గ్రంథాలయాన్ని వాడుకలోకి తెచ్చిన రాజు
[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. – పుస్తకం.నెట్]
నెల్లూరు జిల్లాలో ఇప్పటికే కొనఊపిరితో మనుగడ సాగిస్తున్నవి – ఒకటి రెండు గ్రంథాలయాలు మాత్రమే. కానీ, శతాబ్దాల చరిత్ర కలిగిన వెంకటగిరి సంస్థాన గ్రంథాలయాన్ని సరస్వతి నిలయంగా వాడుకలోకి తెచ్చిన ఘనత సర్వజ్ఞ కుమార యాచేంద్ర రాజపండితులదే!
1847 నుంచి 1878 వరకు వెంకటగిరిరాజుగా ఆయన సంస్థానాన్ని పరిపాలించారు. 1850 ప్రాంతం ముందు ముద్రితమైన గ్రంథాలు మొదలు పూర్వపు తాళపత్రాల వరకు విలువైన వేనవేలప్రతులు ఈ సంస్థాన గ్రంథాలయంలో ఉన్నాయి. సుప్రసిద్ధ భాషా పరిశోధకుడు, తెలుగువారికి వాజ్ఞయభిక్ష పెట్టిన సీపీబ్రౌన్ దొరగారి సహాయకులైన జూలూరి అప్పయ్య పంతులు ప్రతిపదపీఠికతో 1844లో వెలువడిన వసుచరిత్ర, శీనివాస తారావళి, యదువంశభూష శతకం వంటి అనేకం ఈ గ్రంథాలయంలో ఉన్నాయి. తాళపత్రాలు నుంచి అనేక గ్రంథాలు వెంకటగిరి రాజులకు అంకితం ఇచ్చారు. ఎందరో పండితులకు ధనసహాయం చేశారు. ఈగ్రంథాలయాన్ని ప్రజలకు చేరువ చేసింది కుమార యాచేంద్ర రాజా అయితే, గ్రంథాలయంపై పరిశోధనలు చేసి, ప్రజలకు చేరువ చేసిన చరిత్రకారులు డాక్టరు కాళిదాసు పురుషోత్తం. క్రీ.శ.1600 నాటి నుంచి అనేకులు సేకరించిన అక్షరసంపదను సర్వజ్ఞ యాచేంద్ర ఆస్వాదించారు. నెల్లూరు పౌర గ్రంథాలయం ఇదే అయింది. మెక్లీన్స్ లైబ్రరీ కూడా ఆతరువాతనే. నెల్లూరు వర్థమాన సమాజం, అంతకుముందు వీఆర్ కళాశాల, సీఏఎం హైస్కూలు, ఆంధ్రసభలలో గ్రంథాలయాలున్నా, వీటి జాడ మాత్రం నేడు నామమాత్రమే!!
Sreenivas Paruchuri
1. తారావళి అంటే 27 పద్యాలతో కూర్చిన (పద్య)మాలిక. దీనినే “నక్షత్రమాల” అనే మరో పేరుతో కూడా పిలుస్తారు. తెలుగులో చాలా “తారావళులు”న్నాయి. పై పుస్తకం శ్రీనివాసుడిపై చెప్పబ్డిన తారావళి.
[ఆ మధ్య “ఆంధ్రజ్యోతి”, “ఆంధ్రప్రభ” పేపర్లలోను, తరువాత పుస్తకాలలో, “భరతఖండంబు చక్కని పాడియావు” అనే పద్యకర్తృత్వంపైన ఒక “గొప్ప”(!) 🙂 చర్చ జరిగింది. అప్పుడు ఈ నక్షత్రమాల అన్న పేరు మీరు వినివుండాలి.]
2. యదువంశభూషశతకం – అంటే? శతకమే! 🙂 “కృష్ణ హరీ యదువంశభూషణా” అనే మకుటంతో వుంటుంది.
జూలూరి అప్పయ్య, కాళిదాసు పురుషుత్తంగార్ల గురించి చెప్పనవసరం లేదనుకుంటాను. ఈ మధ్యనే APGOML కి వెళ్ళివచ్చారు కదా. అక్కడ కా.పు గారి కొత్త పుస్తకం మీరు చూసుండాలి. దానిలో పాత పత్రికలు, పుస్తకాల గురించి బోలెడు data దొరుకుతుంది.
— శ్రీనివాస్
సౌమ్య
వసుచరిత్ర – అంటే విన్న పేరే కానీ, ఈ ’శ్రీనివాస తారావళి’, ’యదువంశభూష శతకం’ – ఏమిటి? దేని గురించి? ఎవరన్నా తెలిసిన వారుంటే వ్యాఖ్య రాయగలరు…