Gandhian Approach to integrated rural development (English)
రాసిన వారు: మయసభ
***********************
పుస్తకం పేరు : Gandhian Approach to integrated rural development (English)
రచయిత: ఆశు పస్రీచ (Ashu Pasricha)
పుస్తకం వెల: 450 రూపాయలు
ISBN: 8175410655
Publisher : Shipra Publications
ఈ పుస్తకం 2000 సంవత్సరం లో పబ్లిష్ చేయబడినది. ఇందులో గ్రామ సమగ్ర అభివృద్ధి కి సంబంధించి గాంధీజీ ఆలోచనలను విశదీకరించారు. మన దేశంలో 70% మంది గ్రామాల్లో నివసిస్తున్నారు. కానీ వాటి అభివృద్ధి చెప్పుకోతగిన స్థాయిలో లేదు. దీనికి ప్రధాన కారణాలు పేదరికం, నిరుద్యోగం. మన స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం ఎన్ని పధకాలు ప్రవేశపెట్టినా అవి ఫలవంతం కాలేదు. గ్రామాల నుంచి పట్టణాలకు వలస పెరుగుతూనే ఉంది. ఈ పుస్తకం లోని మొదటి అధ్యాయం పేదరికం,దానికి కారణాలు,అందులోని విభజన, స్వాతంత్ర్యం రాక మునుపు, వచ్చిన తరువాత గ్రామాభివృద్ధి కోసం ప్రవేశ పెట్టిన పధకాల గురించి, అవి ఫలవంతం కాకపోవడానికి గల కారణాలను వివరిస్తుంది. రెండో అధ్యాయం ప్రభుత్వం నాలుగవ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టిన సమగ్ర గ్రామాభివృద్ధి పధకం (IRDP) గురించి లోతుగా వివరిస్తుంది. మూడో అధ్యాయం మొదలుకొని గాంధీజీ ఆలోచనలను, ఆయన గ్రామాలు, అందులో నివసించే మనుష్యుల జీవన శైలి ఎలా ఉండాలి అని వ్రాసిన మెతడాలజి గురించి సమగ్రంగా వివరిస్తుంది. గాంధీజీ పల్లెలే దేశానికీ పట్టుకొమ్మలు అని అంటారు. అయన ఆలా అనటానికి గల కారణాలను ఈ పుస్తకంలో చక్కగా పొందుపరిచారు. గ్రామాభివృద్ధి గురించి ఆసక్తి కలవారు తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది.
Leave a Reply