2010లో మీరు చదివిన పుస్తకాలు – జనవరి’11 ఫోకస్

Reminder.. 🙂

———————–

మరో ఏడాది పూర్తి కావస్తుంది. ఈ ఏడాదిలో మీ పుస్తక పఠన విశేషాలను కొత్త ఏడాది, మొదటి నెలలో ఫోకస్ భాగంగా పంచుకునే వీలు కలిగించటానికి ఈ ముందస్తు ప్రకటన.  ఏడాదిలో చదివిన పుస్తకాల చిట్టా రాసుకోవాలన్నా, లేక మిమల్ని అమితంగా ప్రభావితం చేసిన పుస్తకాల / రచయితల గురించైనా, లేక మీ చదువు ఈ సంవత్సరంలో నత్త నడక నడిచిన తీరు వివరించాలన్నా.. ఇదే మా ఆహ్వానం. నెలకు పైగా సమయం ఉంది కాబట్టి, తీరిగ్గా రాసి పంపండి.

వ్యాసాలను జనవరి నెలలో ప్రచురించాలన్నది ఆలోచన. (ఏడాది పూర్తవ్వాలిగా!)

ఎప్పటిలానే, వ్యాసాల తీరుపై గాని, నిడివి పై గాని ఎలాంటి ఆంక్షలూ లేవు.

మీ మీ పుస్తక పఠనానుభవాలతో కొత్త ఏడాదిలో కలుసుకుందాం.

-పుస్తకం.నెట్

You Might Also Like

2 Comments

  1. Pavankumar

    nenu chadivina the best book RGV’s Naa istham…

  2. లలిత (తెలుగు4కిడ్స్)

    ఇది బావుంది. ప్రతి ఫోకస్, ముందు నెలలోనే ఎందుకు ప్రకటించకూడదు? అప్పుడు ఆ విషయం మీద రాయడానికి సమయం దొరుకుతుంది కదా. లేకపోతే నెల గడిచిపోతుంది నాలాంటి వాళ్ళు రాసే లోపల 🙂

Leave a Reply