“My Stroke of Luck – Kirk Douglas”

వ్యాసం రాసిపంపినవారు: పద్మవల్లి

వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడో తెల్పుడీ…

What is a hero? According to Christopher Reeve “A hero is an ordinary individual who finds the strength to persevere and endure in spite of overwhelming obstacles, so are the families and friends stood by them. – From “Still Me”.

ఒక వ్యక్తిని వీరుడు/ధీరుడిని చేసేదేమిటి? ఆ వీరుడికి సహకరించే సైన్యం ఎవరు? డబ్బు, పరపతి, గ్లామర్ ????? ఊహు….ఇవేవీ కావు. కావాల్సింది మనో ధైర్యం, పట్టుదల, కార్య దీక్ష, అన్నిటినీ మించి ముఖ్యంగా తనవారి అండ. ఈ విషయాన్ని పదే పదే ఋజువుచేసే జీవితకథలు చదివే అవకాశం ఈమధ్య బాగానే కలిగింది. వాటిలో ఒకటి “My Stroke of Luck” by Kirk Douglas.

గ్లామర్ ప్రపంచంలోని ఏ వ్యక్తి గురించయినా, మనకి తెల్సింది వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతులు, సంపాదించుకున్న ఆస్థిపాస్తులూ, విలాసాలూ, సాధించిన అవార్డులూ, తెరమీద వీరోచితాలు, తెరవెనక ప్రేమాయణాలూ …అంతే… ఏ హీరో చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం …ఆ మాటకొస్తే ఏ ప్రముఖ వ్యక్తి గురించయినా సరే, కొద్దిగా అటూ ఇటూ అంతే. మహా తెలిస్తే వాళ్ళు చేసిన దానధర్మాల గురించి మనం ఏ కాఫీ టేబుల్ సమావేశంలోనే మాట్లాడుకోటానికీ, మన విజ్ఞానం వెళ్ళబోసుకోడానికీ అవసరమయింత మాత్రమే.

కానీ అందరూ చాలా సులభంగా విస్మరించేది వాళ్ళు కూడా మామూలు మనుషులేనని, మనలాగే  సుఖదుఃఖాలకి అతీతులు కారనీ, వాళ్ళ జీవితాల్లో కూడా other side of the coin ఉంటుందనీనూ. ప్రపంచాన్ని కాళ్ళ దగ్గర నిలబెట్టుకోగలిగిన ఎంతటి కుబేరుడయినా, ఒక్కోసారి విధివిలాసానికి లొంగిపోక తప్పదు. ఆ దేవదేవుడి నిర్ణయాన్ని చేతులు కట్టుకుని మన్నించాల్సిందే! కానీ ఆ ఓటమి కూడా గ్రేస్ ఫుల్ గా అంగీకరించినవారు, లేదా విధికి ఎదురీది గెలిచినవాళ్ళూ విజేతలుగా  మిగిలిపోతారు. వాళ్ళే ఈ ప్రపంచానికి నిజమైన హీరోలు. ఓ Christopher Reeve లా, ఓ Randy Pausch లా .. to name a few.

ఇలా విధి చేతిలో నలిగిన ధీరులేం చేసారు? వాళ్ళు వాళ్ళకున్న సంపదలతోనూ, మందీ మార్బలంతో రాజభోగాలనుభవిస్తూనో, లేదా జీవచ్ఛవాల్లానో  మిగిలిన జీవితాన్ని గడపలేదు. ఈ వెండితెర గ్రీకువీరుల జీవితాల్లోకి, చుట్టూ ఉన్న జలతారు పరదాలు తొలిగించి చూస్తే  బయటకి తెలియని ఎన్నో పార్శ్వాలు.  పర్సనల్  ట్రాజడీలు ఎదురైనపుడు, తాత్కాలికంగా క్రుంగిపోయినా, మళ్ళీ నిలదొక్కుకుని ధైర్యంగా ఎదురీది గెలిచిన కధలు ఎన్నో. తల తప్ప మిగతా శరీరభాగాలేవీ కదలలేని స్థితిలోనూ, నటుడికి ప్రాణమైన వాచికాన్ని కోల్పోయి మాటలురాని పసివాడిగా మారిపోయినపుడూ కూడా, బయట ప్రపంచం నుంచి దాక్కుని, వాళ్ళు తమ ఇమేజ్ ని కాపాడుకోటానికి ప్రయత్నించలేదు. జీవితం మీద మమకారం కోల్పోకుండా, వచ్చిన కష్టాన్ని ఎలా అధిగమించాలో తెలుసుకుని, సాధించి, మనసుకి నచ్చిన పనులు తిరిగి చెయ్యగలిగారు. అదే పరిస్థితుల్లో ఉన్న మిగిలినవాళ్ళకి  “this is not the end of the world” అని చెపుతూ మార్గదర్శకం అయ్యారు. తమకున్న పరపతి తోనూ,  ప్రముఖుల స్నేహాలనూ ఆసరాగా తీసుకుని తమలాంటి బాధితుల జీవితాల్లో వెలుగు నింపడానికి  ప్రయత్నించారు. ఆ మార్గంలో వాళ్ళు పడిన వేదనా, అధిగమించి హీరోలుగా మిగిలిన  వైనం తెలియాలంటే వాళ్ళ మనసుల్లోకి తొంగి చూడడమొక్కటే  దారి. అలా వాళ్ళ మనసు ద్వారాలు తెరిచి మనల్ని సాదరంగా లోనికి ఆహ్వానించేవే memoirs and autobiographies (అవీ నిజాయితీతో రాసినపుడు మాత్రమే). అలాంటిదే Kirk Douglas రాసుకున్న My Stroke of Luck.

Kirk Douglas,

హాలివుడ్ లెజెండ్…

జీవితకాలపు సేవలకు ఆస్కార్ తో కలిపి ఎన్నో పురస్కారాలు అందుకున్నవాడు…

ఐదుసార్లు దాదాపు మృత్యుముఖంలోకి వెళ్ళి వచ్చినవాడు…

పదిహేనేళ్ళుగా (ఈ పుస్తకం రాసేటప్పటికి) పేస్ మేకర్ తో సహజీవనం చేస్తున్నవాడు…

హెలికాప్టర్ క్రాష్ లో బ్రతికి బయటపడి బేక్ సర్జరీతో సరిపెట్టుకున్నవాడు…

ఒక షూటింగ్లో రాయి మీద పడి తల పగిలి ఐదు రోజులు కోమాలో గడిపి సమవర్తికి  చెక్ చెప్పి తిరిగొచ్చినవాడు…

ఎనభయ్యేళ్ళ వయసులో బ్రెయిన్ స్ట్రోక్ వలన మాట కోల్పోయినవాడు…

ఏం రాసి  ఉంటాడు ఈపుస్తకంలో? సాధించాల్సినవన్నీ అయిపోయాయి జీవితంలో, ఇక నేను దేనికీ బాధ పడక్కర్లేదు అన్నాడా? నటుడికి మాట పోయాక ప్రాణం ఎందుకు అన్నాడా? దశాబ్దాలుగా నిన్నుఆరాధించిన వాళ్ళకి నీ మొహమెలా చూపిస్తావు, చీకటి పరదాల్లో దాక్కోమన్నాడా?

వూహు…ఇవేవీ కాదు. తన చుట్టూ ఉన్న తన వాళ్ళని, తన బలాన్ని, వాళ్ళు తనకిచ్చిన సహకారాన్నీ, ప్రోత్సాహాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. జీవితంలో తనకున్న నిజమైన బలం తన కుటుంబం, స్నేహితులూ అని తెలుసుకుని ఆ బంధాలని పటిష్ఠం చేసుకున్నాడు. తనలాంటి స్ట్రోక్ బాధితులు ఎలాంటి మనస్థితి కలిగి ఉంటారో , సెల్ఫ్ పిటీతో ఎలా కృంగిపోతూ ఉంటారో తెలుసుగనక, అలాంటి వారికి వారి కుటుంబాలకి ఎవేర్ నెస్ కలిగేలా చెయ్యడం తన బాధ్యత అని అనుకుని  అది చేతల్లో చూపించాడు. ఎప్పుడో జీవితపు పరుగుపందెంలో నిమగ్నమయిపోయి అడుక్కి తోసేసిన, తన మతం మీద , దేవుడి మీద విశ్వాసాన్ని, ఎనభయ్యేళ్ళ వయసులో తిరిగి పెంచుకున్నాడు.

మాట కూడా రాని  స్థితిలో విరక్తి చెంది, ఆత్మహత్య చేసుకుందామని గన్ నోట్లో పెట్టుకుని కాల్చుకోవాలా, తల మీద కాల్చుకోవాలా అని ఆలోచిస్తూ, ఆఖరి క్షణంలో  తనవాళ్లకి అదెంత బాధ కలిగిస్తుందో  స్ఫురణకొచ్చి ఆ ఆలోచన విరమించుకుంటాడు. అప్పుడు తన ఇంట్లో ముప్పయ్యేళ్ళుగా ఉన్న హౌస్ కీపర్ గురించి “What a mess for Fifi to clean up” అన్నప్పుడు ఒక్కసారి ఆ మన మనసు మూగపోతుంది. అంతే నిజాయితీగా “నేను ఐదు సార్లు మ్రుత్యుముఖలోకి వెళ్ళినప్పుడు, ఆ మృత్యు దేవతకి లొంగి పోవలసి వస్తే మా అమ్మ ఆఖరి క్షణాల్లో ధైర్యంగా చెప్పినట్టు “Don’t worry. It happens to everyone!” అని చెప్పగలిగే ధైర్యం నాకుందా అని అనుమానం” అన్నప్పుడు మనకి తనలో Spartacus కనిపించడు.

రోజుల తరబడి, రాత్రుళ్ళూ  పగళ్ళూ కదలకుండా మంచం మీద గడిపినప్పుడు, జీవితం భయపెట్టినపుడు ఆ ఆలోచనలు పోగొట్టుకోడానికి, చిన్నప్పుడు అమ్మతో గడిపిన జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుని, “ఒక్కోరోజు ఒక జ్ఞాపకాన్ని , కుక్కపిల్ల ఒక ఎముకని తీరిగ్గా చీక్కోడానికి దాచుకున్నట్టు దాచుకున్నాను” అంటాడు. అలాగే తండ్రితో గడిపిన జ్ఞాపకాన్ని ఒక్కటైనా గుర్తుకు తెచ్చుకోడానికి కష్టపడి, ఎలాగో ఒక్కటి దొరికినపుడు ఆ ఆనందం చూస్తే, ఒక ఆరేళ్ళ పిల్లాడు మాత్రమే మన కళ్ళముందు కదులుతాడు. తండ్రి అంటే ఫాసినేషన్ లేని బిడ్డ  ఎవరు ?

జీవితం ఎంత అందమైనదో, మనకి దక్కిన జీవితం ఎంత విలువైందో, మనమెంత అదృష్టవంతులమో గుర్తించి, ఈ జీవితాన్నిచ్చిన భగవంతుడికి  మరోసారి కృతజ్ఞతలు చెప్పుకోడానికి కావాల్సినన్ని సందర్భాలు ఈ పుస్తకం నిండా.  Little Heroes అంటూ Christopher Reeve, Michael J. Fox, Dudley Moore,  John Callahan,  Patricia Neal, Stephen Hawking, Jim MacLaren మొదలైన వాళ్ళ గురించీ, ఇన్స్పిరేషనల్ అంటూ  ప్రెసిడెంట్స్ Ronald Reagan, Roosevelt గురించీ చదివితే ఎలాంటి కష్టమైనా పరిస్థితిలోనైనా, సాధ్యం కానిది అంటూ లేదనీ, కావాలసింది బోలెడు ఆత్మవిశ్వాసం, కాస్తంత ప్రోత్సాహం అనీ తెలుస్తుంది. తన అనుభవాలతో  “When things go bad, always remember it could be worse.” అనీ “Help others is the will of God.” అంటాడు. తన తోటి కళాకారులు, స్నేహితులూ విధిబారిన పడి ఓడి పోయినవాళ్ళనీ, ధైర్యంగా ఎదురీది నిలిచిన వాళ్ళనీ ఎంతో ఆప్యాయంగా  తలుచుకుంటూ “ I admire them who show courage in face of tragedy instead of crawling away in self-pity. I applaud who use their celebrity to bring light to darkness.”  అని గర్వంతో, ప్రేమతో వాళ్ళే తన హీరోలంటాడు.  అలా అని నిరాశతో మున్చేసాడా అంటే, కానే కాదు. Sometimes God gives us obstacles in life to overcome to make us stronger అంటూ వెన్ను తట్టి స్ఫూర్తి నింపుతాడు.

డిప్రెషన్ గురించి మాట్లాడుతూ, self pity is the essence of the depression అంటాడు. “One of the worst things about being the victim of a stroke is that people feel sorry for you. They want to do things for you. And since you also feel sorry for yourself, you are more than willing to accept their gifts of kindness” అంటూ తెలీకనే మనలో చాలామంది చేసే తప్పుల్ని సున్నితంగా ఎత్తి చూపుతాడు. వాళ్ళకి కావలసింది మానసికబలం, ఆసరా కానీ వాళ్ళని ఇంకా సెల్ఫ్ పిటీ లోకి తోసే సానుభూతి కాదు, అది వాళ్లనింకా చేతకాని వాళ్ళుగా చేస్తుంది తప్ప వాళ్లకి ఏరకంగానూ సహాయపడదు అని మనల్ని హెచ్చరిస్తాడు. ఆ బాధ తెలిసినవాడిగా, తనలాంటి బాధితులకి ఏం కావాలో స్వంత అనుభవంతో తెలుసుకున్నవాడిగా, తన పరిస్థితిల్లో ఉన్నవాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి కావాల్సిన ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు. “The world has filled with people who have suffered from one misfortune or the another. The only thing that sets one apart from the rest is the desire and the attempt to help others. People who reach out beyond their pain, out into the world in a trusting way – they are the one who make a difference.

ఈ  Spartacus ఎంతో  సున్నితమయిన హృదయం ఉన్నవాడు. తన స్నేహితుడు Frank Sinatra ఇంట్లో స్నేహితులందరూ కలిసినపుడు, పూర్తిగా పేరలైజ్ అయి , వెనక గదిలో వీల్ చైర్లో ఉన్న ఫ్రాంక్ ఏం ఆలోచిస్తూ ఉండి ఉంటాడు, “దాదాపు నలభై ఏళ్ళక్రితం, పారామౌంట్ ధియేటర్ బైట తనమీద పిచ్చిఅభిమానంతో కేకలు వేస్తున్న అమ్మాయిల గురించి ఆలోచిస్తున్నాడా” అని మధనపడతాడు.  అలాగే వొళ్ళు జలదరించే ప్రమాదంలో బయటపడ్డ Jim MacLaren గురించి చెపుతూ, తనని కలవడానికి వెళ్ళినపుడు తను ధైర్యంగా చిరునవ్వు నవ్వుతున్నాడు కానీ ఏడుపు ఆపుకోడానికి నేను హాల్లోకి వెళ్ళాల్సి వచ్చింది అంటాడు.

డెబ్భయి ఏళ్ళ వయసులో  హెలీకాఫ్టర్ ప్రమాదంలో నుంచి బయటపడినపుడు, అదే ప్రమాదంలో అతిచిన్న వయసులో ఉన్నవారు మరణించారని  తెలిసి, దానికి తనని బాధ్యుడిగా నిలబెట్టుకుని పడిన గిల్టీ  ఫీలింగ్, జీవితంలోని ఐరనీని ఇంకోసారి ఎత్తి చూపించడమే కాకుండా, తన సున్నితమైన మనసునీ కూడా మనకి చూపిస్తుంది. అతని మాటల్లోనే

 

“Then in 1991, just two year later, I survived a helicopter crash. Fifty feet in the air, we smashed into a small plane that was just taking off. The plane exploded and two occupants were killed instantly. I learned that these two victims on the plane were very young.  One, eighteen, was planning to go to his senior prom that week. The other, a young instructor, was scheduled to give a talk that night on safety in the air. I was in seventies. I felt very guilty. I wrote to the families of both of them; an inadequate note I ‘am sure. I visited the father of the high school student. I met him at the same airport where the collision had occurred. In a corner were the remains of the helicopter, a pile of crushed metal. He was with his other son, a tall, handsome boy. I never felt so inadequate. The father just looked at me with a faint smile. I felt very guilty. What could I say to him, to make him feel better about the death of his young son? I felt like a criminal being alive.

ఈ సున్నితహుదయుడ్ని ప్రేమించకుండా ఉండగలగటం సాధ్యమయ్యే పనేనా?

తన భార్య అన్నీ తనకి తోడుగా నిలబడిన సంగతి చెపుతూ, ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ బంధం ఎలా ఉండాలో ఇలా చెప్తాడు.

 

Two people in love should never become one. There must be a space in togetherness. True Love, real love, is born of respect for another person. It is given and received with a fullness of self that can only be drawn from an individual and separate soul. And the loneliness in solitude is compensated for by a rich and abiding togetherness in love.

యాభయ్యేళ్ళ వైవాహిక జీవితాన్ని సుఫలంగా , సఫలంగా గడిపిన పెద్దాయన తన అనుభవంతో పంచుకున్న ప్రాధమిక సూత్రం, ఏ జంటకైనా శ్రీరస్తూ శుభమస్తూ అని దీవించడంతో పాటూ బహుమతిగా ఫ్రేమ్ కట్టి ఇవ్వదగ్గది

“We must respect each other and allow each other to be what each of us, separately, is. Never try to change your spouse.”

జీవితకాలపు సేవలకు ఆస్కార్ అందుకోవడానికి స్టేజ్ మీదకు వెళ్ళాల్సి వచ్చినపుడు, అక్కడ కనీసం థాంక్స్ అని కూడా చెప్పలేనేమో అని భయపడి మైఖేల్ ని వెళ్ళమంటే తను ఒప్పుకోకుండా , లేదు నువ్వే వెళ్ళాలి, వెళ్ళి తీరాలి అన్నాడు. ఇక తప్పదని తెలిసి, థాంక్స్ అన్న ఒక్క మాటనే పదే పదే వల్లించుకుంటూ స్టేజ్ మీదకి వెళ్ళి అక్కడ ఎదురుగా ఆడియన్స్లో కూర్చున్న భార్యనీ, కొడుకుల్నీ చూసి, ఉద్వేగంతో  వాళ్ళకి కృతజ్ఞత తెలియచేస్తూ, మాటలు కూడబలుక్కుంటూ మాట్లాడినపుడు మనం కూడా అక్కడ ప్రత్యక్ష్యంగా ఉండి చూస్తున్నంత ఆనందం కలుగుతుంది.

పుస్తకమంతా బాధలూ, బోధనలూ మాత్రమే అనుకోవడానికి లేదు. ఈయన సెన్స్ అఫ్ హ్యూమర్ తక్కువేమీ కాదు. అప్పటికప్పుడే ఎమోషన్స్తో మనచేత కంటతడి పెట్టించి, వెంటనే చాల్లే ఊరుకోండి అన్నట్టు నవ్వించేస్తాడు. స్ఫూర్తి చెడిపోకుండానే, మన బరువైన హృదయాల్ని తేలిక చెయ్యడానికి ఎన్నో చెణుకులు వదులుతాడు. మచ్చుకి  కొన్ని.

— తనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని తెలిసినపుడు, “Strokes are for elderly people, with slurred speech, moving about in walkers and wheelchairs. I was only eighty; how can a stroke happen to me ?”

— తను మేనిక్యూర్ చేయించుకుంటూ ఉన్నప్పుడు మధ్యలో స్ట్రోక్ వచ్చి, అందరూ హాస్పిటల్కి తీసుకెళ్ళే ఆత్రుతలో ఉన్నప్పుడు, మాట రాని గొంతుతోనే “Hey, You didn’t finish my nails”

— భార్యతో అప్పుడప్పుడూ జరిగే చిన్న చిన్న వాదనల గురించి “I always end arguments with my wife saying, if you are leaving me, I am coming with you.”

— కొడుకు Michael Douglas గురించి, “If I’d known what a big shot Michael was going to be, I would have been nicer to him when he was a kid.”

స్వర్గం అనేది ఎక్కడో లేదనీ, ఈ భూప్రపంచమే స్వర్గమనీ, ఇక్కడ ప్రతీదీ మనకోసమే ఏదో ఒక లక్ష్యంతో సృష్టించబడినవే అనీ చెప్పే వాక్యాలు నాకెంతో నచ్చినవి. తన మాటల్లో ….

Now, lying in my hospital bed, I wondered: What happens when you die? Could I see my mother again? I would like that.

But may be after death. you come before that mythical man with a long beard, sitting on a throne. You stand before him, puny and timid. Then you ask “Is this heaven?” and he roars back “HEAVEN! You just came from there!”

And as your eyes widen, he continues, “Ingrate! Didn’t you like the sunrise, the sunset, the moon, and the stars? Weren’t you pleased with the mountains, forests, rivers, and streams that I gave you?”

I remain silent as the voice roars. “Didn’t you like the fragrant flowers and fruits and vegetables I gave you? And when I nurtured those plants with rain, you complained because you couldn’t play golf. Ingrate! That was heaven!”

And I dare to ask, “Well, what is this place?” He laughs: “This is the recycling plant. Here you turn back to dust.” I stand there and stare at him. “Don’t you understand? Dust THOU ART, AND TO DUST THOU SHALT RETURN.”  He didn’t have to bellow.

Love you Kirk!

*** Kirk  మీద ఇంతవరకూ నాకు  నటుడుగా, లెజెండ్ గా తెలిసిన దానికన్నా, ఈ పుస్తకంతో నాకు పరిచయమయిన ఒక మంచి మనసు మీద నా అభిమానం పెరిగిపోయింది. ఏకవచనం ఆ అభిమానంతోనే తప్ప, ఆయన మీద గౌరవం లేక కాదు.

*** It’s not a review or summary of the book. These are just my feelings about the book and I am aware that it won’t do good justice to the book. It’s only a glimpse of it. To know more in detail one must read the book by themselves. No other alternative.

You Might Also Like

17 Comments

  1. varaprasad

    maa abhimana rachayita yandamooriki kooda mee naration nacchindante,oh pentastick,its a great hounour,marinni manchi books parichayam cheyandi medum.

  2. varaprasad

    narration,correct teluguwords using in traslation exalent madum.keep itup,ur selection of books also different……………thanq madum.previouslt i posted an comment about ((INSIDERS-1)),it is in english and very long,pl translate that ur way of writing.

  3. Uma

    Padma,

    Excellent!!!.. I felt like reading this book as soon as possible.

    Uma

  4. Prasanna

    I have read your review with great interest and admiration. I agree with others about bhavukata in your writing. You have depicted about the book in your feelings and I have read it several times. It has driven me to read the book and I am going for the book.
    The site “PUSTAKAM” is wonderful, and a regular visitor. congrats to all of you for maintaining such a treasure of sahithyam. Thanks a lot.

  5. srinivasaraov,khammam

    lernt heart touching points from ur review. May God bless u.Wishing many more reviews from u madam.

  6. చాణక్య

    చాలా కాలం తర్వాత ఒక సమగ్ర ‘సమీక్ష’ చదివాను. పద్మగారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. థాంక్యూ! ఇంకా ఇలాంటివి మరిన్ని రాయాలి మీరు. 🙂

    ఇక పుస్తకం.నెట్ చూడడం ఇదే మొదటిసారి. చాలా మిస్ అయ్యాను అనిపించింది. అద్భుతంగా నడిపుతున్నారు సైట్‌ని! నిర్వాహకులకు నా అభినందనలు! 🙂

  7. kiran

    I just wanna take the book into my hands…!!
    loved the way u narrated it ..:)

  8. పద్మవల్లి

    Thanks to all for reading this and your encouraging words.
    Regards

  9. ramani

    Congrats padma. Very good review.

  10. ennela

    wow! chaalaa chaalaa baagundi review..I enjoyed it thoroughly.

  11. Sridhar

    Padma, a huge WOW !!!!!!

    Very nice review, depicts your inherent ‘bhavukatha’, ‘spandana’ and ‘prajna’ …

    thanks for sharing your thoughts on the book, there is a potential for a fan club for your reviews…:)

    regards
    Sridhar…

  12. HK

    Very sensible. One of the best reviews I ever read.

  13. రాజేంద్ర కుమార్ దేవరపల్లి

    హాలీవుడ్ అతిరథుడు కిర్క్ డగ్లస్.బహుశా అతనంతగా వైవిధ్యమైన పాత్రలు పోషించినవారు కిర్క్ డగ్లస్ తరువాతి తరం నుంచి ఎవరూ లేకపోవటం ఒక కఠోరమైన నిజం.రోడ్ రన్నర్ షో లాంటి కార్టూన్ సినిమా ప్రేరణతో తీసిన సినిమా కావచ్చు స్పార్టకస్ కావచ్చు ఎలాంటి సినిమాలో నైనా అతను అతిరథుడే.కిర్క్ డగ్లస్ నటించినవాటిలో ఆణిముత్యాల్లాంటి సినిమాలు చాలా ఉన్నాయి.వాటిలో ఎక్కువ భాగం నేను చూసాను.ముఖ్యంగా లోన్లీ ఆర్ ది బ్రేవ్ లాంటివి ఇవ్వాళ పెద్ద గా ఎవరికీ తెలియవు కూడా కానీ ఎలాగైన చూసి తీరాల్సిన సినిమా అది.సమీక్ష చాలా చాలా బాగుంది.అభినందనలు.

  14. Chandu S

    Congrats padma. Very good review. I can’t express in words how much I enjoyed reading this article. Thanks again So this is the beginning.

    1. yandamoori veerendranath

      Around 40 years ago, i saw almost all films of Kirk Douglus when i was a kid. the review is excellent. its not really a review of a book, but…. reflection of the writer’s thoughts through your site. congrats.

    2. పద్మవల్లి

      Thank You! Yes, its not a review, just my thoughts and feelings penned down after reading the book.
      Best Regards

Leave a Reply