నా అమెరికా పర్యటన -ఏ.జి.కె
రాసిన వారు: ఎన్. ఇన్నయ్య
(టైపింగ్ సహాయం: నాగలక్ష్మి దామరాజు)
***************
‘నా అమెరికా పర్యటన’ నేటికీ అమెరికాలోని తెలుగు వారికి, ఇండియా నుండి వెళ్ళే తెలుగువారికి కరదీపికగా ఉపకరిస్తుంది. మనం మాట్లాడుకున్నట్లు, ఆప్యాయంగా పలకరిస్తున్నట్లు ఈ రచన ద్రాక్షా పాకంలో సాగింది.1963లో అందరినీ ఆశ్చర్యపరచేటట్లు అమెరికా ప్రభుత్వము ఒక పదవిలేని మామూలు లాయర్ ను, మానవ వాదిని తన అతిధిగా పిలిచి పర్యటన చేయమన్నది. ఆ సందర్శనను ప్రయోజనాత్మకంగా చూపారు ఆవుల గోపాల కృష్ణమూర్తి.
పత్రికలు చూచారు, లోటుపాటులు గమనించారు. వ్యవసాయం పోల్చి చెప్పారు. పర్యటన నేత్రానంద దృశ్యాలు అభివర్ణించారు. అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడి నిర్వహించిన,విలేఖరుల సమావేశంలో వైట్ హౌస్ లో పాల్గొన్నారు. ఫ్రెస్నో నగర మేయరుగా ఒక రోజు గౌరవ స్థానం పొందారు. వాషింగ్టన్ పోస్ట్ పత్రిక కార్యాలయంలో, ఎడిటర్ల చర్చలో పాల్గొన్నారు. మాడిసన్ లో వున్న తెలుగు గ్రంథాలయంకు త్రిపురనేని రామస్వామి రచన భగవద్గీత బహూకరించారు.
పిల్లలకు బి. వి. నరసింహారావు బాలగేయాలు వినిపించి వారు కేరింతలు కొట్టేటట్లు చేయడం ఏ.జి.కె. ప్రత్యేకత. అమెరికాలోని న్యాయస్థానాలు, మానవ వాద సంఘాలు, పత్రికలు, ప్రభుత్వము, స్థానిక సంస్థలు, బడులు, పిల్లల గురించి విడమరిచి వివరించారు. భారత, అమెరికా రాజ్యాంగ ఎన్నికల షరతులను పోల్చి చూపారు. ఇన్ని అంశాలు ఇంత కొద్ది కాలంలో గమనిచడము ఏ.జి.కె ప్రత్యేకత.
ఈ రచన 1966 లో వెలువడినా దీని విలువ నేటికీ ఏ మాత్రమూ తగ్గలేదు. అంకెల వివరాలు మారాయేగాని మిగిలిన విషయాలు ఆదర్శంగా నిలుస్తాయి. సందర్శకులకు ఒక గైడ్ వంటిది అనడంలో అతిశయోక్తి లేదు. 1967లో చనిపోయిన ఎ.జి.కె. తన చివరి రచనగా అందించిన బహుమానం ఇది. 1963కి ఇప్పటికి అమెరికాను పోల్చి చూడడానికి కూడా ఈ రచన ఉపకరిస్తుంది.
ద్రాక్షా పాకంలో వచనం సాగింది. రాడికల్, సమీక్ష, రాడికల్ హ్యూమనిస్ట్ పత్రికలు నడిపిన ఎ.జి.కె. వ్యాసోపన్యాసకుడుగా ప్రసిద్ది చెందారు. ఈ గ్రంథాన్ని తెనాలిలోని ప్రభాత్ పబ్లిషింగ్ హౌస్ వారు అనుపమ ప్రింటర్స్ ద్వారా 1966 ఏప్రిల్ లో ముద్రించడం జరిగింది. అప్పటి దీని వెల రు.5.00. ఈ పుస్తకాన్ని ఈ చిరునామాలో చదవవొచ్చు, ఉచితంగా దిగుమతి చేసుకోవచ్చు.
Radhadevi
Very informative and enlightening about America. Could be a history lesson!!
sambasivarao kolli
I had the privilege of hearing some the expriences directly from AGK.Thank you for the book.
ram
Thanks for introducing the book and author…
more about AGK–>http://zolaleila.blogspot.com/2010/12/agk-humanist-rare-personality.html
gumma veeranna
పుస్తకం చదివాను. చాలా బాగుంది. ఆనాటి అమెరికా గురించి కళ్లకుకట్టినట్లు రాశారు.ఈనాటి యువకులు తప్పక చదవాల్సిన పుస్తకమిది.