Father’s Day సందర్భంగా నన్ను అబ్బురపరిచిన ఒక తండ్రి కథ
రాసిన వారు: లలిత
**********
క్రిస్ గార్డ్‌నర్. ఇతని గురించి వికిపీడియాలో క్లుప్తంగా విషయాలన్నీ తెలుస్తాయి. ఇతను అమెరికాలో హోమ్లెస్ గా ఉండి మిలియనీర్ అయిన ఒక నల్ల వాడు. ఒక వ్యాపారవేత్త, వితరణశీలి, అన్నింటినీ మించి ఒక తండ్రి. ఇతని విజయ గాథ స్ఫూర్తిగా తీసిన సినిమా పేరు The Pursuit of Happyness. అతని జీవిత కథ అంతకు ముందే అదే పేరుతో పుస్తకంగా కూడా ప్రచురించబడింది.
సినిమా పరిచయం ఓప్రా విన్‌ఫ్రీ షో లో చూశాను. క్రిస్ గార్డ్‌నర్ నీ అప్పుడు చూశాను. ఆహాఁ అనుకునున్నాను. అనుకోకుండా చాలా రోజుల తర్వాత టీవీలోనే ఆ సినిమా చూశాను. అప్పుడు ఆగలేక పబ్లిక్ లైబ్రరీ నుంచి పుస్తకం తెచ్చుకుని చదివాను. అతని జీవితంలో చిన్నతనం నుంచీ ఎన్నో కష్టాలు. అన్నిటికంటే అతనిని బాధించినది తండ్రి లేని(వదిలేసిన) వాడుగా పెరగడం. అతని జీవితానికి ఉపయోగపడే చాలా పాఠాలు నేర్చుకున్నది తల్లి నుంచి. చిన్నతనంలోనే తను మాత్రం ఎప్పుడూ తన పిల్లలని తండ్రి లేని వాడుగా చెయ్యను అని నిశ్చయించుకుంటాడు. హోమ్లెస్ గా ఉన్నప్పుడు కూడా ఆ నిర్ణయాన్న్ని ఏ మాత్రం సడలనివ్వలేదు, అసలు ఇంకో విధంగా ఆలోచించనూ లేదు.
ఊహ తెలిసిన వయసునుంచీ కష్టమూ, బాధా , అటువంటి పరిస్థితులలోనూ ఆస్వాదించిన చిన్ని చిన్ని సంతోషాలూ, ఒక వయసొచ్చాక, అతను పెరిగిన సమాజంలో ఆ వయసులో జరిగిన అన్ని రకాల అనుభవాలూ, ఆ తర్వాత భవిష్యత్తు గురించి ఆశయాలూ, ఆశలూ, మళ్ళీ రక రకాల అనుభవాలూ, ఆశయాలకి, అసలు నిజాలకీ మధ్య దూరాలూ, అక్కడా అంది పుచ్చుకున్న ఆనందాలూ, రోగులకి సేవ చెయ్యడంలో అతని ఆలోచనలూ, ఆ స్థితిని అతను accept చెయ్యడం, అక్కడిన్నంచీ ఎదిగి ఏ మాత్రం పరిచయం లేని వైద్యరంగంలో పెద్ద చదువులు చదివిన వారికి కూడా శిక్షణని ఇవ్వడం, అందులో గౌరవం, గర్వం, తృప్తీ, ఐనా చాలీ చాలని సంపాదన వల్ల ఆ రంగాన్నీ వదిలడం, పెళ్ళీ, distraction, తండ్రి కావడం, తను అనుకున్నట్టు తండ్రిగా ఉండడం కోసం పెళ్ళి నుంచి తప్పుకుని, అటు తన కొడుకు తల్లితోనూ ఉన్న విభేదాలు అర్థమయ్యే లోపల ఒక కలను వెంబడించడం మొదలు పెట్టి ఎన్నో తంటాలు పడి ఆ కలని అందుకుని అందులో సాయపడ్డ వారికీ, ఇంకా ఎందరో ఎదగడానికీ పెద్ద ఎత్తున సాయం చెయ్యగలిగే స్థితికి ఎదిగిన వైనం అంతా చాలా బాగా చెప్పారు ఆపుస్తకంలో. అతని జీవిత కథ ఎంతగా నన్ను impress చేసిందో, ఆ కథని మాటలలో పెట్టిన తీరు కూడ అంతగానూ impress చేసింది. అలా చెప్పగలిగినందువల్లే నేను అతని కథను అర్థం చేసుకోగలిగాను అని అనిపిస్తుంది. కష్టాలు ఏకరువు పెట్టలేదు, సినీ హీరోలలాగానూ అనిపించేలా చెయ్యలేదు. ఒక జీవితాన్ని మనం దగ్గరగా ఉండి గమనిస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా చూపించారు. అతని సవతి తండ్రి పాత్ర తప్ప ఇంకే పాత్రనూ మరీ నెగటివ్ లైటులోనూ చూపలేదు. ఎక్కడికక్కడ అతని ఆలోచనలను కూడా ఎంత బాగా చెప్పగలిగారో, Chris Gardner అతనికి పుస్తకం రాయడానికి సహకరించిన Quincy Troupe.
అతను ఉండడానికి ఇల్లు లేని పరిస్థితులలో తన కొడుకుని తనతోనే ఉంచుకుని, ఆఫీసుకీ, హోమ్లెస్ వారు రాత్రి తలదాచుకోగలిగే శరణాలయానికీ, అక్కడికి సమయానికి చేరలేకపోతే చీప్ హోటల్ కీ మధ్య ఉరుకులు పరుగులతో, తన కలతోనూ రాజీ పడకుండా అందుకోసం కష్టపడుతూ, ఆ పరిస్థితులలో కూడా వారాంతాలలో తన కొడుకుని చూస్తూ, తండ్రిగా అన్నీ మరిచిపోయి ఆనందించి, తను తండ్రి లేక అనుభవించిన బాధ తన కొడుకుకి కలిగించకూడదు అన్న తన ఆశయాన్ని ఏదో వ్రతంలాగా, ఎవరికో నిరూపించడం కోసం కాక అచ్చంగా తమ కోసం జీవించిన ఆ తండ్రి కథ నన్ను చాలా అబ్బురపరిచింది.
కష్టాలలోనూ, కష్టం రానీయకుండా ఉండడం కోసమూ, తమని కన్న వారి కలలు తీరుస్తూ, తాము కన్న వారి కలలు తీర్చేందుకూ, శ్రమించే వారూ, కుటుంబానికి గుర్తింపునీ, గౌరవాన్నీ కలగచేసే వారూ తండ్రులందరికీ అభినందనలు.
పుస్తకం » Blog Archive » మాటే మంత్రము
[…] అది అర్థం అయ్యేలా చెశాయి. అదే అనుభవం The Pursuit of Happyness లో Chris Gardner కి కూడా అనుభవం అవుతుంది. అతని […]
భావన
చాలా మంచి నవల. సినిమా కూడా బాగుంటుంది. చాలా సార్లు కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి చదువుతున్నప్పుడు సినిమా చూస్తున్నప్పుడు అతని (ఆ తండ్రి) తపన చూస్తే.
(తెలుగు4కిడ్స్) లలిత
నిజమే. నాకు ఆ పుస్తకం చదువుతుంటే కలిగిన అనుభవాన్ని మాటలలో పెట్టే ప్రయత్నం చేశాను.
మనిషిలోని, సమాజంలోని మంచి చెడులన్నీ చూపించింది ఈ పుస్తకం. అది చదివితేనే, ఆ సందర్భంలోనే బాగా అర్థం అవుతాయి. క్రిస్ గార్డ్‌నర్ వ్యక్తిత్వమూ మచ్చ లేనిది కాదు. ఐనా అతనిలోని పట్టుదల, తండ్రి, మంచితనమూ మిగిలిన బలహీనతలను, పరిస్థితులనూ జయించిన తీరు పుస్తకం చదివితే బాగా ర్థం అవుతుంది.
ఈ వ్యక్తి కథ నన్ను చాలా ఆలోచింపచేసింది. ఇతనిలోని “తండ్రి” కథ నన్ను చాలా impress చేసింది.
ఎప్పట్నుంచో ఈ పుస్తకాన్ని పరిచయం చెయ్యాలనుకుని చేతకాదని పక్కకు పెట్టి, Father’s day దగ్గర పడుతున్న కొద్దీ, ఇలాంటి తండ్రుల గురించి తక్కువ వింటూ ఉంటుంటాము కాబట్టి పరిచయం చెయ్యాలనిపించి ప్రయత్నించాను.
కనీసం కూతూహలంతో ఐనా ఎవరైనా ఈ పుస్తకం చదివి ఇంకా బాగా పరిచయం చెయ్యగలిగితే బావుంతుంది కదా.
nanich
Even I do feel the same. anta baane undi kani, 4th paragraph koncham matter tho ekkuva vishayam cover cheddamu ani try chesinattu anipinchindi.
Anyway, nice one. Thanks much Lalitha garu for introducing this book. Cant wait reading it.
ramanrsimha
Madam,
I could not understand very well.
I think that this review is little bit complicated..(?)
Any how thanks for introducing a new(good) book..