ప్రళయ కావేరి కథలు – స. వెం. రమేష్

వ్యాసకర్త: Sri Atluri
******
దాదాపు గా నాలుగు ఏళ్ళ క్రితం అనుకుంటా ప్రళయ కావేరి కథలు చదివాను. భాష కొంచం నాకు కష్టం గానే ఉండింది. కానీ రెండు కథలు చదవగానే అర్ధం కావడం మొదలు పెట్టింది. నిజానికి ఈ కథలు అన్ని ఆంధ్రజ్యోతి ఆదివారం లో ప్రచురించబడ్డాయి కాని అప్పటికి ఆన్లైన్ లో ఆంధ్రజ్యోతి రాకపోవడం వల్లో లేక నేను సరిగ్గా చూడకపోవడం వల్లో చదవలేకపోయాను. అనుకోకుండా ఒకసారి ఈ కథలగురించి వినడం దాంతో ఇండియా నుంచి తెప్పించి చదవడం జరిగింది.

ఈ కథ సంకలనం లో మొత్తం ఇరవై ఒక్క కథలు ఉన్నాయి. ఉత్తరపొద్దు కథతో మొదలైన ఈ సంకలనం వోల్లెరుగని నిద్ర కథ తో పూర్తవుతాయి. రమేష్ గారికి భాష మీద పట్టుతో పాటు ప్రేమా, మమకారం కూడా చాలా ఉన్నాయి. ప్రళయకావేరి అనగా మనకి తెలిసిన పులికాట్ సరస్సు. ఇది ఇండియా లో రెండో అతి పెద్ద సరస్సు. ఈ సరస్సు చుట్టూ ఉన్న దీవులు వాటి పేర్లు, అక్కడి వారి జీవన విధానం ఏంటో, ఎంతో అందం గా రాసారు. మనకు తెలీని బోలెడు పేరులు మానని అలా పలకరించి మానని వదలవు.

ఈ పండ్ల పేర్లు చూడండి.. పాలపండ్లు , కలిగి పండ్లు , బీర పండ్లు , బిక్కి పండ్లు, నిమ్మ టాయలు, ఊటి పండ్లు , గొంజి పండ్లు, ఎలుక చెవులు, బలిజ పండ్లు, పిల్లట్లు – ఇవి అన్ని అడవిలో దొరికే పండ్లు. వీటిలో ఒక్కదాని పేరు కూడా వినలేదు నేను ఇప్పటిదాకా (రుచి మాట దేవుడెరుగు). అసలు ఇలాంటి పండ్లు ఉంటాయని కూడా తెలీదు నాకు. అంటే మనం పట్నం లో పెరిగి ప్రకృతికి ఎంత దూరం గా పెరిగామో అని ఒక రకమైన సిగ్గు వేస్తుంది. నారింజ కాయని కిచ్చిలి కాయ అంటారని ఇప్పుడే తెలిసింది. బలిగూడు (చెడుగుడు) ఆటలో కూతలు ” ఆకు పాకు బెల్లం పెడతా నాకు” “గోడమీద గొలుసు, నీ అబ్బ నాకు తెలుసు ” వింటే ఎంత నవ్వు వస్తుందో… ఇలాంటివి కూడా ఉంటాయని తెలీదు మనకి (నాకు) .పరంటిది పెద్దోళ్ళు కథలో భజన గురించి చదువుతుంటే చిన్నప్పుడు మన అక్కవాళ్ళు బొమ్మల పెళ్ళికి మనం చేసే హడావిడి గుర్తుకు రాకమానదు.

ఇరవై ఒక్క కథలలో ఒక్క కథ కూడా నచ్చని కథ లేదు అంటే అతిశయోక్తి లేదు. అన్ని కథలు చాలా బాగున్నాయి. ఒక కథ చదువుతుంటే మానని మనం చదువుకుంటున్న భావన వస్తే అది మన తప్పు కాదు.

తిని దిబ్బెకిన్నోడూ, అవునమ్మి అప్పుతీరిచ్చినోడు బాగుపడడు అని చెపుతాడు రమేష్. దాదాపు గా ఇదే సంగతి మన ఇళ్ళల్లో మన. పెద్దవాళ్ళు చెపుతారు . ఎద్దుల గురించి చదువుతుంటే మా నాన్నకి మా ఇంట్లో ఉన్న ఎద్దుల మీద ఉన్న మమకారం గుర్తుకు వచ్చింది. వాటిని అమ్మవలసి వచ్చిన రోజు అయన కూతురిని అత్తవారింటికి పంపిన బాధ కంటే ఎక్కువ పడ్డాడు.. దాదాపు గా నాలుగేళ్ళు నెల నెల వెళ్లి చూసుకు వచ్చేవాడు వాటిని.

అమ్మ పాల కమ్మదనం చదువుతుంటే అమ్మతనం మీద మమకారం పెరగక పోదు.ఆటకెక్కిన అలక చదువుతుంటే మన చిన్ననాటి అలక ఎంత సేపో చెప్పకనే చెప్పుతుంది. అలాగే ఆడే వయసులో ఆడాల, కాసేవ్వఅత్తా భాగోతం, పాంచాలి పరాభవం, పరంటిది పెద్దోళ్ళు కతలు నవ్వు తెప్పిస్తే, పద్దినాల సుట్టం, తెప్ప తిరనాళ్ల, వోళ్ళేరుగని నిదుర, అడ పోడుసు సొంగోం కథలు కంటతడ పెట్టిస్తాయి. ఒక్క కథ పేరు చెప్పి ఇంకో కథ పేరు చెప్పకపోవడం ఆ కథలకి అన్యాయం చెయ్యడమే. ప్రతి కథ ప్రత్యేకమైనవే.

“అమ్మంటే కన్నతల్లె కాదు, అమ్మ బాస కూడా, అమ్మంటే అమ్మనేల కూడా” ఎంత చక్కటి విశ్లేషణ. ఇది చెప్పింది చదువుకొని రమేష్ తాతగారు. వారికి నా నమస్సులు. ఇలాంటి కథలు రమేష్ గారు మర్రిన్ని రాయాలని కోరుకుంటూ …

***
ఈ కథలపై ఇటీవలే సారంగ ఈ-వారపత్రికలో వచ్చిన ఒక వ్యాసం ఇక్కడ.

You Might Also Like

11 Comments

  1. ప్రళయకావేరి కథలు – మరోసారి! | పుస్తకం

    […] లో సంక్షిప్తంగా ఈ కథల గురించి ప్రస్తావించాక మళ్ళీ చదవాలి అనిపించింది. […]

  2. Vijesh

    Soumya garu
    pustakam koni chadivite aa rachayita ki ento konta encouragement andi .. oka yabhai rupayalu kuda oka MACHI pustakam kosam karchupettaleni position lo manam lemu ane nenu anukutunnanu andi … tappugaa ante kshantavyudini…
    vijesh

    1. సౌమ్య

      Vijesh garu: When there is an option to read a public-domain book, that does not mean that people won’t buy it. Like you said, “manchi pustakam kosam kharchupettaleni position lo manam lemu”, perhaps! Giving a link to a publicly accessible (non-pirated) copy is not equivalent to encouraging free (as in free beer)-reading. This book has been freely (as in freedom) available for years now on Telugupeople.com. And so were a couple of other books. Anyway, I think we are talking about different things. So, let us just leave this here.

  3. vijesh

    you can buy the book online at kinige.com …. encourage buying the books not free reading ….

    1. సౌమ్య

      Telugupeople.com link is not a pirated copy, FYI. At this rate, we should not read even books from Project Gutenburg…we should only buy them somewhere even if there are freely available, copyright free versions. 🙂

  4. surya

    You can see one of the Ramesh story in this link
    http://www.bhumika.org/archives/2714

    1. సౌమ్య

      The stories seem to be online here.

  5. తమ్మినేని యదుకుల భూషణ్.

    చక్కని సమీక్ష , ఎందులోనైనా శ్రీనివాస్ ది చక్కని అభిరుచి! ఇటీవల అమరులైన తెలుగు భాషా ప్రేమి, పెద్దలు సి. ధర్మారావు గారు ఈ కథల గురించి చెబితే చదివాను. కథల్లో నిండుగా కనిపించవలసింది జీవితమే. జీవితంలోంచి పుట్టుకోస్తేనే గాని కథలైనా కవితలైనా ఆకట్టు కోవు. తరచూ ఆలోచనల అస్థిపంజరాలు కొట్టుకొచ్చే తెలుగు తీరంలో అప్పుడప్పుడు అందమైన పద్మాలు తేలి వచ్చి కనువిందు చేస్తుంటాయి. ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికల్లో వచ్చిన ఉళేనూరు కాంపు కథలు (మన్నం సింధు మాధవి) ఈ కోవకు చెందినవే.

    చిన్న నాడు నేను విన్నఆటలో కూతల్లో నాకు బాగా గుర్తున్నది :
    “ఎర్ర మట్టి కుండలో ఏనుగు తలకాయ్ లబోదిబో ”

    తెలుగు లో చాలా మంది మరచిపోయిన పదం : చెండు ( కోస్తా జిల్లాల్లో ‘బంతి ‘) పల్లెల్లో గుడి ముందు
    పిల్లలు చేరి కొంచెం లావాటి చెండుతో ( పుట్ట చెండు ) ఆడుకొనే వారు., చెండాటను పెద్దలు ఉత్సాహంగా హాస్యాలడుతూ చూస్తూ ఉండేవారు. చీల్చి చెండాడారు అని పత్రికల్లో కనిపించే జాతీయం వెనుక ఆట ఇదే.
    అలాగే కోస్తాలోని బంతిపూలు , రాయలసీమలోని చెండుపూలు ఒక్కటే.
    పల్లెల్లో అక్షరం ముక్క రాని బంధువులు మరణించిన ప్రతిసారి వారి నోటిగుండా జాలువారిన
    అచ్చ తెనుగు మళ్ళీ వినిపించదే అన్న దిగులు ,దుః ఖం వెన్నాడుతుంది. అలాంటి దిగులును తీర్చేవి
    ఇలాంటి కథలే.

    22 మార్చి 2013

  6. జంపాల చౌదరి

    బాగా పరిచయం చేశారు. నాకు ఇష్టమైన పుస్తకాలలో ఒకటి. స.వెం.రమేశ్ గారు రచయితే కాక తెలుగు భాషా పరిరక్షణోద్యమంలో అలుపెరగని కార్యకర్త. త్రిరాష్ట్ర సంగమ ప్రాంతంలో తెలుగుకోసం కృషిచేస్తున్నవారెందరికో ఆయన స్ఫూర్తి. 2009లో రమేశ్ గారిని తానా సంస్థ రెండేళ్ళకొకసారి తెలుగు భాష అభివృద్ధి, పరిరక్షణల కోసం ఉత్తమకృషి చేసేవారికి ఇచ్చే తానా-గిడుగు రామమూర్తి పంతులు అవార్డుతో గౌరవించింది.

    1. Sudhakar

      Jampala choudari garu

      I want to know more about Sa.Vem.ramesh works.If you know about any URL links related to his literary works.

  7. M.V.Ramanarao.

    పుస్తకరూపంలో వచ్చిన అన్ని కథలూ చదవలేదు కాని పత్రికలో కొన్ని చదివాను.చాలా బాగా నేటివిటీతో ఉన్నాయి.నేను నెల్లూరులో పనిచేసినప్పుడు పులికాట్ సరస్సుని (ప్రళయకావేరిని )చూసాను.

Leave a Reply