పుస్తకం
All about books



పుస్తకభాష

October 17, 2014

Fun Home – A Family Tragicomic

More articles by »
Written by: సౌమ్య
Tags: ,
Fun Home – A Family Tragiocomic అన్నది ఒక గ్రాఫిక్ ఆత్మకథ. రచయిత్రి – Alison Bechdel. ఈవిడ అమెరికాకు చెందిన ప్రముఖ కార్టూనిస్టు. అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఈ పుస్తకం కూడా గ్రాఫిక్ నవలా ప్రపంచంలో పేరొందిన Eisner అవార్డు సహా అనేక బహుమతులు పొందిన పుస్తకం. కొన్ని నెలల క్రితం ఈ పుస్తకం చదివాను. నన్నెంతగా ఆకట్టుకుందంటే వరుసగా మూణ్ణాలుగు సార్లు ఈ పుస్తకం చదివి, నాకు తెలిసిన వాళ్ళకి చదవమని ప్రచారం కూడా చేసాను :-). దాని గురించి, నాలుగు మాటలు –

కథ: పైన చెప్పినట్లు, ఇది రచయిత్రి ఆత్మకథ. Funeral home నడపడం వాళ్ళ కుటుంబ వ్యాపారం. దాన్నే వాళ్ళు Fun Home అని పిల్చుకుంటూంటారు. వాళ్ళ నాన్నకేమో ఇంటిని, ఇంట్లోని వస్తువులనీ curate చేయడం వ్యాపకం, వ్యసనం. దానితో చిన్నప్పటి నుండి ఆలిసన్, ఆవిడ ఇద్దరు తమ్ముళ్ళూ ఇంట్లో ఈ కార్యకలాపాలన్నింటిలోనూ పాలు పంచుకుంటూంటారు. “వస్తువుల్ని పిల్లల్లాగా, పిల్లలని వస్తువుల్లాగా” చూస్తూ ఉండే ఆ తండ్రి మరణించినప్పుడు ఆయన closet gay అని తెలుస్తుంది, కొన్నాళ్ళ క్రితమే తాను lesbian అని గ్రహించుకున్న రచయిత్రికి. ఆ ఎరుక, ఆవిడ చిన్నతనపు అనుభవాలు, తదనంతర పరిణామాలు,వీటన్నింటినీ ఆవిడ అర్థం చేసుకున్న తీరు – ఇవీ ఈ పుస్తకం కథలో ప్రధానాంశాలు (నా దృష్టిలో!)

కథ కాకుండా, పుస్తకంలో నన్ను ప్రధానంగా ఆకట్టుకున్నవి మూడు అంశాలు: రచయిత్రి సాహిత్యాన్ని మాధ్యమంగా వాడి తన కథను చెప్పిన విధానం, ఆవిడ భాష, కొన్ని అంశాల గురించి గ్రాఫిక్ వర్ణనలు. ఒక్కొక్కటిగా వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను.

పుస్తకంలో తరుచుగా ఆంగ్ల సాహిత్యం, గ్రీకు మైథాలజీలోని పాత్రల ప్రస్తావనలు వస్తూంటాయి. రచయిత్రి తన జీవితంలో జరిగే సంఘటనలను సాహిత్యంతో పోలుస్తూ వెళుతుంది పుస్తకం ఆద్యంతమూ. ఉదాహరణకి రెండు వాక్యాలు.:
“If my father was a Fitzgerald character, mymother stepped right out of Henry James – a vigorous American idealist ensnared by degenerate continental forces.”

“If the taming of the shrew was a harbinger of my parents’ later marriage, Henry James’s ‘The Potrait of a lady’ runs more than a little parallel to their early days together”.

ఎందుకు ఇలా ఇన్నిసార్లు కథల్లో పాత్రల ద్వారా సంభాషిస్తోంది? అనిపిస్తే, దానికీ పుస్తకంలోనే ఓ సమాధానం రాసిందావిడ‌-
I employ these allusions to James and Fitzgerald not only as descriptive devices, but because my parents are most real to me in fictional terms .. and perhaps my cool aesthetic distance itself does more to convey the arctic climate of our family than any particular literary comparison” అని.

ఆమె తల్లికి నచ్చిన ఒక కవిత గురించి చెబుతూ, “Perhaps she also liked the poem because its juxtaposition of catastrophe with a plush domestic interior is life with my father in a nutshell.” అంటుంది. – ఇలాగ పుస్తకం పొడుగుతా వివిధ రచనల ప్రస్తావన, వాటిని తన కథతో జత చేయడం జరుగుతూనే ఉంటుంది కానీ, ఎక్కడా విసుగేయలేదు నాకు. పై పెచ్చు చాలా ఆసక్తికరంగా అనిపించింది కూడానూ. ఆవిడ చదివిన పుస్తకాలేవీ (అత్యంత ప్రముఖమైనవి – అందరూ చదివి తీరాల్సినవి అని అందరూ అనుకునేవాటితో సహా) నేను చదవలేదు. చదివి ఉంటే మరింత ఎక్కువగా ఆస్వాదించేదాన్ని ఏమో రచయిత్రి శైలి ని. (కో.కొ: ఇటీవలి కాలంలో చదివిన మరో నవల – Eleanor Brown రాసిన The Weird Sisters కూడా ఇలాగే షేక్స్పియర్ సాహిత్యంతో ముడిపెడుతూ కథ చెబుతూ ఆకట్టుకుంది నన్ను, కథ రొటీన్ పంథాలో సాగినా కూడా)

రచయిత్రికి భాష మీద మంచి పట్టు ఉంది. సాధారణంగా నేను ఆంగ్ల రచనల్లో కథ-కథనాల్లో కొత్తదనం ఉంటే వాటి వెంబడే పోవడం తప్ప ఇలాంటివి అంతగా గమనించను. ఇది, ఈమధ్య చదివిన మరికొన్ని ఇతర రచనలు – ప్రత్యేకం భాషని కూడా గమనించేంత ఆకట్టుకున్నాయి – అవి నా కంటబడ్డం నా‌ అదృష్టం. ఆవిడ భాషా విన్యాసం నన్ను చాలా వరకు ఆకట్టుకున్నా, ఆ పట్టు నా చుట్టూ ఉచ్చులా బిగుసుకుంది కూడా ఒకట్రెండు చోట్ల! ముఖ్యంగా ఇవేవో పొడుగుపొడుగు పదాలతో ఇలాంటి వాక్యాలు చూసినప్పుడు:
“In an act of prestidigitation typical of the way my father juggled his public appearance and private reality, the evidence is simultaneously hidden and revealed.”
..on the drive back home, a postlapsarian melancholy crept over me.”
ఇలా అంతా రాసి మళ్ళీ అవిడే “..Again, the troubling gap between word and meaning. My feeble language skills could not bear the weight of such a laden experience.” అనడంతో మాత్రం నాకు దిమ్మతిరిగిపోయింది. 🙂
వాళ్ళ నాన్న గే అని, తాను లెస్బియన్ అని తెలుసుకున్నప్పుడు ఆవిడ రాసిన వాక్యాల్లో కొన్ని నన్ను చాలా ఆకట్టుకున్నాయి. ఉదాహరణకి:
I’d been upstaged, demoted from protagonist in my own drama to comic relief in my parents’ tragedy
I had imagined my confession as an emancipation from my parents, but instead I was pulled into their orbit

సాహిత్యంలో మంచి ప్రవేశం, భాషపై మంచి పట్టుతో పాటు, రచయిత్రిలో ఉన్న మరో గుణం ఆవిడ మాటల్లోనే – “…then, there is my own compulsive propensity for autobiography..” – ఏళ్ళ తరబడి ఆవిడ రాసుకున్న డైరీల పుణ్యమా అని, పుస్తకంలో చాలా విషయాలు సాధారణంగా retrospectలో రాసుకునే ఆత్మకథలతో పోలిస్తే చాలా వివరంగా ఉంటాయి. ఇంత వివరంలో కూడా కొన్ని చోట్ల విషయాలు అటూ-ఇటూ అయ్యాయా? అని సందేహం కలిగింది. ముఖ్యంగా వాళ్ళ నాన్న మరణించినప్పుడు సంతాపం వ్యక్తపరచడానికి వచ్చినవాళ్ళపై విరుచుకుపడాలన్న కోరిక రచయిత్రికి కలిగిన చోట- అంతకు ముందు రాసిన దాని ప్రకారం ఆవిడకింకా వాళ్ళ నాన్న స్వలింగసంపర్కం చేసేవాడన్న సంగతి తెలియదు. కానీ, తెలిసినట్లు రాసింది మరి (పేజి: 125). ఆలిసన్ టినేజీలో తాను లెస్బియన్ అని తీర్మానించుకున్నాక తన తల్లిదండ్రులకి ఉత్తరం ద్వారా తెలియజేస్తుంది (“I did it via letter – a remote medium, but as I have explained, we were that sort of family”). ఈ టైములో వాళ్ళమ్మ వాళ్ళ నాన్న ని విడాకులు కోరడమూ, ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో వాళ్ళ నాన్న మరణించడమూ జరుగుతుంది – ఆ తరువాత తెలుస్తుంది ఆలిసన్ కి – ఆయన closet gay అని (దయచేసి ఈ పదాలకంతా తెలుగు పదాలున్నాయేమో సూచించగలరు). నాకేమిటో ఇక్కడ కొంచెం అయోమయంగా అనిపించింది timeline.

ఆరో అధ్యాయం చాలా క్లిష్టంగా ఉండింది నాకు. అదొక్కటి తప్పిస్తే, మొత్తంగా పుస్తకం నన్ను చాలా ఆకట్టుకుంది. ముఖ్యంగా, రచయిత్రి తన చిన్నతనంలో ఉన్న OCD (Obsessive Compulsive Disorder) ని వర్ణించిన విధానం చూసి అవాక్కయ్యాను నేను. ఇంత స్పష్టంగా, గ్రాఫిక్ గా వర్ణించవచ్చునా మానసిక సమస్యల గురించి? అని. ఆమె OCD గురించి వర్ణించిన తీరు, ఆనాటి డైరీ ఎంట్రీలతో తన మనోభావాలను మనతో పంచుకున్న తీరు – నామట్టుకు నాకు అద్భుతమే. అది చదివాక నాకూ చిన్నప్పటినుండీ OCD ఉందేమో అన్న అనుమానం కలిగిందన్నది వేరే సంగతి!

ఇకపోతే, ఇది గ్రాఫిక్ నవల – ఇప్పటి దాకా నేను బొమ్మల గురించి ఏం రాయలేదు. నిజానికి, బొమ్మలు కొన్ని చోట్ల మామూలుగా కనబడ్డా కొన్నిచోట్ల చాలా లోతుగా ఉన్నాయి. ఆ బొమ్మలతో ఆ డైలాగులు, రచయిత్రి వన్-లైనర్లు కలుపుకుంటే, అదొక ప్రపంచం. బయటపడి ఇంకో పుస్తకం వైపుకి వెళ్ళడానికి నాక్కొన్ని రోజులు పట్టింది. పుస్తకంలో కొన్ని explicit దృశ్యాలు ఉన్నాయి. చదువరులు ఈ విషయం దృష్టిలో ఉంచుకోవాలి. గ్రాఫిక్ నవలల అభిమానులు తప్పకుండా చదవాల్సిన పుస్తకం.

నాకు LGBT సమూహాల గురించి అవగాహన లేదు. ఈమధ్యనే చదివిన Millenium Trilogyనే నేను చదివిన పుస్తకాల్లో వీరు ప్రధాన పాత్రధారులుగా ఉన్న రచన. ఇది రెండవది. కనుక, పుస్తకంలో సూచించిన విషయాలేవైనా నేను అపార్థం చేసుకున్నానేమో, నాకు తెలియదు ఇప్పటికైతే. వీళ్ళ కుటుంబీకులు ఈ పుస్తకం రాయడాన్ని అభ్యంతరపెట్టలేదని వాళ్ళకి చివ్వర్లో ధన్యవాదాలు తెలిపింది రచయిత్రి. ఇదంతా చదివాక నాకు ఆశ్చర్యంగా ఉంది ఈ విధంగా జీవితాలు బట్టబయలైపోతూ ఉంటే ఎలా ఊరుకున్నారూ? అని. నేనైతే చాలావరకు నవల అనుకుంటూనే చదివాను -వాళ్ళ జీవితాల్లోని డ్రామా అలా ఉంది కనుక!

Alison Bechdel అన్నావిడ ప్రముఖ అమెరికన్ కార్టూనిస్టు అని, ఆవిడ రాసిన “Dykes to watch out for” అన్న కామిక్ దాదాపు ముప్ఫై ఏళ్ళ పాటు బహుళ ప్రజాదరణ పొందిందని ఇదివరలో వేరే వెబ్-కామిక్స్ చదువుతున్నప్పుడు తెలిసింది (XKCD నుండి Questionable Content మీదుగా Dykes to Watch out for చేరుకున్నాను నేను.). “ముప్ఫై ఏళ్ళ క్రితం లెస్బియన్ మహిళలు ప్రధాన పాత్రధారులుగా కామిక్ రాసిందా ఈవిడ?” అన్న ఆశ్చర్యంలో ఆవిడ గురించి వికీ పేజీలో చదువూండగా ఈ “Fun Home” పుస్తకం గురించి తెలిసింది. అయితే, “ఓహో” అనుకుని ఊరుకున్నాను. అయితే, ఈమధ్యనే ఒక స్నేహితుడు దీన్ని చదివి బాగుందనడంతో చదవడం సంభవించింది. అందుకు అతనికి బహిరంగంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను (వాళ్ళు విదేశీయులు, తెలుగు తెలియదు, ఇది చదవడు – ఇలాంటివన్నీ అప్రస్తుతం!).

********








Fun Home: A Family Tragicomic





Alison Bechdel





Graphic Novel




2006




240



ISBN 0-618-87171-3



About the Author(s)

సౌమ్య



0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *




 
 

 

నాలుగు Will Eisner పుస్తకాలు

రెండేళ్ళ క్రితం అనుకుంటాను Will Eisner గీసి, రాసిన A Contract with God and Other stories అన్న నాలుగు గ్రాఫిక్ కథల స...
by సౌమ్య
0

 
 

మూడు గ్రాఫిక్ పుస్తకాలు

ఈ వ్యాసం ఇటీవలి కాలంలో చదివిన మూడు గ్రాఫిక్ పుస్తకాల గురించి. మొదటి రెండు పుస్తకాలక...
by సౌమ్య
0

 
 

American Born Chinese – గ్రాఫిక్ నవల

పుస్తకం: American Born Chinese by Gene Luen Yang నేపథ్యం: ఆ మధ్య కోర్స్ ఎరా (కోర్సుల ఎర అనమాట) వెబ్సైటులో “Comic Book...
by సౌమ్య
1

 

 

Sita’s Ramayana

పుస్తకం వివరాలు: సీతాస్ రామాయణ (Sita’s Ramayana) రచన: సంహిత అర్ని (Samhita Arni) చిత్రాలు: మొయ్నా చిత్ర...
by అసూర్యంపశ్య
2

 
 
Persepolis

Persepolis

Persepolis – Marjare Satrapi రాసిన,గీసిన – గ్రాఫిక్ నవల. నవల కాదు – ఆత్మకథ. గ్రాఫిక్ నవల చదవడం ఇదే త...
by సౌమ్య
6