Johnny Gone Down – Karan Bajaj

బోరు కొట్టి క్రాస్వర్డ్ లో తిరుగుతూంటే – ఈ నవల కనబడ్డది. ఈమధ్య కాలంలో ఈ పేరు తరుచుగా వినబడడం చేతనూ, నా ముందు నాలుగైదు గంటల ఎదురుచూపు నేను ఎప్పుడొచ్చి దాన్ని కౌగిలించుకుంటానా అని ఎదురుచూస్తూండటం చేతనూ, పుస్తకం ఖరీదు ఎనభై తొమ్మిది రూపాయలే అని తాటికాయంత అక్షరాలతో ప్రకటించడం చేతనూ -ఆ నాలుగైదు గంటల సమయాన్ని చంపెయోచ్చని పుస్తకం కొన్నాను. చదవడం మొదలుపెట్టాను. పూర్తయ్యాకే మళ్ళీ తల ఎత్తింది! నిజం! బైట వర్షం పడుతూ ఉంటె, ఒక చేత్తో మొక్క జొన్న తింటూ, ఒక చేత్తో పుస్తకం పెట్టుకుని, చినుకులు కాళ్ళపై తగిలేంత దూరంలో కూర్చుని, వీక్డే రోజు పుస్తకం చదివే అదృష్టం ఎంతమందికి పడుతుంది??

పుస్తకం కథ సంగతికొస్తే: నిక్/బుద్దా/నికిల్ ఆర్య/జానీ : ఇలా రకరకాల నామధేయాలతో ఇరవై ఐదు సంవత్సరాలు ఊరూరూ, దేశం దేశం తిరిగిన నికిల్ కథ ఇది. ఎం.ఐ.టీ. గ్రాడ్యుయేట్ గా మొదలుపెట్టి, త్వరలో నాసా లో చేరాల్సిన వ్యక్తి, కంబోడియా జైళ్లలో మగ్గి, ఆపై కొన్నాళ్ళు థాయ్లాండ్ లో సన్యాసిగా మారి, అనుకోకుండా బ్రజిల్ చేరి – ఒక డాన్ వద్ద అకౌంట్స్ చూస్తూ..ఆపై, వ్యాపారవేత్తగా ఎదిగి…మళ్ళీ అమెరికా చేరి, అనామకుడిగా జీవితం మొదలుపెట్టి, బహుళ జనాదరణ పొందిన సాఫ్ట్వేర్ రూపొందించి….అనుకోని పరిస్థితిలో భారత దేశం వచ్చి, ప్రమాదకరమైన, ఆటవికమైన ఆటలో ఆటగాడై – ఇలా ఇలా.. మలుపులు తిరిగిన జీవితం నికిల్ ది. ఈ మలుపుల్లో అతను కలిసిన మనుషులు, ఏర్పడ్డ అనుబంధాలు, ప్రతి చోటా తన గమనం అతను నిర్మించుకుని, కూల్చేసుకుంటూ వచ్చిన పధ్ధతి – ఇదీ స్థూలంగా ఈ పుస్తకం కథ. మంచి సినిమా సరుకు నన్నడిగితే 🙂

కథ, కథనం లో కొంత ఈకలు లాగగల అంశాలు లేకపోలేదు. నాకు ఒక మూన్నాలుగు తట్టాయి. ఈకల్లాగాడమే పనిగా పెట్టుకుంటే మరికొన్ని తప్పక తట్టొచ్చు. లాగే వాళ్ళు లాక్కుని,ఆపై – ‘చ! ఈ నవలలు ఇంతే! వీళ్ళు ఎదగరు..ఇవి చదివే వాళ్ళూ ఎదగరు’ అనుకోవచ్చు.. ఎవరి అభిప్రాయాలు వారివీ! ఇంతకీ, నాకు బాగా నచ్చిన విషయం ఏమిటి అంటే -చదివినంత సేపు నన్ను కట్టిపడేసింది. మంచి కమర్షియల్ చిత్రం లాగానే – మంచి కమర్షియల్ నవల కి ఉండాల్సిన లక్షణాల్లో అదొకటి. వెంటాడడం, వేటాడడం – ఇవి ఈ నవలలకి అనవసరమైన లక్షణాలు. వంచిన తల ఎత్తకుండా మనల్ని చదివిస్తే అది మంచి నవలే అని నా అభిప్రాయం. ఆ పరంగా ఇది నా దృష్టిలో మంచి నవలే.

ఇటీవలి కాలం లో భారతీయ ఆంగ్ల రచయితల రచనలు బాగా జనాదరణ పొందుతున్నాయి. కానీ, నిజానికి నాకెప్పుడూ అవి పెద్దగా నచ్చేవి కావు. అంటే -ఏదో కాలక్షేపానికి బానే ఉంటాయి కానీ, అంతకు మించి వేరేదీ లేదు అనిపించేది. పైగా, ఒకర్ని చూసి ఒకరు ఎడాపెడా రాసేస్తున్నారీ మధ్య. కరణ్ బజాజ్ నవల చదవడం మొదలుపెట్టినప్పుడు కూడా ఇదే ఆలోచనతో మొదలుపెట్టాను. అయితే, ఇలా పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్న ఈ నవలాకారులలో ఇతను చాలా నయం అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. వీళ్ళని ‘రాఖీ సావంత్స్’ ఆఫ్ ఇండియన్ లిటరేచర్ అని వర్ణించిన వారిని చూస్తె – నాకు జెలసీ కొద్దీ అలా అంటున్నారు అనిపిస్తోంది కానీ, ఏదో ఒకటి, నాకనవసరం. నా దృష్టి లో మాత్రం – ఇతను, ఇతనిలాంటి వారు -ఆర్చర్స్, షెల్డన్స్ ఆఫ్ ఇండియన్ లిటరేచర్.

ఈ పుస్తకం, కరణ్ బజాజ్ రాసిన మరో పుస్తకం – ‘కీప్ ఆఫ్ ది గ్రాస్’ కొనుగోలు చేసేందుకు ఫ్లిప్కార్ట్ లంకెలు కింద చూడండి.
Johnny Gone Down – (ఫ్లిప్కార్ట్ లో అయితే యాభై రూపాయలే!!)
Keep off the grass

You Might Also Like

11 Comments

  1. పుస్తకం » Blog Archive » 2010 – నా పుస్తక పఠనం కథ

    […] కరణ్ బజాజ్ నవలలు- Keep off the grass మరియు Johnny Gone Down. ఆశ్విన్ సంఘీ నవల – The Rozabal Line సిడ్నీ […]

  2. budugoy

    @venu : i think u r refering to ‘joker in the pack’..
    @sowmya : more than motorcycle diaries u will see shades of fivepoint someone in both the books suggested by venu.

  3. సౌమ్య

    @Venu Vedam: Ruskin Bond or Rudyard Kipling? 🙂
    If you recollect the name of that book abt two MBA grads (iam getting a feeling like this is indian motorcycle diaries.. heehee)..please drop a comment here.

  4. Venu Vedam

    Well, I loved this book. Much better than Keep Off the Grass. (That was atrocious with Rudyard Kipling making an appearance. Give me a break.)

    Soumya – if you haven’t read it already – try Amitabha Bagcchi’s “Above Average” – a better IIT book. 🙂 I am sure you would love it. I have some more recommendations too especially about two young MBA grads going to the interiors of India on a HUL drive and experiencing the grassroots economy. Forgot the name. That is a good read too.

  5. గిరీష్ కె.

    I agree! ఈ పుస్తకం కథ. మంచి సినిమా సరుకు!!!

  6. సౌమ్య

    Ah, I read ‘Keep off the grass’ last week…and I felt this one is a lot better than that! 🙂

  7. budugoy

    when i read Karan Bajaj’s “Keep off grass”, I found it a very good novel for a debutant. My expectations were def.ly above average when I started reading this one.
    What I found most disappointing about this book is that, this kind of book can be conceived on a drawing board. Watch some hollywood thrillers (thankfully author himself gives the list), read some pot boilers and do a mish-mash of all those u have this novel.

    If this is the new-age indian writing, someone please nip it in the bud.
    puh..lease tell some original stories not clever mix of hollywood movies.

  8. Indian Mnerva

    బాగుంది ఇప్పుడు నేనెలాగోలా 100/- bill చేయాలన్నమాట. చదవాల్సినవి మరికొన్ని పుస్తకాలు చెబుదురూ… నేనుకూడా వెదుకుతున్నాను flipkartలో. Thanks in advance.

  9. మేధ

    ఈ పుస్తకం గురించి వ్రాయడం మొదలుపెట్టి నేను మధ్యలో వదిలేశా… మొదట కొంచెం బోరు కొట్టినా ఆపకుండా చదివించింది.. అఫ్కోర్స్, కధ సుఖాంతం చేయడం కమర్షియల్ సినిమాలానే ఉంది..

    @Indian Minerva గారు:
    ఈ పుస్తకం నేను ఆన్లైన్లో నే కొన్నాను.. మూడు పుస్తకాలు 300/-వి 225/-కి (With Shipping) వస్తుంటే మూడు రోజులు ఎదురు చూసిన ఫర్లేదు మరి.. 🙂

  10. సౌమ్య

    @Indian Minerva:
    Since its 50/-, there are shipping charges, may be. But, if you buy it with some other book, from what I know, shipping should be free. I always had free shipping with flipkart.

    If one wants to buy this book exclusively, even at that rate, it costs 80 in flipkart, 90 in crossword + transport to crossword +time wasted in travel in big cities : I think buying via flipkart is still worth it 🙂

  11. Indian Mnerva

    అబ్బాయ్/అమ్మాయ్… 50 రూపాయలకి తోడు మళ్ళా 30 రూపాయలు షిప్పింగ్ చార్జెస్ కట్టి 3 రోజులు వెయిట్చేసేకంటే… ఈ వీకెండ్ crosswords కేవెళ్ళి కొనుక్కోవడం బెటరేమో 🙂

Leave a Reply