మీ రచనలకు తానా సావనీర్ ఆహ్వానం

డల్లాస్‌లో మే 24-26 తేదీలలో జరగబోయే పందొమ్మిదవ తానా మాహాసభల సందర్భంగా వెలువడబోయే సావనీర్ లో ప్రచురణార్థం మీ రచనలను ఆహ్వానిస్తున్నాం.
* మీ రచన కథ, కవిత, వ్యాసం ఏదయినా కావచ్చు.
* నిడివి మూడు లేక నాలుగు పేజీలకు మించకూడదు.
* తెలుగు రచనలకు ప్రాధాన్యం ఉంటుంది. రెండవతరం రచయితలు ఆంగ్లంలో రాయవచ్చు.
* “భాష, సంప్రదాయం, సేవ, అభ్యుదయం” ఈ సభల ప్రధానాంశం కనుక ఇతివృత్తం వీటికి సంబంధించి కానీ, ప్రవాసాంధ్రుల జీవితానికి కానీ చెంది ఉంటే మేలు.
* మీ రచనలు ఏ పత్రికలోనూ ప్రచురించబడి ఉండకూడదు.
* హాస్యరచనలకు ప్రత్యేక ఆహ్వానం
* మీ రచనలు తెలుగులో యూనికోడ్ ఫాంట్ లో టైప్ చేసి పంపాలి.
* ప్రచురణ విషయంలో తుది నిర్ణయం సంపాదకవర్గానిదే.
* మీ రచనలన్నీ souvenir@tana2013.org కు ఈమెయిల్ చేయండి.
* రచనలు అందవలసిన ఆఖరి తేదీ 31 మార్చ్ 2013.

– తానా సావనీర్ 2013 సంపాదకవర్గం

(వివరాలు పంపినది: చంద్ర కన్నెగంటి)

You Might Also Like

Leave a Reply