సీ++ ద కంప్లీట్ రెఫెరెన్స్
రాసినవారు: రవిచంద్ర
***********
హెర్బర్ట్ షిల్ట్ రాసిన పుస్తకాల్లో అత్యధికంగా అమ్ముడుపోతున్న వాటిలో ఒకటైన ఈ పుస్తకం, సీ++ మొదట్లో నేర్చుకునే వారికి సరైన పుస్తకం. పేరుకు తగ్గట్టే సీ++ లో ఉండే అన్ని ఫీచర్లనూ, అన్ని రకాల సింటాక్సులను, కనీసం ఒక్కో సరళమైన ఉదాహరణతో వివరిస్తాడు రచయిత. చాలా వరకు ఉదాహరణలు కేవలం కోడ్ స్నిప్పెట్స్ మాత్రమే కాకుండా పూర్తి స్థాయి ప్రోగ్రాములు. ఆయన సీ++ ప్రామాణికాలు నిర్ణయించే కమిటీలో సభ్యుడు కూడా కాబట్టి లాంగ్వేజీ ఒక్కో ఫీచర్, మరియు వాటి పుట్టు పూర్వోత్తరాలను కూడా సులభశైలిలో వివరిస్తారు.
ఈ పుస్తకాన్ని మొత్తం ఐదు భాగాలుగా విభజించారు. సీ కూడా సీ++ లో భాగమే కాబట్టి మొదటి భాగంలో వాటి రెండు భాషల్లో ఉమ్మడిగా ఉన్న ఫీచర్లను విశ్లేషిస్తారు. రెండో భాగంలో సీ++ కే ప్రత్యేకమైన ఫీచర్లైన క్లాసెస్, కన్‌స్ట్రక్టర్స్, డిస్ట్రక్టర్స్ మొదలైన వాటి గురించి వివరణ ఉంటుంది. కాబట్టి సీ, సీ++ రెండూ తెలియని వారికి, ఇది వరకే సీ తెలిసిఉన్న వాళ్ళకి ఉభయులకూ ఉపయుక్తంగా ఉంటుంది. అసలు చదువరికి సీ++ గురించి, ప్రోగ్రామింగ్ గురించి ఎటువంటి పరిజ్ఞానం లేకపోయినా ఈ పుస్తకంతో నేర్చుకోవడం ప్రారంభించవచ్చు.
సాధారణంగా ఇంటర్వ్యూల్లో సీ++ గురించి అడిగేటప్పుడు అభ్యర్థికి అన్ని ఫీచర్ల మీద అవగాహన ఎలా ఉందని తెలుసుకోవడం కోసం ప్రశ్నలు అడుగుతారు. అలాంటి అవసరాలకు ఈ పుస్తకం సరిగ్గా సరిపోతుంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ విధానంలోని ప్రాథమిక భావనలైన డేటా ఎన్‌క్యాప్సులేషన్, పాలీమార్ఫిజమ్, ఇన్‌హెరిటెన్స్ మొదలైన అంశాలతో పాటు అడ్వాన్స్‌డ్ ఫీచర్లయిన నేమ్ స్పేసెస్, టెంప్లేట్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, స్టాండర్డ్ టెంప్లేట్ లైబ్రరీ మొదలైన అంశాల గురించి పూర్తి వివరణ ఉంది. పూర్తి స్థాయి వివరణ ఉండటంవల్ల పుస్తకం కాస్త పెద్దదిగా కనిపించినా చదివేటప్పుడు నోట్స్ తయారు చేసుకోవడం వల్ల ఉపయోగముంటుంది.
మూడవ భాగంలో సీ++ ప్రామాణిక ఫంక్షన్ లైబ్రరీల గురించి, నాలుగవ భాగంలో ప్రామాణిక క్లాస్ లైబ్రరీల గురించి వివరణ ఉంటుంది. ముఖ్యంగా స్టాండర్డ్ టెంప్లేట్ లైబ్రరీ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. నేర్చుకునేటప్పుడు చిన్న చిన్న ప్రోగ్రాములకే పరిమితం అయినా కంపెనీల్లో పనిచేసేటపుడు పెద్ద ప్రాజెక్టుల్లో పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడే ఈ లైబ్రరీలు విస్తృతంగా అవసరం అవుతాయి. తరచు అవసరమయ్యే ఫంక్షన్లు, డేటాస్ట్రక్చర్లు, అల్గారిథమ్స్ అన్నీ ఈ లైబ్రరీల రూపంలో లభ్యమవుతాయి. చివరి భాగమైన ఐదో భాగంలో సీ++ ఫీచర్లు, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్లను పూర్తిగా వినియోగించుకుంటూ రాసిన రెండు ప్రాక్టికల్ ఉదాహరణలు ఇవ్వబడ్డాయి.
అయితే అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో మామూలు భాషనుపయోగించి రాసేయడం వలన పుస్తకం యొక్క టెక్నికల్ అక్యూరసీ ని తప్పుబట్టిన వారూ ఉన్నారు. అయినా సరే సీ++ మొదలుపెట్టడానికి, రెఫరెన్సుగా దాచుకోవడానికి అనువైన పుస్తకం ఇది.
ప్రచురణ: Osborne/McGraw-Hill; 3rd edition
వెల:470 రూపాయలు
పేజీలు: 1000
chmahesh
naku nachinadhi me pustakam .net , kani naku i will learn computer you can give me some your value books details to me all the best
Srinivas Reddy
Chala bagundi…mee aalochana…internet and computer books kuuda iste baguntundi..anyhow thanQ
jagadeesh
i saw this is Osborne/McGraw-Hill; 3rd edition book.very good.mi asham chala bagundi.nenu kuda maa college websitenu create cheshanu.eroju enadulo mee site chushanu.chalabagundi