తిక్కన భారతం రాసిన చోటు..
నెల్లూరు లో రంగనాథస్వామి గుడి దాటి కాస్త ముందుకు వెళ్తే, పెన్నా నది కనిపిస్తుంది. దాని పక్కగా నడుస్తూ ఉంటే, ఒక పాడుబడ్డ ఇల్లు కనిపిస్తుంది. “పాడుబడ్డ” అని ఎందుకంటున్నా అంటే, దాన్నెవరూ పట్టించుకుంటున్న దాఖలా లేదు అక్కడ. దీని పక్కనే, తుప్పు పట్టిన గేట్లతో, “తిక్కన పార్కు” కనిపిస్తుంది. పార్కు కదా, అనుకుని లోపలికి వెళ్టే, అదీ అలాగే, దిక్కులేకుండా ఉంటుంది. ముందర పెన్నా కనిపిస్తోంది కదా, అని మురిసిపోకండి. అక్కడ జనం సకల కార్యాలూ చేయడం కూడా కనిపిస్తుంది. ఆ ఇల్లు మహాకవి తిక్కన నివసించిన ఇల్లు. భారతం రాసిన చోటు. దాని గోడలపై పాకుతూ ఉన్న బల్లుల సంగతి అటు పెడితే, గోడ వెనక మనుషులు చేసే పనులు తల్చుకుంటే కంపరం పుడుతోంది ఇవ్వాళ కూడా!
ఇది తిక్కన భారతం రాసిన చోటు – అని ఒక బోర్డు తగిలిస్తే, చాలనుకున్నారో ఏమిటో మన ప్రభుత్వాధికారులు! కానీ, చూడబోతే, ఈ భవనం పునరుద్ధరిస్తాం – అంటూ మీటింగులు పెట్టడం మాత్రం ఘనంగానే చేసినట్లు ఉన్నారు.
అలాగే, తిక్కన భారతంలో రాసిన మొదటి పద్యం, అంటూ చక్కగా దాన్ని కూడా గోడపై పెయింట్ చేసారు, అప్పట్లో.
అవి వదిలేస్తే, తరువాత పట్టించుకుంటున్నట్లు లేరు. పాడుబడ్డట్లు అనిపిస్తున్న ఆ స్థలమే సాక్ష్యం. చారిత్రక ప్రాముఖ్యం ఉన్న స్థలం అది. అలాంటప్పుడు అసలు ఆ మలుపు తిరిగే చోటే కనీసం ఒక బోర్డన్నా ఉండాలి కదా! మరో దేశమైతే, అక్కడొక మెమోరియల్ కట్టి, విశేషాలని బట్టి మ్యూజియం కూడా కట్టేవారేమో! మన దేశంలోనే, కర్నాటక రాష్ట్రంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మస్థలాన్ని మ్యూజియం గా మార్చిన విషయం ఇదివరలో పుస్తకం.నెట్ లో కూడా రాసాను. ఏదో నేను థ్రిల్లైపోతాను అని మా కజిన్ నన్ను ఆ రోడ్లో నడిపిస్తూ, ఈ ఇల్లు చూపించింది కనుక చూడగలిగాను. తనైనా, నాకన్నా ఒకరోజు ముందు నెల్లూరొచ్చింది కనకా, అందరం గుడి రోడ్డులోనే ఒకే చోట దిగాము కనుకా, ఈ ఇల్లు సంగతి తెల్సుకోగలిగింది.
అంత ఆర్భాటంగా ఆవిష్కరణా గట్రా చేసిన వారు – ఇలా వదిలేయడంలో భావమేమీటో…నాకైతే అర్థం కావడం లేదు! అదీ, తిక్కన గారి ఇంటిని!
బివి లక్ష్మీ నారాయణ
అదే మన దౌర్భాగ్యం…అటు రాజమండ్రిలో భారతానికి, నన్నయ్యకు ఏటా ఉత్సవాలు జరుగుతుంటే కనీసం ఇక్కడ తిక్కన గారిని స్మరించుకునే నాధుడే కరవు..మీ లాంటి వాళ్ళు స్వల్ప సంఖ్యలో ఆయన గురించి తపన పడ్తున్నారు…అది అభినందనీయం
సౌమ్య
@Ram Cheruvu: Does it mean, Tikkana just used to come to this house, write Bharatham and leave every evening? Are you saying that its his “office”?
raam cheruvu
Ayya,
oka savaraNa… adi tikkana gaari illu kaadu.. aayana Mahabharatam rachinchina mandiram ..
Ram Cheruvu
mallina narasimha rao
ఆలోచించమని గా చదువుకోగలరు.టైపాటుకు మన్నించగోర్తాను.
mallina narasimha rao
మనం ఈ విషయంలో ఇప్పుడు ఏం చేయగలం? అనేదాని గుఱించి అందరూ ఆలోచించి కార్యాచరణకు పూనుకుంటే మంచిదని నాకు తోస్తున్నది. greenpeace పేరుగల సంస్థ వారు అందరి అభిప్రాయాలను క్రోడీకరించి ప్రభుత్వపెద్దలకు వారి సందేశం ద్వారా వత్తిడిని తెచ్చి వ్యవహారాలు సవ్యమైన దిశలో సాగేటట్లుగా చేస్తూండటం చూస్తున్నాం కదా. అదేమాదిరి మనం కూడా ప్రయత్నం ప్రారంభిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మనమందరం కలిస్తే ఏం సాధించలేమా? ఓ సారి ఒక్క క్షణం అందరినీ ఓలోచించమని నా ప్రార్థన.
రాఘవ
చిత్రంలో కనబడే వ్రాతలనుబట్టి చూస్తే ఈ మందిరాన్ని “సర్వాంగసుందరం”గా తయారుచేసి సంవత్సరంపైన నాలుగు నెలలయ్యిందేమోనండీ. ఇంతలోనే ఇలా తయారయ్యిందంటే ఈ పని చేసినవారికి దాని బాగోగులు చూచుకోవటంపై ఎంత నిబద్ధత ఉందో అర్థమౌతోంది! ఈ పెద్దమనుషులకు “కేవలం విత్తు నాటితే సరిపోదు, ఆ విత్తు మొలకెత్తాలి, ఆ మొలక మొక్కై చెట్టయ్యేవఱకూ దాని బాగోగులు చూసుకుంటూ చీడపీడలనుండి రక్షించుకోవా”లనీ తెలిసినట్టు లేదు!! 🙁