ఈ రెండు నవలికలు కొంతవరకు ఆటోబయోగ్రఫికల్ అంటారామె. మొదటి రచనకు,రెండో రచనకు మధ్య యాభయ్యేళ్ళ సుదీర్ఘ వ్యత్యాసం ఉంది.

George Orwell 1984, Animal farm; Lois Lowry రాసిన The Giver లాంటి డిస్టోపియన్ నవలల్ని గుర్తుకుతెచ్చిన 2BR02B, ఆయన రచనల మీద ఆసక్తి కలిగేలా చేసింది. కానీ ఈ రెండు నవలికలూ ఆయన పరిపూర్ణమైన రచయితగా శిఖరాగ్రాన ఉన్న కాలంలోవి కాకపోవడంతో అసలు ఎక్కడా Vonnegut ను చదువుతున్నాం అనిపించదు. మొదటి నవలిక ‘Basic Training’ లో ఆయన శైలిలో సహజంగా ఉండే పరిపక్వత లోపిస్తే, రెండో నవలిక ‘If God Were Alive Today’ లో ఆ పరిపక్వత పాళ్ళు శృతిమించి రాగానపడ్డాయి.

‘Basic Training’ నాకు చాలా నచ్చిన కథ. పదహారేళ్ళ Haley Brandon తల్లిదండ్రుల మరణం తరువాత ఆయన బంధువులతో Ardennes Farm లో నివసించడానికి వస్తాడు. ఇంటి పెద్ద జనరల్ (ఆర్మీ లో పని చేసినకారణంగా ‘ది జనరల్’ అని పిలుస్తుంటారు), ఆయన ముగ్గురు కుమార్తెలు Annie, Kitty, Hope లు ,వారి పొలంలో పనిచేసే Mr. Banghart మరియు Caesar, Delores అనే రెండు గుఱ్ఱాలు ఇందులో మిగతా పాత్రలు. జనరల్ పేరుకి తగ్గట్లు ఇంట్లో కూడా క్రమశిక్షణ పేరుతో అందర్నీ శాసిస్తుంటాడు. ఇందులో Vonnegut మార్కు డార్క్ హ్యూమర్ లేకపోయినా అక్కడక్కడా చతురోక్తులతో తేలికపాటి హాస్యం ఉంటుంది. ఈ కథలో జనరల్ ఇంటి వాతావరణం కొన్నిచోట్ల The Sound of Music సినిమాను గుర్తుకుతెస్తుంది. జనరల్ తాను నమ్మిన సిద్ధాంతాలను ఇంట్లో గుడ్డిగా అమలుపరుస్తుంటాడు. వాటిని సమర్థించుకోడానికి చిన్న చిన్న కథలల్లి పిల్లల్ని ఒప్పిస్తుంటాడు. ఇంట్లో పాటించాల్సిన నియమాల్నీ, ఏదైనా నేరం చేస్తే శిక్షల్నీ బులెటిన్ బోర్డు మీద అతికిస్తుంటాడు. పాలేరు Banghart దగ్గరనుంచీ ఇంట్లో అందరూ జనరల్ నుంచి ఎలా తప్పించుకుందామా అని ఉపాయాలు వెతుకుతుంటారు. మరి చికాగో వెళ్ళి పియానో ప్లేయర్ అవుదామని కలలు కన్న Haley ఆ కట్టుదిట్టమైన వాతావరణంలో ఎలా ఇమిడాడు? తన కలను నెరవేర్చుకున్నాడా లేదా? అనేది మిగతా కథాంశం. Vonnegut తొలి కథ కావడంతో ఇందులో సహజంగానే యవ్వనంలో వెలుగుచూసే భయాలు, స్వేచ్ఛగా రెక్కలు విప్పుకుని ఎగిరిపోవాలనే తాపత్రయం లాంటివి అంతర్లీనంగా కనిపిస్తాయి. Vonnegut నిజజీవితంలో రెయిన్బో ఫార్మ్ కెప్టెన్ కూతురు మేరీతో ప్రేమలో పడటం ఈ కథకు స్ఫూర్తి.

Noon brought with it the solid blessings of strong coffee and whole milk, of strawberry jam and biscuits, of ham and gravy. It was an hour of peace and plenty, reminding Haley of a medieval custom he had read about—whereby a condemned man was hanged and skillfully revived several times before being permitted to expire completely. The analogy did not spoil his appetite. He wolfed his food, excused himself, and lay down on the sunroom couch.

Haley,Banghart లు తమ గుర్రబ్బండితో జనరల్ కార్ ను గుద్దేసిన తరువాత ఈ నేరేషన్ నవ్వులు పూయిస్తుంది.

Mr. Banghart had arisen from the ground and walked over to the car to study it in silence. He turned away from it after a few moments and headed across the barnyard.
“Where are you going?” called Hope.Mr. Banghart stopped.“I don’t know,” he said with a shrug. “Dallas, Scranton, Los Angeles—somewhere.”

ఇక రెండో కథ ‘If God Were Alive Today’ విషయానికొస్తే, ఈ కథ చదువుతున్నంతసేపూ “But beauty, real beauty, ends where an intellectual expression begins’ అన్న మహానుభావుడు ఆస్కార్ వైల్డ్ మాటలు పదే పదే గుర్తొచ్చాయి. మొదటి కథలో ఉన్న సరళత, అందం ఇందులో కొంచెం కూడా కనిపించదు. ఒక పరిపూర్ణమైన రచయితగా Vonnegut జీనియస్ మాత్రమే కనిపిస్తుంది. ఇందులో కథాంశం, డిసెంబర్ 12, 2000 సంవత్సరంలో Northampton లోని కాల్విన్ థియేటర్ లో స్టాండ్ అప్ కమెడియన్ Gil Berman కాలేజీ పిల్లలనుద్దేశించి చేసిన ఒక షో. Berman గళంలో రచయిత అమెరికా సంస్కృతి పట్లా, చుట్టూ ఉన్న సమాజం పట్లా తనలో నిలువెల్లా పేరుకుపోయిన అసంతృప్తిని వెళ్ళగక్కుతారు. ఇక్కడ Vonnegut లో నిలకడ స్థానంలో సమయం తక్కువుందనే తొందర, చివరిదశలో ఉన్నానన్న తెగింపు ప్రతి వాక్యంలోనూ కనిపిస్తాయి. అంతేకాకుండా ఆయన తుదిరోజుల్లో చేసిన రచన కావడంతో పూర్తికాకుండా అసంపూర్తిగానే ఉండిపోయింది. ఇందులో Berman ఆలోచనలు ఆయన పుట్టుక, తల్లిదండ్రుల విచ్ఛిన్నమైన వివాహం, తండ్రి Dr. Robert Berman ఆత్మహత్య, తల్లి Magda కాన్సర్, డ్రగ్స్ మొదలు పలు సామాజిక, రాజకీయ అంశాల చుట్టూ తిరుగుతాయి. విచిత్రంగా Berman లో దేనిపట్లా కృతజ్ఞతా భావం కనిపించదు. అన్నిటా ద్వేషం తప్ప ప్రేమగానీ, గౌరవంగానీ వ్యక్తం కావు. ఇక ఒక స్థాయిలో ఆ ఆలోచనలు ఆక్రందనలుగా రూపాంతరం చెంది చదివేవాళ్ళకి చెవిలో ranting లా అనిపిస్తుంది. కథను ప్రారంభించిన లైన్స్ లో Vonnegut మార్కు డార్క్ హ్యూమర్ ను ఆస్వాదించేలోపు అనవసర ప్రసంగాలు, కొంచెం కూడా దిశానిర్దేశం లేని Berman ఆలోచనలు పాఠకులకు విసుగు తెప్పిస్తాయి. చివరగా పాఠకులు ఆ ఆలోచనల్లో వేగం అందుకోకుండానే పుస్తకం పూర్తవుతుంది. ఈ కథను అర్థం చేసుకోడానికి ఆ సమయంలో Vonnegut ఎదుర్కొన తీవ్ర మానసిక సంక్షోభాన్ని గురించి Nanette Vonnegut రాసిన ముందుమాట కొంతవరకూ సహాయపడుతుంది.

“When artificial intelligence was perfected, the most respected manufactured brain was at the Massachusetts Institute of Technology. It had chosen its own name, which was ‘M.I.T.’ Computers had designed it, and then computers controlled the machines that made its parts, and it now took care of its own upgrading and maintenance. It had all knowledge in its memory, and it was telling all sorts of other machines what to do or say next. One day, ‘Cal Tech,’ the artificial intelligence at the California Institute of Technology, asked M.I.T. what it thought of people. M.I.T. needed only one word for an answer. The word was ‘Obsolete.’

“Next question? ‘What were people for?’ And M.I.T. replied: ‘Paranoia, schizophrenia, depression, greed, ignorance, and stand-up comedy.’”

ఒక అసంపూర్ణమైన దానిలో పరిపూర్ణతను పొందడానికి చేసే ప్రయత్నం దాగుంటుంది. అలాగే లోపభూయిష్టమైన ప్రతి దానిలో ఆ లోపాన్ని అధిగమించాలనుకునే ఆరాటం ఉంటుంది. కానీ ఒకసారంటూ ఆ పరిపూర్ణత మెట్లు పైకంటూ ఎక్కేశాక మిగిలేది పతనమే. ఎంతటి మహామహులకైనా తిరుగుప్రయాణం తప్పదు మరి. తరచి చూస్తే యవ్వనానికి, వృద్ధాప్యానికీ వ్యత్యాసం అదేనేమో. మానవ జీవితపు తొలి దశలో సత్యాన్వేషణ కోసం ఆరాటం ఉంటే, మలిదశలో తెలుసుకున్న ప్రతీ సత్యాన్ని (unlearn) మర్చిపోవాలనే తపన కనిపిస్తుంది. ఒకవేళ మర్చిపోలేకపోతే,దాన్ని జీవితానికి అన్వయించుకోవడం అనివార్యమైనప్పుడు కలిగిన ఆశాభంగంలోంచి పుట్టే స్వరాల్లో ఆస్వాదించ వీలైన జీవన రాగాలేమీ ఉండవు. అవన్నీ కేవలం నైరాశ్యంతో కూడిన పొలికేకల్లా, అపస్వరాల్లా మిగిలిపోతాయి. రెండో కథలో Kurt Vonnegut గళంలో ఈ తరహా existential క్రైసిస్ కనిపిస్తుంది. అది వినసొంపుగా అయితే లేదు.

Money is dehydrated mercy. If you have plenty of it, you just add tears, and people come out of the woodwork to comfort you.

“Comedians used to have brains. They don’t anymore. Nothing but sex and toilet jokes.”

Ash blew up again. “Who ever told you a comedian is supposed to be funny?” he said. “The great ones are heartbreakers, and that’s what you did to me tonight. Who are you? What are you? Where did you park your flying saucer?”

‘Mr. Berman, where do you get your ideas from?’ Well, you might as well have asked the same question of Lewd-vig van Beethoven. Young Lewd-vig was horsing around in Germany like everybody else, and all of a sudden all this shit came pouring out of him, and it was music. I was horsing around at Columbia University like everybody else, and all of a sudden all this shit came pouring out, and it was embarrassment about my country.”

“Like ninety-nine point ninety-nine percent of great artists of every sort since the dawn of history, my dear mother, Magda, fell victim to audience shortages and a talent glut.” He said of talent in general: “Beware of gods bearing gifts.”

ఆత్మ విమర్శ చేసుకుంటూ-
I wanted to say to him, ‘Gilbert Lanz Berman, can’t you put down the world and all its troubles for at least ten minutes? It’ll still be there when you pick it up again.’”

సాహితీ ప్రముఖుల్ని మాదకద్రవ్యాలకి ముడిపెడుతూ-

One, Allen Ginsberg, had written such good poems while a confessed drug-user that he had been elected to the American Academy of Arts and Letters! As for alcohol, which Berman was still drinking back then, Eugene O’Neill, Sinclair Lewis, Ernest Hemingway, and John Steinbeck, not Columbia grads, to be sure, but American winners of Nobel Prizes for Literature, were all certifiable alcoholics. And the greatest of all mental-health theorists, Sigmund fucking Freud, was on cocaine.

But Gil Berman, watching drug-free Gil Berman like a hawk, found him unimpaired as a wit and scourge of every sort of institutional stupidity and hypocrisy that was murdering not just common decency, but the planet itself.

స్త్రీ ద్వేషం వెలుగుచూసిన సందర్భాల్లో ఫెమినిజం పై నిప్పులు చెరుగుతూ-

And then he said, “I know you ladies from Smith College here tonight are ardent feminists, flat heels and no makeup, preparing to beat men at their own games in the marketplace. But you know what I think?” he asked with apparently profound, baritone concern. “I think this is a national tragedy. Honest to God, and this kidder is not kidding this time: I think educating a woman is like pouring honey into a fine Swiss watch. Everything stops.”

All I need to know from you, Doc, is where do I go to get detoxed from sobriety?”

In his Rolling Stone interview he declared: “Drugs are science. Alcohol is superstition.”About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

Unforbidden Pleasures – Adam Phillips

వ్యాసకర్త: Nagini Kandala ************* ఆ మధ్య ఇంతియాజ్ అలీ సినిమా ‘తమాషా’ అని ఒకటొచ్చింది. ఎంత త్వర...
by అతిథి
0

 
 

Uncommon Type: Some Stories – Tom Hanks

వ్యాసకర్త:Naagini Kandala *************** టామ్ హాంక్స్.. సుమారు పదేళ్ళ క్రిందట ఎప్పుడో చూసిన Cast Away సినిమాత...
by అతిథి
1

 
 

Hillbilly Elegy: A Memoir of a Family and Culture in Crisis – J.D.Vance

వ్యాసకర్త: Naagini Kandala ***************** అమెరికాలోని మారుమూల Appalachia ప్రాంతాలకు చెందిన వారిని హిల్ల్బిల...
by అతిథి
0

 

 

Stiff: The Curious Lives of Human Cadavers – Mary Roach

వ్యాసకర్త: Naagini Kandala ****************** Stiff: The Curious Lives of Human Cadavers, అమెరికన్ రచయిత్రి మేరీ రోచ్ 2003లో రాసిన పుస్త...
by అతిథి
1

 
 

Fantastic night and other stories – Stefan Zweig

వ్యాసకర్త: Nagini Kandala ********* Stefan Zweig.. ఈ మధ్యే మొదలైన కొత్త ప్రేమ. అసలీ పుస్తకం కళ్ళపడే వరకూ ఈయన గు...
by అతిథి
0

 
 

The Sympathizer – Viet Thanh Nguyen

వ్యాసకర్త: Nagini Kandala ************ “If you want to tell people the truth, make them laugh, otherwise they’ll kill you” అని ఆస్కార్ వైల్డ్ అన్నా...
by అతిథి
0