బాపు గారి గురించి కొన్ని జ్ఞాపకాలు

వ్యాసకర్త: భానుమతి

******

నమస్తే. నా పేరు భానుమతి. బాపు గారి అమ్మాయిని. నాకు మీ అందరితో కొన్ని భావాలను పంచుకోవాలనిపించి ఇది మొదలుపెడుతున్నాను.

కేవలం కుటుంబ సభ్యులతో కూర్చుని నాన్న గురించి, మామ గురించి మాట్లాడి, మెమరీస్ నెమరువేసుకోవచ్చు. కానీ, I want to share these feelings with all of you. All those who are mourning for Bapu garu. నేను మీ అందరిలో ఒకదాన్ని. I feel a strong bonding with all of you, because we are all mourning for one man – Bapu.

గడిచిన కొద్ది రోజుల్లో నేను బాపు గారిపై మనుషుల్లో ఉన్న ప్రేమని, గౌరవాన్ని చూశాను. ఇది ఒక అద్భుతమైన అనుభవం. ఇంకా ఆశ్చర్యం నించి, amazement నించి తేరుకోలేదు. ఇంత సింపుల్ గా, నిరాడంబరంగా ఉన్న మనిషి ఇంత మంది అభిమానాన్ని, ప్రేమనీ కమాండ్ చేశారా? లెక్క లేనంత మంది అభిమానులు, అన్ని రంగాల్లో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులు – తమిళనాడు గవర్నర్ రోశయ్య గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపిన గౌరవం, ప్రేమ చూసి నేను with all humility, వెనక్కు వెళ్ళి దూరంగా నించుని ఉన్నాను. ఇప్పుడు I feel so humble seeing so much love – that I am not able to express my feelings. I am feeling it difficult to find the right words. Just రెండు ముక్కల్లో మీ అందరి అభిమానానికి థాంక్స్ అని రాయలేకపోతున్నా.

కేవలం ఆయన కూతురుని అయినందుకు నాకు ఒక ప్రత్యేకత ఉంది అని అనుకోలేకపోతున్నాను. బాపు గారి గురించి “మా”, “నా” అన్న పదాలని అనుకోలేకపోతున్నాను. మనందరినీ ఒకే తండుతో కట్టి ఒక పెద్ద కుటుంబంగా చేసినాయన బాపు.

సీతారాముడు (బి.వి.ఎస్.రామారావు గారు) మామ-నాన్న ల బాల్య స్నేహితుడు. ఆయన అన్నారు “వాళ్ళు యుగపురుషులే, మళ్ళీ ఇలాంటి వాళ్ళు ఇంకొక్క యుగానికి గానీ పుట్టరు. బాపు ఈ అవతారం చాలించాడు. అవతారం చాలించే సమయం వచ్చింది అని గ్రహించలేకపోయారు. అందుకే పని చేయలేక పోతున్నానని ఫ్రస్ట్రేషన్. ఇంకా ఇంకా పని చేయాలనే తపనతో సగం జబ్బు పడిపోయారు. అసలు యే రోజైతే నీరసించి పని చేయలేక పోతున్నానని తెలుసుకున్నారో, ఆ రోజే పోయారు. ఈ శారీరక బాధ, శరీరాన్ని వదిలి వెళ్ళడం, అంతా నేచురల్ ప్రోసెస్ కాబట్టి ఇంత సమయం పట్టింది” అన్నారు.

మామ (ముళ్ళపూడి రమణగారు) – “మీ నాన్న పని రాక్షసుడు. పని ఉంటే ఇంకేమీ అక్కర్లేదు” అనేవారు.

అందుకే కాబోలు నాన్న పోయారని ఏడుపు రావట్లేదు.

“అమ్మో, ఈయన గొప్ప మనిషి. అలా దూరం నించి దణ్ణం పెట్టి నించోవాలి” అనిపిస్తోంది.

అందాలరాముడు సినిమాలో చివర్లో ఒక పిల్లాడు – ఈయన రామన్నయ్య కాదు, డిప్యూటి కలెక్టర్ అని తెలిసినప్పుడు – “రామన్నయ్య గారూ, రామన్నయ్య గారూ, మిమ్మల్ని ముట్టుకోవచ్చా?” అని అడుగుతాడు. సరిగ్గా అలానే అనిపిస్తోంది నాకు.

ఎగైన్, హ్యాట్స్ ఆఫ్ టు మామ. మామ రాసిన డైలాగ్స్ యెక్కడో దూరిపోతాయి. అలాగే ఇంత మంది ప్రేంఅని చూసి, ఈయన అఒక కుటుంబానికే చెందిన వారు అనీ, మాకు మాత్రం సంబంధించిన వారు అనీ అనుకోలేక పోతున్నాను.

నన్ను చాలా మంది అడుగుతూంటారు – “మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, బాపు గారి అమ్మాయిగా?” అని. యేమోనండి, మీ అందరికి మీ నాన్న ఎలాగో, నాకు ఆయన అంతే. అందరి తండ్రుల్లాగే, మాకు నాన్నా, మామా ఎవెర్ చరింగ్ పెఒప్లె. నిజం చెప్తున్నా – నేను యేనాడు బాపు గారి అమ్మాయిని అని గర్వంగా ఫీల్ అవలేదు ఇప్పటి దాకా.

and when Shri Rosayya gaaru came – when the AP government representatives came over to pay their tributes to naanna- that was when i felt so proud of my father.. of what he was- of what he gave the world- and- of being his daughter.

AP ministers వచ్చి, నన్ను పిలిచి, “మీ నాన్నగారి కోసం అసెంబ్లీలో రెండు నిముషాలు మౌనం పాటించాం” అన్నప్పుడు,

“బాపు గారు, రమణ గారి పేర్లతో మూడు ప్రొపోజల్స్ ప్రకటిస్తున్నాము” అని చెప్పినప్పుడు నాకు నోట మాట రాలేదు. వణుకు వచ్చింది. ఏడుపు వచ్చేసింది. థాంక్స్ అండి అని దణ్ణం పెట్టాను. నాకేమిటి, ఏఫీ ప్రభుత్వ ప్రతినిధులు వచ్చి పర్సనల్ గా ఇవి చెప్పడం ఏమిటి? కేవలం బాపు గారి అమ్మాయిని, ఇంత గౌరవమా?

You have no idea how much all these experiences in the past few days have humbled me.. You have no idea how much I am moved and touched seeing so much love and respect this simple, ordinary man commanded. All I want to say is I am one among all of you- paying my respects to that great man. But I miss naanna. I miss maama. I miss amma.

నేను వీళ్ళ పక్కింట్లోనే ఉంటాను. నాకు వేరే ప్రపంచంలేదు. ఫ్రెండ్స్ లేరు. నేను సోషలైజ్ చెయ్యను. నాకు నాన్న, మామ, అమ్మ, అత్త గొడుగులు. మూడు గొడుగులు ఎగిరిపోయాయి/పడిపోయాయి. అత్తకి మేము – మాకు అత్త. ఒకప్పుడు అంత పెద్ద కుటుంబం. Now, we are just a small family, but knit tighter.

శ్రీరాముడు ఈ ఇంట్లో నన్ను పుట్టించాడు. నాకు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, “నువ్వు ఇలా చేశావు-అలా చేశావు” అని తిట్టుకున్నా, నాకు ఈ అదృష్టాన్ని కలిగించినందుకు ఆ సీతారాములకు సదా కృతజ్ఞురాలను.

I say this on behalf of my brothers Venu, Venkat, Vara, Prasad and my sister Anuradha.

P.S.: నాన్న, మామ దేవుళ్ళని కాదు. We love them because they were wonderful human beings.

Maama taught me to see man and respect him with all his perfections- and imperfections.

ఉప్పు, కారం, చీకటి, వెలుగు, నలుపు, తెలుపు, కష్టం, సుఖం, యేడుపు, నవ్వు, తప్పు, ఒప్పు – కలిస్తేనే మనిషి. Accept him as he is unconditionally. We will have a wonderful bonding with each other and lead a beautiful life even against all odds” ఇది వాళ్ళు నేర్పి వెళ్ళిన పాఠం.

నమస్తే.

You Might Also Like

47 Comments

  1. యద్దనపూడి కామేశ్వరి

    భానుమతి గారు,
    మీ ప్రతి మాటలోను బాపుగారి పెంపకం వల్ల కలిగిన సంస్కారం కనిపిస్తోందండి. మీ బాధే నాదీను. అంతటి గొప్ప వారిని పోగొట్టుకున్నాం.

  2. B MADHU BABU

    థాంక్స్ ఫర్ షేర్ యువర్ ఫీలింగ్స్ , మేము గర్వపడుతున్నాం బాపు రమణ మన తెలుగు వారైనందుకు

  3. B MADHU BABU

    థాంక్స్ ఫర్ షేర్ యువర్ ఫెయిలింగ్స్ , వె అర్ ప్రౌడ్ ఫర్ బాపు రమణ is a తెలుగు పర్సన్స్

  4. varaprasaad.k

    పచ్చిమ గోదావరిలో పుట్టి ప్రపంచ విఖ్యాతుడైన ఒక మహనీయుని గురించి ఎంతో ఆర్ద్రంగా అర్థవంతంగా రాయటం అయన నుండి అబ్బిన సంస్కారం,వినమ్రంగా మాట్లాడటం అయన ఇచ్చిన వరం.అమ్మా అయన చిరంజీవి ఎప్పటికి మనల్ని నడిపించే ఒక మరపు రాని మరువలేని అచ్చ తెనుగు బిడ్డ .

  5. sreeram velamuri

    గ్రేట్ తల్లీ , we లవ్ HIM

  6. Mohan Tanneeru

    నిజంగా బాపు Gari బొమ్మ అంత సింపుల్ గా అందంగా ఉన్న్నవి మీ ఎక్స్ప్రెషన్స్.
    Thank యు

  7. Motamarri Vinod

    డియర్ భానుమతి గారు,

    మీ అనుభూతి చాలా గొప్పగావుంది. చూసారా బాపుగారి బొమ్మలు,దర్శక ప్రతిభా,తెలుగుతనం మీదమమకారం,ముఖ్యంగా సినిమాప్రపంచం ద్వారా,వారి సునిశిత హాస్యంతో కార్టూన్లతో మాలో పూర్తిగా నిండిపొయారు, ఎంతగా అంటే వారికుటుంబసభ్యులు ఎవరూ ఏంచేస్తుంటారు అనేవిషయాలు జ్ఞప్తిలోనే లేవు. మీ నిష్కల్మష అభిప్రాయం మాకు మళ్ళీ ఆమహనుభావుడ్ని గుర్తుచేసింది(మర్చిపోతేకదా). మామూలు మనుష్యులం కాబట్టి ఆయనకంటే ముందు మేముపోతేబావుండు అనుకొంటాము ఆ అనుభూతులతో. జ్ఞాపకాలని వయసు ప్రభావితం చేస్తుందికాబట్టి. అందుకనే నేనెప్పుడూ అనుకొంటా, ఆ పాట రచయత “నువు ఏకళనున్నా మాబాపే, నీ చీరవిశేషం అల్లాగే” అనివ్రాసివుంటే ఎంతబాగుండేదా అని.

  8. yssubramanyam

    భానుమతి గారు ,
    నేను మీ కొన్ని వాక్యాలు ఫేసు బూక్కు లో పేస్టు చేసాను . అందరూ మిమ్మల్ని account ఓపెన్ చెయ్యమని కోరుతున్నారు . బాపు గారు చిరంజీవి , మౌర్నింగ్ అనే పదం “బాపు గారి లాంటి మహనీయులకి వాడకూడదు అని అభి మానులు నన్ను తెలియబరచ మని చెప్పారు .
    విధేయుడు
    సుబ్రహ్మణ్యం

  9. g b sastry

    చి సౌ భానుమతి గారు బాపురమణీయాన్ని పుణికి పుచ్చుకున్నరీతిలో తన మనస్సుని మనతో పంచుకున్నారు మన లాంటి బాపు రమణల లోటు తో బాధపడుతున్నవారికి మనస్సును తాకే రీతిలో రాసారు.
    ఆ మహాను భావుల ఆత్మలకు శాంతి వారి కుటుంబ సభ్యులకు ఈ లోటుని భరించే శక్తినివ్వాలని ఆ రాముని కోరుకుంటున్నాను
    గాడేపల్లి బ్రహ్మానంద శాస్త్రి
    బెంగళూరు
    మొబైల్ నెంబరు 919035014046

  10. PRABHAKARA RAO MARTHY

    బాపు-రమణ లు ఇద్దరు కీర్తి గాంచిన యుగ పురుషులే
    వారి జీవితాలు మంగళ దాయికాలు
    వారి కృషి అమరం

  11. Sitha

    భానుమతి గారు చాలా బాగా రాసారు .అంతటి బాధ లో మనసు మూగబోయి ఉన్నప్పుడు ఒక సగటు ఆడపిల్ల ( స్త్రీ ) గా తన ఆలోచనలను షేర్ చేసుకున్నారు .నిరాడంబరత, humbleness తండ్రి కి తగ్గ తనయ .డౌన్ to ఎర్త్.సింపుల్ లివింగ్ హై thinking

Leave a Reply